3 October 2022

గొప్ప కరువు సమయంలో ఒట్టోమన్ సుల్తాన్ ఐర్లాండ్‌కు ఆర్థికంగా సహాయం చేశాడని మీకు తెలుసా?

 

19వ శతాబ్దం మధ్యలో జరిగిన మహా కరువు ఐరిష్ చరిత్రలో అత్యంత వినాశకరమైన సంఘటనలలో ఒకటి. 1845 మరియు 1852 మధ్య, ఐర్లాండ్  ద్వీపం యొక్క బంగాళాదుంప పంట  ముడుత తెగులుకు గురి అయినది. బంగాళాదుంప ఐర్లాండ్‌లో ప్రధానమైన ఆహారం, చాలా సంవత్సరాల పాటు మంచి సాగు లేకపోవటం వలన  ఆకలి, వ్యాధి కి గురిఅయి దాదాపు ఒక మిలియన్ ప్రజలు  ఐర్లాండ్ లో చనిపోయారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు మరో మిలియన్ ఐరిష్ ప్రజలు వలస వెళ్ళారు.  ఈ సంక్షోభంలో ఒట్టోమన్ సామ్రాజ్య సుల్తాన్ అబ్దుల్మెసిడ్1 ఐరిష్ ప్రజలకు  సహాయం చేయడానికి ప్రయత్నించారు.

 1847లో 23 సంవత్సరాల సుల్తాన్ అబ్దుల్మెసిడ్ Abdülmecid I ఐర్లాండ్‌కు వ్యక్తిగతంగా ₤10,000 సాయం అందించడానికి నిశ్చయించుకొన్నారు.  కానీ టర్కీ లోని బ్రిటీష్ దౌత్యవేత్తలు ₤2,000 మాత్రమే విరాళం అందించిన క్వీన్ విక్టోరియా కంటే ఎవరైనా ఎక్కువ అందించడం అభ్యంతరకరమని సుల్తాన్  కు  సలహా ఇచ్చారు. కాబట్టి సుల్తాన్ ఆ మొత్తంలో సగం మాత్రమే విరాళంగా ఇవ్వాలని సూచించబడింది, దీంతో సుల్తాన్ ₤1,000 ఇచ్చాడు. కాన్స్టాంటినోపుల్‌లోని బ్రిటిష్ రాయబారి హెన్రీ వెల్లెస్లీ బ్రిటిష్ సామ్రాజ్యం తరపున సుల్తాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సుల్తాన్ విరాళాన్ని బ్రిటన్ మరియు ఐర్లాండ్‌లోని ప్రజలు కూడా మెచ్చుకున్నారు. ఒక ఆంగ్ల మతపరమైన జర్నల్ ఎ బెనెవలెంట్ సుల్తాన్అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది, దీనిలో రచయిత ఇలా వ్రాశాడు, “మొట్టమొదటిసారిగా ఒక మహమ్మదీయ సార్వభౌముడు, ఒక క్రైస్తవ దేశం పట్ల సానుభూతిని వ్యక్తం చేశాడు. అటువంటి సానుభూతి, అన్ని ధార్మిక విశ్వాసాలలో పెంపొందించబడాలి.

 కాని సుల్తాన్ అబ్దుల్మెసిడ్1 సహాయం చేయడానికి ఇతర మార్గాలను కనుగొన్నాడు. ఐర్లాండ్‌లోని ఓడరేవు పట్టణం డ్రోగెడా కు ఒట్టోమన్ సామ్రాజ్యం మే 1847లో ఆహారాన్ని నింపిన ఐదు నౌకలను డ్రోగెడా పట్టణానికి రహస్యంగా పంపినది.  ఆ కాలానికి చెందిన వార్తాపత్రిక కథనాలలో  సుల్తాన్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఐరిష్ ప్రముఖులు రాసిన  ఒక లేఖ కూడా ఉంది.

సుల్తాన్ అబ్దుల్మెసిడ్1   ఐరిష్‌కు ప్రజలకు చేసిన సహాయం కు కృతజ్ఞతగా కరువు ముగిసిన రెండు సంవత్సరాల తర్వాత, 1854లో కొందరు ఐరిష్ ప్రజలు రష్యా-టర్కీ సంఘర్షణలో  సుల్తాన్ పక్షం చేరారు. విస్తరిస్తున్న రష్యన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒట్టోమన్ భూభాగాన్ని రక్షించడానికి బ్రిటన్ క్రిమియన్ యుద్ధంలో పాల్గొంది. ఐరిష్ నర్సులు మరియు ఇంజనీర్‌లతో పాటు (మరియు చరిత్రలో మొదటి యుద్ధ పాత్రికేయులు కొందరు), సుమారు 30,000 మంది ఐరిష్ సైనికులు క్రిమియా యుద్ధంలో పనిచేశారు. తమ కష్టకాలంలో తమకు సహాయం చేసిన సుల్తాన్ యొక్క భూభాగాన్ని రక్షించడంలో ఐరిష్ సైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

No comments:

Post a Comment