ఉసామాహ్ ఇబ్న్ షరీక్ ప్రకారం ఒక బెడౌయిన్
ప్రవక్త(స) తో ఇలా అన్నాడు:"ఓ అల్లాహ్ యొక్క దూత, మేము
చికిత్స పొందకూడదా?"
ప్రవక్త(స) ఇలా అన్నారు: “ఓ
అల్లాహ్ సేవకులారా,తప్పనిసరిగా చికిత్స పొందండి. అల్లాహ్ ఒక ఒక వ్యాధికి తప్ప మిగతా వాటికీ చికిత్స లేదా
నివారణను కూడా సూచించాడు.
వారు, “ఓ
అల్లాహ్ యొక్క దూత, అది ఏమిటి?” అన్నారు.
ప్రవక్త ఇలా అన్నారు, "వృద్ధాప్యం."
అబ్దుల్లా ఇబ్న్ మసూద్ ఉల్లేఖించిన మరొక హదీసు
ఉంది, దీనిలో
అల్లాహ్ యొక్క దూత ఇలా అన్నారు:"దీని గురించిన జ్ఞానం ఉన్నవాడికి తెలుసు, మరియు
దానిని గురించి తెలియనివాడు అజ్ఞాని."
అంటే ప్రవక్త (స) మనకు చికిత్స చేయమని
మరియు వ్యాధి నివారణ కోసం అన్వేషించమని సూచించారు.
ఇస్లామిక్ వైద్య చరిత్రలో మహిళల పాత్ర గురించి చాలా తక్కువ సమాచారం ఉంది. కొందరి అభిప్రాయం ప్రకారం స్త్రీలు ఇస్లామిక్ వైద్య అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించలేదు. కాని ఈ భావన నిజం కాదు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ముస్లిం మహిళల పాత్ర విస్తృతంగా ఉంది.
ఇస్లాంలో వైద్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త (స) తన సహచరులకు రోగాలు మరియు వ్యాధులకు చికిత్స పొందడం యొక్క ప్రాముఖ్యతను గురించి బోధించేవారు. ముస్లింలు విద్యాఅధ్యయనాన్ని మతాన్ని అధ్యయనం చేసిన విధంగానే పరిగణిస్తారు.
ప్రవక్త (స) కాలంలో, ఆరోగ్య సంరక్షణకు సహకరించిన కొంతమంది మహిళా ముస్లిం వైద్యులు ఉన్నారు.దురదృష్టవశాత్తు, వారి విజయాలు గురించి మనకు బాగా తెలియదు. ఉమయ్యద్ మరియు అబ్బాసిద్ యుగాలలో గ్రీకు గ్రంథాలను అరబిక్‌లోకి అనువదించడాన్ని ప్రోత్సహించడం మరియు వారి అనుభవాలను జోడించడం ద్వారా ఇస్లామిక్ మెడిసిన్ అభివృద్ధి ప్రారంభమైంది.
ప్రవక్త ముహమ్మద్ (స) పాలనలో అనేక కొత్త ఆసుపత్రుల నిర్మాణం మరియు రోగులకు చికిత్స చేసే పద్ధతులు ఏర్పడ్డాయి. ఈ కాలంలో నర్సులు రోగులకు ఆహారాన్ని వడ్డించడం మరియు ఔషధ ద్రవాలను అందించడం వంటి విధులను నిర్వహించేవారు. లింగం ఆధారంగా ఆసుపత్రి వార్డులను వేరుచేయడం జరిగింది పురుష మరియు స్త్రీ డాక్టర్స్ వేరు-వేరుగా ఉండేవారు.
ఆసుపత్రులు మరియు గృహ సందర్శనలు:
ఇస్లాం ప్రారంభ సంవత్సరాల్లో మరియు ఆ తర్వాత కూడా మహిళలు వైద్యరంగంలో అభ్యసించారని సూచించడానికి పుష్కలంగా ఆధారాలు ఉన్నాయి. రుఫైదా యొక్క గుడారం ఇస్లామిక్ చరిత్రలో రోగులకు చికిత్స చేసే మొదటి మొబైల్ ఆసుపత్రిగా పరిగణించబడుతుంది.
అండలస్‌లోని ప్రఖ్యాత ఇస్లామిక్ సర్జన్ అల్-జహ్రావి ప్రసూతి శాస్త్రం మరియు స్త్రీ ఆరోగ్య ప్రాక్టీస్ సమయంలో మహిళా హెల్త్‌కేర్ అసిస్టెంట్ల(వీరినిని ఇప్పుడు మంత్రసానులు అని పిలుస్తారు)పై ఆధారపడినట్లు తెలిసింది. షెహబుల్దీన్ అల్-సైగ్ కుమార్తె అల్ మన్సూరీ ఆసుపత్రిలో (ఆ సమయంలో ఈజిప్ట్‌లోని అతిపెద్ద ఆసుపత్రి) పని చేస్తుందని మరియు అక్కడ ఉన్నత పదవిలో ఉందని తెలుస్తుంది.
ఆసుపత్రుల్లో
మహిళా వైద్యులు పనిచేయడమే కాకుండా ఇళ్లకు వెళ్లి రోగులను పరామర్శించారు.
అల్-తబ్బారి తన పుస్తకం "తారీఖ్ అల్ రుసూల్వా అల్ ములూక్"లో మహిళా రోగులను
చికిత్స చేయడానికి మహిళా వైద్యురాళ్ళు కలరు
అని తెలిపాడు.
అల్-తబ్బారీ ప్రకారం ఆసుపత్రి(బిమరిస్తాన్) లో మహిళా రోగుల కోసం ప్రత్యేకంగా మహిళా వైద్యులు ఉండేవారు. ఇదే సమయంలో ఇళ్లలో మహిళా రోగులను సందర్శించే మంత్రసానుల గురించి చెప్పాలి. ఇబ్న్ అల్-హజ్ తన పుస్తకం “అల్-మద్ఖల్” 13వ మరియు 14వ శతాబ్దాలలో కైరోలోని ముస్లిం కుటుంబాలకు ప్రత్యేకంగా మంత్రసానులను వచ్చి ప్రసవాలు చేయడానికి మరియు నవజాత శిశువులను సంరక్షించడానికి ఉండేవారని వివరించాడు.
ఇస్లామిక్ మహిళా ఆరోగ్య ప్రదాతల ప్రత్యేకతలు:
ముస్లిం స్త్రీలు ఇస్లాం యొక్క ప్రారంభ సంవత్సరాల నుండి గాయపడిన వారికి సహాయం చేయడంలో చురుకుగా పాల్గొన్నారు. మహిళా వైద్యులు యుద్ధంలో గాయపడిన రోగులను చూసుకోవడం, రక్తస్రావం ఆపడం, డ్రెస్సింగ్ మార్చడం మరియు గాయం నయం చేయడానికి చేతితో తయారు చేసిన ట్రాపికల్ క్రీమ్‌లను పూయడం చేసేవారు. చిన్నపాటి శస్త్రచికిత్స మరియు విచ్చేదం చేసేవారు. "కై"- కాటరైజేషన్ మరియు "హిజామా" (రక్తపాతం) చేయడం కూడా అభ్యసించబడింది.
మందుల తయారీలో ముస్లిం స్త్రీలు కూడా పాల్గొన్నారు. అల్-తబ్బారి తన పుస్తకంలో, మహిళలు సరైన క్రిమినాశక క్రీములను తయారు చేయడం ద్వారా గాయాలకు చికిత్స చేయడంలో సహాయం చేశారని పేర్కొన్నారు. బనీ ఔద్‌కు చెందిన జైనాబ్ కంటి వ్యాధులకు చికిత్స చేయడంలో మరియు ట్రాపికల్ ఔషధాలను తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. చేతితో తయారు చేసిన ట్రాపికల్ క్రీమ్‌ల ద్వారా చర్మపు పుండ్లకు చికిత్స చేసే హుస్బా అధిపతిగా అల్ షిఫా బింట్ అబ్దుల్లా ను రెండవ ఖలీఫా ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ నియమించారు.
కొందరు ఇస్లామిక్ మహిళా వైద్యులు:
1. రుఫైదా అల్-అస్లామియాRufaida Al-Aslamia 620-
రుఫైదా అల్-అస్లామియా లేదా రుఫాయిదా బిన్తె సాద్ (అరబిక్: : رفيدة
الأسلمية జననం సుమారుగా 620 AD; 2 BH) ఇస్లామిక్ వైద్య మరియు సామాజిక కార్యకర్త, రుఫైదా మొదటి ముస్లిం మహిళా నర్సు మరియు మొదటి ముస్లిం మహిళా సర్జన్,
ఇస్లాంను అంగీకరించిన మదీనాలోని మొట్టమొదటి వ్యక్తులలో రుషైదా ఒకరు.
రుఫైదా అల్-అస్లామియా మదీనాలోని కజ్రాజ్ గిరిజన సమాఖ్య లోని బోని అస్లెం తెగలో జన్మించారు మరియు మదీనా కు ప్రవక్త ముహమ్మద్(స) వచ్చినప్పుడు స్వాగతం పలికిన అన్సార్ మహిళలలో రుఫైదా ఒకరు.
రుఫైదా అల్-అస్లామియా ఒక దయ గల నర్సు మరియు మంచి నిర్వాహకురాలు. రుఫైదా తన క్లినికల్ నైపుణ్యాలతో ఆయేషా(ర) తో సహా ప్రవక్త ముహమ్మద్(స) యొక్క ప్రసిద్ధ మహిళా సహచరులకు నర్సులుగా ఉండటానికి మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేయడానికి శిక్షణ ఇచ్చింది. రుఫైదా ఒక సామాజిక కార్యకర్తగా కూడా పనిచేసింది మరియు వ్యాదులకు సంబంధించిన సామాజిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడింది. రుఫైదా పిల్లలకు, అనాథలకు మరియు పేదలకు సహాయం చేసేది.
వైద్య కుటుంబంలో జన్మించిన రుఫైదా తన తండ్రి సాద్ అల్ అస్లామీ నుంచి వైద్యo, నర్సింగ్ లో మరియు మరియు అనారోగ్యంతో ఉన్నవారిని చూసుకోవడం లో శిక్షణ పొందారు. తండ్రి శిక్షణ లో రుఫైదా అల్-అస్లామియా యుద్ధ సమయంలో గుడారం క్షేత్ర ఆసుపత్రుల నిర్వహణ లో నైపుణ్యాలను అభ్యసించింది, ప్రవక్త ముహమ్మద్(స) యుద్ద సమయం లో జరిగే ప్రాణనష్టాలను నివారించడానికి గాయపడిన సైనికులను తక్షణమే గుడారాల లో గల క్షేత్ర ఆసుపత్రులకి తీసుకెళ్లమని ఆదేశించేవారు.
రుఫైదా అల్-అస్లామియా తన వైద్య నైపుణ్యం తో గాయపడిన వారికి చికిత్స చేసేది. జిహాద్ సమయంలో గాయపడిన సైనికులకు రుఫైదా వైద్యం చేసేది మరియు ఎడారి వేడి గాలుల నుంచి కఠినమైన ఎడారి వేడి నుండి వారికి తక్షణ వైద్య సహాయం, ఉపచారాలు అందించేది.
రుఫైదా అల్-అస్లామియా తన క్లినికల్ నైపుణ్యాలను మరియు వైద్య అనుభవాన్ని ఉపయోగించి ముస్లిం సమాజపు వైద్య అవసరాలను తీర్చగలిగే మొట్టమొదటి మొబైల్ కేర్ యూనిట్లను అభివృద్ధి చేసింది. రుఫైదా పని ఆస్పత్రి పరిశుభ్రత మరియు రోగులను సంరక్షణ అందించడం.
సైనిక యాత్రల సమయంలో,
రుఫైదా
అల్-అస్లామియా స్వచ్ఛంద నర్సుల బృందాలకు నాయకత్వం వహించారు,
వారు
యుద్ధభూమికి వెళ్లి క్షతగాత్రులకు చికిత్స చేసేవారు. రుఫైదా ఖండక్,
ఖైబర్
మరియు ఇతర యుద్ధాలలో (Khandaq, Khaibar, and other) పాల్గొంది. Battle of The Trench, లో రుఫైదా
అల్-అస్లామియా గాయపడినవారికి చికిత్స చేసింది.
సహీ బుఖారీ హదీసుల ప్రకారం ప్రవక్త (స) అభ్యర్థన మేరకు సాద్ ఇబ్న్ మువాజ్ మరియు ఇతర గాయపడిన ప్రవక్త (స)సహచరులకు రుఫైదా చికిత్స చేసింది. రుఫైదా తన గుడారంలో సాద్ ఇబ్న్ మువాజ్ చేతి నుండి బాణం తీసివేసింది.
శాంతి కాలంలో, రుఫైదా అల్-అస్లామియా ముస్లింలకు అవసరమైన సహాయం అందించడం ద్వారా మానవతా కార్యకలాపాలలో తన ప్రమేయాన్ని కొనసాగించారు.
రుఫైదా మహిళా సహచరుల బృందానికి నర్సులుగా శిక్షణ ఇచ్చారు. ఖైబర్ యుద్ధానికి (battle of Khaibar) ముహమ్మద్(స) సైన్యం సిద్ధమవుతున్నప్పుడు, రుఫైదా మరియు స్వచ్ఛంద నర్సుల బృందం ముహమ్మద్(స) వద్దకు వెళ్ళి "అల్లాహ్ యొక్క దూత, మేము మీతో యుద్ధానికి వెళ్లి గాయపడినవారికి చికిత్స చేసి, ముస్లింలకు సాధ్యమైనంత సహాయం చేయాలనుకుంటున్నాము" అని ప్రవక్త(స)అనుమతి కోరారు. ప్రవక్త ముహమ్మద్(స) వారికి యుద్దరంగానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. నర్సు వాలంటీర్లు తమ విధులను చక్కగా నిర్వహించారు, వారి కృషి కి ప్రవక్త ముహమ్మద్ (స) మెచ్చి అనుగ్రహంలో కొంత భాగాన్ని రుఫైదాకు కేటాయించారు. రుఫైదా వాటా వాస్తవానికి పోరాడిన సైనికులకు సమానం. ఇది రుఫైదా వైద్య మరియు నర్సింగ్ పనికి గుర్తింపుగా ఉంది.
అల్-బుఖారీ, అబూ దావూద్ మరియు అల్-నసాయీలు ఉల్లేఖించిన ప్రవక్త (స) యొక్క కొన్ని హదీత్‌లను రుఫైదా సేకరించినది అని కూడా ప్రస్తావించబడింది.
ప్రవక్త ముహమ్మద్ (స) సమయంలో ప్రాక్టీస్ చేసిన రుఫైదా అల్-అస్లామియా మొదటి ముస్లిం నర్సు అని రికార్డులు సాక్ష్యమిస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాలు మొట్టమొదటి నర్సు మరియు మహిళా ముస్లిం సర్జన్ హోదాను రుఫైదాకు ఆపాదించాయి.
ప్రతి సంవత్సరం ఐర్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ద్వారా బహ్రెయిన్ విశ్వవిద్యాలయంలోని ఒక విద్యార్థికి నర్సింగ్‌లో గౌరవనీయమైన మరియు ప్రతిష్టాత్మక రుఫైదా అల్-అస్లామియా అవార్డు ఇవ్వబడుతుంది. అవార్డు గ్రహీత ను సీనియర్ క్లినికల్ మెడికల్ స్టాఫ్ సభ్యుల బృందం నిర్ణయించును., నర్సింగ్‌లో రుఫైదా అల్-అస్లామియా ప్రైజ్ రోగులకు అద్భుతమైన నర్సింగ్ సంరక్షణను అందించడంలో స్థిరంగా రాణించే విద్యార్థికి ఇవ్వబడుతుంది.
2.అల్-షిఫా (లైలా బింట్ అబ్దుల్లా
అల్-ఖురాషియా అల్-అదవియా- ఓంసులైమాన్)Al-Shifaa (Laila bint
Abduallah Al-Qurashiyah Al-Adawiyah- OmSulaiman):
అల్-షిఫా బింట్ అబ్దుల్లా అల్-ఖురాషియా
అల్-అదవియా తెలివైన మహిళల్లో ఒకరు. నిరక్షరాస్యత ప్రబలం గా ఉన్న కాలంలో అల్-షిఫా బింట్
అబ్దుల్లా అక్షరాస్యురాలు. ప్రవక్త (స) కాలంలో అల్-షిఫా బింట్ అబ్దుల్లా మొదటి
మహిళా ఉపాధ్యాయురాలు.
అల్-షిఫా బింట్ అబ్దుల్లా ప్రభుత్వ పాలన లో పాలుపంచుకుంది మరియు వైద్యంలో నైపుణ్యం సాధించింది. అల్-షిఫా బింట్ అబ్దుల్లా అసలు పేరు లైలా, అయితే, వైద్య సాధనలో అల్-షిఫా బింట్ అబ్దుల్లా కున్న జ్ఞానం మరియు నైపుణ్యం కారణంగా, అల్-షిఫా బింట్ అబ్దుల్లా ను అల్-షిఫా (వైద్యం) అని పిలిచేవారు.అల్-షిఫా బింట్ అబ్దుల్లా ఒక నర్సు మరియు వైద్య అభ్యాసకురాలు.
అల్-షిఫా బింట్ అబ్దుల్లా చీమ కాటు ant bite కు నివారణ చికిత్స చేసేవారు. ప్రవక్త (స) అల్-షిఫా బింట్ అబ్దుల్లా ను ఇతర ముస్లిం మహిళలకు శిక్షణ ఇవ్వాలని కోరారు. అల్-షిఫా బింట్ అబ్దుల్లా కు బాగా చదవడం మరియు వ్రాయడం వచ్చు మరియు హఫ్సా బిన్త్ అల్-ఖత్తాబ్ (ప్రవక్త (స) భార్య)కి అల్-షిఫా బింట్ అబ్దుల్లా రాయడం నేర్పించేది. అల్-షిఫా బింట్ అబ్దుల్లా ఎక్జిమా, కురుపులు వంటి చర్మ వ్యాదులకు కీటకాల కాట్లకు పూతల చికిత్సలో ప్రసిద్ధి చెందింది. హఫ్సా బిన్త్ అల్-ఖత్తాబ్ కు అల్-షిఫా బింట్ అబ్దుల్లా చీమ కాటు నివారణలో శిక్షణ ఇచ్చింది.
అల్-హుస్బా (మార్కెట్‌ను నియంత్రించడం మరియు పర్యవేక్షించడం)లో పాల్గొన్న ఇస్లాంలోని మొదటి స్త్రీలలో అల్-షిఫా బింట్ అబ్దుల్లా ఒకరు.
ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రెండవ ఖలీఫా) మదీనాలో మార్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా (హోస్బా) అల్-షిఫా బింట్ అబ్దుల్లా ను నియమించారు. అటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించిన మొదటి ముస్లిం మహిళ అల్-షిఫా బింట్ అబ్దుల్లా.ఇది హెల్త్ & సేఫ్టీ ఆఫీసర్ హోదాను పోలి ఉంటుంది.
అల్-షిఫా బింట్ అబ్దుల్లా ప్రవక్త (స) యొక్క 12 హదీత్‌లను కూడా సేకరించినది. అల్-షిఫా బింట్ అబ్దుల్లా 641వ సంవత్సరంలో మరణించింది.
3. నుసైబా బిన్త్ హరిత్ అల్-అన్సారీ (ఓం
అతియ్యా అల్-అన్సరియాహ్ Nusaybah bint Harith
al-Ansari (Om Atiyyah Al-Ansariyyah):):
నుసైబా ఇస్లాం స్వీకరించడానికి ముందు మరియు తరువాతకూడా వైద్యం చేసింది. నుసైబా ప్రవక్త (స) ప్రోత్సాహంతో సున్తీ చేసేది. నుసైబా ప్రవక్త (స) భార్యలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు మరియు వారిని క్రమం తప్పకుండా సందర్శించేవారు మరియు వారితో బహుమతులు పంచుకునేవారు. నుసైబా ప్రవక్త (స) యొక్క కొన్ని హదీసులను నివేదించింది. నుసైబా యుద్ధభూమిలో క్షతగాత్రులను జాగ్రత్తగా చూసుకుంది మరియు వారికి నీరు, ఆహారం మరియు ప్రథమ చికిత్స అందించింది. నుసైబా ప్రవక్త (స) తో పాటు 7 యుద్ధాలలో పాల్గొంది.
నుసైబా, ప్రవక్త (స) కుమార్తె జైనబ్ మరణం తరువాత జైనబ్ మృతదేహాన్ని కడిగి సిద్ధం చేసింది. నుసైబా ప్రవక్త (స) యొక్క 40 కి పైగా హదీత్‌లను కూడా సేకరించినది. వాటిలో కొన్ని అల్-బుఖారీ మరియు ముస్లిం ద్వారా వివరించబడ్డాయి. సహీహ్ అల్-బుఖారీలో వివరించిన విధంగా ఈద్ ప్రార్థనలకు హాజరయ్యేందుకు మహిళలకు అనుమతి గురించి ఒక హదీసు ఉంది. తరువాత ఆమె ఇరాక్‌లోని అల్-బస్రాహ్‌కు వెళ్లి అక్కడ మరణించింది.
4. నుసైబా బింత్‌కాబ్ అల్ మజినియాత్ (ఓం
ఒమారా) Nusaybah bintKa’ab al Maziniyyat (Om Omara):
ఇస్లాంను స్వీకరించిన తొలి మహిళల్లో నుసైబా బింత్‌కాబ్ ఒకరు. హిజ్రాకు ముందు ప్రవక్త (స)ని కలవడానికి మదీనా నుండి మక్కాకు వెళ్లిన తర్వాత మొసబ్ ఇబ్న్ ఉమైర్ తో కలసి నుసైబా బింత్‌కాబ్ (ఇద్దరు ఆడవారు మరియు డెబ్బై మంది మగవారిలో భాగంగా) బయాత్ అల్-అకాబా ఒప్పందానికి హాజరయ్యారు. ప్రవక్త (స) మదీనాకు వలస వచ్చినప్పుడు ప్రవక్త(స)కు మద్దతు ఇస్తానని వాగ్దానం చేసిన మొదటి మహిళ నుసైబా బింత్‌కాబ్. ఉహుద్ యుద్ధంలో గాయపడిన వ్యక్తులకు నుసైబా బింత్‌కాబ్ సహాయం చేసింది మరియు పోరాటంలో ప్రవక్త (స)ని సమర్థించింది, ఉహుద్ యుద్దంలో ప్రవక్త(స)రక్షించడానికి నుసైబా బింత్‌కాబ్ పోరాడినది.
నుసైబా బింత్‌కాబ్ యుద్ధo లో గాయపడిన వారికి చికిత్స చేసేది. నుసైబా బింత్‌కాబ్ బలమైన పోరాట యోధురాలు మరియు మొసైలిమా తో జరిగిన యుద్ధంలో(మొదటి ఖలీఫా - అబూ బకర్ కాలంలో) పాల్గొoది మరియు నుసైబా బింత్‌కాబ్ చేయి తీవ్రంగా గాయపడి కత్తిరించబడిందని amputated తెలుస్తున్నది. మదీనాకు తిరిగి వెళ్ళినప్పుడు నుసైబా బింత్‌కాబ్ స్వయంగా చికిత్స పొందింది.
5. ఓం సినాన్ అల్-ఇస్లామియా Om Sinan Al-Islamiyyah:
యుద్ధభూమిలోకి వెళ్లి గాయపడిన సైనికులకు
సహాయం చేయడానికి మరియు దాహంతో ఉన్నవారికి నీరు అందించడానికి ప్రవక్త (స) అనుమతి
కోరిన సహచరులలో ఓం సినాన్ ఒకరు.ఓం సినాన్ అల్-ఇస్లామియా ఖైబర్ యుద్ధంలో ప్రవక్త (స) తో కలిసి
గాయపడిన సహచరులకు చికిత్స చేయడంలో సహాయం చేసింది.
6. ఓం వార్కా బిన్త్ అబ్దుల్లా ఇబ్న్ అల్-హరిత్ అల్-అన్సరియా Om Warqah bint Abdullah ibn Al-Harith Al-Ansariyyah:
ఓం వార్ఖా క్షతగాత్రులకు వైద్య సహాయం చేసేది. ఓం వార్ఖా ఖురాన్‌ను సంకలనం చేయడంలో కూడా పాల్గొంది మరియు ప్రవక్త (స) అనుమతి తీసుకున్న తర్వాత ఓం వార్ఖా తన ఇంటిని చిన్న మసీదుగా మార్చుకుంది. ప్రవక్త (స) తన సహచరులతో ఓం వార్ఖా ను సజీవ అమరవీరుడని పిలిచేవారు. ఓం వార్ఖా ఖలీఫా ఒమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ కాలంలో తన సేవకుడిచే చంపబడింది.
7. అల్-రోబీ బింట్ మోవాజ్ Al-Robee’e bint Mo’awaz:
అల్-రోబీ ప్రవక్త (స) కాలంలో జీవించారు.
ప్రవక్త (స) వూదు wudu’e ను చేసిన విధానం గురించి కొన్ని హదీసులను
సేకరించిన వ్యక్తులలో అల్-రోబీ కూడా ఒకరు. హిజ్రా 6వ సంవత్సరంలో బయాత్ అల్-రిద్వాన్‌కు
హాజరైన సహచరులలో అల్-రోబీ ఒకరు. గాయపడిన సహచరులకు చికిత్స చేయడంలో అల్-రోబీ Al-Robee'e సహాయం
చేసింది. అల్-రోబీ మోవియా Mo’awiyah (సంవత్సరం 665 CE) సమయంలో మరణించింది.
ప్రవక్త (స) కాలంలో, ముస్లిం సైన్యంలోని గాయపడిన యోధుల గాయలకు డ్రెసింగ్‌లు, నొప్పి నివారణకు మూలికలను అందించడం ద్వారా ఎక్కువ మంది మహిళా సహచరులు సహాయం చేశారు.
వారిలో కొందరు:
8. ఓం హకం అల్-మఖ్జూమియా Om Hakam
Al-Makhzoomiyyah,
9. ఓం
మూసా ఇబ్న్ నుసైర్Om Musa ibn Nusair,
10. సఫియా
బిన్త్ అల్-ఖత్తాబ్ Safiyyah bint Al-Khattab.
11. ఆయిషా, ప్రవక్త (స)భార్య Aisha (the prophet’s wife),,
12. ఓం ఐమాన్ (బరాకా బింట్ థాలబా) Om Salim (Anas ibn Malik’s mother)
13. ఓం సలీం (అనాస్ ఇబ్న్ మాలిక్ తల్లి) Om Salim (Anas ibn Malik’s mother)
14. ఒమయ్య బిన్త్ కైస్ అల్-గఫారియా Omayyah bint Qais Al-Ghafariyyah.
15. లైలా అల్-గఫారియహ్ Layla Al-Ghafariyyah.
16. మోజహ్ అల్-గఫారియా Mo’azah Al-Ghafariyyah.
17. ఓం అల్-ఓలా అల్-అన్సరియ Om Al-Ola Al-Ansariyyah.
18. సల్మా (ఓం రఫే Salma (Om Rafe’e):
సల్మా తన భర్తతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరియు అతని ఇంటిని కూడా చూసుకునేవారు. ఆమె మక్కాలో ప్రసవించే సమయంలో ఖదీజా (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య)కు సహాయం చేసింది.
19. హిమ్నా బిన్త్ జహాష్ (జైనాబ్ సోదరి -
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య):
దాహంతో ఉన్నవారికి నీటిని తీసుకురావడం, క్షతగాత్రులను సురక్షితంగా తరలించడం మరియు అవసరమైన చికిత్స అందించడం ద్వారా హిమ్నా ఉహద్ యుద్ధంలో పాల్గొంది
20. జైనబ్ బింట్ అలీ Zaynab bint Ali::
జైనబ్ ప్రవక్త (స) మనవరాలు. జైనబ్ ధైర్యసాహసాలకు
మరియు యుద్ధభూమిలో నైపుణ్యాలకు, గాయాలను నయం చేయడానికి ప్రసిద్ధి
చెందింది. ఇరాన్‌లో జైనాబ్ చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం
నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. చారిత్రాత్మకంగా, జైనాబ్ తన సోదరుడు హుస్సేన్‌తో కలిసి
కుఫాహ్‌కు వెళ్లాడు, అక్కడ హుస్సేన్ ఉమయ్యద్
ఖలీఫ్‌ను సవాలు చేశాడు మరియు 680లో కర్బలా యుద్ధంలో ఓడిపోయాడు. జైనాబ్ కర్బలా యుద్ధంలో బంధించబడింది మరియు యాజిద్
మరియు మువావియా ముందు నిలబడి, జైనాబ్ తనను మరియు ఇతర ఖైదీలను విడుదల చేయమని ఉద్వేగభరితమైన
ప్రసంగం లో ఆదేశించినది.
ఉమయ్యాద్ కాలంలో కొంతమంది మహిళా వైద్యులు ఉన్నారు:
21. బనీ అవ్ద్‌కు చెందిన జైనాబ్ Zainab from baniAwd: కంటి రోగాలకు చికిత్స చేయడంలో మరియు శస్త్రచికిత్స కు
ప్రసిద్ధి చెందింది. అబో అల్-ఫరాజ్ అల్-అస్ఫహానీ తన పుస్తకంలో (అల్-అఘాని) జైనాబ్ ను
పేర్కొన్నాడు.
22. ఫరీదా అల్-కుబ్రా Faridah Al-Kubra, ఈమె అల్-హిజాజ్ నుండి సిరియాకు
వెళ్లింది.
23. ఖర్కా అల్-అమిరియా Kharqa’a Al-Amiriyyah, ఈమె అల్-హిజాజ్‌లో నివసించింది మరియు
వైద్య సాధన చేసింది.
24. ఉమయ్యద్ కాలంలో అల్-హిజాజ్ నుండి సలామా
అల్-కిస్ Salamah Al-Qiss సిరియాలో నివసించడానికి వెళ్ళినది.
25. హోబాబా Hobabah:
ఈమె ఇరాక్‌లోని అల్-బస్రాహ్‌లో నివసించింది మరియు సాధన చేసింది (క్రీ.శ. 723లో
మరణించింది).
అబ్బాసిడ్ కాలంలో కొంతమంది మహిళా వైద్యులు ఉన్నారు:
26. తొమ్మిదవ శతాబ్దంలో వైద్య సాధన చేసి 838 CEలో
మరణించిన మోటయం అల్-హమిషియా Motayam
Al-Hamishiyyah.
27. రోహాస్ Rohass, బాగ్దాద్‌లో నివసించి 859సంవత్సరంలో మరణించినది.
28.మహబోబా Mahbobah, అబ్బాసిద్ కాలిఫేట్, ఇరాక్, (క్రీ.శ. 861లో మరణించినది.).
29. టోలోనియా రాజ్యం- ఈజిప్టులో నివసించిన ఓం
అస్య Om Asyah (మంత్రసాని)
అండలస్ (ఆధునిక స్పెయిన్)లో ముస్లిం పాలన
సమయంలో మెడిసిన్ ప్రాక్టిస్ చేసిన కొంతమంది మహిళలు:
30. అల్-హఫీద్ ఇబ్న్ జోర్ సోదరి The sister of Al-Hafid ibn Zohr: ఇబ్న్ జోర్ ఇద్దరు కుమార్తెలు మరియు సోదరి ప్రసూతి శాస్త్రం మరియు మంత్రసాని obstetrics and midwifery తో పాటు అనారోగ్యంతో ఉన్న పిల్లలకు చికిత్స చేసేవారు. (ఇబ్న్ జోర్ ఇద్దరు కుమార్తెలు అల్-అండలస్‌లోని పాలకుడు అల్-మన్సూర్ అతని భార్య అతని భార్య యొక్క ప్రైవేట్ వైద్యులు.) అల్-అండలస్ (ఇష్బిల్యా - సెవిల్లె)లో ఇబ్న్ జోర్ కుటుంబంలో ఐదు తరాలకు పైగా వైద్యులు ఉన్నారు.
31. అల్-జహ్రావి యొక్క కుమార్తెలు The daughters of Al-Zahrawi: అల్-జహ్రావి యొక్క కుమార్తెలు తమ తండ్రిచే బోధించబడిన తర్వాత మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రసిద్ధి చెందారు. అల్-జహ్రావి మెడిసిన్‌లో “అల్-తస్రిఫ్” అనే ఎన్‌సైక్లోపీడియాను వ్రాసారు మరియు అల్-తస్రిఫ్ 30వ సంపుటంలో మంత్రసాని మరియు ప్రసూతి శాస్త్రం, శస్త్రచికిత్స గురించి వివరంగా చర్చించడానికి 10 అధ్యాయాలను కేటాయించాడు.
32. ఓం అల్-హసన్ బింట్ అల్-ఖాదీ అల్-తంజలీ Om Al-Hasan bint Al-Qadi Al-Tanjaly: 14వ శతాబ్దంలో అల్-అండలస్‌లో నివసించిన మరియు వైద్య సాధనలో మరియు బోధించడంలో ప్రసిద్ధి చెందారు. ఓం అల్-హసన్ బింట్ అల్-ఖాదీ పుస్తకాలు రాయడానికి ఆసక్తి చూపలేదు. ఓం అల్-హసన్ బింట్ అల్-ఖాదీ గొప్ప పండితురాలు మరియు ఖురాన్ యొక్క తాజ్వీద్ బోధించింది.
డమాస్కస్ (సిరియా)లోని ఇస్లామిక్ మహిళా వైద్యులు:
33. బింట్ దోన్ అల్-లౌజ్ Bint Dohn Al-Louz (ఈమెను దోన్ అల్-లౌజ్ అని కూడా పిలుస్తారు): బింట్ దోన్ అల్-లౌజ్ చాలా నైపుణ్యం కలిగిన మహిళ, బింట్ దోన్ అల్-లౌజ్ డమాస్కస్‌లోని ఇస్లామిక్ పండితులలో ఒకరు. బింట్ దోన్ అల్-లౌజ్ ఆమె 1216 లో మరణించింది.
17వ శతాబ్దంలో ఈజిప్టులో ఇస్లామిక్
మహిళా వైద్యులు:
34. బింతె షిహాబ్ అల్-దీన్ ఇబ్న్ అల్-సాఘ్ Bint Shihab Al-deen ibn Al-Sa'egh: బింతె షిహాబ్ అల్-దీన్ తన తండ్రి 1627లో మరణించిన తర్వాత మెడిసిన్‌ను
అభ్యసించింది. బింతె షిహాబ్ అల్-దీన్ కైరో (ఈజిప్ట్)లోని అల్-మన్సౌరీ బిమర్‌స్తాన్ లో
వైద్యుల చీఫ్ అయింది. ఆహోదాలో ఈజిప్ట్ లోని
అల్-మన్సౌరీ బిమర్‌స్తాన్ యొక్క నియంత్రణ
బింతె షిహాబ్ అల్-దీన్ చేసింది.
35. 15వ శతాబ్దపు టర్కీలో మహిళా సర్జన్లు Women surgeons in 15th-century Turkey:
15వ శతాబ్దంలో ఒక టర్కిష్ సర్జన్, సెరెఫెడిన్ సబున్‌కుగ్లు Serefeddin Sabuncuoglu (1385-1468), రచించిన సర్జరీకి సంబంధించిన ప్రసిద్ధ మాన్యువల్ “సెరాహియెతుల్-హనియే Cerrahiyyetu’l-Haniyye”” లో మహిళా రోగుల ప్రసూతి మరియు గైనాకాలజి obstetric and gynaecologic వివరాలను వివరించడంoo లేదా స్త్రీరోగాలకు చికిత్స విధానాలు వివరించినాడు. సెరెఫెడిన్ సబున్‌కుగ్లు మహిళా సర్జన్లతో కూడా కలసి పనిచేశాడు.
15వ శతాబ్దం లో అనటోలియాలోని మహిళా శస్త్రవైద్యులు సాధారణంగా స్త్రీల గైనాలోజికల్ సమస్యలను చికిత్స చేసేవారు. సెరెఫెడిన్ సబున్‌కుగ్లు గ్రంధం “సెరాహియెతుల్-హనియే Cerrahiyyetu'l-Haniyye”లో, మహిళా సర్జన్ల శస్త్రచికిత్స వివరాలు నమోదు చేయడం జరిగింది. మహిళా సర్జన్లు పీడియాట్రిక్ న్యూరో సర్జికల్ వ్యాధులు పిండం హైడ్రోసెఫాలస్ మరియు మాక్రోసెఫాలస్ వంటి వాటికి చికిత్స చేసేవారు. సెరెఫెడిన్ సబున్‌కుగ్లు యొక్క గ్రంథంలో, సంక్లిష్టమైన శస్త్రచికిత్స రంగంలో మహిళా అభ్యాసకుల పాత్రను వివరించడం జరిగింది.
ముగింపుConclusion:
గ్రీకు యుగంలో మరియు హిప్పోక్రేట్స్ తర్వాత పురుష వైద్యులు మాత్రమే వైద్యాన్ని అభ్యసించేవారు కాబట్టి మహిళా వైద్యుల వివరాలు పెద్దగా నమోదు చేయబడలేదు.
ఇస్లాం యొక్క ప్రారంభ దశ నుండి ముస్లిం మహిళా ఆరోగ్య ప్రదాతలు,
వైద్యం
యొక్క వివిధ అంశాలలో పాల్గొన్నారు. కాని దురదృష్టవశాత్తు వారు తక్కువగా
నివేదించబడ్డారు. ఇబ్న్ అబీ ఉసైబియా తన పుస్తకంలో ఒక మహిళా వైద్యురాలు గురించి మాత్రమే పేర్కొన్నాడు.
ముస్లిం మహిళలు శాస్త్రీయ రంగంలో గొప్ప ప్రభావాన్ని చూపారు మరియు వారి సహకారాన్ని అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం
ముస్లిం మహిళలు ఉపన్యాసాలకు హాజరు కావడమే కాకుండా వారి మగ సహచరులకు బోధించడానికి కూడా సహకరించారు. దురదృష్టవశాత్తు, వారి గురించి వ్రాయబడినవి చాలా తక్కువగా ఉండటమే వారి కృషి వెలుగులోకి రాకపోవడానికి కారణం మరియు వ్రాయబడినది ప్రధానంగా అరబిక్‌లో ఉంది. ముస్లిం మహిళలు మగవారిలా కాకుండా, పుస్తకాలు లేదా వ్యాసాలు వ్రాయలేదు. అల్-అండలస్‌లో నివసించిన గౌరవనీయులైన మహిళా ముస్లిం వైద్యుల్లో ఒకరైన ఓమ్ అల్-హసన్ బింట్ అల్-ఖాదీ అల్-తంజలీ తన అనుభవాన్ని పుస్తకాలలో రాయడానికి ఇష్టపడలేదు మరియు ఆమె అరబిక్‌లో ఒక కవిత ప్రస్తావించింది.:"రచయితలు వ్రాస్తారు, మరియు చేసేవారు చేస్తారు".ముస్లిం మహిళా వైద్యులు తమ కృషి లో నిమగ్నమై ఉండడం వల్ల రాయడానికి సమయం ఉండదు.
1849లో
యుఎస్ నుండి వచ్చిన తర్వాత 1858లో
ఎలిజబెత్ బ్లాక్‌వెల్ ఇంగ్లండ్‌లో నమోదైన మొదటి మహిళా వైద్యురాలు అని
గుర్తుంచుకోవాలి.
ఇస్లాంలో మహిళా ముస్లిం వైద్యుల గొప్ప చరిత్ర ఉందని, ఇది పాశ్చాత్య దేశాలకు భిన్నంగా శతాబ్దాల తరబడి కొనసాగుతుందని స్పష్టమైంది. ఇస్లాంలో మహిళా ముస్లిం వైద్యుల పరిశోధనల నుండి చాలా నేర్చుకోవచ్చు, కానీ వారి సహకారాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అభినందించడానికి మరింత జ్ఞానం అవసరం.
No comments:
Post a Comment