మనలో చాలా మంది ముస్లిం వైద్యులు అల్-రాజీ, అల్-మజూసి, ఇబ్న్ సినా, ఇబ్న్ అల్-నఫీస్ వంటి ప్రసిద్ధ ముస్లిం
వైద్యుల గురించి విన్నాము కానీ ఇబ్న్ అబీ
ఉసైబియా గురించి వినలేదు. ఇస్లామిక్ వైద్య చరిత్రకు ఇబ్న్ అబీ ఉసైబియా చేసిన
కృషిని పరిగణనలోకి తీసుకుంటే, ఇబ్న్
అబీ ఉసైబియా ను గొప్ప వైద్యుడిగా పరిగణించ వచ్చు.
ఇబ్న్ అబీ ఉసైబియా పూర్తి పేరు మువాఫ్ఫాక్ ఎఐ-దిన్ అబూ అల్-అబ్బాస్ అహ్మద్ ఇబ్న్ అల్-ఖాసిమ్ ఇబ్న్ ఖలాఫ్ ఇబ్న్ యూనస్ అల్-ఖాజర్జీ.
ఇబ్న్ అబీ ఉసైబియా డమాస్కస్‌లో (1203 CE) ప్రముఖ వైద్య కుటుంబంలో జన్మించాడు. ఇబ్న్ అబీ ఉసైబియా తండ్రి నేత్ర వైద్యుడు. ఇబ్న్ అబీ ఉసైబియా మేనమామ చిన్న వయస్సులోనే వైద్యంలో ప్రసిద్ధ ఉపాధ్యాయుడు. ఇబ్న్ అబీ ఉసైబియా మేనమామ టర్కిష్ భాష లో నిపుణుడు, విస్తృతమైన విజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇబ్న్ అబీ ఉసైబియా మేనమామ వైద్యుడు మాత్రమే కాదు, సంగీతకారుడు, కవి మరియు ఓక్యులిస్ట్ కూడా. తండ్రి,మేనమామ యువ ఇబ్న్ అబీ ఉసైబియాపై గొప్ప ప్రభావాన్ని చూపారు.
ఇబ్న్ అబీ ఉసైబియా ప్రాథమిక విద్య తండ్రి, మేనమామల ఆధ్వర్యంలో సాగింది. ఇబ్న్ అబీ ఉసైబియా ప్రఖ్యాత వృక్షశాస్త్రజ్ఞుడు ఇబ్న్ అల్-బైతార్ వద్ద వృక్షశాస్త్రం అబ్యసించాడు తరువాత డమాస్కస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత అల్-నూరి ఆసుపత్రిలో ఫిజిషియన్-ఇన్-చీఫ్, అల్-దఖ్వార్ అని పిలువబడే ముహదబ్ అల్దిన్ 'అబ్ద్ అల్-రహీమ్ ఇబ్న్ 'అలీ దగ్గిర అప్రెంటిస్‌గా పనిచేసాడు.
ఇబ్న్ అబీ ఉసేబియా ప్రసిద్ధ అల్-నాసిరి
ఆసుపత్రిలో (మన్సోరి బిమరిస్తాన్) వైద్య మరియు శస్త్రచికిత్స రెసిడెన్సీని
తీసుకోవడానికి కైరోకు వెళ్లారు. శిక్షణ ముగించుకుని, ఇబ్న్ అబీ ఉసేబియా సిరియాకు తిరిగి వచ్చి, ఆగ్నేయ సిరియాలోని సల్ఖాద్ Salkhad
పట్టణ గవర్నర్ ఇజ్ అల్-దిన్ అబు అల్ మన్సూర్ అహ్మద్ ఇబ్న్ అబ్దుల్లా సేవలో మెడికల్
ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఇబ్న్ అబీ ఉసేబియా (1270 CE)లో మరణించే వరకు అక్కడే వైద్య వృత్తి చేస్తూ
ఉన్నాడు.
ఇబ్న్ అబీ ఉసేబియా చాలా కవితలతో సహా అనేక గ్రంధాల రచయిత. దురదృష్టవశాత్తు, వీటిలో చాలా వరకు పోయాయి. ఈ సమయంలోనే ఇబ్న్ అబీ ఉసేబియా వైద్య చరిత్రకారుడిగా (ఉయూన్ అల్-అన్బా ఫి తబకత్ అల్-అతిబ్బా(Uyoon al-Anbaa fi Tabaqat al-Atibbaa)) అనే వైద్య చరిత్ర పుస్తకాన్ని వ్రాసాడు.
ఉయోన్ అల్-అన్బా అనేది ఆకాలం నాటి వైద్యుల
చరిత్ర. ఇబ్న్ అబీ ఉసేబియా తన కాలం మరియు మునుపటి కాలంలోని వైద్యశాస్త్ర చరిత్రను
వివరించాడు. ఆ కాలపునాటి వైద్యుల గురించి, వారి సవివరమైన జీవిత చరిత్రలు, వారు అభ్యసించిన విధానం, వారు ఉపయోగించిన వైద్య మరియు శస్త్రచికిత్స పద్ధతులు వివరించాడు.
ఇస్లామిక్ ఔషధ చరిత్రపై నిపుణుడు అయిన డాక్టర్
సమీ హమర్నెహ్ అభిప్రాయం లో “ఉయోన్ అల్-అన్బా” అనేది మధ్యయుగం నుండి ఆధునిక కాలం
వరకు వ్రాయబడిన అత్యుత్తమమైన గ్రంధం. “ఉయోన్
అల్-అన్బా” పురాతన కాలం నుండి 1262 CE మధ్యకాలం వరకు ఆరోగ్య వృత్తి పెరుగుదల మరియు అభివృద్ధి గురించి అధ్యయనం మరియు
అవగాహన కోసం ఉపయోగపడే సమాచార వనరు. ఇస్లామిక్ వైద్య చరిత్రలో ఒక అద్బుతమైన కృషి.
ఇబ్న్ అబీ ఉసేబియా తన పుస్తకం “ఉయోన్ అల్-అన్బా” ను సిరియా రాజు అల్-సాలిహ్ నజ్మ్ ఎఐ-దిన్ యొక్క
వజీర్ (మంత్రి) అబు అల్-హసన్ ఇబ్న్ గజల్ ఇబ్న్ అబి సైద్ కి అంకితం చేయబడింది.
వైద్య చరిత్రకారుల జాబితాలో ఇబ్న్ అబీ ఉసైబియా
ఉన్నత స్థానానికి అర్హుడు. ఇబ్న్ అబీ ఉసైబియా వివరణల నుండి మనం హిప్పోక్రేట్స్, గాలెన్, గ్రీకో-రోమన్,
బైజాంటైన్, అలెగ్జాండ్రియన్ మరియు ప్రారంభ ముస్లిం
వైద్యులతో సహా ప్రారంభ గ్రీకు వైద్యుల గురించి చాలా వరకు నేర్చుకున్నాము. ఇబ్న్
అబీ ఉసైబియా తన పుస్తకంలో,
ఇరాక్, దియార్ బకర్ (ఎగువ టైగ్రిస్ యొక్క రెండు ఒడ్డున ఉన్న ప్రాంతం), భారతదేశం, ఉత్తర ఆఫ్రికా మరియు స్పెయిన్, మగ్రిబ్, ఈజిప్ట్ మరియు సిరియా లోని వైద్య నిపుణుల గురించి చాలా లోతుగా వివరించాడు.
No comments:
Post a Comment