ఇమామ్ మాలిక్ ఇబ్న్ అనస్ 711లో మదీనాలోని జుల్-మర్వా అనే గ్రామంలో జన్మించాడు. ఇమామ్ మాలిక్ అతని తండ్రి, తాత మరియు ముత్తాత హదీసు పండితులు. ఇమామ్ మాలిక్ ముత్తాత, ప్రవక్త (స)తో కలిసి అనేక యుద్ధాలు చేసిన సహచరుడు.
ఇమామ్ మాలిక్ పండితుల
ఇంటిలో లో పెరిగాడు, కానీ చదువు
పట్ల ఆసక్తి లేదు. బాల్యం ఆటపాటలలో గడిచినది. కాని ఒకరోజు తండ్రి మందలింపుతో ఇమామ్ మాలిక్ 10 సంవత్సరాల
వయస్సు లో మతాన్ని అధ్యయనం చేయడానికి తన సమయాన్ని ఎక్కువగా కేటాయించాడు. ఇమామ్
మాలిక్ తన యవ్వనంలో దివ్య ఖురాన్ నేర్చుకున్నాడు మరియు దానిని కంఠస్థం చేసాడు.
ఇమామ్ మాలిక్‌కు 900 మంది ఉపాధ్యాయులు కలరు. 17 సంవత్సరాల వయస్సు నుండి ఇమామ్ మాలిక్ బోధించడం ప్రారంభించాడు మరియు చిన్న వయస్సులోనే గొప్ప పండితుడు అయ్యాడు. కాలక్రమేణా, ఇమామ్ మాలిక్ అత్యంత ప్రసిద్ధి చెందాడు. ఇమామ్ మాలిక్ హజ్‌కు వెళ్లడం తప్ప మదీనా దాటి వెలుపలకు ఎప్పుడూ వెళ్లలేదు. ఇమామ్ మాలిక్ ప్రవక్త (స) భూమి(మదీనా)పై అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడు.
అబూ హనీఫా, అబూ యూసుఫ్, లైస్ ఇబ్న్ సాద్ మరియు చాలా మందితో సహా ఇమాం మాలిక్ కు దాదాపు అందరు గొప్ప పండితులను కలిసే అవకాశం వచ్చింది. ఇమాం మాలిక్ ఇస్లామిక్ ప్రపంచంలోని ప్రతి ప్రాంతం నుండి విద్యార్థులను కలిగి ఉన్నాడు మరియు ఇమాం మాలిక్ విద్యార్థులలో ఇమామ్ షఫీ, ఇమామ్ సుఫ్యాన్ అత్-థావ్రీ, ఇబ్ను జరాజీ మరియు అబ్దుల్లా ఇబ్న్ ముబారక్ అత్యంత ప్రసిద్ధులు. సుమారు 1300 మంది పండితులు ఇమామ్ మాలిక్ యొక్క ప్రత్యక్ష విద్యార్థులు అని సూచించే కథనాలు కలవు.
ఇమాం మాలిక్ చాలా
నిరాడంబరమైన వ్యక్తి. ఇమాం మాలిక్ తన జీవితాన్ని నిరంతర జ్ఞానo పొందటం కోసం మరియు అల్లాహ్ ఆరాధనలో గడిపాడు. ఇమాం
మాలిక్ సొంత ఇల్లు లేదు. ఇమామ్ మాలిక్ తన
యొక్క గొప్ప సహచరుడు అబ్దుల్లా ఇబ్న్ మసూద్‌కు చెందిన ఇంటిలో అద్దెదారు. ఇమామ్ మాలిక్
గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇమాం మాలిక్ చాలా
చక్కటి దుస్తులు ధరించేవాడు, అందమైన
దుస్తులు ధరించడం వ్యక్తి యొక్క ప్రదర్శనను మెరుగుపరుస్తుందని ఇమాం మాలిక్ అభిప్రాయం.
ఇమామ్ మాలిక్ తన
తరగతిలో కఠినమైన క్రమశిక్షణను కొనసాగించేవారు. విద్యార్ధులు అందరూ సమానంగా
పరిగణించబడ్డారు మరియు ఖలీఫాతో సహా మిక్కిలి ప్రభావవంతమైన వ్యక్తుల కోసం ప్రత్యేక
సీటింగ్ ఏర్పాట్లు లేవు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సున్నీ ముస్లింలచే గౌరవించబడిన ఇమామ్ మాలిక్, అన్ని కాలాలలోని గొప్ప హదీసు పండితులలో ఒకరు. మాలకీ న్యాయ శాస్త్ర(Malaki School of Jurisprudence) రూపకల్పనలో ఇమామ్ మాలిక్ ప్రముఖ పాత్ర వహించాడు. ఇమాం మాలిక్ అనుచరులు మాలికీ స్కూల్ ఆఫ్ లా (మధబ్)గా పిలవబడ్డారు.
ఇమాం మాలిక్ పుస్తకం “అల్ మువత్తా” హదీసులకు సంబంధించి వ్రాసిన మరియు సంకలనం చేయబడిన మూడవ సమగ్ర పుస్తకం మరియు సున్నీ ముస్లింల ప్రకారం 100% ప్రామాణికమైన హదీసులను కలిగి ఉన్న మొదటిది. వందల, వేల హదీసులను పరిశీలించిన తరువాత, ఇమాం తన పుస్తకం కోసం వాటిలో కొన్నింటిని ఎంచుకొని వాటిని సబ్జెక్ట్ వారీగా కేటాయించాడు. ఉదా. ప్రార్థన, జకాత్, ఉపవాసం మొదలైనవి.
ఇమామ్ మాలిక్ యొక్క “మువత్తా”ను సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం వంటి సాహిహ్ ( 100% ప్రామాణికమైన హదీసుల పుస్తకం)గా పరిగణిస్తారు, అయితే “మువత్తా” బాగా ప్రాచుర్యం పొందకపోవడానికి కారణం దానిలోని చాలా హదీసులు బుఖారీ మరియు ముస్లింలలో ఉండడమే... ఇమామ్ బుఖారీ ప్రకారం హదీస్ వ్యాఖ్యాతల యొక్క అత్యంత ప్రామాణికమైన గొలుసు, అంటే గోల్డెన్ చైన్, "ఇబ్న్ ఉమర్ నుండి నఫీ నుండి మాలిక్ మరియు చివరకు ప్రవక్త.".
ఇమామ్ మాలిక్ భార్య,
ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె కలరు. ఫాతిమా బింటే మాలిక్ అనే ఇమాం మాలిక్ కుమార్తె
హదీసు పండితురాలు. ఫాతిమా బింటే మాలిక్ “మువత్తా” మొత్తాన్ని
కంఠస్థం చేసింది.
సున్నీ ఇస్లాం యొక్క ఇతర ముగ్గురు గొప్ప ఇమామ్‌ల మాదిరిగా కాకుండా, ఇమామ్ మాలిక్, ఖలీఫాలతో చాలా మంచి సంబంధం కలిగి ఉన్నాడు మరియు వారి నుండి బహుమతులు స్వీకరించి మదీనాలోని వారి రాజభవనాలను సందర్శించేవాడు. ఇస్లామిక్ తీర్పులను స్వతంత్రంగా ఇవ్వడానికి అలాంటి సంబంధం ఇమాం మాలిక్ కు ఎప్పుడూ అడ్డంకి కాలేదు మరియు ఇమాం మాలిక్ ఏనాడు ప్రభుత్వ పదవిని నిర్వహించలేదు.
ఇమాం మాలిక్ ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో నాటి పాలకులకు సలహా ఇచ్చాడు మరియు వారిని సంతోషపెట్టడానికి ఎటువంటి తీర్పులను వక్రీకరించలేదు. దీని కారణంగా, ఒకసారి మదీనా గవర్నర్, ఖలీఫ్ అల్ మన్సూర్ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా తీర్పును జారీ చేసినందుకు ఇమాం మాలిక్ ను అరెస్టు చేసి బహిరంగంగా కొరడాలతో కొట్టారు.
ఈ విషయం ఖలీఫాకు తెలియడంతో, ఖలీఫా గవర్నర్‌ను తొలగించి, ఇమామ్ మాలిక్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇమామ్ మాలిక్ పుస్తకం “అల్-మువత్తా”ను పవిత్ర కాబాలో ఉంచాలని మరియు మొత్తం ముస్లిం ఉమ్మా దాని తీర్పులను అనుసరించమని ఖలీఫ్ అల్ మన్సూర్ ఆదేశించినట్లు చెప్పబడుతుంది. అయితే, అలాంటి ప్రతిపాదనను ఇమామ్ మాలిక్ తిరస్కరించారు.
ఇమామ్ మాలిక్ తన 87వ ఏట హిజ్రీ 179 (క్రీ.శ. 795)లో మరణించాడు. ఇమామ్ మాలిక్ మరణ వార్త విని యావత్ ముస్లిం సమాజం విషాదంలో మునిగిపోయింది. ఇమామ్ మాలిక్ మరణవార్త విన్న సుఫియాన్ ఇబ్ను ఉహైనా బరువెక్కిన హృదయంతో ఇమామ్ మాలిక్ తర్వాత భూమిపై మరొకరు కనిపించరని అన్నారు.
మాలిక్ ఇబ్న్ అనస్ “మువాతా” అనే ఒక ప్రధాన పుస్తకాన్ని రూపొందించాడు. ఇది ఇస్లామిక్ చట్టం యొక్క పురాతన సంగ్రహం.
ఇమామ్ మాలిక్ రచనలు:
• అల్-మువత్తా.
• అల్-ముదవ్వనా అల్-కుబ్రా, మాలిక్ ఇబ్న్ అనస్ మరణం తర్వాత సాహ్నున్ ఇబ్న్ సైద్ ఇబ్న్ హబీబ్ అట్-తనూఖీ (c. 776-7 – 854–5)చే వ్రాయబడింది.
మాలికీ ఇస్లామిక్ చట్టం/మధబ్ మాలిక్, మాలికియ న్యాయ పాఠశాలMālikī Islamic law/ Madhhab Mālik:
మధబ్ మాలిక్ లేదా మాలికీ , ఇస్లాంలోని నాలుగు సున్నీ న్యాయ పాఠశాలల్లో ఒకటి. మాలికీ న్యాయ పాఠశాల మదీనాలోని పురాతన న్యాయ పాఠశాల. మాలికీ న్యాయ పాఠశాల 8వ శతాబ్దంలో స్థాపించబడింది. ఇమామ్ మాలిక్ ఇబ్న్ అనస్ బోధనల ఆధారంగా, ఖురాన్ మరియు హదీథ్ యొక్క చట్టపరమైన చిక్కులను అర్థం చేసుకోవడానికి మాలికీలు స్థానిక మదనీ కమ్యూనిటీ అభ్యాసాన్ని (ʿamal) నొక్కిచెప్పారు. అదే సమయంలో, మాలికీలు సారూప్య తార్కికానికి (కియాస్qiyās) ఆహ్వానించారు మరియు ప్రయోజనకరమైన చట్టపరమైన ఫలితాలను నిర్ధారించడానికి న్యాయపరమైన విచక్షణను (ఇస్తిహ్సాన్istihsan) ఉపయోగించారు.
మాలికీ న్యాయ పాఠశాల
ప్రస్తుతం ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికా అంతటా, సూడాన్‌లో మరియు కొన్ని పర్షియన్ గల్ఫ్
రాష్ట్రాలలో ఉంది.
No comments:
Post a Comment