మద్య ప్రదేశ్ కు చెందిన “గోల్డెన్ గర్ల్” 18 ఏళ్ల ముస్కాన్ ఖాన్ “ఓపెన్ ఫెడరేషన్
కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2022” న్యూజిలాండ్‌లో 4 బంగారు పతకాలను గెలుచుకుంది, మద్య ప్రదేశ్
శివపురికు చెందిన ముస్కాన్ ఖాన్ దేశానికి, రాష్ట్రానికి
మరియు నగరానికి కీర్తిని తెచ్చిపెట్టింది.
ముస్కాన్ తండ్రి ముస్కాన్ కి స్పోర్ట్స్ లో ఆసక్తి ని గ్రహించి ఆమెను ప్రోత్సహించడం ప్రారంభించినాడు. ముస్కాన్ స్కూలు చదువుతో పాటు క్రీడలలో కూడా తీవ్రంగా శ్రమించడం ప్రారంభించింది. ముస్కాన్ కృషి ఫలించింది. ముస్కాన్ క్రీడా పోటీలలో అగ్రస్థానంలో నిలిచింది
ముస్కాన్ మొదట హ్యాండ్‌బాల్‌తో
ప్రారంభించింది. ముస్కాన్ మినీ హ్యాండ్‌బాల్‌లో 3 సార్లు జాతీయ క్రిడాకారిణిని. ముస్కాన్ 2016లో తొలిసారిగా
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొంది ఆ తర్వాత 2017, 2018 మరియు 2019 సంవత్సరాల్లో నేషనలల్స్ ఆడింది.మ్యాచ్‌లో 10 గోల్స్‌లో 9 గోల్స్ చేసింది.
ముస్కాన్ చాలా ఆలోచించిన తర్వాత వెయిట్
లిఫ్టింగ్‌కు మారింది.ముస్కాన్ పవర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో జిల్లా స్థాయి నుంచి
డివిజన్ స్థాయి వరకు, ఆపై రాష్ట్ర
స్థాయి పోటీల్లో గెలుచుకుందని ముస్కాన్ తండ్రి చెప్పారు. పవర్ లిఫ్టింగ్‌కు ముందు ముస్కాన్
హ్యాండ్‌బాల్ జావెలిన్ మరియు షాట్ పుట్ మొదలగు ఆటలలో కూడా పాల్గొంది, చివరకు ముస్కాన్ వెయిట్ లిఫ్టింగ్ వైపు మొగ్గు చూపింది..
ముస్కాన్ ఆగస్టు 2022లో కేరళలోని
కాసర్‌గోడ్‌లో జరిగిన ఆల్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలో 2 బంగారు పతకాలు మరియు ఒక
రజతం గెలుచుకున్నది.
న్యూజిలాండ్‌లో జరిగే
కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ 2022 పోటిలకు బారత్ తరుపున ముస్కాన్ ఎంపిక
అయినది.. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ఓపెన్ ఫెడరేషన్ కామన్వెల్త్ పవర్
లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో 4 స్వర్ణాలు
గెలుచుకోవడం ద్వారా ముస్కాన్ ఖాన్ కొత్త
మైలురాయిని సాధించినది మరియు తన నగరంతో సహా దేశానికి అవార్డులను తెచ్చిపెట్టింది.
ముస్కాన్ న్యూజిలాండ్‌జరిగిన
పవర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో స్క్వాట్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్టింగ్ మరియు మొత్తం వెయిట్ కౌంట్‌లో నాలుగు
బంగారు పతకాలు సాధించి దేశానికి ప్రశంసలు అందించినది.
No comments:
Post a Comment