8 November 2022

ఇబ్న్ మాజా హదీసు పండితుడు (824-886)

 

ఇబ్న్ మాజా అని పిలువబడే అబు అబ్దుల్లా ముహమ్మద్ ఇబ్న్ యజీద్ అల్-రబీ అల్-కజ్వినీ, హదీసు సంకలన కర్తలో ఒకరిగా పరిగణించబడతారు.

 ఇబ్న్ మాజా (824 AD)లో పర్షియాలోని ఖజ్విన్‌లో జన్మించాడు మరియు (886 AD)లో  మరణించాడు.  అత్యంత ముఖ్యమైన ఆరు హదీసు సంకలనములలో చివరిది అయిన "సునన్" లేదా "సునన్ ఇబ్న్ మాజా" అనే  హదీసు సంకలనం ద్వారా ఇబ్న్ మాజా కీర్తి మరియు గుర్తింపు పొందాడు.

ఖజ్విన్‌,  అబ్బాసిద్  ఖలీఫా  ఉత్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ కాలంలో నాలెడ్జ్ సెంటర్‌గా రూపాంతరం చెందినది  మరియు పరిశోధన మరియు శాస్త్రీయ కార్యకలాపాలతో విజ్ఞాన నగరంగా మారింది.

ఖలీఫా అల్-మామున్ పాలనలో అబ్బాసిద్ రాజ్యం ఇస్లామిక్ శక్తీ మరియు నాగరికత యొక్క కాలంగా  ఉంది

 

చిన్నప్పటి నుండి, ఇబ్న్ మాజా హదీసు పండితులతో గడిపాడు. 22 సంవత్సరాల వయస్సులో ఇబ్న్ మాజా, హదీసులను సేకరించడానికి మరియు ఇతర పండితులను కలవడానికి మరియు నేర్చుకోవడానికి కుఫా, డమాస్కస్, హిజాజ్, ఈజిప్ట్ మరియు ఇతర నగరాలకు పర్యటించాడు. ప్రయాణించిన ప్రతి దేశంలోని హదీస్ పాఠశాలలో  ఇబ్న్ మాజా హదీసులను అబ్యసించాడు మరియు  సేకరించాడు.

ఇబ్న్ మాజా,  అల్ జమాన్, అబూ బకర్ ఇబ్న్ అబీ షైబా, ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా బిన్ నిమీర్ మరియు ముహమ్మద్ ఇబ్న్ అల్-ముతన్నా వంటి సీనియర్ హదీత్ పండితుల దగ్గర చదువుకున్నాడు.

ఇబ్న్ మాజా రచయిత మరియు ఉపాధ్యాయుడు. ఇబ్న్ మాజా విద్యార్థులలో  ఇబ్న్ సెబౌవే, మహమ్మద్ బిన్ ఇస్సా అల్-సఫర్, ఐజాక్ బిన్ మొహమ్మద్, అలీ బిన్ కత్తాన్ మరియు ఇతర ప్రసిద్ధ హదీస్ వ్యాఖ్యాతలు కలరు.

15 సంవత్సరాల ప్రయాణాల అనంతరం ఇబ్న్ మాజా చివరకు ఖజ్విన్‌లో స్థిరపడినాడు. ఖజ్విన్‌లో ఇబ్న్ మాజా హదీసులను రాయడం, వర్గీకరించడం మరియు వివరించడం కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు  మరియు  హదీసుల సేకరణ రంగంలో ఒక సూచనగా నిలిచాడు.

"విశ్వసనీయుడు, జ్ఞానవంతుడు. తేదీలు మరియు సునన్‌లను వర్గీకరించడంతో సహా హదీసు సేకరణ రంగం లో ఇబ్న్ మాజా ముఖ్యమైన పండితుడు”. అని ఖజ్విని Qazwini పేర్కొన్నాడు.

ఇబ్న్ మాజా “హదీస్ లలో గల అపారమైన జ్ఞానం గల పండితుడు మరియు నిజాయితీగల విమర్శకుడు." ఇమామ్ థాబి, ఇబ్న్ ఖల్లికాన్ పేర్కొన్నారు.

"సునన్ ఇబ్న్ మాజా" అనే పుస్తకం ప్రవక్త హదీసులోని ఆరు పుస్తకాలలో ఒకటి మరియు అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత ప్రసిద్ధమైనదిగా పరిగణించబడుతుంది. “సునన్ ఇబ్న్ మాజా” వివిధ సబ్జెక్టుల వారిగా  వర్గీకరించబడింది మరియు 4341 హదీసులను లెక్కించవచ్చు. కొంతమంది పండితులు అందలో కొన్ని హదీసులు బలహీనంగా ఉన్నాయని లేదా నిజం కాదని నమ్ముతారు. అందులో కొన్ని హదీసులు (సుమారు మూడు వేలు) ఇతర హదీసు పుస్తకాలలో కూడా చూడవచ్చు. ఇబ్న్ మాజా తన "సునన్" పుస్తకంలో 1339 హదీసులను మాత్రమే చేర్చాడు.

 

కొంతమంది సంప్రదాయవాదులు ఇబ్న్ మాజా కంటే మరొక ప్రసిద్ధ హదీసు పండితుడు అల్-దారిమి (d. 869) యొక్క సునన్ పనిని ఇష్టపడతారు.

పన్నెండవ శతాబ్దపు నాటికి, ఇబ్న్ మాజా సంప్రదాయవాదిగా (ముహద్దీత్) గా గుర్తిoచబడినాడు మరియు ఇబ్న్ మాజా సునన్ చివరికి ఆరు హదీసు పుస్తకాలలో ఒకటిగా గుర్తించబడింది, అయినప్పటికీ ఇది ఇప్పటికీ బలహీనమైనదిగా పరిగణించబడుతుంది.

"సునన్" అనేది ఇతర హదీత్ పుస్తకాల నుండి చాలా భిన్నంగా ఉంటుంది, ఇబ్న్ మాజా హదీసులను  వివరించడంలో మరియు వ్యాఖ్యానించడంలో జాగ్రత్త తీసుకున్నారు. అల్-సిందీ, సుయుతీ, ముహమ్మద్ అల్-ముంతకీ అల్-కష్నావి వంటి  ఇతర పండితులు ఇబ్న్ మాజా  పుస్తకంపై వ్యాఖ్యానించారు.

ఇబ్న్ మాజా ఇతర రచనలు:

"సునన్"తో పాటు, ఇబ్న్ మాజా పవిత్ర ఖురాన్ యొక్క వివరణను రాశాడు. ఇబ్న్ కథిర్ తన పుస్తకం "ది బిగినింగ్ అండ్ ది ఎండ్"లో "సునన్" బాగా గౌరవించబడిన వివరణ అని రాశాడు, కానీ దురదృష్టవశాత్తు ఇబ్న్ మాజా ను వ్రాసిన అనేక ఇతర పుస్తకాల వలె అది పోయింది.

ఇబ్న్ మాజా తన కాలం వరకు ప్రవక్త సహచరుల శకాన్ని వివరిస్తూ ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఇబ్న్ కథిర్ ఇది వాస్తవాలతో కూడిన దృఢమైన పుస్తకం అని నొక్కి చెప్పాడు. కానీ పుస్తకం కూడా పోయింది.

ఇబ్న్ మాజా 886 AD రంజాన్ నెలలో మరణించాడు.

 

 

 

No comments:

Post a Comment