19 November 2022

జాజ్జౌ(జరియా) అమీరా అమీనా –1533-1610 Amina Emira of Zazzau

 


అమీనాతు (అమీనా) హౌసా ముస్లిం. అమీనా,  జాజ్జౌ (ప్రస్తుత వాయువ్య నైజీరియాలోని కడునా రాష్ట్రంలోని జరియా నగరం) లో జన్మించినది. అమీనా పదహారవ శతాబ్దం మధ్యకాలంలో పరిపాలించి ఉండవచ్చు. అమీనా జీవిత చరిత్ర అస్పష్టంగా ఉంది.

అమీనా పదహారవ శతాబ్దం CE మధ్యలో జజ్జౌ (జరియా) యొక్క 22వ పాలకుడు నికటౌ మరియు రాణి బక్వా తురుంకు (1536–1566)కి జన్మించింది. అమీనా కు జరియా అనే చెల్లెలు ఉంది. జరియా పేరుమీద నైజీరియా లో ఆధునిక నగరం జరియా కలదు. బాల్యం నుంచి అమీనా రాజకీయ మరియు సైనిక విషయాలలో నైపుణ్యం సాధించినది.

పదహారేళ్ల వయసులో, అమీనాకు మగాజియా (వారసుడిగా) అని పేరు పెట్టారు మరియు అమీనా కు నలభై మంది బానిసలు (కుయాంగా) ఇచ్చారు.

1566లో అమీనా తల్లిదండ్రుల మరణం తర్వాత, అమీనా సోదరుడు జజ్జౌ(జరియా)కు రాజు అయ్యాడు. ఈ సమయంలో, అమీనా "తన సోదరుని అశ్విక దళంలో ప్రముఖ యోధురాలు"గా గుర్తిoపబడినది మరియు తన సైనిక నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందింది.

1576లో అమీనా సోదరుడు కరామి మరణించిన తర్వాత, అమీనా రాణి అయినది మరియు జాజ్జౌ (జరియా)నగర రాజ్య సింహాసనాన్ని అధిష్టించినది.  అరబ్ వ్యాపారులు కానో మరియు కట్సినా యొక్క బానిస మార్కెట్లలో విక్రయించబడే బానిసల యొక్క ప్రాధమిక మూలం కూడా జాజ్జౌ (జరియా)నగరo.

రాణిగా పట్టాభిషిక్తురాలైన  మూడు నెలల తర్వాత, అమీనా జజ్జౌ(జరియా) భూభాగాన్ని విస్తరించింది. 20,000 మంది సైనికులు మరియు 1,000 మంది అశ్వికదళ దళాలతో కూడిన అమీనా సైన్యం బాగా శిక్షణ పొందింది. అమీనా క్వారరాఫా మరియు నూపే వరకు పెద్ద భూభాగాలను స్వాధీనం చేసుకుంది.

అమీనా ఆధ్వర్యంలో, జాజ్జౌ(జరియా) గతంలో కంటే ఎక్కువ భూభాగాన్ని నియంత్రించినది మరియు తన కొత్త భూములను గుర్తించడానికి మరియు రక్షించడానికి, తన నగరాల చుట్టూ  మట్టి గోడలను నిర్మించినది. ఇవి చాలా వరకు నేటికీ మనుగడలో ఉన్నాయి, వీటిని  గనువార్ అమీనా (అమీనా గోడలు) అని పిలుస్తారు.

పంతొమ్మిదవ శతాబ్దపు ముస్లిం పండితుడు డాన్ టఫా ప్రకారం అత్తాగర్ అనే ప్రదేశంలో మరణించింది. ప్రముఖ ఆఫ్రికా చరిత్రకారుడు సిడ్నీ జాన్ హాగ్బెన్ ఈ విషయాన్నీ ద్రువపరిచినాడు. కానీ అమీనా మరణం చుట్టూ అనేక వైరుధ్యాలు ఉన్నాయి; చాలా మంది రచయితలు అమీనా వోమ్ జోస్‌లో మరణించిందని ఉదహరించగా, ఇతర చరిత్రకారులు అమీనా అటగారాలో మరణించారని చెప్పారు.

లెగసె:

పాలకురాలిగా అమీనా శాశ్వత కీర్తిని పొందింది. అమీనా స్వాధీనం చేసుకొన్న భూభాగం నైజర్ సముద్రపు ఒడ్డు వరకు విస్తరించింది

జాజ్జౌ(జరియా) భూభాగాన్ని విస్తరించడంతోపాటు, ఉత్తర ఆఫ్రికా అంతటా అమీనా  వాణిజ్య మార్గాలను సృష్టించింది మరియు  కోలా గింజల సాగును ప్రవేశపెట్టినందుకు అమీనా ఘనత పొందింది.

·         లాగోస్ లోని నేషనల్ ఆర్ట్స్ థియేటర్ వద్ద క్వీన్ అమీనా విగ్రహం స్థాపించబడినది.

·         జరియా (జాజ్జౌ) నైజీరియాలోని అతిపెద్ద విశ్వవిద్యాలయం మరియు ఆఫ్రికా ఖండంలో రెండవ అతిపెద్ద విశ్వవిద్యాలయం అయిన అహ్మదు బెల్లో విశ్వవిద్యాలయానికి నిలయం.

·          అహ్మదు బెల్లో విశ్వవిద్యాలయం వ్యవసాయం, సైన్స్, ఫైనాన్స్, మెడిసిన్ మరియు లా రంగాలలో చాలా ప్రముఖమైనది.

·         చారిత్రాత్మక ఫాంటసీ నవల “క్వీన్ ఆఫ్ జాజ్జౌ” అమీనా జీవితం ఆధారంగా రూపొందించబడింది.

·         రచయిత రాయ్ ఓకుపే రచించిన గ్రాఫిక్ నవల Malika: Warrior Queen (2017)లోని మాలిక పాత్రకు అమీనా ప్రేరణ.

·         వీడియో గేమ్ ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ III: లో క్వీన్ అమీనా హౌసా నాగరికత నాయకురాలిగా కనిపిస్తుంది.

No comments:

Post a Comment