5 October 2022

ఇస్లామిక్ ప్రపంచం మరియు వైకింగ్‌ల మధ్య సంభంధం Relations between the Islamic World and the Vikings.

 

ఇస్లామిక్ స్వర్ణయుగం అనగా  8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు, అబ్బాసిద్ కాలిఫేట్ చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా స్థాపించబడింది. అబ్బాసిద్ కాలిఫేట్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతులతో అనగా తూర్పున భారతీయులు మరియు చైనీయులు మరియు పశ్చిమాన బైజాంటైన్ల తో సంబంధాలు కలిగి ఉంది. ఈ సంబంధాలు ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపా మధ్య వాణిజ్య సంబంధాల  స్థాపనకు దారితీసింది.

ఇస్లామిక్ ప్రపంచం మరియు వైకింగ్‌ల మధ్య సంబంధానికి సంబంధించిన సమాచారం అరబిక్ వ్రాత మూలాల్లో మరియు స్కాండినేవియాలో లబించిన అరబిక్ కళాఖండాల artefacts ద్వారా కనుగొనబడింది.

మూరిష్ కవి మరియు దౌత్యవేత్త అల్-గజల్ స్కాండినేవియా గురించి వివరించిన కొద్దిమంది అరబ్బులలో ఒకరు. కార్డోబా యొక్క నాల్గవ ఎమిర్, అబ్ద్ అల్-రెహ్మాన్ II, అల్-గజల్‌ను 'మజుస్' రాజు వద్దకు పంపాడు. 'మజస్' అనేది అగ్ని ఆరాధకులకు మరొక పదం. కాని ఈ సందర్భంలో వైకింగ్స్. అల్-గజల్ అక్కడికి ఎందుకు పంపబడ్డాడో స్పష్టంగా తెలియకపోయినా, డేన్స్ రాజు అయిన కింగ్ హోరిక్ I పరిపాలించే  ఒక ద్వీపం లేదా ద్వీపకల్పం గురించి అల్-గజల్ నివేదించాడు.

అల్-టార్తుషి Al-Tartushi కూడా  970లో వైకింగ్‌ల గురించి తన రచనలలో వివరించాడు. అల్-టార్తుషి తన ప్రయాణాలలో ఒకదానిలో "ష్లెస్విగ్ Schleswig", అంటే హేడేబీ i.e. Hedeby - వైకింగ్ యుగంలో ముఖ్యమైన ఒక వర్తక సెటిల్మెంట్  గురించి వివరించాడు. అల్-టార్తుషి ప్రకారం షెల్స్‌విగ్ అనేది మహాసముద్రం వద్ద ఉన్న చాలా పెద్ద పట్టణం. లోపల మంచినీటి వనరులు ఉన్నాయి. అక్కడి ప్రజలు సిరియస్‌ను ఆరాధిస్తారు మరియు అక్కడ కొంతమంది క్రైస్తవులు ఉన్నారు వారికి అక్కడ చర్చి ఉంది”.

 తమ  రచనలలో వైకింగ్స్ గురించి ప్రస్తావించిన ఇతర అరబ్ రచయితలు ఇబ్న్ ఖోరాదాద్బే Ibn Khoradadbeh మరియు ఇబ్న్ ఫడ్లాన్ Ibn Fadlan.

ఇబ్న్ ఖోరదాద్బే 844లో వైకింగ్‌లను “రస్” అని సూచిస్తాడు మరియు వారిని బానిసలు, చర్మం  మరియు కత్తుల వ్యాపారులుగా అభివర్ణించాడు.

ఇబ్న్ ఫడ్లాన్ “రస్” ప్రజలను   'పరిపూర్ణ భౌతిక నమూనాలు - పొడవుగా, అందoగా  మరియు దృడంగా ఉన్నారని  వర్ణించినాడు.

స్కాండినేవియాలో కనిపించిన  అరబిక్ లేదా ఓరియంటల్ కళాఖండాలు artifacts చాలా విభిన్నమైనవి. స్వీడన్‌లో కాంస్య పాత్రలు, క్యూఫిక్ నాణేలు, దుస్తులు మరియు దుస్తుల ఉపకరణాలు, గాజు పాత్రలు, పూసలు, బ్యాలెన్స్‌లు మరియు బరువులు ఎక్కువగా కనిపించినవి. ఇవి స్కాండినేవియా కు అరబ్ ప్రపంచంతో ఉన్న సంబంధానికి రుజువులు.

 



స్వీడన్‌లో దొరికిన వెండి ఉంగరం

వైకింగ్స్ మరియు ఇస్లామిక్ ప్రపంచం మధ్య సంబంధానికి సంబంధించిన అతి ముఖ్యమైన భౌతిక సాక్ష్యం బిర్కా సమీపంలోని ఒక మహిళ యొక్క సమాధిలో కనుగొనబడిన ఉంగరం. ఉంగరం వెండి మిశ్రమం మరియు రంగు గాజుతో తయారుచేయబడి దానిపై క్యూఫిక్ అరబిక్‌లో "అల్లాహ్ కోసం" అని లిఖించబడి ఉంది. సమాధిలో ఉన్న మహిళ సాంప్రదాయ స్కాండినేవియన్ దుస్తులను ధరించినప్పటికీ, ఆమె జాతి లేదా మతాన్ని గుర్తించడం సాధ్యం కాదు.

ఇస్లామిక్ ప్రపంచం మరియు వైకింగ్‌ల మధ్య పరస్పర సంభందాలు కేవలం వాణిజ్యపరమేనా లేదా వారిలో కొందరు ఇస్లాంలోకి మారారా అనేది స్పష్టంగా లేదు. ఏది ఏమైనప్పటికీ, అబ్బాసిడ్ కాలిఫేట్ కు  వైకింగ్స్ తో  సంభంధాలు ఉన్నవి అనటానికి ఇది ఇది ఒక రుజువు



హగేబిహోగా Hagebyhöga లో లబించిన అరబిక్ రాత ఉన్న  ఉన్న రెండు కాంస్య సీసాలు

 

No comments:

Post a Comment