6 October 2022

ఇస్లాం లో కమ్యూనిజం/సామ్యవాదం/సంక్షేమ భావనలు.

 


 ఆధునిక కాలం లో అంత్యంత ప్రజాదరణ పొందిన వాదాలలో కమ్యూనిజం లేక శాస్త్రీయ  సామ్య వాదం ముఖ్యమైనది. కమ్యూనిజం ను ప్రవచించినవారు కారల్ మార్క్స్ మరియు ఎంగెల్స్. వీరు 1848 లో  తాము రచించిన కమ్యూనిస్ట్ మ్యానిప్యాస్టో లో కమ్యూనిజం మూల  సూత్రాలను వివరించినారు. కమ్యూనిజం స్థాపించబడిన 50 సం. లలోనే ప్రపంచంలోని అన్నీ దేశాలలో విస్తరించినది. అయితే కమ్యూనిజం 1990 తరువాత పతనమైనది. కమ్యూనిజం మూలసూత్రాలను స్థూలంగా  పరిశీలించిన మిగులు విలువ లేదా లాభాలను పెట్టుబడిదారులు ఒక్కరే  అనుభవించుటను వ్యతిరేకించుట, వర్గరహిత సమాజం, సంపద వికేంద్రీకరణ, అందరికీ సమాన అవకాశాలు, అందరికీ పని హక్కు, మొదలగు అంశాలు కనిపించుతాయి.


 పైన వివరించిన సూత్రాలను నిశితంగా పరిశీలించిన మనకు కమ్యూనిజం కొత్తది ఏమి కాదని, పైన వివరించిన సూత్రాలు మనకు  1500 సం.పూర్వమే  అవతరించిన  దివ్యకొరాన్ లో కనిపించునని తెలియును.కమ్యూనిజం మూల సూత్రాలను  మార్క్స్ కన్నా ముందే ప్రవక్త మహమ్మద్(స.ఆ.స.) ప్రవచించేను.


 ఏవిధంగా మార్క్స్ కమ్యూనిజం సంపదనను పెట్టుబడిదారులనుంచి, కార్మికులకు పంచమని చెబుతుందో,అదేవిధం గా ఐదు ఇస్లామిక్ మూలసూత్రాలలో ఒకటైన  జకాత్ ప్రతి ముస్లిం తన సంపందను జకాత్ రూపం లో సామాన్యులకు, పేదవారికి పంచమని  దివ్య కొరాన్ లో చెబుతుంది. అది ప్రతి ముస్లిం వీధి అని చెబుతుంధి.

 

 దివ్యకొరాన్ ప్రవక్త మహమ్మద్(స.ఆ.స.) నోట అల్లాహ్ చే అవతరింపబడిన గ్రంధం. దివ్య కొరాన్ దైవ వాణి. అంతిమ గ్రంధం అయిన  దివ్య కొరాన్ లో మానవ జీవితం లోని అన్నీ ఆంశాలకు సమాధానం లబించును..దివ్య కొరాన్ మనవాళికి సంపూర్ణ విజ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని  అంధించే గ్రంథం. దివ్య కొరాన్  మానవ జీవితం లోని అన్నింటికీ సమాధానాలు చెప్పే,భోదించే,మార్గదర్శకం చూపే దేవుని చేత అవతరింప బడిన సమగ్ర గ్రంధం అని చెప్పవచ్చును. కొరాన్ అద్యయనం చేసిన అది ఒక మత గ్రంధం కాదని అది  మానవుని సంపూర్ణ జీవన విధానం వివరించే గ్రంధం అని చెప్పవచ్చును.

 

 ఇస్లాం ను ప్రపంచజనాభా లో    దాదాపు 23%మంది జనాబా, లేదా ప్రపంచవ్యాప్తం గా  160 కోట్ల మంధి  ప్రజలు అనుసరిస్తున్నారు. ఇస్లాం ఒక మతమే కాదు, అది  ఒక జీవన విధానం అని చెప్పవచ్చును.

 

 ఇస్లాం మతం యొక్క మూల విశ్వాసాలు ఐదు. అవి

1. షహాదహ్: ఒకేదేవుని అందు విశ్వసముంచుట మరియు అతని అంతిమ ప్రవక్తాయిన మహమ్మద్ ప్రవక్త (స.ఆ.స.)అందు నమ్మక ముంచుట.

2. సలాత్ :రోజుకు 5 సార్లు ప్రార్ధన (నమాజ్) చేయుట

3. సామ్: రమదాన్ నెలలో ఉపావాసముండుట

4.జకాత్: పేదలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయుట

5. హజ్: జీవితంలో ఒక్క సరియైన మక్కా యాత్ర చేయుట.

 

 పైన వివరించిన ఇస్లాం మూల సూత్రాలను పరిశీలించిన అందులో జకాత్ ముఖ్యమైనది. ఇది సమాజం లో ఆర్థిక వికాసానికి తోడ్పడును. జకాత్ ప్రకారం ప్రతి విశ్వాసి తను సంపాదించిన ధనములో కొంత భాగాన్ని  పేదలకు, అభాగ్యులకు, అవసరము ఉన్న  వారికి దానము చేయవలసిఉంటుంది. ఇది ప్రతి ముస్లిం నెరవేర్చవలసిన తప్పనిసరి విధి. జకాత్ సమాజం లో సమతౌల్యత,అబివృద్ధి సాదించుటకు తోడ్పడును. మనకు సంబంధించినవన్ని భగవంతుని కృప అన్న భావన మనలో శుద్ధిని,అబివృద్ధిని పెంచును. జకాత్ ఇతరుల ఆర్థిక కష్టాలను తొలగించి అసమానతలను తొలగించుటకు తోడ్పడును. ఒక విశ్వాసి సదాకా రూపంలో ఇంకా ఎక్కువకూడా దానం చేయవచ్చును.

 

 ఇస్లాం మూలవిశ్వాసాలలో ఒకటైన జకాత్కొరాన్,హదీసులలో చర్చించబడినది. హదీసులు అనగా ప్రవక్త చే ఆచరింపబడివని మరియు ప్రవక్త ఆదేశాలు అని చెప్పవచ్చును.

 

 కొరాన్ లో జకాత్ప్రస్తావన 30 సార్లుకు పైగా ముఖ్యంగా మదీనా సురాలలో కనిపించును. జకాత్ పేదల సంక్షేమం కోసం  ఆదాయాన్ని పునః పంపిణిచేసే మార్గము. ప్రతివారు తమ ముక్తికి ఉపకరించే సాదనం గా జకాత్ ను  భావించాలి. ప్రతివారి ఆత్మ మరియు సంపదను పునీతము  చేసేది జకాత్. అల్లాహ్ కు మానవునికి మద్య వారధి జకాత్.  జకాత్ ను ప్రవక్త మహమ్మద్ (స.ఆ.స.) ప్రోత్సహించేను.

 

 హదీసులలో జకాత్ ప్రస్తావన కలదు. జకాత్ చెల్లించనివారు కపటులు మరియు వారి ప్రార్ధనలను భగవంతుడు ఆలకించడు అని హదీసులలో ఉంది.. పేదల ఆకలి తీర్చటానికి జకాత్ తోడ్పడును. జకాత్ ఇవ్వటం వ్యక్తుల ప్రయోజనాలను అల్లాహ్ కాపాడును మరియు వారి హృదయ పరిశుద్దతకు తోడ్పడును. అంతిమ దినాన జకాత్ ఇవ్వని వారు తమ చర్యలకు ప్రశ్నించబడేదరు మరియు శిక్షింపబడేదరు.

 

 మానవ సామాజిక జీవనానికి సంబంధించిన అన్నీ రంగాలలో అత్యున్నత తాత్విక నిర్దేశాలను మహమ్మద్ నబీ రూపొందించాడు. కొన్ని వందల సం.ల క్రిందటే ఆర్థిక రంగానికి సంబంధించిన అరుదైన, విలువైన భావాలు(జకాత్) వెల్లడించాడు. ఆర్థిక రంగంలో మహమ్మద్ నబీ ప్రవచించిన సూక్తులు అద్భుతమైనవి. మహమ్మద్ నబీ ప్రవచించిన ఈ సూత్రాలను,విషయాలను మనమంతా గ్రహించి  వాటిని అనుసరించాలి అని పెరియార్ కూడా అన్నాడు.

 

 కమ్యూనిజం సంపద కేంద్రీకరణను నిరసించి సంపద అందరి పరము అనగా సమాజపరము   చేయాలంటుంది. ఇస్లాం కూడా సంపద కేంద్రీకరణను వ్యతిరేకించును. సంపద కూడబెట్టటంను నిరసించును. ప్రతివిశ్వాసి సంపదను దేవుడు ఇచ్చిన వరంగా భావించి దానిని దేవుని మార్గంలో అనగా పెదసాదలకు పంచాలని (జకాత్ రూపంలో) అది విశ్వాసి యొక్క విధి అని అంటుంది.. ఇస్లాం ప్రకారం సంపద అనునది అల్లాహ్ చే ప్రజలకు ఇవ్వబడిన ట్రస్ట్ గా భావించాలి. ఆర్థిక అబివృది ఇస్లాం యొక్క  అంతిమ లక్ష్యం కాదు.పరలోక సంక్షేమానికి ఆర్థికాబివృద్దిని ఉపయోగించుకోవాలి. విశ్వాసి జకాత్, సదాకా ల ద్వారా పేదల సంక్షేమానికి తద్వారా ఆర్ధిక సమానత్వ సాధనకు తోడ్పడాలి.

 

 ఒకహదీసు ప్రకారం మన పొరుగు వాడు ఆకలిగా ఉన్నపుడు, మనం నిండుగా భోజనం చేయటం నేరం. అదే విదంగా మనం, మనకు ఏది కోరుకొంటామో అదే మన సోదరునికి కూడా లబించాలని కోరుకోవాలి.

 

 కమ్యూనిజం పేద-ధనికుల మద్య తేడాను రూపుమాపి సమ సమాజం లేదా వర్గ రహిత సమాజం కోరుకొనును. అదేవిదంగా ఇస్లాం మానవ సమానత్వం నందు అధిక విశ్వాసముంచి, సోదర భావమును పెంచును. ప్రవక్త(స.ఆ.స.) తన అంతిమ ప్రసంగంలో ప్రపంచంలోని మానవులండరు సమానులే అని, పేద-ధనిక,రంగు,జాతి, బాష భేదములు లేవు అని పలికిరి. నవీన హిందూ సిద్దాంత కర్త స్వామి వివేకానంద కూడా ఇలా అన్నారు: వాస్తవికంగా నిత్య జీవన విధానంలో ఏమాత్రం ప్రశంసనీయమైన స్థాయిలో నైనా సమానాత్వాన్ని, ఏ మతమైన పాటిస్తుదంటే అది ఇస్లాం ...... కేవలం ఇస్లాం మాత్రమే”(బి.ఎన్. గంగూలీ 1975 పేజ్ న.120)

.

 కమ్యూనిజం కార్మికుల శ్రమను దోపిడి చేయడం, సరియైన పని కి తగిన వేతనం ఇవ్వక పోవడాన్ని వ్యతిరేకించును.అదేవిధంగా వారిపై ఆదిక భారం మోపరాదు అని అభిప్రాయపడేను.

 

 ఇస్లాం కార్మిక శ్రమకు సరియైన గుర్తింపు ఇస్తుంది. ప్రవక్త మహమ్మద్ (స.ఆ.స.)కార్మికుని చెమట ఆరకముందే అతనికి వేతనం చెల్లించమని కోరినారు. అదేవిధంగా శ్రమకు తగిన సరియైన ప్రతిఫలం కార్మికునికి చెల్లించవలసి ఉంటుంది అన్నరూ. ఇస్లాం శ్రామిక గౌరవానికి (dignity of Labor) అత్యాదిక స్థానం ఇచ్చింది. ప్రవక్త దృష్ఠి లో యాచన కన్న, శ్రమ చేసి జీవించటం మిన్న.అదేవిధంగా ఎవరిమీద వారి శక్తి కి మించిన భారం మోపరాదు.  శక్తికి మించిన భారం ఎవరిమీదా మోపకూడదు”. – దివ్యఏ కొరాన్  2;233. ఈ విధంగా ప్రవక్త(స) శ్రామికునికి అతని శక్తికి ప్రాధాన్యతను ఇచ్చేను.

 

 సామ్యవాదం లేదా సోషలిజం మార్పును క్రమంగా లేదా పరిణామంగా రావాలని కోరును.ఆర్థిక కేంద్రీకరణ స్థానం లో వికేంద్రీకరణకు స్థానం ఇస్తుంది. ప్రజాస్వామ్య భావాలను ప్రోత్సహిస్తుంది.

 

 ఇస్లామిక్ సామ్యవాదం ను ఇస్లామిక్ చరిత్ర కారులు ఆద్యాత్మిక రూపంలో వాడారు. వారి అబిప్రాయం ప్రకారం మహమ్మద్ ప్రవక్త హదీసులు, దివ్య కొరాన్ భోధనలు ప్రత్యేకించి జకాత్ పై వివరణలు సాంఘిక,ఆర్థిక సమానత్వ సాధనకు తోడ్పడును. ఈ విషయం లో వారికి  ప్రవక్త మదీనా లో స్థాపించిన ఆదర్శ రాజ్యం ఆదర్శమైనది.ముస్లిం సామ్యవాదులు ప్రజస్వామ్యం నందు విశ్వాసముంచి నియామకం కన్నా ఎన్నికకే అధిక ప్రాధాన్యమిచిరి. ప్రవక్త మహమ్మద్(స.ఆ.స.) యొక్క సహచరుడు అయిన అబు ధార్-అల్-ఘిఫారి ఇస్లామిక్ సామ్యవాద ప్రముఖుడు. ఖలీఫా ఉస్మాన్ కాలం లో పాలక వర్గం చేతిలో సంపద కేంద్రీకరణను వ్యతిరేకించి వెంటనే దానిని అందరికీ పంచమని కోరినాడు.

 

 ఇక సంక్షేమ భావనకు వస్తే ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలు. సంక్షేమ రాజ్యాలు ప్రజలకు కావలసిన అన్నీ రకాల సేవలను అందించును. పుట్టుక నుంచి మరణం వరకు వ్యక్తి కి కావలసిన అన్నీ రకాల సేవలను అంధించును.

 

 ఇస్లాం కూడా సంక్షేమ రాజ్య భావనకు  మొదటినుంచి ప్రాధాన్యత ఇచ్చింది. ఇస్లామిక్ రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యలే. అందుకు సరియైన ఉదాహరణ తొలి దినాలలో ప్రవక్త మదీనాలో స్థాపించిన ఇస్లామిక్ సమాజమే.పోరాటాల ద్వారా లబించిన ధనం, సంపద (బైతుల్ మాల్ ) వెనువెంటనే  అందరికీ సమానంగా  పంచబడేది. క్షతగాత్రుల బాగోగులు విచారించబడేవి.స్త్రీలు, బాలలు,అనాదలు, వృద్ధుల, పెదలు,వికలాంగుల ప్రయోజనాలు జకాత్, జిజ్యా ద్వారా లబించిన సంపదతో పరిరక్షించబడేవి. పింఛనులు  పంచబడేవి .ప్రకృతి వైపరీత్యాలు,క్షామాలు ఎదుర్కొనటానికి ఆహార నిల్వలు ఉండేవి. ఇస్లామిక్ రాజ్యాలు చరిత్రలో మొట్ట  మొదటి సంక్షేమ రాజ్యాలు.

 

 ఆధునిక కాలంలో ప్రపంచీకరణ,సరళీకరణ,ప్రవేటీకరణ నేపద్యంలో ఆర్ధిక సంస్కరణలు ప్రాముఖ్యతను చోటు చేసుకొన్నాయి. అబివృద్ధి కి పర్యాయపదంగా చెప్పుకొనే పశ్చిమ దేశాలు బ్యాంకింగ్ రంగంలో దెబ్బతిని వారి ఆర్థిక వ్యవస్థ పతనంచెంది ఆర్ధిక మాంద్యం అంచులలోనికి చేరుకోన్నాయి.

 

  అన్నీ దేశాలు, ఆర్ధిక మాంద్యం లో ఉన్న కాలంలో కూడా పటిష్టం గా ఉన్న ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానం పట్ల ఆసక్తి చూప సాగాయి. ఇస్లాం మత  సూత్రాల ప్రకారం వడ్డీ (రిబా) విధించడం, చెల్లించడం నిషేధం. 1200 సంవత్సరాల క్రితం బాగ్దాద్‌, డెమస్కస్‌, ఫెజ్‌ మరియు కోర్డోబాలలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు జరిగిన ఆధారాలు ఉన్నాయి షరియా సూత్రాలపై ఆధారపడి లాభ, నష్టాలు పంచుకొనే విధానం (ప్రాఫిట్ అండ్ లాస్  షేరింగ్) పై ఆధారపడి పనిచేసే బ్యాంకింగ్ వ్యవస్థను ఇస్లామిక్ బ్యాంకింగ్ గా పేర్కొనవచ్చును. షరియత్ చట్టాలను గౌరవిస్తూ, ఆ సూత్రాలకు అనుగుణంగా నడుచుకునే బ్యాంకులను ఇస్లామిక్ బ్యాంకులు అనవచ్చును.మన దేశం లో కూడా ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశ పెట్టాలని బారత ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

No comments:

Post a Comment