23 October 2022

మరియం బిన్ లాడెన్ సౌదీ నుండి ఈజిప్టుకు ఈత కొట్టిన మొదటి అరబ్ మహిళ Mariam bin Laden becomes 1st Arab woman to swim from Saudi to Egypt

 

రియాద్‌: సౌదీ స్విమ్మర్‌, డాక్టర్‌ మరియం సలేహ్‌ బిన్‌ లాడెన్‌ సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రంలోని  తిరాన్‌ జలసంధి మీదుగా స్విమ్ చేస్తూ ఈజిప్ట్‌ తీరానికి చేరుకుని ఈ ఘనత సాధించిన తొలి అరబ్‌, సౌదీ మహిళగా రికార్డు సృష్టించింది.

స్విమ్మర్ మరియం బిన్ లాడెన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఎర్ర సముద్రం మీదుగా ఈజిప్టుకు తన స్విమ్మింగ్ కు సంబంధించిన వివిధ చిత్రాలను ప్రచురించింది.

సౌదీ అరేబియా  నుండి ఈజిప్టుకు ఈదుతున్న మొదటి సౌదీ మరియు అరబ్ మహిళగా మరియం ఇది తాను ఊహించని కల అని  తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సొరచేపలు వంటి ప్రమాదాలను ఎదుర్కొంటూ,   రక్షిత పంజరం లేకుండా స్విమ్ చేస్తూ మరియం తన కలను సాధించినది.  

ఈజిప్ట్ చేరుకోవడానికి తిరాన్ జలసంధిని దాటడానికి స్విమింగ్ లో తనతో పాటు వచ్చిన మరొక అంతర్జాతీయ స్విమ్మర్ 'లూయిస్ బ్యూ'కి మరియం కృతజ్ఞతలు తెలిపారు.

మరియమ్ యొక్క స్విమ్మింగ్ వీడియోను అనేక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు షేర్ చేసుకొన్నాయి  సౌదీ నుండి ఈజిప్టుకు ఈత కొట్టడం ఒక కల మరియు కలలు నిజమవుతాయి. అని టిట్వర్ లో అనేకులు మరియం ను అభినందించారు.

గతం లో స్విమ్మర్ మరియం బిన్ లాడెన్ విజయాలు:

32 ఏళ్ల సౌదీ స్విమ్మర్ మరియం గతంలో 2017లో 24 కిలోమీటర్ల పొడుగైన దుబాయ్ వాటర్ కెనాల్‌ ఈది రికార్డు సృష్టించినది.

  సిరియన్ సంక్షోభం పై అవగాహన పెంచే ప్రయత్నంలో భాగం గా  మరియం 2016లో 11 గంటల 41 నిమిషాల సమయంలో మొత్తం ఇంగ్లీష్ ఛానల్‌ను వ్యక్తిగతంగా స్విమ్ చేయటం లో విజయం సాధించి, రికార్డును సాధించింది.

  జూన్ 2016లో 10 రోజుల్లో ఇంగ్లాండ్‌లోని థేమ్స్ నది యొక్క 162 కి.మీ పొడవును స్విమ్ చేసిన మొదటి మహిళ కూడా మరియం.

 2015లో, యూరప్ నుండి ఆసియా వరకు టర్కీలో ఉన్న 4.5 కి.మీ హెలెస్‌పాంట్ స్విమ్ పూర్తి చేసిన మొదటి అరబ్ మహిళగా మరియం గుర్తింపు పొందింది.

No comments:

Post a Comment