12 November 2022

అల్- బైహాకీ 994–1066 Al-Bayhaqi 994–1066

 

అబూ బకర్ అహ్మద్ ఇబ్న్ హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ మూసా అల్-ఖుస్రావ్జిర్దీ అల్-బైహకీ (994–1066) ని అల్-బైహక్ అని కూడా పిలుస్తారు. అల్-బైహకీ 994లో  ఇరాన్ లోని ఖొరాసన్ ప్రావిన్స్  లోని  సబ్జెవర్ సమీపంలోని బైహాక్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. అల్-బైహకీ విద్యను గ్రహించుటకు ఖుఫా, బాగ్దాద్, ఖురాసన్, హిజాజ్ మొదలగు ప్రాంతాలను సందర్శించారు. ఇస్లామిక్ స్వర్ణయుగం లో జన్మించాడు.

 

అల్-బైహకీ షఫీ ఆలోచనా పాఠశాలలో ఫిఖ్, హదీసుల పండితుడు. అల్-బైహకీ షాఫీ ఫికా లో అనేక గ్రంధములను రచించిరి. అస్-సునన్ అల్-కుబ్రా మరియు అస్-సునన్ అస్-సుఘ్రా As-Sunan Al-Kubra and As-Sunan As-Sughra వంటి అనేక పుస్తకాలు అల్-బైహకీ రాశాడు. అద్-ధహబి ప్రకారం అల్-బైహకీ పుస్తకాలు వెయ్యి వాల్యూమ్‌లను మించిపోయాయి.

అల్-బైహకీ తన జీవితకాలంలో, ఒక ప్రసిద్ధ సున్నీ హఫీద్‌ పండితుడు. షఫీ మద్‌హబ్‌లో న్యాయశాస్త్ర పండితుడిగా మరియు ఇస్లామిక్ థియాలజీ యొక్క అష్'రీ పాఠశాలను అనుసరించాడు.

 

 అల్-బైహకీ హదీసు యొక్క సాంప్రదాయిక మూల్యాంకనంలో గణనీయమైన సంస్కరణకు దోహదపడినాడు. ఇస్లామిక్ వేదాంతశాస్త్రంతో ఏ హదీసు వ్యతిరేకం గా పరిగణించబడుతుందో దానిని మూల్యాంకనం చేయడంలో ప్రతిబింబ తార్కిక reflective reasoning ఉపయోగాన్ని నొక్కి చెప్పాడు. అల్-బైహకీ అటువంటి హదీథ్‌లను తక్కువ విశ్వసనీయమైనది గా అర్థం చేసుకుంటాడు.

 

అల్-బైహకీ ప్రకారం సంప్రదాయాలు, భగవంతుని యొక్క మానవరూప అవగాహన (anthropomorphic) ను సూచిస్థాయి. అల్-బైహకీ దృష్టిలో  "కన్ను" వంటి లక్షణాలు నిజమైన భాగాలను సూచించవు కానీ దేవుని లక్షణాలను సూచిస్తాయి.

 

అల్-బైహకీ విశ్వోద్భవ శాస్త్రంపై తన అవగాహనను తెలుపుతూ అనేక రకాల అభిప్రాయాలను కలిగి ఉన్నాడు. దేవుడు మొదట నీటిని సృష్టించాడని అల్-బైహకీ విశ్వసించాడు మరియు ఆ తర్వాత ఈ నీటిని దేవుడు  తన సృష్టికి ప్రాతిపదికగా ఉపయోగించాడు.

అల్-బైహకీ యొక్క రచనలు ఇస్లామిక్ విజ్ఞాన సంపదగా పరిగణించబడుతున్నాయి. అల్-బైహకీ రచనలు ఖచ్చితమైనవి, విశ్వసనీయమైనవి మరియు పరిపూర్ణత కలిగి ఉన్నాయి.

అల్-దహాబీ ప్రకారం వెయ్యికి పైగా సంపుటాలను రచించిన అల్-బైహకీ అతని కాలంలో ప్రముఖ రచయిత. అల్-బైహకీ రచించిన అత్యంత ప్రసిద్ధ పుస్తకాలలో:

  సునన్ అల్-కుబ్రా లిల్ బెహకీ, సాధారణంగా సునన్ అల్-బైహకీ అని పిలుస్తారు.

·        షుయాబ్ ఉల్ ఇమాన్.

·        అల్-'తిఖాద్ వాల్-హిదయా ఇలా సబిల్ అర్-రషద్

·        మారిఫా అల్-సునన్ వా అల్-అథర్ (కొన్నిసార్లు అల్-సునన్ అల్-వుస్తాగా సూచిస్తారు)

·        బయాన్ ఖాతా మాన్ అఖ్తా`అలా అల్-షఫీ.

·        అల్-మబుత - షఫీ లా పై ఒక పుస్తకం.

·        అల్ సిపాత్-ఆస్మా వా అల్

·        అల్-`తిఖాద్ `అలా మధబ్ అల్-సలాఫ్ అహ్ల్ అల్-సున్నా వ అల్-జమా`.

·        దలాయిల్ అల్-నుబువహ్ (ప్రవక్తత్వం యొక్క చిహ్నాలు)

·        అల్-దాఅవత్ అల్-కబీర్ (ప్రార్థనల ప్రధాన పుస్తకం)

·        అల్-జుహ్ద్ అల్-కబీర్ (సన్యాసం యొక్క ప్రధాన పుస్తకం)

·        హయత్ ఉల్ అన్బియా ఫి ఖుబూర్ (సమాధులలో ప్రవక్తల జీవితం)

·        షుఅబ్ అల్-ఇమాన్

·         అల్-అర్బున్ అల్-సుఘ్రా

·         అల్-ఖిలాఫియాత్

·         ఫదాయిల్ అల్-అవుకత్

·         మనాకిబ్ అల్-షఫీ

·         మనకీబ్ అల్-ఇమామ్ అహ్మద్

·         తారిఖ్ హుకామా అల్-ఇస్లాం మొదలైనవి

 

అల్-బైహకీ ధర్మబద్ధమైన పండితుల పద్ధతిలో పొదుపుగా జీవించాడు. అల్-బైహకీ తన మరణానికి ముప్పై సంవత్సరాల ముందు నిరంతర ఉపవాసం ప్రారంభించాడు. అల్-బైహకీ 1066లో  72 సంవత్సరాల వయస్సులో నిషాపూర్, ఇప్పుడు ఖొరాసన్, ఇరాన్ లో మరణించినాడు.

 

 

 


No comments:

Post a Comment