29 October 2022

రోక్సెలానా 1505-1558 ఒట్టోమన్ చక్రవర్తి సులేమాన్ ది మాగ్నిఫిసెంట్ భార్య Roxelana wife of Süleyman the Magnificent

 


రోక్సెలానా లేదా  రోక్సోలానా ను హుర్రెమ్ హసేకి సుల్తాన్ అని కూడా పిలుస్తారు. రోక్సెలానా,అసలు పేరు  అలెగ్జాండ్రా లిసోవ్స్కా Aleksandra Lisovska. 1505లో  రోహటిన్, పోలాండ్ ప్రస్తుత ఉక్రెయిన్‌లో జన్మించారు. రోక్సెలానా ఏప్రిల్ 1558లో ఇస్తాంబుల్,  టర్కీ లో  మరణించారు.

కాన్స్టాంటినోపుల్, ఒట్టోమన్ సామ్రాజ్యం (ఇప్పుడు ఇస్తాంబుల్, టర్కీ) కి  స్లావిక్ మహిళ అయిన రోక్సెలానా బలవంతంగా ఉంపుడుగత్తెగా వచ్చింది మరియు తరువాత ఒట్టోమన్ సుల్తాన్ సులేమాన్ ది మాగ్నిఫిసెంట్ కి  భార్య అయింది. సుల్తాన్‌ సులేమాన్ పై ప్రభావం కలిగి, అంతఃపుర/ప్యాలెస్ కుట్రల  ద్వారా, రోక్సెలానా గణనీయమైన అధికారాన్ని పొందినది.

రోక్సెలానా 1505లో ప్రస్తుతం పశ్చిమ ఉక్రెయిన్‌లో ఉన్న రోహటిన్ పట్టణంలో జన్మించింది. కొందరు చరిత్రకారుల  ప్రకారం, రోక్సెలానా క్రైస్తవ పేరు అలెగ్జాండ్రా లిసోవ్స్కా. క్రిమియన్ తాతార్ యోధులు రోక్సెలానాను చిన్నతనంలో బంధించి, ఒట్టోమన్ రాజధాని కాన్స్టాంటినోపుల్ (ఇప్పుడు ఇస్తాంబుల్)కి తీసుకువెళ్లారు, అక్కడ రోక్సెలానాను బానిస మార్కెట్‌లో 1520లో సుల్తాన్‌గా మారిన సులేమాన్‌తో సంబంధం ఉన్న వ్యక్తికి విక్రయించారు. ఆతరువాత ఇస్లాం లోకి మారి  సుల్తాన్ సులేమాన్ అంతఃపురంharemలోకి ప్రవేశించినది.

రోక్సెలానా ఆహ్లాదకరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది (రోక్సెలానా టర్కిష్ పేరు, హుర్రెమ్, అంటే "ఆనందకరమైనది") మరియు త్వరగా అంతఃపురంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రోక్సెలానా 1521లో తన మొదటి కుమారుడైన మెహ్మద్‌ Mehmed ను కన్నది. ఒట్టోమన్ సామ్రాజ్య ఆచారం ప్రకారం, ఒక ఉంపుడుగత్తెకు ఒక కొడుకును  మాత్రమే ఉండే అవకాశం ఉంది; ఉంపుడుగత్తె కొడుకు యుక్తవయస్సు వచ్చినప్పుడు, తల్లి మరియు కొడుకు కలిసి బయటకు పంపబడతారు. 

ఏది ఏమైనప్పటికీ, రోక్సెలానా, సుల్తాన్ సులేమాన్ తో  కనీసం నలుగురు కుమారులను కన్నది  మరియు వారు యుక్తవయస్సు వచ్చిన తర్వాత కూడా రాజధానిలోనే ఉన్నారు. కొంతకాలం తరువాత సుల్తాన్ సులేమాన్ రోక్సెలానాను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాడు, సులేమాన్ సుల్తాన్ భార్యగా/వధువుగా, రోక్సెలానా బానిసత్వం నుండి విముక్తి పొందింది.

రోక్సెలానా మరియు సుల్తాన్ సులేమాన్‌ల మధ్య సన్నిహిత సంబంధం కలదు. ఉంది. సుల్తాన్ సులేమాన్‌, రోక్సెలానా  తరచూ ఒకరికొకరు ప్రేమ కవిత్వం రాసుకునేవారు.

పోలాండ్ రాజు సిగిస్మండ్ II అగస్టస్‌Sigismund II Augustus,తో మరియు పర్షియాకు చెందిన షాహ్మాస్ప్IṬahmāsp I భార్య మరియు సోదరితో రోక్సెలానా రాజ్య పాలన విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు చేసేది. 

రోక్సెలానా విజయాలతో అసూయ చెందిన ఆమె ప్రత్యర్ధులు రోక్సెలానాను  ఒక మంత్రగత్తె అని భావించేవారు. సుల్తాన్‌పై తన ప్రభావాన్ని పెంచుకోవడానికి 1536లో సుల్తాన్ గ్రాండ్ విజియర్ (ముఖ్యమంత్రి) ఇబ్రహీం పాసా హత్యకు పథకం వేసిన స్కీమర్‌గా కూడా రోక్సెలానా పిలవబడింది.

రోక్సెలానా తన అంతఃపురాన్ని ఓల్డ్ సెరాగ్లియో (ఎస్కి సారే) నుండి టాప్‌కాపిTopkapı Palace ప్యాలెస్‌కి తరలించినది. టాప్‌కాపిTopkapı Palace ప్యాలెస్‌ లోనే సులేమాన్ నివసించి రాజ దర్బార్ నిర్వహించేవాడు.

1543లో మెహ్మద్ మరణించినప్పుడు సులేమాన్ మరియు రోక్సెలానా దుఃఖించారు. సులేమాన్ మరియు రోక్సెలానా తమ కుమార్తె మిహ్రిమాను 1544లో గ్రాండ్ విజియర్‌గా మారిన రుస్టెమ్ కి  వివాహం చేశారు. 

సులేమాన్ 1566 వరకు జీవించాడు తరువాత సెలిమ్II, ఒట్టోమన్ చక్రవర్తిగా నియమితుడయ్యాడు. సెలిమ్II, బలహీనమైన పాలకుడు. సెలిమ్II పాలనలో ఒట్టోమన్ చక్రవర్తి పై  గ్రాండ్ విజియర్‌ కన్నా అంతఃపుర ప్రభావం ఎక్కువుగా ఉండేది. ఫలితంగా "సుల్తానేట్ ఆఫ్ ది ఉమెన్" అనే   పరిస్థితి ఏర్పడింది, ఇది తరచుగా రోక్సెలానా కు ఆపాదించబడింది.

రోక్సెలానా ఏప్రిల్ 1558లో మరణించినది. ఇస్తాంబుల్లోని సులేమానియే మసీదు వద్ద రోక్సెలానా సమాధి కలదు.  

 

లెగసి:

హుర్రెమ్ హసేకి సుల్తాన్, లేదా రోక్సెలానా, మక్కా నుండి జెరూసలేం (అల్-ఖుద్స్) వరకు ప్రజా భవనాలను నిర్మించినది.  

ఒట్టోమన్ రాయల్ ఆర్కిటెక్ట్ సినాన్ ద్వారా రోక్సెలానా అనేక పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులను ప్రారంభించింది. వారి మొదటి పెద్ద ప్రాజెక్ట్, 1539 నాటికి ప్రారంభించబడిన, కాన్స్టాంటినోపుల్‌లోని హసేకి మసీదు సముదాయం. హసేకి మసీదు సముదాయం లో రెండు పాఠశాలలు మరియు ఒక ఆసుపత్రి,  ఒక ఫౌంటెన్ మరియు మహిళల ఆసుపత్రి ఉన్నాయి. 

రోక్సెలానా కాన్‌స్టాంటినోపుల్‌ హగియా సోఫియాలోని విశ్వాసకుల కోసం  హుర్రెమ్ సుల్తాన్ బాత్‌హౌస్‌ను కూడా ప్రారంబించినది.

రోక్సెలానా, అడ్రియానోపోల్ మరియు అంకారాలో మసీదు సముదాయాలను కూడా నిర్మించింది.

జెరూసలేంలో రోక్సెలానా 1552లో పేదలకు ఆహారం ఇవ్వడానికి హసేకి సుల్తాన్ ఇమారెట్ అనే పబ్లిక్ సూప్ కిచెన్‌ను స్థాపించింది, ఇది కనీసం 500 మందికి రోజుకు రెండుసార్లు ఆహారం ఇచ్చేదని చెప్పబడింది.

రోక్సెలానా మక్కాలో పబ్లిక్ సూప్ కిచెన్‌ను కూడా నిర్మించింది.

2007లో, ఉక్రెయిన్లోని ఓడరేవు నగరమైన మారియుపోల్లో ముస్లింలు రోక్సెలానాను గౌరవించేందుకు ఒక మసీదును ప్రారంభించారు.

హుర్రెమ్ హసేకి సుల్తాన్, లేదా రోక్సెలానా, ఆధునిక టర్కీ మరియు పశ్చిమ దేశాలలో ప్రసిద్ధి చెందింది మరియు రోక్సెలానా పేరు మీద అనేక కళాత్మక రచనలు వెలుబడినవి.

1561లో, హుర్రెమ్ మరణించిన మూడు సంవత్సరాల తర్వాత, ఫ్రెంచ్ రచయిత గాబ్రియేల్ బౌనిన్ లా సోల్టేన్ పేరుతో ఒక విషాదాన్ని tragedy రాశాడు.

రోక్సెలానా ప్రేరణ తో అనేక  పెయింటింగ్స్, సంగీత రచనలు, ఒపెరా, బ్యాలెట్, నాటకాలు, అనేక నవలలు ప్రధానంగా రష్యన్, ఉక్రేనియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్,  స్పానిష్  మరియు పోలిష్ భాషలలో వెలుబడినవి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment