4 November 2022

ఇస్లాం లో అమరత్వం (షాహిదా) పొందిన మొదటి మహిళ-సుమయ్యా బింట్ ఖబ్బాట్ 550-615 Sumayyah bint Khabbat 550-615

 


సుమయ్యా బింట్ ఖబ్బాట్ (అరబిక్: سُمَيَّة ٱبۡنَت خَيَّاط) లేదా సుమయ్య బింట్ ఖబ్బత్ (550 – 615) ముహమ్మద్ ప్రవక్త(స) యొక్క ఉమ్మా (కమ్యూనిటీ) లో మొదటి షాహిదా మరియు ప్రవక్త (స) సహచరి స్త్రీగా ప్రసిద్ధి చెందింది.

సుమయ్యా,  మక్కా, హెజాజ్ (ప్రస్తుత సౌదీ అరేబియా) లో 550 లో జన్మించినది. సుమయ్యా,  అబిస్సినియన్ జాతీయత కల మహిళ.సుమయ్యా మక్కాలోని మఖ్జుమ్ వంశానికి చెందిన అబూ హుదైఫా ఇబ్న్ అల్-ముగీరా వద్ద బానిసగా ఉంది. సుమయ్యా ను యెమెన్‌లోని మద్హిజ్ తెగకు చెంది మాలిక్ వంశానికి చెందిన యాసిర్ ఇబ్న్ అమీర్‌తో, అబూ హుదైఫా  వివాహం జరిపాడు. తప్పిపోయిన సోదరుడిని వెతకడానికి మక్కాకు వచ్చిన తరువాత, అబూ హుదైఫా రక్షణలో సుమయ్యా మక్కా లో స్థిరపడాలని నిర్ణయించుకున్నది. యాసిర్ ఇబ్న్ అమీర్‌తో సుమయ్య ఒక కొడుకు అమ్మర్ 566కి జన్మనిచ్చింది. యాసిర్‌కు హర్త్ మరియు అబ్దుల్లా అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. 

కొంత కాలం తరువాత అబూ హుదైఫా, సుమయ్య మరియు ఆమె కుమారుడు అమ్మర్ ఇద్దరినీ బానిసత్వం నుంచి విడుదల చేసాడు. కానీ వారు అబూ హుదైఫా జీవితాంతం అతని పోషణ లోనే ఉన్నారు.  అబూ హుదైఫా "ఇస్లాంకు ముందు" మరణించాడని చెప్పబడింది.  కానీ అబూ హుదైఫా "ప్రవక్త(స)ను అపహాస్యం చేసిన వారిలో ఒకడు" అని కూడా చెప్పబడింది. 

ఒక హదీసు  ప్రకారం, "ఇస్లాంను " మొదటి స్వీకరించిన ఏడుగురి  లో సుమయ్య ఒకరు, మిగిలిన ఆరుగురు మహమ్మద్, అబూ బకర్, బిలాల్, ఖబ్బాబ్, సుహైబ్ మరియు  సుమయ్య కుమారుడు అమ్మర్.  మరొక హదీసు  ప్రకారం, అమ్మర్ "ముప్పై మంది తర్వాత" అల్-అర్కం ఇంట్లోకి ముస్లింలు ప్రవేశించే వరకు ఇస్లాం లోనికి  మారలేదు. యాసిర్ మరియు అతని కుమారుడు అబ్దుల్లా కూడా "ఇస్లాం లోకి మారారు. 610కి ముందు దిల్ వంశంచే యాసిర్‌ సోదరుడు    హర్త్ చంపబడ్డాడు..

ఖురైష్లు  తక్కువ సామాజిక స్థాయి ముస్లింలను హింసించేవారు. సుమయ్య కుటుంబ పరిస్థితి  వారి పోషకుడు అబూ హుదైఫా మరణం తర్వాత దుర్బరంగా  ఉంది మరియు మఖ్జుమ్ వంశానికి చెందిన ఇతర సభ్యులు వారిని  ఇస్లాం విశ్వాసాన్ని విడిచిపెట్టమని ఒత్తిడి  మరియు  హింసించే వారు. ఒకానొక సందర్భంలో సుమయ్య ను నీళ్లతో నిండిన కుండలో ఉంచి, సుమయ్య తప్పించుకోలేని విధంగా పైకి లేపారు. సుమయ్య, యాసిర్ మరియు అమ్మర్ కూడా మెయిల్-కోట్లు ధరించి పగటిపూట ఎండలో నిలబడవలసి వచ్చింది.

చాలా వృద్ధురాలు మరియు బలహీనమైన మహిళ" అని వర్ణించినప్పటికీ, సుమయ్య స్థిరంగా ఉండి ఇస్లాంను విడిచిపెట్టడానికి నిరాకరించినది.ఒక సాయంత్రం మఖ్జుమ్ వంశానికి చెందిన అబూ జహ్ల్, సుమయ్య నిలబడి ఉండడం గమనిoఛి సుమయ్య ను  అనరాని మాటలతో అవమానించడం ప్రారంభించాడు. ఆపై అబూ జహ్ల్ తన ఈటెతో సుమయ్య ను పొడిచి చంపాడు. అరబిక్ బదర్ వద్ద అబూ జహ్ల్ చంపబడినప్పుడు, ముహమ్మద్ ప్రవక్త(స) అమ్మర్‌తో ఇలా అన్నాడు, "అల్లా మీ తల్లిని చంపిన వ్యక్తిని చంపాడు."

ప్రముఖ ఇస్లామిక్ పండితులు  ఇబ్న్ సాద్ మరియు తబరి తమ రచనలలో సుమయ్య కధనం ను ప్రస్తావించారు.ఇస్లామిక్ పండితుడు తబరి సుమయ్య జీవితానికి సంబంధించిన ప్రత్యామ్నాయ కథనాన్ని పేర్కొన్నాడు. యాసిర్ మరణం తర్వాత సుమయ్య అజ్రాక్ అనే బైజాంటైన్ బానిసను వివాహం చేసుకున్నట్లు తబరి పేర్కొన్నాడు. చెప్పాడు. సుమయ్య-అజ్రాక్ కు సలామా అనే కుమారుడు కలదు. సుమయ్య కుమారుడు సలామా రక్తసంబంధికులు ఉమయ్యద్ కుటుంబంలో వివాహం చేసుకొన్నారు.

సుమయ్య కు సంబంధించిన తొలి ప్రస్తావన ఇబ్న్ ఇషాక్ రచన  ముహమ్మద్ జీవిత చరిత్ర, సిరతు రసూలుల్లా ("దేవుని దూత జీవిత చరిత్ర")లో ఉంది. “అమ్మర్ " సుమయ్య "కొడుకు గా Ammar "son of" Sumayya ”ప్రస్తావించబడినది.  

 

 

 

No comments:

Post a Comment