ఇబ్న్ తైమియా, పూర్తి పేరు తకీ
అల్-దీన్ అబూ అల్-అబ్బాస్ అహ్మద్ ఇబ్న్ ʿఅబ్ద్ అల్-సలామ్ ఇబ్న్ ʿఅబ్ద్
అల్లాహ్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ తైమియా. 1263, హర్రాన్, మెసొపొటేమియా Mesopotamia(ఆధునిక టర్కీ) లో జన్మించిన ఇబ్న్ తైమియా 1328లో దమాస్కస్, సిరియా లో
మరణించారు. అహ్మద్ ఇబ్న్ హంబల్ స్థాపించిన హంబలీ న్యాయ పాఠశాల(Hanbal School of
Jurisprudence)సమర్ధకునిగా, ఇస్లామిక్ ధర్మo
దాని సనాతన మూలాలకు అనగా దివ్య ఖురాన్ మరియు సున్నత్ కు తిరిగి రావాలని కోరుకున్నారు.
మెసొపొటేమియాలో జన్మించిన ఇబ్న్ తైమియా 1268లో మంగోల్ దండయాత్ర పలితంగా శరణార్థిగా
డమాస్కస్‌లో విద్యనభ్యసించాడు. ఇబ్న్ తైమియా తరువాత హంబలీ
న్యాయ పాఠశాల బోధనలలో మునిగిపోయాడు. ఇబ్న్ తైమియా, హంబలీ న్యాయ పాఠశాల సిద్ధాంతాలలో
అసమానమైన పాండిత్యాన్ని కలిగి ఉన్నాడు. ఇబ్న్ తైమియా సమకాలీన ఇస్లామిక్
మూలాలు మరియు విభాగాలలో- ఖురాన్, హదీత్, న్యాయశాస్త్రం (fiqh), పిడివాద వేదాంతశాస్త్రం (కలాం), తత్వశాస్త్రం మరియు సూఫీ
(ఇస్లామిక్ మార్మికవాదం) వేదాంతశాస్త్రంలో విస్తృతమైన జ్ఞానాన్ని సంపాదించాడు.
ఇబ్న్ తైమియా జీవితం వేధింపులతో
నిoడినది. 1293 లో ఇబ్న్
తైమియా ప్రవక్త(స)ను అవమానించాడని ఆరోపించిన క్రైస్తవుడికి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన స్థానిక అధికారులతో విభేదించాడు. 1298లో అతను
ఆంత్రోపోమార్ఫిజం (దేవునికి మానవ లక్షణాలను ఆపాదించడం) మరియు పిడివాద
వేదాంతశాస్త్రం యొక్క చట్టబద్ధతను ధిక్కరిస్తూ విమర్శించినందుకు ఆరోపించబడ్డాడు.
1299 నుండి 1303 సంవత్సరాలలో
మంగోల్ సంక్షోభం సమయంలో మరియు ముఖ్యంగా డమాస్కస్ ఆక్రమణ సమయంలో, ఇబ్న్ తైమియా
మంగోల్ ఆక్రమణదారుల అనుమానిత విశ్వాసాన్ని ఖండించాడు. తరువాతి సంవత్సరాల్లో ఇబ్న్
తైమియా లెబనాన్‌లోని కస్రావాన్ షియాకు వ్యతిరేకంగా పనిచేసాడు.రిఫైయ్య-ఒక సూఫీ తరికా,
సృష్టికర్త మరియు సృష్టించినది
ఒకటిగా మారిందని బోధించిన ఇట్టిహాదియా పాఠశాల school of thought (ఇబ్న్
అల్-అరబీ బోధన నుండి అభివృద్ధి చెందిన
పాఠశాల) ఏకత్వాన్నికూడా ఇబ్న్ తైమియా ఖండించాడు.
1306లో గవర్నర్ కౌన్సిల్‌కు తన నమ్మకాలను వివరించడానికి ఇబ్న్ తైమియా
పిలిపించబడ్డాడు. గవర్నర్ కౌన్సిల్ ఇబ్న్ తైమియాను
ఖండించనప్పటికీ, ఇబ్న్ తైమియా
ను కైరోకు పంపింది. అక్కడ ఇబ్న్
తైమియా ఆంత్రోపోమోర్ఫిజం ఆరోపణలపై కొత్త కౌన్సిల్ ముందు హాజరయ్యాడు మరియు 18 నెలలపాటు
కోటలో ఖైదు చేయబడ్డాడు. విడుదల పొందిన వెంటనే, ఇబ్న్ తైమియా 1308లో జైలులో
సెయింట్‌లను ఆరాధించడం మతపరమైన చట్టాని (షరియా) కి విరుద్ధమని ఖండించినందుకు
ఖాదీస్ (సివిల్ మరియు మతపరమైన విధులను నిర్వర్తించే ముస్లిం న్యాయమూర్తులు) చే మరల
నిర్బంధించబడ్డాడు.
ఇబ్న్ తైమియా ను 1309లో
అలెగ్జాండ్రియా లో గృహనిర్బంధంలో ఉంచారు. పదవీ త్యాగం చేసిన సుల్తాన్ ముహమ్మద్
ఇబ్న్ ఖలావున్ ఏడు నెలల తర్వాత, తిరిగి వచ్చినప్పుడు ఇబ్న్ తైమియా కైరోకు తిరిగి రాగలిగాడు. 1313లో మంగోలుల
నుంఛి డమాస్కస్‌ను తిరిగి పొందాలనే ఉద్దేశం
తో సుల్తాన్ ముహమ్మద్ ఇబ్న్ ఖలావున్ తో కలిసి ఇబ్న్ తైమియా కైరోను మరోసారి
విడిచిపెట్టాడు.
ఇబ్న్ తైమియా తన చివరి 15 సంవత్సరాలు
డమాస్కస్‌లో గడిపాడు. హంబలి న్యాయ పాఠశాల బోధకునిగా పెద్ద సంఖ్యలో ఇబ్న్ ఖయ్యిమ్
అల్-జౌజియా (1350లో
మరణించాడు) వంటి శిష్యులను
పొందాడు. ఇబ్న్ తైమియా ముస్లిం
సంప్రదాయబద్ధంగా భార్యను తిరస్కరించే సౌలభ్యాన్ని తగ్గించే సిద్ధాంతానికి మద్దతు
ఇస్తున్నాడని ఆరోపణ తో 1320 నుండి 1321 వరకు
డమాస్కస్ కోటలో నిర్బంధించబడ్డాడు. జూలై 1326లో, సెయింట్
ఆరాధనను ఖండించడాన్ని కొనసాగించినందుకు కైరో సల్తానత్ ఇబ్న్ తైమియా ను కోటకే పరిమితం
చేయాలని ఆదేశించింది.
డమాస్కస్ జైలులో తన పుస్తకాలు
మరియు రచనా సామగ్రిని కోల్పోయి 1328లో 65 సంవత్సరాల వయస్సులో డమాస్కస్,
సిరియా జైలులో ఇబ్న్ తైమియా మరణించాడు మరియు సూఫీ స్మశానవాటికలో ఇబ్న్ తైమియా ఖననం
చేయబడ్డాడు. ఇబ్న్ తైమియా సమాధి ఇప్పటికీ ఉంది మరియు దానిని ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు.
ఇబ్న్ తైమియా గణనీయమైన రచనలు
చేసాడు. అవి సిరియా, ఈజిప్ట్, అరేబియా
మరియు భారతదేశంలో ప్రచురించబడినవి. ఇబ్న్ తైమియా రచనలు అతని ధార్మిక మరియు రాజకీయభావాలను వివరించినవి. ఇబ్న్ తైమియా రచనలలో రెండు రచనలు ప్రత్యేక
శ్రద్ధకు అర్హమైనవి. ఒకటి “అల్-సియాసత్ అల్-షరియా (“ట్రీటైజ్ ఆన్ జురిడికల్
పాలిటిక్స్”), మరొకటి, మిన్హాజ్
అల్-సున్నా ("ది వే ఆఫ్ ట్రెడిషన్"). ఇది మధ్యయుగ
ఇస్లాం నుండి మనుగడలో ఉన్న తులనాత్మక వేదాంతశాస్త్రం యొక్క గొప్ప రచన.
ఇబ్న్ తైమియా ఇస్లామిక్ మూలాలకు
తిరిగి రావాలని కోరుకున్నాడు, ఇస్లామిక్ మూలాలు వివిధ మతపరమైన
విభాగాలు లేదా పాఠశాలల ద్వారా ఒక స్థాయిలో లేదా మరొక స్థాయిలో తరచుగా మార్చబడినాయి
అని ఇబ్న్ తైమియా భావించాడు. ఇబ్న్ తైమియా ప్రకారం ఇస్లామిక్ మూలాధారాలు దివ్య ఖురాన్
మరియు సున్నత్ మాత్రమె.
ఖురాన్ మరియు సున్నత్ రెండు
మూలాలపై ఆధారపడి ఉంటే తప్ప, ఇజ్మా, లేదా సంఘ
ఏకాభిప్రాయం కు విలువ లేదు అని ఇబ్న్ తైమియా
నొక్కి చెప్పాడు. అయితే, ఇబ్న్ తైమియా
సంప్రదాయవాదం, సారూప్య
తార్కికం (ఖియాస్) మరియు యుటిలిటీ (మసలాహ్(maṣlaḥah)) ను తన ఆలోచనలో
పెద్ద స్థానాన్ని అనుమతించకుండా నిరోధించలేదు. రెండూ ద్యోతకం మరియు సంప్రదాయం revelation and tradition యొక్క
లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి. మూలాధారాలకు తిరిగి రావడం మాత్రమే ముస్లిం సమాజం
ఐక్యతకు అనుమతిస్తుందని ఇబ్న్ తైమియా భావించాడు.
థియోడిసిలో (ప్రపంచంలో చెడును
గమనించినప్పుడు దేవుడు మంచివాడని సమర్థించడం), ఇబ్న్ తైమియా ఖురాన్‌లో
వర్ణించబడినట్లుగా మరియు ప్రవక్త సున్నత్‌లో వివరించినట్లుగా దేవుణ్ణి వర్ణించాలని
కోరుకున్నాడు.
ఆరాధనల విషయం లో దేవుడు మరియు
అతని ప్రవక్త ప్రారంభించిన ఆరాధనలు మాత్రమే అవసరమని మరియు సామాజిక సంబంధాలలో, ఖురాన్ మరియు
సున్నత్ ద్వారా నిషేధించబడిన వాటిని మాత్రమే నిషేధించగలమని ఇబ్న్ తైమియా
విశ్వసించాడు. ఇబ్న్ తైమియా ఖండించదగిన ఆవిష్కరణలను (బిదహ్) పక్కన పెట్టడానికి
మొగ్గు చూపాడు మరియు మరింత సరళమైన ఆర్థిక నీతిని నిర్మించాడు.
రాజకీయాల్లో ఇబ్న్ తైమియా మొదటి నాలుగు ఖలీఫాల (రాషిదూన్) యొక్క చట్టబద్ధతను గుర్తించాడు, కానీ ఒకే ఖలీఫాను కలిగి ఉండవలసిన అవసరాన్ని తిరస్కరించాడు మరియు అనేక ఎమిరేట్స్ ఉనికిని అనుమతించాడు. ప్రతి ఎమిరేట్‌లో,రాజు మతపరమైన చట్టాన్ని ఖచ్చితంగా వర్తింపజేయాలని మరియు దేవునికి అవిధేయత చూపనంతకాలం చట్టపరమైన అభిప్రాయం అనేది మతపరమైన చట్టo పై ఆధారపడాలని ఇబ్న్ తైమియా డిమాండ్ చేశాడు. ఇబ్న్ తైమియా ప్రకారం రాజు అధికార పరిధిలో సాధారణ సంక్షేమ ప్రయోజనం కోసం "మంచిని కోరి చెడును నిషేధిoచాలి "అనే భావనను ప్రతి ముస్లిం తప్పనిసరిగా పాటించాలని కోరాడు.
ఇబ్న్ తైమియా తన కాలంలోనే అనేక మంది మతపరమైన మరియు రాజకీయ ప్రత్యర్థులను కలిగి
ఉన్నప్పటికీ, ఇస్లాంను బలంగా
ప్రభావితం చేసాడు. మూలాలకు తిరిగి రావడం ద్వారా సాంప్రదాయ సిద్ధాంతాలను సంస్కరించే
వివిధ సంస్కరణ ఉద్యమాలను కూడా ఇబ్న్ తైమియా ప్రభావితం చేసాడు.
No comments:
Post a Comment