2 October 2022

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి Mu'in al-Din Chishti (1141-1230)

 


ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి (పర్షియా :: خواجہ معین الدین چشتی ) (జననం 1141, మరణం1230గరీబ్ నవాజ్ (పర్షియన్ : غریب نواز ), అని కూడా ప్రసిద్ధి. చిష్తీ ముయిన్ అల్-దీన్ హసన్ సిజ్జి (1143–1236 CE),ని సాధారణంగా ముయిన్ అల్-దీన్ చిష్తీ లేదా మొయినుద్దీన్ చిష్తి(పర్షియా :: خواجہ معین الدین چشتی) (ఉర్దూ: معین الدین چشتی)  అని పిలుస్తారు, లేదా గరీబ్ నవాజ్(పర్షియన్ : غریب نواز ),  ('పేదలకు ఓదార్పు) అని  లేదా గౌరవంగా షేక్ ముయిన్ అల్-దిన్ లేదా ముయిన్ అల్-దీన్ లేదా ఖ్వాజా ముయిన్ అల్-దీన్ (ఉర్దూ: معین الدین چشتی) అని భారత ఉపఖండం లోని ముస్లిములు పిలుస్తారు. 

మొయినుద్దీన్ చిష్తి సున్నీ ముస్లిం బోధకుడు ధార్మిక పండితుడు, తాత్వికుడు మరియు సిస్తాన్, ఖోరాసాన్ పెర్షియా కు చెందిన సూఫీ సన్యాసి.  మొయినుద్దీన్ చిష్తి ప్రఖ్యాతిగాంచిన సూఫీచిష్తియా తరీఖా  గురువు మరియు  దక్షిణాసియాలో ప్రాముఖ్యత  పొందినవాడు. భారత ఉపఖండంలో చిష్తియా తరీఖాను స్థాపించెను.

మొయినుద్దీన్ చిష్తి 13వ-శతాబ్దపు ప్రారంభంలో భారత ఉపఖండంలో స్థిరపడ్డాడు. చిష్తియా తరికా (క్రమం) మధ్యయుగ భారతదేశంలో ఆధిపత్య ముస్లిం ఆధ్యాత్మిక సమూహంగా మారింది మరియు చాలా మంది భారతీయ సున్నీ సాధువులు-నిజాముద్దీన్ అవ్లియా (d. 1325) అమీర్ ఖుస్రో (మ. 1325) చిష్తీ తరికా గా ఉన్నారు.

సుల్తాన్ ఇల్తుత్మిష్ (d. 1236) పాలనలో ఢిల్లీకి చేరుకున్న ముయిన్ అల్-దీన్ కొంతకాలం తర్వాత ఢిల్లీ నుండి అజ్మీర్‌కు వెళ్ళాడు. ఆ సమయంలో ముయిన్ అల్-దీన్ ప్రసిద్ధ సున్నీ హన్‌బాలీ పండితుడు మరియు ఆధ్యాత్మికవేత్త అయిన అబ్దల్లా అన్సారి  యొక్క రచనలచే ఎక్కువగా ప్రభావితమయ్యాడు. అబ్దల్లా అన్సారి ప్రసిద్ధ రచనతబాఖత్ అల్-షూఫియా”, ముయిన్ అల్-దిన్ యొక్క ప్రపంచ దృష్టికోణాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించి ఉండవచ్చు.

అజ్మీర్‌లో ఉన్న సమయంలోనే ముయిన్ అల్-దిన్ ఒక ఆకర్షణీయమైన మరియు దయగల ఆధ్యాత్మిక బోధకుడు మరియు ఉపాధ్యాయుడిగా కీర్తిని పొందాడు. ముయిన్ అల్-దిన్ తన జీవితంలోని ఈ సంవత్సరాల్లో అనేక ఆధ్యాత్మిక అద్భుతాల (కరమాత్)ను అందుకున్నాడు. ముయిన్ అల్-దిన్ మరణించిన తర్వాత గొప్ప సెయింట్ గా పరిగణించబడ్డాడు. 

ముయిన్ అల్-దిన్ చిష్తీ "ఇస్లామిక్ ఆధ్యాత్మికత యొక్క చరిత్రలో అత్యంత విశిష్ట వ్యక్తులలో ఒకడుగా పరిగణించబడినాడు. ముయిన్ అల్-దిన్ చిష్తీ విదేశీ అరబ్ విశ్వాసాన్ని(ఇస్లాం ను) ఇటివల ఇస్లాం లోనికి ప్రవేశించిన స్వదేశీ ప్రజలకు మరింత దగ్గర చేయడానికి ప్రయత్నం చేసాడు. ముయిన్ అల్-దిన్ చిష్తీ తన అనుచరులను దేవునికి సంబంధించిన భక్తి, ప్రార్థనలు మొదలగు వాటిలో  "సంగీతం యొక్క ఉపయోగాన్ని" అధికారికంగా అనుమతించిన మొదటి ప్రధాన ఇస్లామిక్ ఆధ్యాత్మికవేత్తలలో ఒకరు.

1143లో సిస్తాన్‌లో జన్మించిన ముయిన్ అల్-దిన్ చిష్తీకి పదహారేళ్ల వయసులో తండ్రి సయ్యద్ గియాత్ అల్-దీన్ మరణించాడు. తండ్రి సయ్యద్ గియాత్ అల్-దీన్ కు చెందిన గ్రైండింగ్ మిల్లు మరియు పండ్లతోట ముయిన్ అల్-దిన్ చిష్తీకి సంక్రమించినవి. ముయిన్ అల్-దిన్ తండ్రి గియాత్ అల్-దిన్ మరియు తల్లి, బీబీ ఉమ్మల్వారా (అలియాస్ బీబీ మహే-నూర్), సయ్యద్‌లు లేదా ప్రవక్త మహమ్మద్ (స) మనవళ్లు హసన్ మరియు హుస్సేన్ వంశస్తులు.

తండ్రి వ్యాపారం లో ఆసక్తి లేక ముయిన్ అల్-దిన్ క్రమంగా తనలో ఆధ్యాత్మిక ధోరణులను పెంచుకున్నాడు మరియు బుఖారా మరియు సమర్‌కండ్‌లోని మతసంస్థలలో విద్యాబ్యాసం చేసాడు. ముహమ్మద్ అల్-బుఖారీ (d. 870) మరియు అబు మన్సూర్ అల్-మాతురిడి (d. 944) యొక్క పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. 

ఇరాక్‌కు ప్రయాణిస్తున్నప్పుడు, నిషాపూర్ జిల్లాలో, ముయిన్ అల్-దిన్ ప్రసిద్ధ సున్నీ ఆధ్యాత్మిక వేత్త క్వాజా ఉత్మన్ ప్రభావం లోకి వచ్చాడు. ఇరవై సంవత్సరాల పాటు, క్వాజా ఉత్మన్ తో పాటు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం కు ముయిన్ అల్-దిన్ తన స్వంత స్వతంత్ర ఆధ్యాత్మిక ప్రయాణాలను కొనసాగించాడు. ఈ ప్రయాణాల కాలంలో ప్రముఖ సున్నీ ఆధ్యాత్మికవేత్తలయిన అబ్దుల్-ఖాదిర్ గిలానీ (d. 1166), నజ్ముద్దీన్ కుబ్రా (d. 1221), నజీబ్ అల్-దిన్ అబ్ద అల్-కహీర్ సుహ్రావర్దీ,  అబూ సైద్ తబ్రీజీ, మరియు అబ్ద్ అల్-వహిద్ గిహ్అజ్నావి వంటి అత్యంత గౌరవనీయమైన సున్ని సాధువులను కలిసాడు. పదమూడవ శతాబ్దం ప్రారంభంలో దక్షిణాసియాకు చేరుకున్న ముయిన్ అల్-దిన్ ప్రఖ్యాత సున్నీ ఆధ్యాత్మికవేత్త మరియు న్యాయనిపుణుడు అలీ హుజ్విరి (మ. 1072) యొక్క సమాధి-ఆశ్రమం వద్ద ధ్యానం చేసేందుకు లాహోర్‌కు వెళ్లాడు.

లాహోర్ నుండి, ముయిన్ అల్-దిన్ అజ్మీర్ వైపు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు మరియు ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్నాడు, మొదటిభార్య  సయ్యద్ వాజియుద్దీన్ కుమార్తెను 1209/10 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య  స్థానిక హిందూ రాజు కుమార్తె. ముయిన్ అల్-దిన్ ముగ్గురు కుమారులుఅబూ సైద్, ఫకర్ అల్-దీన్ మరియు హసామ్ అల్-దీన్ మరియు ఒక కుమార్తె బీబీ జమాల్. ఇద్దరు కుమారులు హిందూ రాజా కుమార్తె వలన కలిగినట్లు  నమ్ముతారు. అజ్మీర్‌లో స్థిరపడిన తర్వాత, ముయిన్ అల్-దిన్ భారతదేశంలో సున్ని మార్మికవాదం యొక్క చిష్తి క్రమాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు.

13వ శతాబ్దంలో పెర్షియన్ ముయిన్ అల్-దీన్ చిష్తీ ద్వారా చిష్తియా తరికా భారత ఉపఖండంలోకి వ్యాపించింది. ఒక కధనం ప్రకారం ముయిన్ అల్-దీన్ చిష్తీ కు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ కలలో కనిపించి తన "ప్రతినిధి" లేదా "దూత"గా భారతదేశంలో ఉండమన్నారు. 

భారత దేశం లోని స్థానిక ప్రజలు  ఇస్లాం లోకి మారడానికి ప్రధాన కారణం వారి పట్ల   ముయిన్ అల్-దిన్ చూపిన సహనశీలత మరియు దయ.  ముయిన్ అల్-దిన్ చిష్తీ తన ఆధ్యాత్మిక వారసుడిగా భక్తియార్ కాకీ (మ. 1235)ని నియమించాడని చెబుతారు. కాకి ఢిల్లీలో చిష్తియాను వ్యాప్తి చేయడంలో పనిచేశారు. ఇంకా, ముయిన్ అల్-దిన్ కుమారుడు, ఫఖ్ర్ అల్-దీన్ (మ. 1255), అజ్మీర్‌లో చిష్తి తరికా బోధనలను మరింతగా విస్తరించాడని చెప్పబడింది, అదే సమయంలో ముయిన్ అల్-దిన్ యొక్క ప్రధాన శిష్యులలో మరొకరు, హమీద్ అల్-దీన్ దూఫ్ రాజస్థాన్‌లోని నాగౌర్‌లో బోధించారు మరియు  చిష్తియాను వ్యాప్తిచెందించారు.

ముయిన్ అల్-దిన్ చిష్తీ ద్వారా భారతదేశంలో ఇస్లాంను వ్యాప్తిచెందించెను. ఇతడి సమాధి అజ్మీర్లో గలదు. ముయిన్ అల్-దీన్ చిష్తి సమాధి (దర్గా) అత్యంత గౌరవప్రదమైన ప్రదేశంగా మారింది. అన్ని సామాజిక వర్గాల ప్రజలచే  గౌరవించబడిన ముయిన్ అల్-దీన్ చిష్తి సమాధిని సున్నీ డిల్లి పాలకులు చాలా గౌరవంగా చూసుకున్నారు.  ముహమ్మద్ బిన్ తుగ్లక్, (1324-1351) ముయిన్ అల్-దీన్ చిష్తి సమాధిని సందర్శించాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ (మ. 1605) తన పాలనలో పద్నాలుగు సార్లు కంటే తక్కువ కాకుండా ముయిన్ అల్-దీన్ చిష్తి సమాధిని సందర్శించాడు.

ముయిన్ అల్-దిన్ చిష్తి సమాధి భారత ఉపఖండంలోని సున్నీ ముస్లింలకు అత్యంత ప్రాచుర్యం పొందిన మతపరమైన సందర్శనా స్థలాలలో ఒకటిగా కొనసాగుతోంది." ముయిన్ అల్-దిన్ చిష్తి సమాధి చాలా మంది హిందువులను కూడా సందర్శిస్తారు. అన్ని మతాల వారు ఇతడి సమాధిని దర్శించడం ఇస్లాంమతంలోగల విశాలతత్వాన్ని నిరూపిస్తుంది.

అజ్మీర్‌లోని ముయిన్ అల్-దీన్ చిష్తి మరియు చిష్తి దర్గా గురించి తీసిన భారతీయ చిత్రాలలో జి. ఈశ్వర్ నిర్మించిన మేరే గరీబ్ నవాజ్, కె. షరీఫ్ యొక్క సుల్తాన్ ఇ హింద్ (1973), అక్బర్ బాలమ్ యొక్క  ఖవాజా కి దివానీ (1981), ఎం గుల్జార్ సుల్తానీ  ద్వారా మేరే దాతా గరీబ్ నవాజ్ (1994) ఉన్నాయి.

2008 నాటి భారతీయ చలనచిత్రం జోధా అక్బర్‌లోని "ఖ్వాజా మేరే ఖ్వాజా" అనే పాట, A. R. రెహమాన్ స్వరపరిచారు, ఇది ముయిన్ అల్-దీన్ చిష్తీకి నివాళులర్పించింది.

నుస్రత్ ఫతే అలీ ఖాన్ యొక్క "ఖ్వాజా ఇ ఖ్వాజ్గన్" మరియు సబ్రీ బ్రదర్స్ యొక్క "ఖవాజా కి దీవానీ"తో సహా వివిధ ఖవ్వాలిలు ముయిన్ అల్-దీన్ చిష్తీ పట్ల భక్తిని వర్ణిస్తాయి

No comments:

Post a Comment