22 November 2022

మరియం అఫిఫా అన్సారీ భారతదేశపు మొదటి మహిళా ముస్లిం న్యూరో సర్జన్

 

కృషి మరియు అంకితభావాన్ని విశ్వసించే వారికి విజయం వస్తుంది అనే విశ్వాసం మరియం అఫీఫా అన్సారీ విషయం లో నిజమైనది. మరియం అఫీఫా అన్సారీ ఎప్పుడూ డాక్టర్ కావాలని కలలు కనేది మరియు 2020లో ఆల్ ఇండియా నీట్ పరీక్షలో 137వ ర్యాంక్ సాధించడంతో కల నిజమైంది.

మరియం అఫీఫా అన్సారీ పాఠశాల రోజుల నుండి, ఎప్పుడూ టాప్ పెర్ఫార్మర్. మరియం తన ప్రాథమిక విద్యను మలగావ్‌లోని ఉర్దూ మీడియం పాఠశాలలో పూర్తి చేసింది.

10వ తరగతి వరకు ఉర్దూ మీడియం పాఠశాలల్లో చదివిన మరియమ్ ఆ తర్వాత ఉన్నత విద్యకు  హైదరాబాద్ వచ్చేసింది.

హైదరాబాద్‌లోని రాజకుమారి దురుశేవర్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి, 10వ తరగతిలో బంగారు పతకం సాధించింది. మరియం ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేసినది.  మరియం తన MBBS కోర్సులో ఐదు బంగారు పతకాలు సాధించింది.

2017లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో MBBS కోర్సు పూర్తి చేసిన తర్వాత, మరియం అదే కళాశాలలో జనరల్ సర్జరీలో మాస్టర్స్ కోర్సుకు ఉచిత ప్రవేశం పొందగలిగింది.

2019లో, ఆమె ఇంగ్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుండి MRCS పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసింది.

2020లో డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డ్ కోర్సు చేసింది.ఇది భారతదేశంలోని నిపుణులైన వైద్యులకు అందించే ప్రత్యేక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.

2020 NEET SS పరీక్షలో అధిక స్కోర్ సాధించిన తర్వాత, మరియం కు  ఉస్మానియా మెడికల్ కాలేజీలో MCHకి ఉచిత ప్రవేశం లభించింది.

మరియమ్ యొక్క నిరంతర కృషి ఆమె విజయ మార్గంలో ప్రతి అడ్డంకిని దాటడానికి సహాయపడింది. డాక్టర్ మరియం అఫీఫా అన్సారీ భారతదేశంలోని యువ తరానికి స్ఫూర్తి.

మరియo మాట్లాడుతూ  "నా విజయం అల్లా నుండి వచ్చిన బహుమతి మరియు ఇప్పుడు ఒక బాధ్యత".మరియం తన వృత్తి ద్వారా సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు.

మరియం తల్లి ఉపాధ్యాయురాలు మరియం చదువుతో పాటు పెయింటింగ్, కాలిగ్రఫీ మరియు ఇస్లామిక్ బోధనలో కూడా రాణిస్తోంది.

 

 

No comments:

Post a Comment