28 October 2022

ఈజిప్ట్(కైరో) రాణి షజరత్ అల్-దుర్? -1257 Shajarat Al-Durr

 


షజరత్ అల్-దుర్, దాదాపు 1,300 సంవత్సరాల క్రితం క్లియోపాత్రా తర్వాత ఈజిప్షియన్ సింహాసనంపై కూర్చున్న మొదటి మహిళ.

13వ శతాబ్ద ప్రారంభ సంవత్సరాలలో జన్మించిన షజరత్ అల్-దుర్   గురించిన జన్మ వివరాలు (జన్మ స్థలం, పుట్టిన సంవత్సరం)  చాలా తక్కువగా తెలుసు. కొందరు చరిత్రకారులు "షజరత్ అల్-దుర్" ("ముత్యాల చెట్టు”) రాచరిక కుటుంభం నుండి  వచ్చిందని చెబుతారు.  ఎక్కువమంది చరిత్రకారులు   షజరత్ అల్-దుర్   ప్రస్తుత ఆర్మేనియాలోని  సంచార కిప్చక్ టర్క్స్ కుటుంబంలో జన్మించారని అంగీకరిస్తున్నారు.  

 షజరత్ అల్-దుర్ర్ జన్మించిన సమయంలో, మంగోల్స్  ఆసియా ఆక్రమించి పశ్చిమం గా ముందుకు దూసుకుపోతున్నారు. తమ పరాజీతులను  మంగోలులు  బందీలుగా తీసుకెళ్లి ఈజిప్టులోని పాలక అయ్యుబిడ్స్‌ Ayyubids పాలకులతో తో సహా ఇతర పాలకులకు విక్రయించారు.

షజరత్ అల్-దుర్ యొక్క మొదటి భర్త, కైరో సుల్తాన్ అల్-మాలిక్ అల్-సాలిహ్, నిజానికి, పెద్ద సంఖ్యలో కిప్‌చాక్‌లను బానిసలుగా  కైరోకు తీసుకువచ్చిన మొదటి వ్యక్తి. కిప్‌చాక్‌ పురుషులు సైనిక సేవకులుగా మారారు. వీరిని మమ్లుక్స్ అని పిలుస్తారు, ఇతర బందీ స్త్రీల వలె షజరత్ అల్-దుర్ కూడా రాజు యొక్క అంతఃపురంలోకి ప్రవేశించినది.

సుల్తాన్ అల్-మాలిక్ అల్-సాలిహ్,   షజరత్ అల్-దుర్ ను ఎంతోగా ప్రేమించాడు  మరియు  షజరత్ అల్-దుర్ ను తనతో పాటు యుద్ధాలకు తీసుకువెళ్లేవాడు. 1239లో, షజరత్ అల్-దుర్  కు ఖలీల్ అనే కొడుకు పుట్టాడు మరియు 1240లో షజరత్ అల్-దుర్ మరియు సుల్తాన్‌ అల్-మాలిక్ అల్-సాలిహ్ లు వివాహం చేసుకున్నారు. ఇది సుల్తాన్ అల్-మాలిక్ అల్-సాలిహ్ కు రెండోవ వివాహం.   సుల్తాన్ తో వివాహం షజరత్ అల్-దుర్  ను బానిసత్వం నుండి విముక్తి చేసింది, కానీ వారి కుమారుడు బాల్యంలోనే మరణించాడు మరియు షజరత్ అల్-దుర్ కు  ఇకపై పిల్లలు పుట్టలేదు.

అయితే అల్-సాలిహ్‌కి అప్పటికే ఒక కుమారుడు తురాన్ షా, టర్కీ లో  ఉన్నాడు. రాజ్య పాలన లో సుల్తాన్  అల్-సాలిహ్ తన రోండోవభార్య షజరత్ అల్-దుర్ పై ఎక్కువగా ఆధారపడ్డాడు. షజరత్ అల్-దుర్ కిప్‌చక్ మూలాలు అయ్యూబిడ్ సుల్తాన్‌కు మమ్లుక్ దళాలను సమీకరించడంలో, ఈజిప్టు లో సామ్రాజ్య నిర్వహణ  తరువాత సిరియాలో ఆధిపత్యాన్ని విస్తరించడంలో తోడ్పడినాయి. సైనిక ప్రచారాలతో సహా రాజ్యానికి  సంబంధించిన విషయాలపై తన భర్తకు కౌన్సెలింగ్ ఇవ్వగల సామర్థ్యం షజరత్ అల్-దుర్ సంపాదించినది.

1249 లో సిరియా సైనిక యాత్రలో లో ఉన్న సుల్తాన్ అల్-సాలిహ్, ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ IX నేతృత్వంలోని ఏడవ క్రూసేడ్ సైన్యాలు 1,800 ఓడలు మరియు 50,000 మంది మనుషులతో  ఈజిప్ట్‌ నైలు డెల్టా నగరం డామియెట్టా పై దండయాత లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలుసుకున్నాడు. కైరోలో రీజెంట్‌గా వ్యవహరిస్తున్న  షజరత్ అల్-దుర్అల్-సాలిహ్ యొక్క టాప్ కమాండర్ ఫఖర్ అల్-దిన్‌ను డామిట్టా రక్షణకు పంపారు మరియు స్వయంగా  షజరత్ అల్-దుర్ కైరో రక్షణకు మమ్లుక్‌ సైన్యానికి నాయకత్వం వహించింది. సుల్తాన్ అల్-సాలిహ్ సిరియా సైనిక యాత్రలలో జరిగిన  యుద్ధంలో గాయపడ్డాడు. గాయపడిన సుల్తాన్ అల్-సాలిహ్ ఈజిప్టుకు తిరిగి వెళ్ళాడు.

లూయిస్ జూన్ 6, 1249న డామియెట్టా వద్ద అడుగుపెట్టాడు. అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం దళాలు నగరాన్ని విడిచిపెట్టాయి  ముస్లిం దళాలు నైలు నది తూర్పు ఒడ్డున, కైరోకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్-మన్సౌరా వద్ద తిరిగి ఏకం అయ్యాయి. అక్కడకి  అనారోగ్యంతో ఉన్న సుల్తాన్ అల్-సాలిహ్ వచ్చాడు. ఆగస్ట్ చివరి నాటికి, సుల్తాన్ అల్-సాలిహ్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం ప్రారంభించింది. మొత్తం ఈజిప్టు నిరాశలో  పడింది.

నవంబర్‌లో, సుల్తాన్ అల్-మాలిక్ అల్-సాలిహ్ మరణించాడు. షజరత్ అల్-దుర్ టర్కీ నుండి తురాన్ షా పిలిపించింది మరియు తురాన్ షా వచ్చే వరకు, సుల్తాన్ అల్-సాలిహ్ మరణాన్ని రహస్యంగా దాచిపెట్టారు.

అల్-సాలిహ్ యొక్క టాప్ కమాండర్ ఫఖర్ అల్-దిన్ మరియు మామ్లుక్‌ సేనలకు  నాయకత్వం వహించే అల్-సాలిహ్ యొక్క ప్రధాన నపుంసకుడు, జమాల్ అల్-దిన్ కు సుల్తాన్ మరణం గురించి తెలియజేయడానికి మరియు ప్రభుత్వం కు క్లిష్టమైన కాలం లో మద్దతు ఇవ్వడంలో మరియు  సహాయాన్ని అభ్యర్థించడానికి షజరత్ అల్-దుర్ సంప్రదించినది అని అల్-మక్రిసీ అనే చరిత్రకారుడు రాశారు.

టర్కీ నుండి తురాన్ షా వచ్చేవరకు దాదాపు మూడు నెలల పాటు, షజరత్ అల్-దుర్ సుల్తానేట్‌కు రహస్య పాలకురాలుగా వ్యహరించినది. ఫఖర్ అల్-దిన్ యుద్ధంలో చనిపోయినప్పటికి, ఈజిప్ట్ మమ్లుక్‌ దళాలు క్రూసేడర్లను తిప్పికొట్టడం ప్రారంభించాయి మరియు లూయిస్ ఓటమి మరియు బంధీ అయ్యే సమయానికి  తురాన్ షా అక్కడికి చేరుకున్నాడు. తండ్రి వారసుడిగా, తురాన్ షా త్వరగా తప్పులు చేయడం ప్రారంభించాడు. తురాన్ షా మమ్లుక్‌లను రాజ్య  పాలనలో పక్కన పెట్టాడు.

తురాన్ షా తన తండ్రి నిధి మరియు షజరత్ అల్-దుర్ ను తన  స్వంత ఆభరణాలు మరియు  ముత్యాలు రెండింటినీ అప్పగించాలని డిమాండ్ చేశాడు.  విధిలేని పరిస్థితులలో షజరత్ అల్-దుర్, మామ్లుక్‌ల రక్షణ కోరింది. చాలా క్లిష్ట సమయాల్లో షజరత్ అల్-దుర్ ఈజిప్ట్ రాజ్యానికి చేసిన సేవలు మరియు తురాన్ షా అసమర్ధ పాలన తో విసిగిన మామ్లుక్‌లు షజరత్ అల్-దుర్ సుల్తానా కు సహాయం చేయడానికి చాలా సంతోషించారు.ఈలోగా తురాన్ షా మే 2, 1250న చంపబడ్డాడు.

ఈజిప్ట్ సుల్తాన్ మరియు పాలకుడిగా  షజరత్ అల్-దుర్ చేత విధులు నిర్వహించబడాలని మామ్లుక్స్ నిర్ణయించారు," అని  చరిత్రకారుడు ఇబ్న్ వాసిల్ పేర్కొన్నాడు. షజరత్ అల్-దుర్ ఆదేశం మేరకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి మరియు షజరత్ అల్-దుర్ మొత్తం రాజ్యానికి నామమాత్రపు అధిపతి అయింది. షజరత్ అల్-దుర్ పేరు మీద ఖలీల్ తల్లిఅనే బిరుదు తో రాయల్ స్టాంప్ విడుదల చేయబడింది. ఖుత్బా లో  షజరత్ అల్-దుర్ కైరో మరియు మొత్తం ఈజిప్ట్ కు  సుల్తానా అని ఉచ్ఛరిoచబడింది.

ఇబ్న్ బటూటా ప్రకారం " షజరత్ అల్-దుర్ అద్భుతమైన తెలివితేటలు" మరియు "రాజ్య వ్యవహారాలు నిర్వహించే  సామర్ధ్యం” కలిగి ఉంది. ఈ విషయాన్ని సిరియాకు చెందిన చరిత్ర రచయిత మరియు కవి ఖైర్ అల్-దిన్ అల్- జిరిక్లి కూడా దృవ పరిచినాడు.

సుల్తానాగా షజరత్ అల్-దుర్ చేసిన మొదటి చర్య క్రూసేడర్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడం. షజరత్ అల్-దుర్ ఫ్రెంచ్ క్వీన్ మార్గరెట్ ఆఫ్ ప్రోవెన్స్‌ Provenceతో చర్చలు జరిపింది. డామిట్టాను తిరిగి ఇవ్వడం మరియు లూయిస్ ixని విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా ఏడవ క్రూసేడ్ ఇద్దరు రాణులు-ఒక ముస్లిం మరియు ఒక క్రైస్తవుల దౌత్యంతో ముగిసింది.

ఈజిప్ట్ సుల్తానాగా షజరత్ అల్-దుర్ చేసిన మొదటి చర్య క్రూసేడర్‌లతో ఒప్పందం కుదుదుర్చుకోవడం పై  బాగ్దాద్  ఖలీఫ్ అల్-ముస్తాసిమ్ నుండి అత్యంత తీవ్రమైన అభ్యంతరం వచ్చింది. బాగ్దాద్  ఖలీఫ్ అల్-ముస్తాసిమ్ ఇలా ప్రకటించాడు: "ఈజిప్ట్ వాసులు   ఇప్పుడు ఒక మహిళచే పాలించబడుతున్నారని మేము విన్నాము. ఈజిప్టులో పరిపాలించడానికి పురుషులు లేకుండా పోయినట్లయితే మాకు తెలియజేయండి, మేము వారిని పరిపాలించడానికి ఒక వ్యక్తిని పంపగలము”.

80 రోజుల నామమాత్రపు పాలన తర్వాత, షజరత్ అల్-దుర్, మామ్లుక్ అధికారి అయిన ఇజ్ అల్-దిన్ అయ్బెక్‌ను వివాహం చేసుకుంది మరియు తన బిరుదును, పదవిని  అయ్బెక్‌కి అప్పగించినది. అయితే అయ్బెక్ తన మొదటి భార్య ఉమ్మ్ అలీకి విడాకులు ఇవ్వాలని షజరత్ అల్-దుర్ పట్టుబట్టింది. సమకాలీన చరిత్రకారుడు ఇబ్న్ అబ్ద్ అల్-జహీర్ పేర్కొన్నట్లుగా, తదుపరి ఏడు సంవత్సరాలు "నిర్ణయం మరియు పరిపాలన యొక్క అధికారం" షజరత్ అల్-దుర్ చేతుల్లోనే ఉంది. షజరత్ అల్-దుర్ అన్ని రాజ శాసనాలపై సంతకం చేసేది, న్యాయం చేసేది మరియు ఆదేశాలు జారీ చేసేది.

షజరత్ అల్-దుర్ సాంస్కృతికంగా కూడా ఈజిప్ట్ పాలనపై  తనదైన ముద్ర వేసింది. షజరత్ అల్-దుర్ సిటాడెల్‌లో రాత్రిపూట వినోదాన్ని ఏర్పాటు చేసిందని చెప్పబడింది. ఈజిప్టు నుండి మక్కాకు వార్షిక తీర్థయాత్ర(హజ్) కు వెళ్ళే కారవాన్‌లో ముందు ఉండే ఒంటె పై అలంకరించబడిన పల్లకి ఉండే మహమల్ సంప్రదాయాన్ని స్థాపించినందుకు షజరత్ అల్-దుర్ ఘనత పొందింది.ఈ సంప్రదాయం 20వ శతాబ్దం మధ్యకాలం వరకు కొనసాగింది.

1254 నాటికి అయ్బెక్ తన నామమాత్రపు సుల్తాన్ పదవి తో అసంతృప్తి పొందాడు. షజరత్ అల్-దుర్ పై అయ్బెక్ ఒకటి లేదా రెండు చిన్నపాటి తిరుగుబాట్లను  చేశాడు మరియు షజరత్ అల్-దుర్, దాచి ఉంచిన మాజీ సుల్తాన్ అల్-సాలిహ్ నిధి కోసం  షజరత్ అల్-దుర్‌తో తీవ్రంగా పోరాడాడు. 1257 లో, తన శక్తిని పెంచుకోవాలని ఐబెక్ తన రెండవ భార్యగా ఒక శక్తివంతమైన యువరాజు కుమార్తెను చేసుకోవాలని భావించాడు. ఇది రాణి మరియు సుల్తానేట్‌లకు వ్యతిరేకంగా రాజద్రోహం అని షజరత్ అల్-దుర్‌ భావించినది. పలితంగా ఐబెక్ ప్రవాసంగా  పోలో ఫీల్డ్స్ పెవిలియన్‌ లోకి వెళ్లాడు.

 

ఏప్రిల్ 12న షజరత్ అల్-దుర్ నుండి అయ్బెక్‌ క్షమాపణ సమన్లు ​​అందుకున్నాడు. పోలో మ్యాచ్ నుండి నేరుగా ప్యాలెస్‌కు చేరుకున్న అయ్బెక్‌కు సుల్తానా నపుంసకుల కత్తులు స్వాగతం పలికాయి

సుల్తాన్ అయ్బెక్ నిద్రలోనే చనిపోయాడని షజరత్ అల్-దుర్‌ పేర్కొంది, అయితే ఈసారి మమ్లూక్స్ షజరత్ అల్-దుర్‌ ను రక్షించడానికి నిరాకరించారు. షజరత్ అల్-దుర్‌ సిటాడెల్‌లో అరెస్టయి మరణించే వరకు అక్కడే గడిపింది. షజరత్ అల్-దుర్‌ చనిపోయిన తరువాత ఆమె ఆభరణాలు మరియు ఆమెకు ప్రియమైన ముత్యాలను మరే ఇతర మహిళ ధరించలేదు.

అయ్బెక్ 15 ఏళ్ల కుమారుడు అల్-మన్సూర్ అలీ- ఉమ్ అలీ కుమారుడు-సుల్తాన్‌గా నియమించ బడినాడు, షజరత్ అల్-దుర్‌ అవశేషాలు  కైరోలోని అత్యంత సుందరమైన సమాధిలో ఖననం చేయబడ్డాయి. సమాధి మిహ్రాబ్, బైజాంటైన్ గ్లాస్ మొజాయిక్‌లలో అలంకరించబడింది, ఇది కైరో నగరంలో పురాతనమైనది మరియు దాని ప్రధాన భాగం ముత్యాలతో అలంకరించబడినది.

పాశ్చాత్య క్రూసేడ్స్ చరిత్రకారుల దృష్టిలో షజరత్ అల్-దుర్‌ యాదృచ్ఛికమైనది. మధ్యయుగ ముస్లిం చరిత్రకారులకు, షజరత్ అల్-దుర్‌ ఏడవ క్రూసేడ్‌ను అంతం చేయడానికి చాకచక్యంగా చర్చలు జరిపిన విజ్ఞత కలిగిన పాలకురాలు.  రెండు గొప్ప రాజవంశాల పరివర్తనకు (అయ్యూబిడ్‌ల ముగింపు మరియు మామ్‌లుక్‌ల ప్రారంభం) తోడ్పడిన గౌరవనీయమైన పాలకురాలు.

ఈ రోజు వరకు షజరత్ అల్-దుర్‌ ఈజిప్ట్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన చారిత్రక వ్యక్తులలో ఒకరిగా మిగిలిపోయింది. షజరత్ అల్-దుర్‌ కథ ఈనాటికీ "మొదటి నుండి చివరి వరకు ఒక మహిళ కథగా మిగిలిపోయింది. 

 

 

No comments:

Post a Comment