ఇమామ్ ముస్లిం గా పిలబడే ప్రముఖ హదీసు పండితుని పూర్తి
పేరు అబూ అల్-హుసేన్ ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్
అల్-ఖుషైరీ. ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ యొక్క
జననం అబ్బాసిడ్ ఖలీఫత్ కాలం
లో 817లో
ఇరాన్ లోని నిషాపూర్
లో జరిగింది మరియు మరణం
నష్రాబాద్, ఇరాన్లో 875లో జరిగింది.
పండితుల ప్రకారం, ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అరబ్ లేదా పెర్షియన్ మూలానికి చెందినవాడు. ముస్లిం
శాస్త్రవేత్త (ఇబ్న్ అల్ హజ్మ్) సహా మెజారిటీ పండితులు అతన్ని అరబ్ తెగకు చెందిన సభ్యుడిగా
పరిగణించారు.
ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ యొక్క ఉపాధ్యాయులలో హర్మలా ఇబ్న్ యాహ్యా, సైద్ ఇబ్న్ మన్సూర్, అబ్ద్-అల్లా ఇబ్న్ మస్లమా అల్-ఖనాబి, అల్-ధుహలీ, అల్-బుఖారీ, ఇబ్న్ మైన్, యాహ్యా ఇబ్న్ యాహ్యా అల్-నిషాబురి అల్-తమీమి మరియు ఇతరులు
ఉన్నారు.
ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్, విద్యార్థులలో అల్-తిర్మిజీ, ఇబ్న్ అబీ హాతిమ్ అల్-రాజీ మరియు ఇబ్న్ ఖుజాయిమా ఉన్నారు, వీరిలో ప్రతి ఒక్కరూ హదీసులపై రచనలు కూడా రాశారు.
అరేబియా ద్వీపకల్పం, ఈజిప్ట్, ఇరాక్ మరియు సిరియా అంతటా తన అధ్యయనాల తర్వాత, ఇమాం ముస్లిం తన స్వస్థలమైన నిషాపూర్‌లో స్థిరపడ్డాడు, అక్కడ అతను అల్-బుఖారీ ని కలుసుకున్నాడు
మరియు అల్-బుఖారీకి జీవితకాల స్నేహితుడు అయ్యాడు.
ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ ప్రముఖ హదీసు (ముహద్దీత్) పండితులలో ఒకడు.
ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ విస్తృతంగా ప్రయాణించారు. ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ గొప్ప రచన, సాహిహ్ ముస్లిం
Ṣaḥīḥ
Muslim ("నిజమైన").
ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అరేబియా, ఈజిప్ట్, సిరియా మరియు ఇరాక్‌లలో సేకరించిన సుమారు 300,000 సంప్రదాయాల నుండి సాహిహ్ ముస్లిం
Ṣaḥīḥ
Muslim గ్రంధం ను సంకలనం చేసినట్లు చెప్పబడింది.
సాహిహ్ ముస్లిం సున్నీ ఇస్లాంలోని ఆరు ప్రధాన హదీసు
సేకరణలలో ఒకటి, మరియు “సాహిహ్ ముస్లిం Ṣaḥīḥ
Muslim” ఏకగ్రీవంగా ప్రశంసించబడింది. సహీహ్ అల్-బుఖారీతో పాటు రెండు అత్యంత ప్రామాణికమైన
(సాహిహ్) సేకరణలలో సాహిహ్ ముస్లిం ఒకటిగా
పరిగణించబడుతుంది.
ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ యొక్క “సాహిహ్ ముస్లిం” లోని హదీసులు 3,033 నుండి 12,000 వరకు ఉంటాయి, ముస్లిం సహీహ్ ("ప్రామాణికమైనది") మరియు సహీహ్ బుఖారీ తో సుమారు 2000 హదీసులను పంచుకున్నట్లు చెప్పబడింది
ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ ముస్లింలు ప్రతి
సంప్రదాయానికి సంబంధించిన ఇస్నాద్‌ల పూర్తి వివరాలను అందించడానికి మరియు పాఠ్య
వైవిధ్యాలను textual variations
రికార్డ్ చేయడoలో జాగ్రత్తగా
ఉండేవారు. “సాహిహ్ ṢaḥīḥMuslim” సేకరణలో ప్రారంభ ఇస్లామిక్
వేదాంతశాస్త్రం మరియు ఖురాన్‌పై చర్చ కూడా ఉన్నాయి.
అల్-బుఖారీ మరియు ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ సంకలనం చేసిన రెండు సేకరణలు, రెండూ సాహిహ్ అని పిలువబడతాయి, ఇవి ఖురాన్ తర్వాత ఇస్లామిక్ చట్టం మరియు ఆచరణలో రెండవ అతి ముఖ్యమైన మూలాలు. ఈ సంకలనాలు మాఘాజీ (ప్రవక్త తన జీవితకాలంలో జరిపిన దాడుల వివరాలు ) మరియు సీరా sīrah యొక్క సేకరణలలో కూడా భాగమయ్యాయి.
సున్నీ పండితుడు, ఇషాక్ ఇబ్న్ రహ్వేహ్ ఇమాం ముస్లిం యొక్క కృషిని మెచ్చుకొన్నాడు.
ఇబ్న్ అబీ హాతిమ్ ఇమాం ఇమాం ముస్లింను "విశ్వసనీయుడు, హదీసుల పరిజ్ఞానం ఉన్న హదీసు పండితులలో ఒకడు"గా
అంగీకరించాడు.
“సహిహ్ ముస్లిం” సున్నీ ముస్లింలలో అత్యంత ప్రామాణికమైన
హదీసు సేకరణలుగా పరిగణించబడుతుంది, ఇది సహీహ్ బుఖారీ తర్వాత రెండవది.
ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ రచనలు:
• సహీహ్ ముస్లిం: ఇమాం ముస్లిం యొక్క ప్రామాణిక హదీసుల సేకరణ
పుస్తకం.
No comments:
Post a Comment