రోషనారా బేగం (3
సెప్టెంబరు 1617 - 11 సెప్టెంబరు 1671) మొఘలు యువరాణి, షాజహాను చక్రవర్తి, ఆయన భార్య ముంతాజు మహలు రెండవ కుమార్తె. రోషనారా
తెలివైన మహిళ, ప్రతిభావంతురాలైన కవయిత్రి. రోషనారా తన తమ్ముడు
ఔరంగజేబు పక్షపాతి. 1657 లో షాజహాను అనారోగ్యం తరువాత జరిగిన వారసత్వ యుద్ధంలో ఔరంగజేబు
కు రోషనారా మద్దతు ఇచ్చింది. 1658 లో ఔరంగజేబు సింహాసనం అధిష్ఠించిన తరువాత
రోషనారాకు పాద్షా బేగం బిరుదు ఇచ్చి, మొఘలు సామ్రాజ్యం
ప్రథమ మహిళగా గౌరవించాడు.
షాజహాను నలుగురు కుమారులలో
లో పెద్దవాడైన దారా షికో, షాజహాను అభిమాన కుమారుడుగా ప్రత్యేకత పొంది నెమలి
సింహాసనం వారసుడయ్యాడు. కాని సోదరుల మద్య షాజహాన్ తరువాత అధికారం పొందే విషయం కుటుంబo
లో పోరాటానికి దారితీసింది. ఈ బలపోరాటంలో దారా షికో తన పెద్ద సోదరి జహానారా బేగం
మద్దతును పొందగా, రోషనారా బేగం ఔరంగజేబుతో కలిసి ఉంది.
ఔరంగజేబును
చంపడానికి షాజహాన్, దారా షికో చేసిన కుట్ర విఫలమైనప్పుడు రోషనారా అధికారంలోకి
రావడం ప్రారంభమైంది. ఔరంగజేబుకు అనుకూలంగా వారసత్వ యుద్ధం పరిష్కరించబడిన తరువాత రోషనారా
త్వరితగతిలో రాజసభలో శక్తివంతమైన వ్యక్తిగా మారింది.
రోషనారాకు తన సోదరి జహనారా పట్ల అసూయ ఉండేది. వారసత్వ యుద్ధంలో తమ తండ్రి
షాజహాన్ మరియు సోదరుడు దారా షికో కి
మద్దతు ఇచ్చినందుకు జహానారా మీద అసంతృప్తి చెందిన ఔరంగజేబు, జహానారాను రాజాంతఃపుర అధిపతిగా ఉన్న పదవి నుండి తొలగించి రోషనారాను
నియమించినాడు.
అయితే చివరికి, రోషనారా, ఔరంగజేబు మద్య పొసగ లేదు. రోషనారా ప్రేమికులను స్వీకరించిందని పుకారు
వచ్చింది. దీనిని ఔరంగజేబు బాగా పట్టించుకోలేదు. అదనంగా రోషనారా ఔరంగజేబు భార్యల
ద్వేషాన్ని పొందినది. రోషనారా బంగారం, పెద్ద ఎత్తున
సంపదను కూడబెట్టింది. తరచుగా అవినీతి పద్ధతులను అనుసరింఛి సంపద కూడబెట్టింది. దీనికారణంగా రోషనారా మీద
అనేక అవినీతి ఫిర్యాదులు వచ్చాయి. రాజసభలో రోషనారా కు ఉన్న అధికారం కారణంగా వీటిలో
ఏ ఫిర్యాదుకు న్యాయం లభించలేదు. పైగా రోషనారా తన ఆర్థిక ప్రయోజనాల కొరకు దక్కనులో
సైనిక పోరాటానికి బయలుదేరే ముందు ఔరంగజేబు, రోషనారా కు ఆమెకు ఇచ్చిన అధికార అధికారాలను దుర్వినియోగం
చేసింది.
రోషనారా శత్రువులు
త్వరలోనే రోషనారా ఆర్థిక, అనైతిక, అవినీతి చర్యలను ఔరంగజేబు దృష్టికి తీసుకువచ్చారు.
ఔరంగజేబు, ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత
రోషనారా అధికారాలను తొలగించి ఆమెను తన కోర్టు నుండి బహిష్కరించాడు. రోషనారా ను
ఏకాంతంగా ఢిల్లీ వెలుపల ఉన్న తన తోట రాజభవనంలో ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని
ఆదేశించాడు.
ఔరంగజేబు పాలన లో నగరానికి దూరంగా తన కోసం ఒక రాజభవనం నిర్మించమని రోషనారా ఔరంగజేబును కోరింది. రాజకీయాలకు దూరంగా ఉండాలని రోషనారా నిర్ణయించుకుంది. రోషనారా బాగు అనే తోటలో మధ్యలో ఉన్న రాజభవనం లో రోషనారా గడిపింది. రోషనారా 54 సంవత్సరాల వయస్సులో మరణించింది. రోషనారా తాను స్వయంగా రూపకల్పన చేసిన ఉద్యానవనంలో చివరి జీవితం మొత్తం నివసించింది.
రోషనారా పేరున
ఉత్తర ఢిల్లీలో రోషనారా బాగు
పేరుతో ఒక ఉద్యానవనం ఉన్నది. ఈనాటి
రోషనారా క్లబ్బు ఈ పార్కులో భాగంగా ఉన్నది. ఆహ్లాదకరమైన " రోషనారా బాగు
" ఉద్యానవనం ప్రస్తుతం ఉత్తర ఢిల్లీలో ఉంది. 19 వ శతాబ్ధంలో బ్రిటిషు
ప్రభుత్వం నిర్మించిన కంట్రీ క్లబ్బు వాస్తవంగా రోషనారాబాగులో ఒక భాగంగా ఉంది.
No comments:
Post a Comment