9 October 2022

బిలాల్ ఇబ్న్ రబా: మానవ సమానత్వానికి చిహ్నం Bilal ibn Rabah: The symbol of human equality


 


బిలాల్ ఇబ్న్ రబాహ్ ఇస్లామిక్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ పేర్లలో ఒకటి. బిలాల్ హబాషా (ఇథియోపియా) నుండి వచ్చిన నీగ్రో బానిస. ఇస్లాం లో సామాజిక సమానత్వం, మానవ సమానత్వం, జాత్యహంకార వ్యతిరేకతకు బిలాల్ స్పష్టమైన  ఉదాహరణ.

680CEలో మక్కాలో, బిలాల్ రబా మరియు హమామాకు జన్మించాడు. బిలాల్, ఇస్లాం యొక్క ప్రధాన శత్రువు అయిన ఉమయ్యా ఇబ్న్ ఖలాఫ్‌కు సన్నిహితురాలు అయిన ఒక మహిళ వద్ద  బానిసగా పనిచేశాడు.

బిలాల్ ఇస్లాంలోకి మారడం గురించి ఉమయ్యా ఇబ్న్ ఖలాఫ్‌ విన్నప్పుడు, బిలాల్ ను ఉమయ్యా హింసించాడు మరియు కొత్త విశ్వాసాన్ని విడిచిపెట్టమని బలవంతం చేశాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఇస్లాం పట్ల ప్రేమతో నిండిన బిలాల్ తీవ్రమైన హింసకు గురైనప్పటికీ తన విశ్వాసంలో స్థిరంగా ఉండి, "అహద్, అహద్" అని చెబుతూనే ఉన్నాడు. (అల్లా ఒక్కడే, అల్లా ఒక్కడే).

ప్రవక్త (స) బిలాల్ కష్టాల గురించి తెలుసుకున్నప్పుడు, అబూ బకర్‌(ర)ను పంపాడు, అబూ బకర్‌(ర),బిలాల్  ను అతని యజమాని నుండి కొనుగోలు చేసి బిలాల్ ని విడిపించాడు. బిలాల్‌కు ఇస్లాం ఇచ్చిన మొదటి బహుమతి స్వాతంత్ర్యం. రెండవ ఖలీఫ్ ఒమర్ ఇబ్న్ ఖత్తాబ్(ర), బిలాల్  ను సయ్యద్నా (మా నాయకుడు) అని పిలిచి గౌరవించాడు.

ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క అత్యంత విశ్వసనీయ మరియు నమ్మకమైన సహచరులలో బిలాల్ ఒకడు అయ్యాడు. ఇస్లాంను స్వీకరించిన మొదటి కొద్దిమంది వ్యక్తులలో బిలాల్ కూడా ఉన్నాడు.

బిలాల్ ప్రవక్త(స)తో కలిసి మదీనాకు వలస వచ్చారు మరియు బదర్, ఓహుద్, ఖండక్ మరియు ఇతర యుద్ధాలలో పాల్గొన్నారు. బద్ర్ యుద్ధంలో, బిలాల్ ఇస్లాం యొక్క బద్ధ శత్రువు ఉమయ్యాను చంపాడు.

 ప్రవక్త ముహమ్మద్ (స) 1,400 సంవత్సరాల క్రితం ప్రపంచ చరిత్రలో మానవుల మధ్య సమానత్వాన్ని మొదటిసారిగా ప్రకటించారు. హజ్ సమయంలో 120,000 మంది సహచరుల సమక్షంలో, ప్రవక్త (స) తన అంతిమ సందేశం లో మానవ సమానత్వం ను బాహాటం గా చాటారు.

ప్రవక్త(స) బిలాల్ ను తన సహచరులలో ఒకరిగా ఎంపిక చేసుకున్నారు. ఇస్లాం లో బిలాల్ ప్రముఖ స్థానానికి ఎదగడం ఇస్లాంలో బహుళత్వం మరియు జాతి సమానత్వం యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం.

ఒకసారి అబ్దుల్లా బిన్ జియాద్ తనకు అజాన్ (ప్రార్థనకు పిలుపు) యొక్క పద్ధతి మరియు పలికే పదాలను గురించి కల వచ్చిందని వివరించాడు, దైవ ప్రవక్త (స) దానిని ఇష్టపడ్డారు మరియు బిలాల్ మదీనాలోని మొదటి అజాన్ పిలవడానికి నియమించబడ్డారు.  ఒమర్ అజాన్ విన్నప్పుడు, ప్రవక్త (స) వద్దకు పరుగెత్తుకు వచ్చి  తను కూడా అదే పదాలతో అజాన్ గురించి కల కన్నానని చెప్పాడు. అలా బిలాల్ ద్వారా అజాన్ స్థాపించబడింది. దైవ ప్రవక్త (స) ఆయనను ముఅజ్జిన్ రసూల్ (ప్రవక్త తరపున నమాజుకు పిలవడం)గా నియమించారు.

బిలాల్ ఇస్లాంను స్వీకరించిన మొదటి ఆఫ్రికన్ అయినందున, ఆఫ్రికన్ ముస్లింలు ఇప్పటికీ ఒక ఆఫ్రికన్‌కు లభించిన ఆ గౌరవాన్ని గర్వంగా భావిస్తారు.


హిజ్రీ 8లో మక్కా విజయం బిలాల్‌కు మరో గొప్ప గౌరవం లబించినది. మక్కా నగరం లొంగిపోయినప్పుడు మరియు ముస్లింలు మరియు ముస్లిమేతర పెద్దలందరూ కాబా ప్రాంగణంలో నిలబడి ఉన్నప్పుడు, ప్రవక్త (స) బిలాల్‌ను పవిత్ర కాబా పైకప్పుపైకి ఎక్కి పై నుండి అజాన్ పిలుపు ఇవ్వమని అడిగారు. ఇది మక్కా ముకర్రమహ్‌లో ఇవ్వబడిన మొదటి ఆజాన్.

బిలాల్‌ ఇస్లాం పట్ల ఉన్న భక్తితో  ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థానంకు  ఎదిగాడు.ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు, “ఓ బిలాల్, నువ్వు చేసిన విశేషమైన కార్యాలు వల్ల స్వర్గంలో నాకంటే ముందు నీవు అడుగులు వేస్తున్న శబ్దాలు నేను విన్నాను. బిలాల్ ఇలా అన్నాడు, "నేను వుదు (అబ్యుషన్) చేసినప్పుడల్లా, నేను తహయ్యతుల్ వుదూ గా రెండు రకాత్ ప్రార్థనను చేస్తాను. "

అషబ్ అల్-సుఫ్ఫాలో బిలాల్ కూడా ఉన్నాడు. అషబ్ అల్-సుఫ్ఫా అనే పదం, వలస తర్వాత మదీనాలోని ప్రవక్త (స) యొక్క మసీదు పక్కన ఉన్న అరుగు/వరండాలో ఉండి, అక్కడ మత శాస్త్రాలను అభ్యసించిన సహచరులకు ఇవ్వబడిన సాధారణ పేరు.

బిలాల్‌కు సుఫ్ఫాలో స్థానం ఉంది కాబట్టి, బిలాల్ ప్రవక్త (స) యొక్క అనేక హదీసులు (సూక్తులు) సేకరించాడు. ఒసామా బిన్ జైద్, బారా బిన్ అజెబ్ మరియు అబ్దుల్లా బిన్ ఒమర్‌లతో సహా దాదాపు 20 మంది పండితులు అషబ్ అల్-సుఫ్ఫాలో భాగమయ్యారు.

హబాషా(ఇధియోపియా) రాజు నజాషి ప్రవక్త (స) కి మూడు ఈటెలను బహుమతిగా పంపినప్పుడు, ప్రవక్త (స) వాటిని ఒమర్, అలీ మరియు బిలాల్‌లకు ఇచ్చాడు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన తరువాత, బిలాల్ తన ప్రియమైన ప్రవక్త (స) లేకుండా మదీనాలో గడపడం కష్టంగా భావించాడు. బిలాల్‌(ర) తనను  జిహాద్ కోసం సిరియాకు వెళ్లనివ్వమని అప్పటి ఖలీఫా అబూ బకర్‌(ర)ను కోరాడు మరియు అక్కడ బిలాల్‌(ర)తన జీవితాంతం గడిపాడు. అప్పటి నుండి బిలాల్‌(ర) రెండుసార్లు మాత్రమే ఆజాన్ ఇచ్చాడు. మొదటిది ఖలీఫ్ ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్(ర) సిరియాకు వచ్చినప్పుడు మరియు రెండవసారి మదీనాలోని ప్రవక్త (స) సమాధిని సందర్శించినప్పుడు. బిలాల్‌ గొంతు విని, ప్రజలు ఏడ్వడం ప్రారంభించారు, ఎందుకంటే అది వారికి ప్రవక్త (స) రోజులను గుర్తు చేసింది.

బిలాల్(ర) మదీనా నుండి సిరియాకు (అప్పటి షామ్) వెళ్లి అక్కడే ఉన్నాడు. బిలాల్(ర) మదీనా నుండి సిరియాకు (అప్పటి షామ్) వెళ్లి అక్కడే ఉన్నాడు. ఖలీఫా  ఉమర్ బైత్ అల్-మక్దిస్ (జెరూసలేం)ని సందర్శించినప్పుడు, ఖలీఫా ఉమర్,  బిలాల్‌(ర)ను అజాన్ ఇవ్వమని అభ్యర్థించాడు, దానిని బిలాల్(ర) అంగీకరించాడు. మరియు బిలాల్(ర) అజాన్‌ ఇచ్చినప్పుడు ప్రవక్త (స)సహచరులు పాత రోజులను గుర్తుచేసుకుంటూ చాలా ఏడ్చారు. ఖలీఫా ఒమర్ కూడా విలపించాడు.

బిలాల్(ర) సిరియాలో ఉన్నప్పుడు, దైవ ప్రవక్త (స) బిలాల్(ర) కలలో కనపడి ఇలా అన్నారు., "ఓ బిలాల్, ఇది ఏమిటి, మీరు నన్ను సందర్శించలేదు." బిలాల్(ర) ఆందోళన చెందాడు; బిలాల్(ర) మదీనాకు పరుగెత్తాడు మరియు ప్రవక్త (స) సమాధి వద్ద తన నివాళులు మరియు శుభాకాంక్షలు తెలియజేసాడు మరియు సమాధితో తన ముఖాన్ని రుద్దాడు.

ప్రవక్త(స) మనవళ్లు హసన్ మరియు హుస్సేన్‌లను చూడగానే,బిలాల్  వారిని ఆలింగనం చేసుకోవడానికి పరుగెత్తాడు. వారి అభ్యర్థనపై, బిలాల్(ర) వణుకుతున్న స్వరంతో మరియు చెమ్మగిల్లిన కళ్ళతో అజాన్ ఇచ్చాడు. బిలాల్(ర) ఆజాన్ విన్న ప్రజలు ప్రవక్త మసీదుకు చేరుకున్నారు. ఇది మదీనాలో బిలాల్(ర)యొక్క చివరి ఆజాన్.

బిలాల్(ర) తన చివరి రోజులు సిరియాలో గడిపాడు. బిలాల్(ర) 18 AHలో 64 సంవత్సరాల వయస్సులో మరణించాడు మరియు డమాస్కస్‌లోని జమా ఉమావి సమీపంలోని బాబ్-అల్ సగీర్‌లో ఖననం చేయబడ్డాడు. బిలాల్(ర) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కి 25 సంవత్సరాలు సేవ చేసాడు.ఇస్లాం, బిలాల్(ర)ని ఒమర్ బిన్ ఖత్తాబ్ చే సైయదానా (మా నాయకుడు) అని సంబోధించే స్థాయికి పెంచినది.

మరణశయ్యపై ఉన్నప్పుడు, బిలాల్(ర) భార్య హింద్, 'వా హజానా' (ఎంత గొప్ప దుఃఖం) అని ఏడ్చింది, దానికి బిలాల్(ర), 'వా తారాబా' (ఎంత గొప్ప ఆనందం) అని బదులిచ్చారు; "రేపు నేను నా ప్రియమైన వారిని - ముహమ్మద్ (స) మరియు అతని సహచరులను కలుస్తాను" అని బిలాల్(ర) తన భార్య హింద్ తో చెప్పాడు.

No comments:

Post a Comment