ఇస్లాం, సోషలిజానికి/ సామ్యవాదంకు అనుకూలం/పూరకంగా ఉందా?
చాలా మంది అభిప్రాయం ప్రకారం 'సోషలిజం' అంటే నాస్తిక తత్వశాస్త్రం మరియు
ఇస్లామిక్ బోధనల యొక్క ప్రధాన అంశంగా ఒకే దేవుడిపై విశ్వాసం ఉన్నందున ఇస్లాం మరియు
సోషలిజం పరస్పర విరుద్దాలు.
కాని ఇది సరైన అభిప్రాయం కాదు. చాలా మంది
ఉలేమాలు సోషలిజాన్ని ఇస్లామిక్ బోధనలలో ముఖ్యమైన భాగంగా అంగీకరించారు. భారతదేశంలో, మౌలానా హస్రత్ మోహానీ మరియు మౌలానా
ఉబైదుల్లా సింధీ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఉత్సాహంగా మద్దతు ఇచ్చారు. మౌలానా మోహానీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులలో ఒకరు.
ఖిలాఫత్ ఉద్యమ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌కు వలస
వెళ్లి, మహేంద్ర
ప్రతాప్ సింగ్‌తో కలిసి అక్కడ ప్రవాస భారత ప్రభుత్వాన్ని మౌలానా ఉబైదుల్లా సింధీ
ఏర్పాటుచేశాడు. ప్రవాస భారత ప్రభుత్వ సభ్యులను బహిష్కరించాలని బ్రిటిష్ వారు
ఆఫ్ఘనిస్తాన్ రాజు పై ఒత్తిడి తెచ్చినప్పుడు మౌలానా ఉబైదుల్లా సింధీ మరియు ప్రవాస
భారత ప్రభుత్వ సభ్యులు రష్యాకు బయలుదేరారు..
మాస్కోలో వారు లెనిన్‌ను కలుసుకున్నారు మరియు బ్రిటీష్ వలసవాదంపై పోరాడటానికి లెనిన్‌తో
చర్చించారు. మౌలానా సింధీ 1940ల ప్రారంభంలో మాత్రమే భారతదేశానికి తిరిగి వచ్చారు.
టర్కీలో ఉస్మానీ అధికారం క్షీణించిన తర్వాత
మరియు రష్యన్ విప్లవం సందర్భంగా అల్లామా ఇక్బాల్ తన “ఖిజార్-ఇ-రాహ్”లో సోషలిజానికి
గొప్ప నివాళి అర్పించాడు.అల్లామా అల్లామా ఇక్బాల్,
మార్క్స్ Marxకు ఘనంగా నివాళులర్పించాడు
మరియు మార్క్స్ ను ప్రవక్త (పెఘంబర్
నీస్త్ వలీ దర్ బఘల్ దరాద్ కితాబ్) అని, ‘పుస్తకం ఉన్న వ్యక్తి’ ‘a man with a book’ without
being a prophet (peghambar neest wali dar baghal darad kitab).అని పిలిచాడు.
అల్లామా ఇక్బాల్, “లెనిన్ ఖుదా కే హుజూర్ మే””
(దేవుని సన్నిధిలో లెనిన్) అనే ఆసక్తికరమైన కవితను కూడా రాశాడు. W.C. ప్రముఖ ఇస్లాం పండితుడు మరియు 1930లలో
లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో బోధించిన వామపక్ష భావాలు కలిగిన క్రైస్తవ మతగురువు
అయిన స్మిత్, ఇస్లాం
ప్రపంచంలో మొట్టమొదటి వ్యవస్థీకృత సోషలిస్ట్ ఉద్యమం అని “ఇస్లాం ఇన్ ది మోడరన్
వరల్డ్” అనే తన పుస్తకంలో రాశారు.
ఇస్లాం, పేదలు మరియు అణగారిన వారి పట్ల లోతైన
సానుభూతిని చూపడమే కాకుండా అనేక మక్కన్ సూరాలలో సంపద కేంద్రీకరణను తీవ్రంగా
ఖండించింది. సూరా 104 మరియు 107లో, అటువంటి భావనలు కలవు. అంతర్జాతీయ
వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రంగా ఉన్న మక్కా చాలా ధనవంతులు (గిరిజన పెద్దలు) మరియు
అత్యంత పేదలకు నిలయంగా ఉండేది.
ఇస్లామిక్ సామ్యవాదం ను ఇస్లామిక్ చరిత్ర
కారులు ఆద్యాత్మిక రూపంలో వాడారు. వారి అబిప్రాయం ప్రకారం మహమ్మద్ ప్రవక్త హదీసులు, దివ్య కొరాన్ భోధనలు సాంఘిక,ఆర్థిక సమానత్వ సాధనకు తోడ్పడును.
ప్రవక్త మహమ్మద్(స.ఆ.స.) యొక్క తోలి సహచరులలో
ఒకరైన అబు ధార్-అల్-ఘిఫారి Abu
Dharr Al-Ghifari Al-Kinani (أَبُو ذَرّ ٱلْغِفَارِيّ ٱلْكِنَانِيّ, ʾAbū Ḏarr కఠినమైన దైవభక్తి కలవాడు.నిరాడంబరమైన
జీవితాన్ని గడిపేవాడు. అలీ షరియాతి, ముహమ్మద్ షర్ఖావి మరియు సమీ
అయాద్ హన్నాతో సహా అనేకమంది ఇస్లామిక్ పండితులచే ఇస్లామిక్ సోషలిజం యొక్క ప్రధాన పూర్వగామిగా, మొదటి ఇస్లామిక్ సోషలిస్టుగా
పరిగణించబడ్డాడు.
ప్రవక్త (స) యొక్క ప్రముఖ సహచరులలో ఒకరైన అబూ
దర్ గఫారీ, సంపద
కేంద్రీకరించడాన్ని ఖండిస్తూ ఉండేవాడు. సంపదను కూడబెట్టుకునే వారి ముందు
ఎల్లప్పుడు మదీనీ
సురాలలో ఒకటైన, 9:34
ను ఉల్లేఖిoచేవాడు.”వెండి బంగారాలను పోగుచేసి, వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టని వారికి వ్యధా భరితమైన శిక్ష యొక్క శుభవార్తను
అంద జేయ్యండి”.
అబూ దర్ గఫారీ అలాంటి వ్యక్తులతో కరచాలనం
చేయడానికి నిరాకరించాడు. ఆ విధంగా, అబూ దర్ తో కరచాలనం చేసిన వారు తమను
తాము గర్వంగా భావించుకుంటారు మరియు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు.
ఉత్మాన్ ఖిలాఫాత్ కాలంలో, డమాస్కస్, మదీనా లోని ముస్లింలు ఇస్లాం నుండి వైదొలగడం, ప్రాపంచిక వస్తువులు, ప్రాపంచిక ఆనందాలు,
సుఖాలు మరియు కోరికల కోసం ప్రజల ఆరాటం
చూసి బాధపడ్డాడు
అబు
ధార్-అల్-ఘిఫారి ఖలీఫా ఉస్మాన్ కాలం లో పాలక వర్గం చేతిలో సంపద కేంద్రీకరణను
వ్యతిరేకించి వెంటనే దానిని అందరికీ పంచమని కోరినాడు. అబూ ధర్ సూత్రాల విషయానికి
వస్తే రాజీపడని వ్యక్తి, దాని కారణంగా ఎడారిలో అల్-రబాతా అనే చిన్న గ్రామం
లో ఒంటరిగా,నిరాడంబరంగా
జీవిస్తూ మరణించాడు. మరణ వస్త్రం/కఫన్
వస్త్రం కొనడానికి కూడా అబూ ధర్ భార్య
దగ్గర డబ్బులు లేకపోవడంతో బట్టల్లోనే అబూ ధర్ ను ఖననం చెసారు.
ముహమ్మద్ (స)ఒకసారి ఇలా అన్నాడు:
అబూ దర్, అల్లాహ్ మీపై దయ చూపుగాక! మీరు ఒంటరిగా
జీవిస్తారు, ఒంటరిగా
చనిపోతారు మరియు ఒంటరిగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు
దివ్య ఖురాన్ విశ్వాసులకు అవసరమైనదాని కంటే ఎక్కువ ఉన్న వాటిని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయమని సలహా
ఇస్తుంది. దివ్య ఖురాన్ లో ఉపయోగించిన పదం
'afw', అంటే
ఒకరి ప్రాథమిక అవసరాలను తీర్చిన తర్వాత మిగిలి ఉన్నదంతా.
2:219 ఆయత్ ఇలా చెబుతోంది, “మేము అల్లాహ్ మార్గం లో ఏమి ఖర్చు పెట్టాలి?
అని వారు అడుగుతారు. “నీ నిత్యావసరాలకు
పోగా మిగిలింది” అని వారికీ చెప్పు.
ఈ సూచన సామ్యవాద సూత్రాలకు చాలా దగ్గరగా
ఉంటుంది 'ప్రతి
ఒక్కరికి అతని అవసరం ప్రకారం'. దివ్య ఖురాన్ యొక్క ప్రాథమిక సూత్రం న్యాయం (adl) మరియు వాస్తవానికి అల్లాహ్ పేరులో ఒకటి ఆదిల్. ఆదిల్ అనగా కేవలం(just) అని అర్ధం. కాబట్టి అన్యాయమైన సమాజం
ఇస్లామిక్ సమాజం కాదు.
దివ్య ఖురాన్‌లో, న్యాయం చాలా ముఖ్యమైనది, అది "న్యాయం చేయండి.
అది దైవభక్తి కి సరిసమానమైనది. "
(5:8). అది మీకు వ్యతిరేకంగా మరియు మీ శత్రువుకు అనుకూలంగా జరిగినా న్యాయం జరగాలి
అని కూడా చెప్పింది.
ఈ విధంగా దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది, “ విశ్వసించిన ప్రజలారా! న్యాయధ్వజవాహాకులుగా
నిలబడండి. మీ న్యాయం, మీ సాక్షం మీకూ, మీ తలితండ్రులకూ, మీ బందువులకూ, ఎంత హాని
కలిగించినా సరే. కక్షిదారులు భాగ్యవంతులయినా, నిరుపేదలయినా అల్లాహ్ వారి
శ్రేయస్సును మీకంటే ఎక్కువుగా కాంక్షిస్తాడు. (4:135) .
మరియు సోషలిజం అంటే ఏమిటి, పంపిణీ న్యాయంతో సహా చాలా సమగ్రమైన
అర్థంలో న్యాయం. ఈ ఆయతులను దివ్య ఖురాన్
యొక్క 104 మరియు 107 అధ్యాయాలతో కలిపి చదివితే, పంపిణీ న్యాయాన్ని
distributive justice మినహాయించలేము. దివ్య ఖురాన్ తన ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికి ఇతర
పదాలను కూడా ఉపయోగిస్తుంది: 'ముస్తక్బిరున్' మరియు 'ముస్తాదిఫున్', ‘mustakbirun’
and ‘mustadifun’ అంటే
శక్తివంతులు మరియు దోపిడీదారులు మరియు బలహీనులు మరియు దోపిడీ చేయబడేవారు. అల్లాహ్ ప్రవక్తలందరూ నిమ్రోద్ మరియు ఫారో వంటి
శక్తివంతమైన దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడిన అబ్రహం, మోసెస్ వంటి సమాజంలోని బలహీన వర్గాలకు
చెందినవారు.
దివ్య ఖురాన్ ప్రకారం, ముస్తక్బీరున్ మరియు ముస్తాదిఫున్ మధ్య
పోరాటం కొనసాగుతుంది, చివరికి ముస్తాదిఫున్ విజయం సాధిస్తాడు మరియు ఈ భూమిని వారసత్వంగా పొందుతాడు
(28:5).
దివ్య ఖురాన్ నిస్సందేహంగా సమాజంలోని బలహీన
వర్గానికి అనుకూలంగా ఉంది మరియు శ్రామికవర్గం యొక్క నాయకత్వాన్ని సమర్ధిస్తుంది.భూమిలో
అణిచివేయబడిన వారిని కనికరించాలనీ, వారిని నాయకులుగా చేయాలనీ, వారినే వారసులుగా
చేయాలనీ, భూమిలో వారికి అధికారాన్ని ప్రసాదించాలని(28:5) దివ్య ఖురాన్ చెబుతుంది. ఇమామ్ ఖొమేనీ ఇరాన్ లో ధనవంతుల సంపద జప్తు చేసి
దాని నుండి బోన్యాద్-ఇ-ముస్తాజెఫీన్ (బలహీనుల
నిధి)” స్థాపించమని ఆదేశించాడు.
ఇస్లామిక్ సామ్యవాదం సంపద కేంద్రీకరణను
నిరసించి సంపద అందరి పరము అనగా సమాజపరము
చేయాలంటుంది. ప్రతివిశ్వాసి సంపదను దేవుడు ఇచ్చిన వరంగా భావించి దానిని
దేవుని మార్గంలో అనగా పెదసాదలకు పంచాలని అది విశ్వాసి యొక్క విధి అని అంటుంది..
ఇస్లాం ప్రకారం సంపద అనునది అల్లాహ్ చే ప్రజలకు ఇవ్వబడిన ట్రస్ట్ గా భావించాలి.
ఆర్థిక అబివృది ఇస్లాం యొక్క అంతిమ
లక్ష్యం కాదు.పరలోక సంక్షేమానికి ఆర్థికాబివృద్దిని ఉపయోగించుకోవాలి.
ఇస్లామిక్ సామ్యవాదుల ప్రకారం మహమ్మద్ ప్రవక్త హదీసులు, దివ్య కొరాన్ భోధనలు సాంఘిక,ఆర్థిక సమానత్వ సాధనకు తోడ్పడును. ఇస్లామిక్
సామ్యవాదులు ప్రజస్వామ్యం నందు విశ్వాసముంచి నియామకం కన్నా ఎన్నికకే అధిక
ప్రాధాన్యమిచిరి.
No comments:
Post a Comment