17 November 2022

బహమనీ కోట గుల్బర్గా లో ప్రపంచంలోనే అతి పొడవైన ఫిరంగి

 


బహమనీ పాలకులు గుల్బర్గా (అహ్సనాబాద్) ఇప్పుడు కలబురగి తమ  రాజధానిగా దక్షిణ భారతదేశంలోని దక్కన్ యొక్క మొదటి స్వతంత్ర ముస్లిం రాజ్యం పరిపాలించారు.

బహమనీ రాజవంశ స్థాపకుడు, అల్లావుద్దీన్ హసన్ బహ్మాన్ షా (1347-1358 A.D.), కలబురగిని తన రాజధానిగా చేసుకున్నాడు మరియు అల్లావుద్దీన్ హసన్ బహ్మాన్ షా మరణానికి ముందు, అల్లావుద్దీన్ హసన్ విశాలమైన సామ్రాజ్యానికి యజమాని. బహమనీ పాలకులు బహమనీ సామ్రాజ్యం యొక్క భూభాగాలను విస్తరించారు మరియు కళ, వాస్తుశిల్పం మరియు సాహిత్య రంగములో  గణనీయమైన కృషి చేశారు.

191సంవత్సరాల (1347-1538 A.D.) బహమనీ పాలనలో గుల్బర్గా (అహస్నాబాద్) మరియు బీదర్ లోహ కళ నిపుణులు మరియు వాస్తుశిల్పులతో నిండిపోయింది.

గుల్బర్గా బహమనీ కోటలో టర్కీ కళాకారులచే ప్రపంచంలోనే అతి పొడవైన కానాన్/ఫిరంగి  రూపొందించబడినది. కానాన్/ఫిరంగి  ఇది మిశ్రమంతో (పంచ ధాతు) రూపొందించబడింది.

గుల్బర్గా బహమనీ కోటలోని కానాన్/ఫిరంగి  ని బారా గాజీ తోఫ్/(కానన్)అని అందురు.  బారా గాజీ తోఫ్/(కానన్)29 అడుగుల పొడవు ఉంటుంది. చుట్టుకొలత (Circumference) 7.6 అడుగులు, వ్యాసం 2 అడుగులు మరియు మందం 7 అంగుళాలు.

ఫిరంగి దాని కదలిక కోసం దాని పైభాగంలో 20 రింగులను కలిగి ఉంటుంది. యుద్ధ సమయంలో ఫిరంగిని లాగడానికి ఇరవై మంది సైనికులు అవసరము. కాని ఇప్పుడు ఐదు రింగులు మాత్రమే మిగిలాయి. ఫిరంగి బరువు 80 టన్నులు ఉంటుంది. బహమనీ సుల్తానుల పాలనలో గుల్బర్గా కోట పై ఎవరూ దాడి చేయకపోవడానికి బహుసా ఇది ఒక కారణం కావచ్చు.

2013 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైనది అని చెప్పుకునే ఆంధ్ర ప్రదేశ్, నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్ కోట వద్ద గల కానన్/ఫిరంగి  కేవలం 23 అడుగులు మాత్రమే ఉంది. అసఫ్ జా-I (మొదటి నిజాం) రాజ్‌పుత్ రాజు రాజా కున్వర్ గోపాల్ సింగ్ గౌర్‌కు 1724 ADలో బాలాపూర్ మరియు శక్కర్ ఖేడా యుద్ధంలో చూపిన ధైర్యసాహసాలకు కౌలాస్ కోటను మంజూరు చేశాడు.

నిజానికి, మూడు పొడవైన ఫిరంగులు భారతదేశంలోనే ఉన్నాయి.

·       గుల్బర్గా ఫిరంగి పొడవు 29 అడుగులు,

·       నిజామాబాద్ ఫిరంగి 23 అడుగులు,

·       జైపూర్ ఫిరంగి 20.2 అడుగులు.

ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ టెన్ ఫిరంగులు:

1. జార్ కానన్ (17.5 అడుగులు) 15వ శతాబ్దం రష్యా

2. పుమ్‌హార్ట్ వాన్ స్టెయిర్ (259 సెం.మీ.) 15వ శతాబ్దం, ఆస్ట్రియా

3. బాసిలిక్-ఒట్టోమన్ (732 సెం.మీ.) టర్కిష్

4. ఫాల్ మెట్టే (181 సెం.మీ.) 15వ శతాబ్దం, జర్మనీ

5. మాలిక్-ఎ-మైదాన్ (14.6 అడుగులు) 16వ శతాబ్దం, బీజాపూర్, భారతదేశం

6. డల్లే గ్రిట్ (345 సెం.మీ.) 14వ శతాబ్దం, బెల్జియం, యూరప్

7. డార్డనెల్లెస్ గన్ (518 సెం.మీ.) 15వ శతాబ్దం, టర్కిష్

8. మోన్స్ మెగ్ (4.6 మీ) 15వ శతాబ్దం, స్కాటిష్, స్కాట్లాండ్

9. ఫాల్ గ్రేట్ (250 సెం.మీ.) 15వ శతాబ్దం,

10. జైవానా (20.2 అడుగులు) 18వ శతాబ్దం, జైపూర్, భారతదేశం


No comments:

Post a Comment