ప్రస్తుతం
మచిలీపట్నం అని పిలువబడే మసులీపట్నం, కృష్ణా మరియు గోదావరి నదుల ముఖద్వారం మధ్య ఉంది, ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో
జిల్లా ముఖ్య కేంద్రంగా ఉంది. మసూలీపట్నం కుతుబ్ షాహీల కాలం నుండి అసఫ్ జాహీల
కాలంలో రెండవ నిజాం మీర్ నిజాం అలీ ఖాన్ కాలం వరకు ఇది చారిత్రాత్మకమైన ఓడరేవు.
చరిత్ర ప్రకారం పదహారవ శతాబ్దం మధ్యకాలం వరకు, మసులిపట్నం ఓడరేవును వరుసగా విజయనగర
సంస్థానం, గోల్కొండకు చెందిన కుతుబ్ షాహీలు
మరియు ఒరిస్సాలోని గజపతిలు నిర్వహించేవారు. 1550 నుండి 1580 వరకు ఇబ్రహీం కుతుబ్ షా పాలనా కాలంలోనే 1560లలో మసులీపట్నం ఇబ్రహీం కుతుబ్ షా పరిపాలనా
నియంత్రణలోకి వచ్చింది. పియస్ మలేకందతిల్ తన “ది ఇండియన్
ఓషన్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ఎర్లీ మోడరన్ ఇండియా” పుస్తకంలో గోల్కొండ రాజధాని మరియు
మసులీపట్నం ఓడరేవు మధ్య 100 సంవత్సరాలకు పైగా సన్నిహిత
సంబంధాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. ఆ సమయంలో మసులీపట్నం ఓడరేవు, అచే, మలయ్ ద్వీపకల్పంలోని ఓడరేవులు, పెగు మరియు అరకాన్‌తో వ్యాపారం
చేసేది. తీర వాణిజ్యం ఒరిస్సాలోని పిప్లి
రేవు కి కూడా విస్తరించబడినది,.పదిహేడవ శతాబ్దం ప్రారంభంలో, కుతుబ్ షాహీల ఆధ్వర్యంలో, మసులీపట్నం కోరమాండల్ తీరంలో
అంతర్జాతీయ ఓడరేవుగా ఖ్యాతిని పొందింది.
కేథరీన్
ఆషర్ మరియు సింథియా టాల్బోట్ “ఇండియా బిఫోర్ యూరోప్” అనే గ్రంధం లో గోల్కొండకు సరుకుల రవాణా మరియు పునఃపంపిణీ కోసం
కోరమాండల్ తీరంలో ఉన్న ఏకైక ఓడరేవుగా మసులీపట్నంను పేర్కొన్నారు. గోల్కొండ కుతుబ్
షాహీ సుల్తానుల క్రింద, మసులిపట్నం 1650లో గోల్కొండ హైదరాబాద్ లేదా సూరత్‌తో
సమానమైన జనాభాతో తూర్పు తీరంలో ప్రధానమైన ఓడరేవు నగరంగా మారింది.
మసులిపట్నంను గోల్కొండ హైదరాబాద్‌ను కలుపుతూ
మహమ్మద్ కులీ కుతుబ్ షా హైవే నిర్మించాడు మరియు గోల్కొండ నుంచి సూరత్‌కు వెళ్లే
ఓవర్‌ల్యాండ్ మార్గం సృష్టించబడింది. ఇది మసులిపట్నం మరియు మధ్యప్రాచ్య దేశాల మధ్య
కొత్త సముద్ర మార్గానికి దారితీసింది.
ఇప్పటివరకు
పశ్చిమ తీరం గుండా గుజరాత్ లేదా మలబార్ ద్వారా వర్తక వాణిజ్యం నడుస్తుంది.
గోల్కొండలోని షియా పాలకులు ఇరాన్‌లోని సఫావిడ్‌లతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండి యాత్రికులకు
మక్కాకు సురక్షితమైన మార్గాన్ని అందించాలని కోరుకున్నారు. కుతుబ్ షాహీ
హైదరాబాదులోకి వస్తున్న పర్షియన్లు మసులీపట్నంలో నౌకానిర్మాణం మరియు వాణిజ్యంలో పెట్టుబడులు
పెట్టారు.
పశ్చిమ తీరం
లో పోర్చుగీస్ ఆధిపత్యం కలదు కాని తూర్పు వైపున ఉన్న కొద్దిపాటి పోర్చుగీస్ ఉనికి
మసులిపట్నం అభివృద్ధి చెందడానికి వీలు కల్పించింది. అన్నింటికంటే, 800 టన్నుల ఓడలను నిర్వహించగల సమర్ధత మసులీపట్నం
ఓడరేవు కు కలదు.
“మొఘల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది డెక్కన్” లో J. F. రిచర్డ్స్ 1712లో మసులీపట్నంలోని 8 పరగణాల నుండి జామా (ఆదాయం) 448,000 రూపాయలగా మరియు
నిజామాపట్నం 314,000 నుండి జామా (ఆదాయం) రూపాయలగా నమోదు చేశారు.
1733 అసఫ్ జాహీ కాలంలో, మసులీపట్నం సర్కార్ 491,000 రూపాయలు మరియు నిజామాపట్నం 246,000 రూపాయల ఆదాయం ఇచ్చింది. అంటే
ఉమ్మడి స్థిరమైన జామా(ఆదాయం) అంటే 750,000 నుండి 800,000 రూపాయల వరకు అసఫ్ జాహీలు తప్పనిసరిగా వారసత్వంగా
పొందవలసి ఉంటుంది. ఆ పైన, వజ్రాలు, ముత్యాలు, వస్త్రాలు, మస్లిన్, పుంజం క్లాత్, చింట్జ్, సేలంపోర్, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు తదితర వాణిజ్య వస్తువుల
లాభదాయకమైన వ్యాపారం కొనసాగుతుంది.
మీర్ నిజాం
అలీఖాన్ హయాంలో హైదరాబాద్ ఆర్ధిక స్థిరత్వాన్ని పొందింనది. 1763లో డెక్కన్ రాజధాని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్‌కు మారి
హైదరాబాద్ శక్తి మరియు సంపద పెరుగుదలతో పాటు వేగవంతమైన అభివృద్ధి మరియు విస్తరణను
నమోదు చేసింది. అటువంటి పరిస్థితులలో
రెండవ నిజాం,
మీర్ నిజాం అలీఖాన్ అధికారికంగా ఆంగ్లేయ
ఈస్టిండియా కంపెనీకి ఒరిస్సాకు దక్షిణంగా ఉన్న ఉత్తర సర్కార్ల ధనిక ప్రాంతాన్ని
అప్పగించిన కారణాన్ని గురించి మనం తెలుసుకోవలసిన అవసరం లేదా? మీర్ నిజాం
అలీఖాన్ తన అధికార పరిధిలో ఉత్తర సర్కార్‌లను నిలుపులేకపోవడానికి బలమైన కారణం ఏమిటి?
1765 మరియు 1800 మధ్య, నిజాం అలీ ఖాన్ ఆంగ్లేయులతో అనేక ఒప్పందాలు
కుదుర్చుకున్నాడు, ఇవి నిజాం అలీ ఖాన్ శక్తిని తగ్గించినవి. కర్ణాటకలో ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధాల తర్వాత, మే 1767లో
నిజాం అలీఖాన్ సంతకం చేసిన శాంతి ఒప్పందం హైదరాబాద్, మరాఠాలు మరియు హైదర్ అలీలకు చాలా
ప్రయోజనకరంగా మారింది, తద్వారా బ్రిటిష్ వారు ఒంటరి అయ్యారు. అయితే 1768లో
బ్రిటీష్ వారు నిజాం అలీఖాన్‌తో కుదుర్చుకున్న మసులీపట్నం ఒప్పందంలో నిజాం అలీఖాన్
కు అవమానకరమైన నిబంధనలు ఉన్నాయి మరియు ఇతర
దక్కన్ శక్తులకు (మరాఠాలు మరియు హైదర్ అలీలకు) కూడా అంతే ప్రతికూలంగా ఉన్నాయి.
నిజాం అలీఖాన్ కోస్తా ఆంధ్ర ఉత్తర
సర్కార్లను బ్రిటిష్ వారికి బదిలీ చేయాల్సి వచ్చింది. ప్రతిగా, మీర్
నిజాం అలీ ఖాన్ వద్ద ఒక అనుబంధ సైనిక దళాన్ని ఉంచడానికి బ్రిటిష్ వారు
అంగీకరించారు, దానిని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. మీర్
నిజాం అలీ ఖాన్ కి ఏడాదికి రూ.9 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు, తర్వాత
ఈ చెల్లింపును బ్రిటిష్ వారు రూ.7
లక్షలకు తగ్గించారు
1779లో నిజాం మైసూర్‌కు చెందిన హైదర్ అలీ మరియు మరాఠాల పీష్వాతో కలిసి
బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు కుట్ర పన్నాడు. నిజాం ప్లాన్ గురించి బ్రిటిష్
వారు తెలుసుకున్నప్పుడు, నిజాంకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ప్రవర్తించారు.
మరో ఒప్పందం ద్వారా, నిజాం ను హైదర్ అలీ నుండి విడదీయవలసి
వచ్చింది మరియు మరొక ఒప్పందం నిజాం ను 1788లో గుంటూరు సర్కార్‌ను బ్రిటిష్ వారికి అప్పగించేలా చేసింది.
బ్రిటీష్ వారు ఆరు ఒప్పందాలపై సంతకం చేయమని బలవంతం చేయడం ద్వారా నిజాంపై తమ
అధికారాన్ని పొందారు
వాటిలో అతి
ముఖ్యమైనది 1798 నాటి అనుబంధ కూటమి Subsidiary
Alliance. ఇది హైదరాబాద్‌ను మరియు దాని విదేశీ
వ్యవహారాలను బ్రిటిష్ వారి ఆధీనంలోకి తెచ్చింది.ఈ రాజకీయ పరిణాల పలితంగా ద్వారా, మసులీపట్నం బ్రిటీష్ ఆధిపత్యంలోకి
వచ్చింది. బ్రిటీష్ వారు నిజాంల నుండి విశాఖపట్నం, గోదావరి మరియు మసులీపట్నంలను
స్వీకరించినారు.
No comments:
Post a Comment