17 November 2022

చాంద్ బీబీ 1550-1599 Chand Bibi 1550-1599 .

 


సుల్తానా చాంద్ బీబీ (1550–1599 CE) (షియా) ఒక భారతీయ పాలకురాలు  మరియు యోధురాలు.

చాంద్ బీబీ భారతదేశంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన హుస్సేన్ నిజాం షాI-ఖుంజా హుమాయున్ బేగంల  కుమార్తె మరియు అహ్మద్‌నగర్ సుల్తాన్ బుర్హాన్ నిజాం షాII యొక్క సోదరి.

చాంద్ బీబీ అరబిక్, పర్షియన్, టర్కిష్, మరాఠీ మరియు కన్నడ వంటి అనేక భాషలలో ప్రావీణ్యం సంపాదించింది. చాంద్ బీబీ సితార్ వాయించడం మరియు చిత్రలేఖనం  లో నిపుణురాలు.

సుల్తానా చాంద్ బీబీ 1580-1590లో ఇబ్రహీం ఆదిల్ షాII యొక్క మైనారిటీ సమయంలో బీజాపూర్ సుల్తానేట్ యొక్క రీజెంట్‌గా మరియు 1595-1600లో మేనల్లుడు బహదూర్ షా యొక్క మైనారిటీ సమయంలో అహ్మద్‌నగర్ సుల్తానేట్‌కు రీజెంట్‌గా వ్యవహరించారు.

సుల్తానా చాంద్ బీబీ బీజాపూర్ మరియు అహ్మద్‌నగర్ రాజప్రతినిధి/రీజెంట్ గా వ్యవరించినది.

చాంద్ బీబీ 1595లో అక్బర్ చక్రవర్తి మొఘల్ సైన్యాలకు వ్యతిరేకంగా అహ్మద్‌నగర్‌ను రక్షించడంలో ప్రసిద్ధి చెందింది.

చాంద్ బీబీ బీజాపూర్ సల్తానత్  రీజెంట్‌:

చాంద్ బీబీ బీజాపూర్ సుల్తానేట్‌కు చెందిన అలీ ఆదిల్ షాIను వివాహం చేసుకున్నది.

బిజాపూర్ అలీ ఆదిల్ షాI తండ్రి, ఇబ్రహీం ఆదిల్ షాI, సున్నీ ప్రభువులు, హబ్షీలు మరియు దక్కనీల మధ్య అధికారాన్ని విభజించారు. అయినప్పటికీ, అలీ ఆదిల్ షా,  షియాల వైపు మొగ్గు చూపారు.1580లో చాంద్ బీబీ భర్త అలీ ఆదిల్ షాI మరణం తర్వాత, షియా ప్రభువులు అలీ ఆదిల్ షాI తొమ్మిదేళ్ల మేనల్లుడు ఇబ్రహీం ఆదిల్ షాIIను పాలకుడిగా ప్రకటించారు. కమల్ ఖాన్ అనే దక్కనీ జనరల్ అధికారాన్ని స్వాధీనం చేసుకుని రీజెంట్ అయ్యాడు.

కమల్ ఖాన్ చాంద్ బీబీ పట్ల అగౌరవంగా ప్రవర్తించాడు మరియు  కమల్ ఖాన్ బిజాపూర్ సింహాసనాన్ని ఆక్రమించుకోవాలనే ఆశయంతో ఉన్నాడు. చాంద్ బీబీ మరో జనరల్ హాజీ కిష్వర్ ఖాన్ సహాయంతో కమల్ ఖాన్‌పై దాడికి పథకం వేసింది. కమల్ ఖాన్ పారిపోతుండగా పట్టుబడి బీజాపూర్ కోటలో తల నరికి చంపబడ్డాడు.

కిష్వర్ ఖాన్, ఇబ్రహీం ఆదిల్ షాIIను యొక్క రెండవ రీజెంట్ అయ్యాడు. ధారాసెయోలో అహ్మద్‌నగర్ సుల్తానేట్‌తో జరిగిన యుద్ధంలో, కిష్వర్ ఖాన్ నేతృత్వంలోని బీజాపూర్ సైన్యం శత్రుసైన్యంలోని ఫిరంగులు మరియు ఏనుగులను స్వాధీనం చేసుకుంది. విజయం తరువాత, బీజాపురి సైన్యాలను కిష్వర్ ఖాన్ స్వాధీనం చేసుకున్న ఏనుగులన్నింటినీ తనకు అప్పగించమని ఆదేశించాడు. ఏనుగులు చాలా విలువైనవి, మరియు బీజాపూర్ యొక్క ఇతర జనరల్స్ దీనిని తప్పుగా భావించారు.

చాంద్ బీబీతో పాటు, వారు బంకాపూర్ జనరల్ ముస్తఫా ఖాన్ సహాయంతో కిష్వర్ ఖాన్‌ను అంతమొందించాలని పథకం వేశారు. కిష్వర్ ఖాన్ యొక్క గూఢచారులు, కిష్వర్ ఖాన్ కి కుట్ర గురించి తెలియజేసారు మరియు కిష్వర్ ఖాన్, ముస్తఫా ఖాన్‌పై సైన్యాన్ని పంపాడు. ముస్తఫా ఖాన్‌ యుద్ధంలో పట్టుబడ్డాడు మరియు చంపబడ్డాడు 

చాంద్ బీబీ,  కిష్వర్ ఖాన్‌ను వ్యతిరేకిoచినది.  కానీ కిష్వర్ ఖాన్‌, చాంద్ బీబీను సతారా కోటలో బంధించి, తనను తాను రాజుగా ప్రకటించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, కిష్వర్ ఖాన్ మిగిలిన జనరల్స్‌లో చాలా అప్రసిద్ధుడయ్యాడు. ఇఖ్లాస్ ఖాన్ అనే హబ్షీ జనరల్ నేతృత్వంలోని ఉమ్మడి సైన్యం బీజాపూర్‌కు వెళ్లినప్పుడు కిష్వర్ ఖాన్ పారిపోవలసి వచ్చింది.

బీజాపూర్ సైన్యంలో ముగ్గురు హబ్షి ప్రభువుల ఇఖ్లాస్ ఖాన్, హమీద్ ఖాన్ మరియు దిలావర్ ఖాన్ బలగాలు ఉన్నాయి. కిష్వర్ ఖాన్ అహ్మద్‌నగర్‌, ఆతరువాత గోల్కొండకు పారిపోయాడు. కిష్వర్ ఖాన్,  చనిపోయిన ముస్తఫా ఖాన్ బంధువు చేత ప్రవాసంలో చంపబడ్డాడు. దీని తరువాత, చాంద్ బీబీ కొద్దికాలం పాటు రాజప్రతినిధి(రీజెంట్)గా వ్యవహరించారు.

జనరల్ ఇఖ్లాస్ ఖాన్ రాజప్రతినిధి అయ్యాడు, కానీ కొద్దిసేపటికే చాంద్ బీబీ చేత తొలగించబడ్డాడు. తరువాత, ఇఖ్లాస్ ఖాన్ తన నియంతృత్వాన్ని పునఃప్రారంభించాడు, ఇది ఇతర హబ్షి జనరల్స్ చేత వ్యతిరేకించబడింది.

బీజాపూర్‌లోని పరిస్థితిని ఉపయోగించుకుని, అహ్మద్‌నగర్ నిజాం షాహీ సుల్తాన్ బీజాపూర్‌పై దాడి చేయడానికి గోల్కొండ కుతుబ్ షాహీతో పొత్తు పెట్టుకున్నాడు. ఉమ్మడి దాడిని తిప్పికొట్టేందుకు బీజాపూర్ వద్ద అందుబాటులో ఉన్న దళాలు సరిపోలేదు.

హబ్షి జనరల్స్ బీజాపూర్ నగరాన్ని రక్షించలేకపోయారు. అప్పుడు చాంద్ బీబీచే నియమించబడిన షియా జనరల్ అబూ-ఉల్-హసన్ కర్ణాటకలో మరాఠా దళాల సహాయం కోరాడు. మరాఠాలు ఆక్రమణదారుల సరఫరా లైన్లపై దాడి చేశారు, అహ్మద్‌నగర్-గోల్కొండ మిత్రరాజ్యాల సైన్యం వెనక్కి తగ్గింది.

ఇఖ్లాస్ ఖాన్ బీజాపూర్ నియంత్రణను స్వాధీనం చేసుకోవడానికి దిలావర్ ఖాన్‌పై దాడి చేశాడు. ఇఖ్లాస్ ఖాన్ ఓడిపోయాడు మరియు దిలావర్ ఖాన్ 1582 నుండి 1591 వరకు రీజెంట్ అయ్యాడు. బీజాపూర్ రాజ్యంలో పాలనా క్రమం పునరుద్ధరించబడినప్పుడు, చాంద్ బీబీ అహ్మద్‌నగర్‌కు తిరిగి వచ్చింది.

చాంద్ బీబీ అహ్మద్‌నగర్‌ సల్తానత్ రీజెంట్:

1591లో, మొఘల్ చక్రవర్తి అక్బర్ తన ఆధిపత్యాన్ని గుర్తించమని నలుగురు దక్కన్ సుల్తానేట్‌లకు తన రాయబారులను పంపాడు. దక్కన్ సుల్తానoదరు  తమ అసమ్మతిని తెలిపారు  మరియు అక్బర్ రాయబారులు 1593లో తిరిగి వచ్చారు.

1595లో, అహ్మద్‌నగర్ సుల్తానేట్ పాలకుడు ఇబ్రహీం నిజాం షా, బీజాపూర్‌కి చెందిన ఇబ్రహీం ఆదిల్ షాII కి తో జరిగిన యుద్ధంలో చంపబడ్డాడు.

ఇబ్రహీం నిజాం షా మరణానంతరం, చాంద్ బీబీ (ఇబ్రహీం నిజాం షా మేనత్త) పాలనలో ఇబ్రహీం నిజాం షా పసికందు బహదూర్ షా రాజుగా ప్రకటించబడాలని కొందరు పెద్దలు భావించారు.

అయితే, దక్కనీ మంత్రి మియాన్ మంజు 6ఆగస్టు, 1595న షా తాహిర్ పన్నెండేళ్ల కుమారుడు,  అహ్మద్ నిజాం షాIIని అహ్మద్‌నగర్   పాలకుడిగా ప్రకటించాడు. ఇఖ్లాస్ ఖాన్ నేతృత్వంలోని అహ్మద్‌నగర్‌లోని హబ్షి ప్రభువులు దీనిని వ్యతిరేకించారు. మియాన్ మంజు, అక్బర్ కుమారుడు మురాద్ మీర్జాను (గుజరాత్‌లో ఉన్నాడు) తన సైన్యాన్ని అహ్మద్‌నగర్‌కు తరలించడానికి ఆహ్వానించాడు. మురాద్ మాల్వాకు వచ్చాడు, అక్కడ మురాద్, అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానా నేతృత్వంలోని మొఘల్ దళాలలో చేరాడు. రాజా అలీ ఖాన్ మాండు వద్ద వారితో చేరారు మరియు సంయుక్త సైన్యం అహ్మద్‌నగర్‌ పై దండెత్తారు.

మురాద్ అహ్మద్‌నగర్‌కు వెళ్లినప్పుడు, చాలా మంది కులీనులు ఇఖ్లాస్ ఖాన్‌ను విడిచిపెట్టి మియాన్ మంజులో చేరారు. మియాన్ మంజు,  ఇఖ్లాస్ ఖాన్ మరియు ఇతర ప్రత్యర్థులను ఓడించాడు. ఇప్పుడు, మియాన్ మంజు మొఘలులను ఆహ్వానించినందుకు చింతించాడు, కానీ చాలా ఆలస్యం అయింది. మియాన్ మంజు దాంతో  రీజెన్సీని అంగీకరించమని చాంద్ బీబీని అభ్యర్థించాడు మరియు అహ్మద్ షాIIతో కలిసి అహ్మద్‌నగర్ నుండి వెళ్ళిపోయాడు. ఇఖ్లాస్ ఖాన్ కూడా పైథాన్‌కు పారిపోయాడు. ఇఖ్లాస్ ఖాన్ మొఘలులచే దాడి చేయబడి ఓడిపోయాడు. చాంద్ బీబీ రీజెన్సీని అంగీకరించినది  మరియు బహదూర్ షాను అహ్మద్‌నగర్ రాజుగా ప్రకటించారు.

అహ్మద్ నగర్ రక్షణ:

యువరాణి చాంద్ బీబీ అహ్మద్‌నగర్ 1595ను రక్షించడానికి ప్రయత్నించినది. నవంబర్ 1595లో మొఘల్ సైన్యం  అహ్మద్‌నగర్ ఆక్రమణకు పునుకోన్నది. చాంద్ బీబీ,  అహ్మద్‌నగర్‌ సేనకు నాయకత్వం వహించినది  మరియు అహ్మద్‌నగర్ కోటను విజయవంతంగా రక్షించినది. షా మురాద్, చాంద్ బీబీకి ఒక రాయబారిని పంపాడు, బెరార్ ఇస్తే ప్రతిగా ముట్టడిని విరమించడానికి ప్రతిపాదించాడు. చాంద్ బీబీ సేనలు కరువుతో బాధపడుతున్నాయి. 1596లో, చాంద్ బీబీ,  బెరార్‌ను మురాద్‌కు అప్పగించడం ద్వారా శాంతిని నెలకొల్పాలని నిర్ణయించుకుంది.

చాంద్ బీబీ తన మేనల్లుడు బీజాపూర్‌కు చెందిన ఇబ్రహీం ఆదిల్ షాII మరియు గోల్కొండకు చెందిన ముహమ్మద్ కులీ కుతుబ్ షాలను మొఘల్ సేనలకు వ్యతిరేకంగా ఏకం కావాలని విజ్ఞప్తి చేసింది. ఇబ్రహీం ఆదిల్ షాII,  సోహైల్ ఖాన్ ఆధ్వర్యంలో 25,000 మంది సైనికులను పంపాడు. నల్దుర్గ్ వద్ద యెఖ్లాస్ ఖాన్ యొక్క మిగిలిన దళం చేరింది. తరువాత, గోల్కొండకు చెందిన 6,000 మంది పురుషులతో కూడిన సైనిక బృందం చేరింది

చాంద్ బీబీ,  ముహమ్మద్ ఖాన్‌ను మంత్రిగా నియమించినది, కానీ ముహమ్మద్ ఖాన్‌ నమ్మకద్రోహి అయ్యాడు. మొత్తం అహ్మద్ నగర్ సుల్తానేట్‌ను మొఘల్‌లకు అప్పగించేందుకు ముహమ్మద్ ఖాన్‌, అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానాకు హామీ ఇచ్చాడు. ఇంతలో, అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానా మొఘల్ సైన్యం  బేరార్ లో చేర్చబడని జిల్లాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది.

బీజాపూర్‌కు తిరిగి వస్తున్న సోహైల్ ఖాన్, తిరిగి వచ్చి అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానా యొక్క మొఘల్ దళాలపై దాడి చేయసాగాడు. అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానా మరియు మీర్జా షారూఖ్ నేతృత్వంలోని మొఘల్ దళాలు బేరార్‌లోని సహపూర్‌లోని మురాద్ శిబిరాన్ని విడిచిపెట్టి, గోదావరి నది ఒడ్డున సోన్‌పేట్ (లేదా సూపా) సమీపంలో సోహైల్ ఖాన్ ఆధ్వర్యంలో బీజాపూర్, అహ్మద్‌నగర్ మరియు గోల్కొండ సంయుక్త దళాలను ఎదుర్కొన్నారు. 8-9 ఫిబ్రవరి 1597లో జరిగిన భీకర యుద్ధంలో, మొఘలులు గెలిచారు

విజయం పొందినప్పటికీ మొఘల్ దళాలు దాడిని కొనసాగించడానికి చాలా బలహీనంగా ఉన్నాయి మరియు సహపూర్‌ Sahpur కు  తిరిగి వచ్చాయి. మొఘల్ సైనిక కమాండర్లలో ఒకరైన రాజా అలీఖాన్ యుద్ధంలో మరణించాడు మరియు ఇతర కమాండర్ల మధ్య తరచుగా వివాదాలు జరిగేవి. ఈ వివాదాల కారణంగా, అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానాను 1597లో అక్బర్ వెనక్కి పిలిపించాడు. ప్రిన్స్ మురాద్ కొంతకాలం తర్వాత మరణించాడు.అక్బర్ తన కుమారుడు దానియాల్ మరియు అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానాలను తాజా దళాలతో పంపాడు. అక్బర్ స్వయంగా బర్హన్‌పూర్‌ Barhanpur లో విడిది చేశాడు.

అహ్మద్‌నగర్‌లో, కొత్తగా నియమించబడిన మంత్రి నెహాంగ్ ఖాన్, చాంద్ బీబీ అధికారాన్ని ప్రతిఘటించారు. అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానా లేకపోవడం మరియు వర్షాకాలం కారణంగా నెహాంగ్ ఖాన్ బీడ్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1599లో, అక్బర్ బీడ్ ఆక్రమించడానికి దానియాల్, మీర్జా యూసుఫ్ ఖాన్ మరియు అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానాలను పంపాడు. నెహాంగ్ ఖాన్ కూడా జైపూర్ కోట్లి రహదారిని  స్వాధీనం చేసుకోవడానికి కవాతు చేసాడు, అక్కడ మొఘలులను ఎదుర్కోవచ్చని  ఆశించాడు. అయితే, డానియాల్ దారి మార్చి అహ్మద్‌నగర్ కోటకు చేరుకున్నాడు. డానియాల్ యొక్క మొఘల్ బలగాలు అహ్మద్ నగర్ కోటను ముట్టడించాయి.

 చాంద్ బీబీ కోటను రక్షించ లేకపోయింది మరియు డానియల్‌తో చర్చలు జరపాలని నిర్ణయించుకుంది. హమీద్ ఖాన్ అనే కులీనుడు, చాంద్ బీబీ మొఘలులతో ఒప్పందంలో ఉందని తప్పుడు వార్తలను ప్రచారం చేశాడు. దీనితో చాంద్ బీబీ,  ఆగ్రహించబడిన తన సొంత దళాల చే చంపబడింది. చాంద్ బీబీ మరణం, మరియు నాలుగు నెలల నాలుగు రోజుల ముట్టడి తర్వాత, అహ్మద్‌నగర్‌ను డానియాల్ మరియు మీర్జా యూసుఫ్ ఖాన్ యొక్క మొఘల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.


లెగసె:

·       1931లో చాంద్‌బీబీ (లేదా అహ్మద్‌నగర్ రాణి) మూకీ చిత్రంగా రూపొందించారు.

·       1937లో విడుదలైన  సుల్తానా చాంద్‌బీబీ అనే  మరొక హిందీ భాషా చిత్రంలో చాంద్‌బీబీ గా శకుంతలా పరంజ్‌పే నటించారు.

·       బీజాపూర్ తూర్పు సరిహద్దుకు సమీపంలో చాంద్ బీబీ భర్త ఆదిల్ షాI నిర్మించిన మెట్ల బావి కి చాంద్ బీబీ పేరు మీద చాంద్ బావడి అని పేరు పెట్టారు

సమాధి స్థలం:

చాంద్ బీబీ ఎముకలను మషాద్‌(డెక్కన్)కు తీసుకువచ్చి ఇమామ్ రెజా మందిరం పక్కన ఖననం చేసారు.

 

 

 

 

 

No comments:

Post a Comment