హుగ్లీలో స్థిరపడిన సంపన్న పెర్షియన్ వ్యాపారులలో
ఒకరైన అఘా ఫజ్లుల్లా కుటుంబంలో జన్మించిన మహమ్మద్ మొహ్సిన్ తరతరాల సంపద మరియు
అదృష్టాన్ని పొందిన అదృష్ట గ్రహీత.
మహమ్మద్ మొహ్సిన్ పెద్ద సోదరి, మను జన్ ఖనుమ్
సహాయంతో, పూర్వీకులు నిర్మించిన ఇమాంబరాను నిర్వహించాడు. మహమ్మద్
మొహ్సిన్ అరబిక్ మరియు పర్షియన్ బాషలలో ఇంటివద్దనే ప్రారంభ విద్యను పొందాడు.
మహమ్మద్ మొహ్సిన్ రచనా నైపుణ్యం కలవాడు మరియు తన
తీరిక సమయంలో ఖురాన్ కాపీలు రాసేవాడు మరియు పేదలకు ఉచితంగా ఇవ్వడానికి మొత్తం 72 కాపీలను తయారు
చేశాడు. మహమ్మద్ మొహ్సిన్ కాపీలలో కొన్ని అప్పట్లో వెయ్యి రూపాయలకు అమ్ముడయ్యాయని
చెబుతారు..1770లో గ్రేట్ బెంగాల్ కరువు సమయంలో పేదలకు మరియు కష్టాల్లో
ఉన్న వారికి సహాయం చేయడంలో మహమ్మద్ మొహ్సిన్ ప్రముఖ వ్యక్తి.
మహమ్మద్ మొహ్సిన్, ట్యూటర్ అఘా షిరాజీ, స్వయంగా ఒక
పర్షియన్. అఘా షిరాజీ తరచుగా
ప్రయాణాలు మరియు సాహసాల కథలను మహమ్మద్ మొహ్సిన్ కి వివరిoచేవాడు. ఇది మొహ్సిన్‌లో ప్రయాణలపై ఆసక్తిని రేకెత్తించింది. ముప్పై
రెండు సంవత్సరాల వయస్సులో, మహమ్మద్ మొహ్సిన్ ప్రయాణం చేయడానికి హుగ్లీ నుండి
బయలుదేరాడు.
మహమ్మద్ మొహ్సిన్ ప్రయాణాలు అతనిని అరేబియాకు
తీసుకెళ్లాయి, అక్కడ నుండి మహమ్మద్ మొహ్సిన్ మక్కా మరియు మదీనాకు
తీర్థయాత్రకు వెళ్ళాడు, తద్వారా 'హాజీ' గా పిలువబడినాడు.
మహమ్మద్ మొహ్సిన్ అరేబియా, పర్షియా, హిందుస్థాన్ మరియు మధ్య ఆసియా మీదుగా 27 సంవత్సరాల పాటు
ప్రయాణించి చివరకు 60 సంవత్సరాల వయస్సులో ముర్షిదాబాద్ (లక్నోలో కొంతకాలం ఆగాడు)
తిరిగి వచ్చాడు.
సోదరి మను జన్ ఖనుమ్ భర్త మరణం తర్వాత మహమ్మద్
మొహ్సిన్ సోదరి వ్యాపారం మరియు ఎస్టేట్ల నిర్వహణ కు హుగ్లీకి తిరిగి వచ్చాడు. సోదరి మను జన్ ఖనుమ్ మరణానంతరం, ఆమె తన ఆస్తి
మొత్తాన్ని మొహ్సిన్‌కి అప్పగించింది.
73 సంవత్సరాల వయస్సులో హాజీ మహమ్మద్ మొహ్సిన్ సంపన్నుడు
అయ్యాడు అయితే, హాజీ మహ్మద్ మొహ్సిన్, సాధారణ
జీవితాన్ని గడిపాడు మరియు పేదరికంలో ఉన్న అనేకమందికి సహాయం చేయదానికి తన సంపదను వినియోగించాడు.
1806లో, హాజీ మహ్మద్ మొహ్సిన్ తన
మొత్తం ఆదాయాన్ని ధార్మిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని ఒప్పుకుంటూ ట్రస్ట్ డీడ్‌పై
సంతకం చేశాడు. హుగ్లీలోని ఇమాంబరా ఇప్పటికీ దాని గోడలలో ఒకదానిపై ఈ దస్తావేజు
కాపీని కలిగి ఉంది. హాజీ మహ్మద్ మొహ్సిన్ ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో 1812లో మరణించాడు మరియు సోదరి మను జన్
ఖనుమ్‌కు దగ్గరగా ఖననం చేయబడినాడు.
తరువాత కాలం లో రాజీబ్ అలీ ఖాన్ మరియు షకీర్ అలీ ఖాన్
(మొహ్సిన్ యొక్క ఇద్దరు విశ్వసనీయులు) మరియు తరువాత వారి కుమారుల ద్రోహం కారణంగా
మొహ్సిన్ పెట్టిన ట్రస్ట్ ఫండ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయబడింది. చివరికి, ప్రభుత్వం దీనిని
తన నియంత్రణలోకి తీసుకుంది.
1836లో హుగ్లీ మొహ్సిన్ కళాశాలగా పిలవబడే హుగ్లీ కళాశాల, ప్రభుత్వం
నిర్వహిస్తున్న మొహ్సిన్ ట్రస్ట్ ఫండ్
మిగులు నిధులతో ప్రారంభించబడింది. హుగ్లీ మొహ్సిన్ కళాశాల కలకత్తా
విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది మరియు దీనిని హుగ్లీ ఒడ్డున జనరల్ పెరాన్
నిర్మించారు.
No comments:
Post a Comment