4 November 2022

నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్‌ లో మహిళల సహకారం नेताजी सुभाष चंद्र बोस की आज़ाद हिंद फ़ौज में महिलाओं का योगदान

 


దేశ సేవ కోసం ఐసిఎస్ ఉద్యోగాన్ని తిరస్కరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్  భారత స్వాతంత్ర్య పోరాట సైనికుడు.  నేతాజీ,  బ్రిటీష్ వారిచే  దాదాపు  పదకొండు సార్లు కారాగారంలో నిర్బంధించ బడ్డాడు..

ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారితో పురుషులు మరియు మహిళలు కలిసి పోరాడిన సైన్యం. ఒకవైపు చాలా మంది పురుషులు అంతకుముందు బ్రిటిష్ సైన్యంలో ఉండి యుద్ధ ఖైదీలుగా ఉంటే, మరోవైపు మహిళలు సాధారణ పౌరులు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో మహిళల భర్తీ అనేది ఒక పెద్ద ముందడుగు.

ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని మహిళా సైనికుల గురించి తెలుసుకొందాము. డాక్టర్ లక్ష్మీ స్వామి నాథన్ ప్రకారం, ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌లో  మహిళా సైనికులు- పెళ్లి కాని యువతులు, వివాహిత మహిళలు, తల్లులు,  కుమార్తెలు, సోదరీమణులు మరియు వారి భార్యలతో పాటు వారి సోదరులు, తండ్రులు లేదా భర్తలు కూడా సభ్యులే.

ఆజాద్ హింద్ ఫౌజ్ లో బెంగాలీ, గూర్ఖా, తమిళం, మలయాళీ, గుజరాతీ, పంజాబీ, ఒడియా మొదలైన ప్రాంతాల నుండి  హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు సబ్యులుగా ఉన్నారు. తమిళులలో ఎక్కువ మంది మహిళలు కలరు.

నేతాజీ, ఆజాద్ హింద్ సర్కార్ & ఫౌజ్: రిమూవింగ్ స్మోక్‌స్క్రీన్‌ Netaji, Azad Hind Sarkar & Fauj : Removing Smokescreens”  అనే పుస్తకం ప్రకారం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన జలాంతర్గామి ప్రయాణంలో మహిళా రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. జలాంతర్గామిలో తనతో పాటు ఉన్న అబిద్ హసన్ ప్రకారం, నేతాజీ బోస్ మహిళలు ఝాన్సీ రాణిలా పోరాడాలని కోరుకున్నారు.

9 జూలై,  1943న, జర్మనీ నుండి సింగపూర్ చేరుకున్న కొద్ది రోజుల తర్వాత, నేతాజీ సింగపూర్‌లో దాదాపు 60,000 మంది భారతీయులతో కూడిన భారీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, నేతాజీ ప్రతి ఒక్కరూ INAలో చేరాలని మరియు "భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటం లో భారతీయ మహిళల రెజిమెంట్' ఏర్పడాలని అన్నారు.

 

భారతీయ మహిళల రెజిమెంట్' భర్తీ అవ్వడానికి ముందుగా అంగీకరించిన వ్యక్తి డాక్టర్ లక్ష్మీ స్వామి నాథన్. ఆ తరువాత పెద్ద సంఖ్యలో యువతులు డాక్టర్ లక్ష్మీ స్వామి నాథన్ తో చేరారు. 22 అక్టోబర్ 1943, సింగపూర్‌లోనే శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి, నేతాజీ,  రాణి ఝాన్సీ రెజిమెంట్‌ను ప్రకటించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో మహిళా సైనికులను రాణులు అని పిలిచేవారు. డా.లక్ష్మీ స్వామి నాథన్‌ను రెజిమెంట్‌కు మొదటి కెప్టెన్‌గా నియమించబడినారు.

మెహబూబ్ అహ్మద్ బ్రిటిష్ ఇండియా ఆర్మీలో రెండవ లెఫ్టినెంట్. 1943లో మెహబూబ్ అహ్మద్ కు తొలిసారిగా సింగపూర్‌లోని 'కైతే భవన్'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాన్ని వినే అవకాశం లభించి, నేతాజీ స్ఫూర్తితో ఆజాద్ హింద్ ఫౌజ్‌లో భాగమయ్యారు. దీని గురించి స్వయంగా మెహబూబ్ అహ్మద్ ఇలా వ్రాశారు - "నేతాజీ స్వరం యొక్క మాయాజాలం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది, ప్రజలందరూ మంత్రముగ్ధులుగా వింటున్నారు. ఆ సమావేశానికి హాజరైన ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తన వేలిని కత్తితో కోసుకుని, నేతాజీ నుదుటిపై రక్తాన్ని పూసి, నేతాజీ  విజయం కోసం, నేతాజీ కి దీర్ఘాయువు ప్రసాదించమని ప్రార్థించిన భావోద్వేగ ఘట్టానికి 'కైతే భవన్' ప్రత్యక్ష సాక్షి. ఆ క్షణం నాకు ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. నా కళ్ళు నేటికీ స్వచ్ఛంగా ఉన్నాయి. నేతాజీ చేసిన ఆప్రసంగం పిల్లల  నుండి వృద్దులలో   త్యాగ స్ఫూర్తిని నింపి దేశం ఋణం తీర్చుకునే కర్తవ్యాన్ని గుర్తు చేసింది. భవనం మొత్తం 'జై హింద్' నినాదంతో మారుమ్రోగింది.

మెహబూబ్ అహ్మద్ రంగూన్‌లో 17 మంది రాణులు తమ రక్తంతో ప్రతిజ్ఞ చేయడం, నేతాజీకి బంగారు ఫోటో ఫ్రేమ్‌ను ఇస్తున్న వృద్ధ మహిళ మొదలైన అనేక ముఖ్యమైన సంఘటనలకు సాక్షిగా కూడా ఉన్నాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపనలో మహిళలు సగర్వంగా  పాలుపంచుకున్నారు.

21 సెప్టెంబర్, 1944, జతిన్ దాస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రంగూన్ జూబ్లీ హాల్‌లో "మీరు మాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను" అనే నినాదాన్ని ఇచ్ఛారు, ఆ తర్వాత అక్కడ ఉన్న భారతీయులు అందరు  "మేము సిద్ధంగా ఉన్నాము. మా రక్తాన్ని ఇస్తాము, తీసుకోండి”అన్నారు.

ఆ తర్వాత నేతాజీ ఆత్మాహుతి ప్రమాణంపై సంతకం చేయడానికి ముందుకు రావాలని ప్రజలను కోరారు. ఈ సంఘటనను మెహబూబ్ అహ్మద్ ఈ విధంగా వర్ణించారు - నేతాజీ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, “స్వేచ్ఛ త్యాగాన్ని కోరుతుంది. మీరు స్వాతంత్ర్యం కోసం చాలా త్యాగం చేసారు, కానీ మీ ప్రాణాలను  ఇంకా త్యాగం చేయలేదు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను త్యాగం చేసే  యువకులు కావాలి.”

 నేతాజీ "మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను" అని గర్జించే స్వరంతో చారిత్రాత్మక ప్రకటన చేశాడు.నేతాజీ పిలుపుతో యువకులు అందరు  తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దమయ్యారు. 'జూబ్లీ హాల్'లో వేలాది యువ గొంతులు 'మా  రక్తాన్ని ఇస్తాం' అనే చారిత్రాత్మక పిలుపుతో  ప్రతిధ్వనించాయి.

జూబ్లీ హాల్‌లో ఉన్న యువత చేత   సుభాష్‌బాబు ప్రతిజ్ఞ చేయిస్తూ.. ‘‘మీరు ఈ ప్రతిజ్ఞపై సంతకం చేయండి.” అన్నారు. యువకుల బృందం ముందుకు కదిలింది. యువకులు ముందుకు సాగడం చూసి నేతాజీ స్వరం 'జూబ్లీ హాల్'లో ప్రతిధ్వనించింది. “ఈ ప్రతిజ్ఞా  పత్రం పై సాధారణ సిరాతో సంతకం చేయకూడదు. తమ సిరల్లో ప్రవహించే నిజమైన భారతీయ రక్తాన్ని కలిగి ఉన్నవారు, తమ జీవితాలపై ఎటువంటి అనుబంధం లేనివారు మరియు స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ముందుకు రండి” అని నేతాజీ పిలుపునిచ్చారు.

ప్రతిజ్ఞా  పత్రం పై సంతకం చేయడానికి ముందుకు వచ్చిన మొదటి బ్యాచ్‌లో పదిహేడు మంది అమ్మాయిలు ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన క్షణం. నేతాజీని  చూడగానే ఆ బాలికలు తమ నడుములోని కత్తులు తీసి వేళ్లను కోసుకొని ప్రతిజ్ఞా  పత్రం పై తమ రక్తo తో సంతకం చేసారు అని మెహబూబ్ అహ్మద్   గుర్తు చేసుకొన్నారు.

రంగూన్ మరియు బ్యాంకాక్‌లలో కూడా రాణి ఝాన్సీ రెజిమెంట్‌ యొక్క శిక్షణా శిబిరాలు ప్రారంభించబడ్డాయి. రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో షాంఘై నుండి మలేషియా వరకు భారతీయ సంతతికి చెందిన మహిళలు పాల్గొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ లో అనేక డజన్ల మంది శ్రీలంక మహిళలు కూడా పాల్గొన్నారు. హిందుస్థాన్ టైమ్స్ డిసెంబర్ 1945 నివేదిక ప్రకారం, ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరడానికి 200 మందికి పైగా మహిళలు షాంఘై నుండి అరకాన్‌కు వచ్చారు.

రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరిన అమ్మాయిలకు సంబంధించిన కథనాలు అద్భుతంగా ఉన్నాయి. ఒకవైపు కుటుంబం మొత్తం చేరిన సందర్భాలు ఉన్నాయి.మరోవైపు చాలా మంది అమ్మాయిలు రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరాలని తమ కుటుంబాల్లో తిరుగుబాటు చేయడం మనకు కనిపిస్తుంది. కొందరు రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరడానికి ఇళ్ల నుంచి పారిపోయారు మరియు వారి తల్లిదండ్రుల ప్రయత్నాలు కూడా వారిని తిరిగి ఇంటికి  తీసుకురాలేకపోయాయి.

సాధారణం గా మహిళలు సైన్యంలో నర్సుల హోదాలో మాత్రమే పనిచేస్తారు అని  అందరు నమ్ముతారు, అయితే ప్రొఫెసర్ కపిల్ తన పుస్తకంలో ఆజాద్ హింద్ ఫౌజ్‌ సీనియర్ అధికారులను ఉటంకిస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రాణులు ముందుండి పోరాడి అనేక సంఘటనలను వివరించారు.

“రాణి ఝాన్సీ రెజిమెంట్” ఏర్పాటు ఆధునిక సైనిక చరిత్రలో అనుహ్యమైనది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆధునిక మహిళా సైనిక రెజిమెంట్. దీని గురించి తెలుసుకోవడం, చదవడం మరింత పరిశోధన మరియు మరింత చర్చ చేయడం అవసరం.

No comments:

Post a Comment