30 October 2022

అబ్బాసిద్ (బాగ్దాద్) యొక్క ఇద్దరు రాణులు: హరున్ అల్-రషీద్ తల్లి మరియు భార్య-ఖైజురాన్ & జుబైదా Two Queens of Abbasid (Baghdad): Mother and Wife of Harun al-Rashid- Khayzuran & Zubayda

 

అల్-ఖైజురాన్(?-789):

ఖైజురాన్ ఎనిమిదవ శతాబ్దం మధ్యలో అరేబియా ద్వీపకల్పంలోని నైరుతి భాగంలో జన్మించినది. ప్రవక్త ముహమ్మద్(స) మరణించిన 100 సంవత్సరాల తర్వాత, ఖైజురాన్ చిన్నతనంలోనే బానిస వ్యాపారులచే కిడ్నాప్ చేయబడి, 758 మరియు 765 మధ్య, మక్కాలో బాగ్దాద్ స్థాపకుడు అబ్బాసిద్ ఖలీఫ్ అల్-మన్సూర్‌కు విక్రయించబడినది. ఖైజురాన్ ను అల్-మన్సూర్‌ తన కుమారుడు మరియు వారసుడు అల్-మహ్దీకి ఇచ్చాడు.

అల్-మహ్దీ,  ఖైజురాన్ కి ఒక కుమార్తె మరియు ఇద్దరు కుమారులను కలిగారు. కుమారులు  ఇద్దరు ఖలీఫాలు అయ్యారు. వారిలో ఒకరు  ప్రఖ్యాత ఖలీఫా హరున్ అల్-రషీద్.

789లో ఖైజురాన్ మరణించే సమయానికి, ఆమె వార్షిక ఆదాయం 160 మిలియన్ దిర్హామ్‌లు.  ఇది అబ్బాసిద్ సామ్రాజ్య మొత్తం ఆదాయంలో దాదాపు సగం అని 10వ శతాబ్దపు చరిత్రకారుడు అల్-మసూది తెలిపారు. ఖైజురాన్ తన కాలంలోని ముస్లిం ప్రపంచంలో అత్యంత ధనవంతురాలు  అని చరిత్రకారిణి నబియా అబాట్ పేర్కొన్నారు.  

ఖైజురాన్ యొక్క రాజకీయ అధికార ప్రస్థానం రాచరిక హరామ్ లేదా మహిళల క్వార్టర్స్ ద్వారా జరిగింది. అల్-మహ్దీ యొక్క మొదటి భార్య మరియు బంధువు అయిన రీటా అబ్బాసిద్ సామ్రాజ్య స్థాపకుడు అబు అబ్బాస్ అబ్దుల్లా యొక్క కుమార్తె.

అల్ తబరి యొక్క రచన  ప్రవక్తలు మరియు రాజుల చరిత్ర History of the Prophets and Kings లో 775లో అల్ మహ్ది బానిస అమ్మాయి ఖైజురాన్ ను వివాహం చేసుకొన్నాడు అని పేర్కొన్నాడు.  ఖలీఫాలు కులీన వంశ స్త్రీలను  వివాహం చేసుకోనే  సమయంలో, ఖైజురాన్‌ రాణిగా ఎదగడం సంప్రదాయానికి ఒక సాహసోపేతమైన విరామంఅని ఆధునిక చరిత్రకారుడు హ్యూ కెన్నెడీ అన్నాడు.

అబ్బాసిడ్ కోర్టులోని ఉన్నత కులీన వంశం లో జన్మించిన స్త్రీలు ఖైజురాన్ ఉనికిని  వెక్కిరించిన  ఖైజురాన్ దానిని దయతో స్వీకరించినది. రీటా మరియు ఖైజురాన్ మధ్య ప్రత్యక్ష ఉద్రిక్తతకు చారిత్రిక ఆధారాలు లేవు. ఖైజురాన్ కుమారులు మూస అల్-హైది మరియు హరున్ అల్-రషిద్ వారసులుగా పరిగణింప బడినారు. 

అరబిక్ లో ఖైజురాన్ అంటే “ రెల్లు” అని అర్ధం. ఖైజురాన్ రెల్లు లాగా సన్నగా, మనోహరం గా ఉండేది అని వర్ణింపబడినది.  ఖైజురాన్ తెలివైనది, స్వేచ్ఛగా కవిత్వాన్ని చెప్పేది మరియు ప్రముఖ ఇస్లామిక్  పండితుల వద్ద దివ్య ఖురాన్, హదీసులు మరియు ఫికా అధ్యయనం చేసింది.

ఖైజురాన్ హాస్యప్రియురాలు.  ఖైజురాన్ ప్రాక్టికల్ జోక్‌లను ఆస్వాదించెది మరియు అల్-మహ్దీ తో ప్రైవేట్‌గా ఖలీఫా  అల్ మన్సూర్ కోపాన్ని గురించి ఎగతాళి చేసేది.

రాజ్య పాలనా విషయానికి వస్తే, ఖైజురాన్ సమర్ధురాలు.  అల్-హదీ-ఖైజురాన్ మొదటి కుమారుడు ముసా ఖలీఫాగా  రాజ్యం ప్రారంభించిన సమయంలో, అల్-ఖైజురాన్ ముసా ను ఏ మాత్రం సంప్రదించకుండానే ముసా పై తన అధికారాన్ని చలాయించేది మరియు పాలనా విషయాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండేది అని అల్-తబరి పేర్కొన్నాడు.

కొత్త ఖలీఫా మూస అల్-హైది తన తల్లి ఆధిపత్యంను  నిరసించాడు. బహుశా తన తమ్ముడు హరున్ అల్-రషీద్ పట్ల ఖైజురాన్ కున్న చిరకాల అభిమతం పట్ల ముసా ఆగ్రహం వ్యక్తం చేసి ఉండవచ్చు. అసమ్మతి ఎక్కువ కాలం కొనసాగలేదు: మరుసటి సంవత్సరం ముసా అల్-హదీ మరణించాడు. (ఖైజురాన్ అతనికి విషప్రయోగం చేసిందని  పుకార్లు వ్యాపించాయి, కానీ వాటికి అధికారిక ఆధారం  లేదు.) హరున్ అల్-రషీద్ మొరాకో నుండి పర్షియా వరకు విస్తరించిన అబ్బాసిద్ సామ్రాజ్యానికి ఖలీఫా  అయ్యాడు మరియు అబ్బాసిద్ శకం అత్యున్నత స్థాయికి చేరుకొంది.

అల్-ఖైజురాన్ 789లో మరణించినది.

లెగసి:

అల్-ఖైజురాన్ బలమైన వ్యక్తిత్వం “వన్ థౌజండ్ అండ్ వన్ నైట్స్‌”లో ప్రధాన పాత్ర అయిన షెహెరాజాడ్‌పై కీలక ప్రభావం చూపిందని పలువురు సాహిత్య చరిత్రకారులు విశ్వసించారు. చాలా కథలు హరున్ అల్-రషీద్ మరియు అతని అద్భుతమైన రాజాస్థానం ద్వారా ప్రభావితమయ్యాయి

 

అబ్బాసిద్ చరిత్ర  ఖైజురాన్ యొక్క రాజకీయ విజయాలను వివరించలేదు, కానీ ఖైజురాన్ పేరు మీద నాణేలు ముద్రించబడినవి.  రాజభవనాలకు  ఖైజురాన్ పేరు పెట్టబడ్డాయి మరియు తరువాతి అబ్బాసిద్ పాలకుల అంత్యక్రియలు జరిగే  స్మశానవాటిక కూడా ఖైజురాన్ పేరును కలిగి ఉంది.  

 

 జుబైదా(?-831):

అల్-ఖైజురాన్ కోడలు అయిన జుబైదా, ఖలీఫా  హరున్ అల్-రషీద్‌ భార్య. 13వ శతాబ్దపు రచయిత ఇబ్న్ ఖలీఖాన్ ప్రకారం, జుబైదా తాత అల్-మన్సూర్, జుబైదా బొద్దుగా, ముద్దుగా  ఉండటం వలన జుబైదా ను "చిన్న వెన్న ముద్ద" అని పిలిచేవాడు.

చరిత్రకారుల ప్రకారం పెద్దయ్యాక, జుబైదా "దాన ధర్మాలు  పుష్కలంగా చేసేది మరియు  జుబైదా ప్రవర్తన సద్గుణమైనది". వంద మంది బానిస బాలికలు ప్రతిరోజూ జుబైదా గదిలో దివ్య ఖురాన్‌ లో  పదో వంతు పఠించేవారని మరియు జుబైదా ప్యాలెస్ దివ్య ఖురాన్‌ పఠనం తో ప్రతిధ్వనిస్తుంది" అని చరిత్రకారులు చెప్పారు.

అబ్బాసిడ్ సామ్రాజ్యం యొక్క అత్యున్నత కాలం లో జన్మించిన జుబైదా విలాసవంతమైన జీవనం గడిపేది. అల్-జుబైర్ యొక్క 11వ శతాబ్దపు గ్రంధం “బుక్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ రేరిటీస్ Book of Gifts and Rarities ప్రకారం జుబైదా ఆనాటి ధనవంతులు మరియు ప్రసిద్ధుల జీవనశైలి” గడిపేది. జుబైదా-ఖలీఫా  హరున్ అల్-రషీద్‌ వివాహ ఖర్చు 50 మిలియన్ దినార్‌లకు చేరుకుంది.

జుబైదా-ఖలీఫా  హరున్ అల్-రషీద్‌ వివాహ ఉత్సవం లో “వధువు కెంపులు మరియు ముత్యాలతో పొదిగిన జాకెట్ " ధరించినది. దాని విలువను అంచనా వేయలేము.  అతిథులు వెండి గిన్నెలలో బంగారు దీనార్లు మరియు బంగారు గిన్నెలలో వెండి దినార్లు బహుమతులు అందుకున్నారు.

"విలువైన రాళ్లతో ఎంబ్రాయిడరీ చేసిన చెప్పులు పరిచయం చేసిన మొదటి వ్యక్తి జుబైదా" అని అల్-మసూది తెలిపారు. అరబ్ చరిత్రకారుడు అల్-మసూది ప్రకారం సామ్రాజ్య అధికారిక  ఉత్సవాలలో “జుబైదా వేసుకొన్న నగలు మరియు ధరించిన దుస్తుల బరువు తో నడవడం చాలా కష్టం."గా ఉండేది మరియు జుబైదా కు సేవకులు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది అని అన్నాడు.

జుబైదా ప్రజాపయోగ పనులపై అమితంగా ఖర్చు చేసేది. జుబైదా తన కాలంలోని పాలకుల కంటే మక్కా యాత్రికుల కోసం ఎక్కువ స్వచ్ఛంద కార్యక్రమాలను చేసింది.

805నాటికి  జుబైదా మక్కాకు కనీసం ఐదు తీర్థయాత్రలు చేసింది. మక్కాలో సంభవించిన  కరువు ప్రజలను నాశనం చేసిందని మరియు జంజామ్ యొక్క పవిత్రమైన బావిలో నీటిని   తగ్గించిందని జుబైదా బాధ పడినది. జుబైదా జంజామ్ బావిని లోతుగా చేయమని ఆదేశించింది మరియు మక్కా మరియు చుట్టుపక్కల ప్రాంతాల  నీటి సరఫరాను మెరుగుపరచడానికి దాదాపు 2 మిలియన్ దినార్లు ఖర్చు చేసింది. తూర్పున 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న హునైన్ స్ప్రింగ్ నుండి అక్విడెక్ట్ నిర్మాణం, అలాగే హజ్‌ యాత్ర లోని ఆచార ప్రదేశాలలో ఒకటైన అరాఫత్ మైదానంలో ప్రసిద్ధి చెందిన "జుబైదా వసంతం“Spring of Zubayda” " కూడా జుబైదా నిర్మించినది. చరిత్రకారుడు ఇబ్న్ ఖలీఖాన్ ప్రకారం సాంకేతిక ఇబ్బందులు, ఖర్చు  పట్టించుకోకుండా  పనిని నిర్వహించాలని జుబైదా ఇంజినీర్లకు ఆదేశాలు ఇచ్చేది.

బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న కుఫా నుండి మక్కా వరకు 1,500-కిలోమీటర్ల దర్బ్ (రహదారి) నిర్మాణం, మార్గమద్యలో  లో నీటి వసతి మరియు కొండపై రాత్రిపూట ప్రయాణికులకు మార్గనిర్దేశం చేసే బీకాన్‌లు నిర్ణిత వ్యవధిలో జుబైదా పూర్తిచేసింది.

చరిత్రకారుడు అల్-అజ్రాకీ, "మక్కా ప్రజలు మరియు యాత్రికులు తమ జీవితంలో దేవుని పక్కన ఉన్న [జుబైదా]కి రుణపడి ఉంటారని" ప్రకటించారు మరియు "దేవుడు జుబైదాను ఆశీర్వదించుగాక " అనే యాత్రికుల కేకలు ఇప్పటికీ దర్బ్ జుబైదా అని పిలువబడే మార్గంలో తరతరాలుగా ప్రతిధ్వనించాయి. (యాత్రికులు ఒంటెల మీదుగా రైలు, ఆటో మరియు విమాన ప్రయాణాలను ఎంచుకున్నప్పుడు ఇది నిరుపయోగంగా మారింది.)

813లో జుబైదా తన సొంత కొడుకు ఖలీఫా అల్-అమీన్ అవినీతికి పాల్పడినప్పుడు అతని స్థానం లో తన సవతి కొడుకు అల్-మామున్  ను  ఖలీఫా చేయడాన్ని ఆమోదించడం ద్వారా తన సొంత మాంసం మరియు రక్తం కంటే సామ్రాజ్య ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది.

విద్యా,సంస్కారవంతుడైన అల్-మామున్ బాగ్దాద్ యొక్క ప్రఖ్యాత బైత్ అల్-హిక్మా bayt al-hikma (house of wisdom) (వివేకం యొక్క ఇల్లు)ని స్థాపించి అత్యంత వివేకవంతమైన పాలకుడిగా ప్రసిద్ది చెందాడు.

బైత్ అల్-హిక్మా అరబిక్ భాషలోకి గ్రీకు, రోమన్ మరియు ఇతర శాస్త్రీయ గ్రంథాల అనువాదానికి కేంద్రంగా మారింది. అనువాద గ్రీకు, రోమన్ మరియు ఇతర శాస్త్రీయ గ్రంథాలు అబ్బాసిడ్ సామ్రాజ్య మేధో వాతావరణాన్ని తెలియజేయడమే కాకుండా, తరువాత యూరోపియన్ పునరుజ్జీవనానికి పునాదులుగా మారాయి.

జుబైదా 831లో మరణించినది.

జుబైదా అబ్బాసిద్ యుగ చరిత్ర మరియు సాహిత్యం రెండింటిలోనూ ప్రభావవంతమైన మహిళగా కీర్తి గడించినది. హరున్ అల్-రషీద్, ఆల్ఫ్ లైలా వా లైలా (1001 రాత్రులు) alf layla wa layla (1001 Nights) యొక్క యూరోపియన్ సేకరణలో ప్రధాన పాత్రధారి ఖలీఫా  అయ్యాడు మరియు జుబైదా కల్పిత షెహెరాజాడేకి నిజ జీవిత ఆధారం అయినది.

No comments:

Post a Comment