21 October 2022

ఇస్లాంను అమెరికాకు తీసుకువచ్చిన ప్రముఖ ఆఫ్రికన్ ముస్లింలు Famous African Muslims Who Brought Islam To America

 


ఇస్లాం మొదటి  నుండి ఆఫ్రికాలో మరియు అమెరికా లో అనుసరించబడుతూనే ఉంది. అమెరికా జనాభా గణనలో అమెరికా స్వాతంత్ర్యం కోసం అంతర్యుద్ధం సమయంలో పోరాడిన ముస్లిం ఇంటిపేరు ఉన్న సుమారు 300 మంది బానిసల రికార్డు ఉంది.

ఇస్లాం పశ్చిమ ఆఫ్రికాకు 10వ శతాబ్దం తర్వాత వచ్చింది. ఇస్లాం ప్రచారం అరబ్ వ్యాపారుల ద్వారా జరిగింది.  ఒట్టోమన్ సామ్రాజ్య కాలం లో మోరిస్కోస్ మరియు అట్లాంటిక్ బానిసల ద్వారా ఇస్లాం  అమెరికా మరియు యూరోప్‌కు వ్యాపించే ముందు చాలా మంది పశ్చిమ ఆఫ్రికన్లు ఇస్లాం స్వీకరించారు.

లాస్ట్ ఇస్లామిక్ హిస్టరీ ప్రకారం, ఇస్లాంను అమెరికాకు తీసుకువచ్చిన ఆఫ్రికన్ ముస్లిములలో -బిలాలీ ముహమ్మద్, అయూబ్ జాబ్ జల్లో, యారో మమూద్, ఇబ్రహీం అబ్దుల్‌రహ్మాన్ ఇబ్న్ సోరి, ఉమ్మర్ ఇబ్న్ సయ్యద్, (ఒమర్ ఇబ్న్ సైద్) మరియు సాలి బిలాలీ (Bilali Muhammad,Ayub Job Djallo, Yarrow Mamood, Ibrahim Abdulrahman ibn Sori,  Ummar ibn Sayyid,   (Omar ibn Said) and Sali Bilali) వంటి వారు  ముఖ్యులు.

1)బిలాలీ ముహమ్మద్ Bilali Muhammad:

ఆఫ్రికా లోని గినియా మరియు సియెర్రా లియోన్ అని పిలువబడే ప్రాంతంలో 1770లో జన్మించిన బిలాలీ ముహమ్మద్ ఫులానీ తెగకు చెందిన శ్రేష్ఠుడు. బిలాలీ ముహమ్మద్ కు అరబిక్ తెలుసు మరియు హదీసులు, తఫ్సీర్ మరియు షరియత్ విషయాలలో పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. బిలాలీ ముహమ్మద్ చదువుకున్నందున, బానిస సంఘంలో హోదాలో ఎదగడానికి అనుమతించబడ్డాడు. బిలాలీ ముహమ్మద్ తన మరణానికి ముందు తన స్నేహితుడికి బహుమతిగా ఇచ్చిన “బిలాలీ డాక్యుమెంట్” అని పిలవబడే మాలికీ ఇస్లామిక్ చట్టంపై 13 పేజీల మాన్యుస్క్రిప్ట్‌ను కూడా రాశాడు. కైరోలోని అల్-అజార్ విశ్వవిద్యాలయంలో విశ్లేసించబడేవరకు ఈ మాన్యుస్క్రిప్ట్ డైరీగా భావించబడింది. బిలాలీ ముహమ్మద్ మాన్యుస్క్రిప్ట్‌ని బెన్ అలీ డైరీ లేదా బెన్ అలీ జర్నల్ అని కూడా పిలుస్తారు.

2)అయుబా సులేమాన్ డియల్లోAyuba Suleiman Diallo:

అయూబ్ జొబ్ జల్లో సెనెగల్‌లో గౌరవనీయమైన ఫుల్బే ముస్లిం కుటుంబం లో జన్మించాడు. అయూబ్ జొబ్ జల్లో ను జొబ్  బెన్ సోలమన్ అని కూడా పిలుస్తారు. అయూబ్ జొబ్ జల్లో తన కొన్ని జ్ఞాపకాలను వ్రాసాడు మరియు కొన్ని సంవత్సరాలు మేరీల్యాండ్‌లో బానిసగా ఉన్నాడు. బానిసగా విక్రయించబడి,  చివరికి సెనెగల్‌లోని తన ముస్లిం కులీన మూలాలకు తిరిగి వచ్చాడు.

3)యారో మమౌట్ Yarrow Mamout:

గినియాలో జన్మించిన యారో మమూద్ 1736లో జన్మించాడు మరియు 1823లో స్వతంత్ర వ్యక్తిగా మరణించాడు. యారో మమూద్ 14 సంవత్సరాల వయస్సులో తన సోదరితో మేరీల్యాండ్‌కు చేరుకున్నాడు. అరబిక్ భాషలో పరిజ్ఞానం ఉన్న యారో మమూద్ తన మరణం వరకు ఇస్లాంను బహిరంగంగా ఆచరించాడు

4) అబ్దుల్‌రహ్మాన్ ఇబ్రహీం ఇబ్న్ సోరిAbdulrahman Ibrahim Ibn Sori:

ఇబ్రహీం అబ్దుల్‌రహ్మాన్ ఇబ్న్ సోరీ గినియాలో జన్మించారు. ఇబ్రహీం అబ్దుల్‌రహ్మాన్ ఇబ్న్ సోరీ ని “ది ప్రిన్స్ ఆమోంగెస్ట్ స్లేవ్స్The Prince Amonsgt Slaves” అని కూడా పిలుస్తారు. అబ్దుల్‌రహ్మాన్ గినియాలోని  టింబో గ్రామానికి చెందిన సోరి రాజు యొక్క కుమారుడు మరియు సైనిక నాయకుడు. ఆకస్మిక దాడి ఫలితంగా అబ్దుల్‌రహ్మాన్ బానిస అయ్యాడు మరియు మిస్సిస్సిపీలోని థామస్ ఫోస్టర్ పేరుగల  బానిస యజమానికి విక్రయించబడ్డాడు. అబ్దుల్‌రహ్మాన్ ఇబ్న్ సోరీకి వివాహం మరియు పిల్లలు ఉన్నారు. అబ్దుల్‌రహ్మాన్ విడుదలకు ముందు 40 ఏళ్లు పనిచేశాడు. తిరుగు ప్రయాణంలో అబ్దుల్‌రహ్మాన్ మరణించారు. అబ్దుల్‌రహ్మాన్ పశ్చిమ ఆఫ్రికాలోని తన కుటుంబానికి అరబిక్‌లో ఒక లేఖ రాశాడు, దానిని మొరాకో సుల్తాన్ అబ్దేర్‌రహ్మనే Abderrahmane చదివాడు. అబ్దుల్‌రహ్మాన్ ను విడుదల చేయమని US అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్‌ను స్వయంగా సుల్తాన్ అబ్దేర్‌రహ్మనే అభ్యర్థించాడు.

5.ఒమర్ ఇబ్న్ సైద్Omar ibn Said:

ఉమ్మర్ ఇబ్న్ సయ్యద్ 1770లో సెనెగల్‌లోని ఫుటా టోరోలో జన్మించాడు. 1807లో పట్టుబడ్డాడు. ముస్లిమోఫుసా ప్రకారం ఉమ్మర్ ఇబ్న్ సయ్యద్ ను ఒమర్ మోరేయు మరియు ప్రిన్స్ ఒమెరో (Omar Moreau and Prince Omeroh) అని పిలువబడ్డాడు. ఉమ్మర్ ఇబ్న్ సయ్యద్ తన జీవితంలో తరువాత క్రైస్తవ మతంలోకి మారాడని చెప్పే అనిర్ధారిత నివేదికలు ఉన్నాయి ఉమ్మర్ ఇబ్న్ సయ్యద్ ఒక ఇస్లామిక్ పండితుడు. ఉమ్మర్ ఇబ్న్ సయ్యద్ అనేక అరబిక్ గ్రంథాలను వ్రాసినాడు మరియు  అంకగణితం నుండి వేదాంతశాస్త్రం వరకు అనేక రంగాలలో పరిజ్ఞానం కలిగి ఉన్నాడు.

6)సాలి బిలాలీ SALI BILALI:

సాలి బిలాలీ మాలిలో జన్మించాడు మరియు 1782లో బానిసగా బంధించబడ్డాడు. స్లేవరీ అబాలిషన్ ఇన్స్టిట్యూట్ ప్రకారం సాలి బిలాలీ మరణశయ్య పై సాలి బిలాలీ చివరి మాటలు షహదా అని నివేదించబడింది.

ఆఫ్రికాతో సహా అన్ని ఖండాలు ఇస్లాం వ్యాప్తికి దోహదపడ్డాయి.

No comments:

Post a Comment