20 October 2022

బార్బరోస్ హేరెద్దీన్ పాసా1478-1546: లయన్ ఆఫ్ ది మెడిటరేనియన్ లేదా స్వోర్డ్ ఆఫ్ ది మెడిటరేనియన్

 

1478లో నేటి ఆధునిక గ్రీస్‌లోని లెస్వోస్ ద్వీపంలో జన్మించిన హేరెడ్డిన్ పాసా అసలు పేరు ఖిజర్ లేదా ఖిదర్. హేరెడ్డిన్ పాసా ఎర్రటి గడ్డం కారణంగా అతనికి 'బార్బరోస్సా' అని పేరు పెట్టారు. ఒట్టోమన్ సుల్తాన్ సెలీమ్1 అతనికి గౌరవ నామం 'హేరెడ్డిన్', ప్రసాదించాడు. 'హేరెడ్డిన్' అంటే 'ఉత్తమమైన విశ్వాసం కలవాడు' అని అర్ధం.

నలుగురు సోదరులలో చిన్నవాడిగా జన్మించిన హేరెడ్డిన్ పాసా, తను స్వయంగా నిర్మించిన ఓడతో ప్రస్తుత గ్రీస్‌లోని లెస్వోస్, థెస్సలోనికీ మరియు యుబోయా (Lesvos, Thessaloniki and Euboea) మధ్య సముద్ర వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాడు.

అండలస్‌లోని క్రైస్తవ క్రూసేడర్‌ల నుండి పారిపోతున్న ముస్లిం శరణార్థులకు సహాయం చేసినందున హేరెడ్డిన్ పాసా సోదరుడిని బాబా ఒరుక్ (ఓరుక్ తండ్రి) అని పిలుస్తారు. బాబా ఒరుక్ పారిపోతున్న అండలస్‌ ముస్లిం శరణార్థులను  తన నౌకాదళం సహాయం తో ఉత్తర ఆఫ్రికాకు తీసుకెళ్లాడు.

హేరెడ్డిన్ పాసా మెడిటరేనియన్‌లో నౌకాదళానికి కమాండర్‌గా తన సబార్డినేట్‌లకు విద్యను అందించడం మరియు వారితో గౌరవప్రదంగా వ్యవహరించడం చేసేవాడు. హేరెడ్డిన్ పాసా నావికులచే  ప్రేమించబడ్డాడు మరియు గౌరవించబడ్డాడు.

హేరెడ్డిన్ పాసా తెలివైనవాడు, ప్రకాశవంతమైన వాక్చాతుర్యం, దృఢ సంకల్పం కలిగిన  ధైర్యవంతుడు మరియు వివేకవంతుడు. హేరెడ్డిన్ పాసా బహుభాషావేత్త, గ్రీక్, అరబిక్, స్పానిష్, ఇటాలియన్ మరియు ఫ్రెంచ్ వంటి అన్ని ప్రధాన మధ్యధరా భాషలను మాట్లాడేవాడు.

నైట్స్ ఆఫ్ రోడ్స్ జైలు నుండి హేరెడ్డిన్ పాసా సోదరుడు ఓరుక్‌ను రక్షించిన తర్వాత, హేరెడ్డిన్ పాసా సోదరులు సెలిమ్I సోదరుడైన ఒట్టోమన్ ప్రిన్స్ సెహ్జాడే కోర్కుట్‌కు విధేయతను ప్రకటించారు.

1504లో, హేరెడ్డిన్ పాసా మరియు అతని సోదరుడు(బార్బరోస్సా సోదరులు) మధ్యధరా ప్రాంతంలో స్పెయిన్, జెనోవా మరియు ఫ్రాన్స్‌లకు వ్యతిరేకంగా నావికా ఆధిపత్యం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజేతలుగా నిలిచారు. హేరెడ్డిన్ బార్బరోస్సా సోదరులు అల్జీర్స్‌పై దాడి చేసి 1516లో స్పానిష్ నుండి అల్జీరియా ను స్వాధీనం చేసుకున్నారు. హేరెడ్డిన్ స్వాధీనం చేసుకున్న భూమిని సెలిమ్ Iకి సమర్పించాడు  మరియు అల్జీరియా ఒట్టోమన్ సామ్రాజ్యం లో భాగమైంది.

హేరెడ్డిన్ పాసా తూర్పు మధ్యధరా మరియు ఏజియన్‌లో వెనీషియన్ ఆధిపత్యాన్ని అంతం చేయడం ద్వారా సముద్ర మార్గాల భద్రతను కొనసాగించాడు.

బార్బరోస్సా సోదరులను మెడిటరేనియన్ మాజీ కోర్సెయిర్స్ అని కొందరు పిలిచినప్పటికి ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్, హేరెడ్డిన్ పాసా బార్బరోస్ నౌకాదళాన్ని సమన్వయం చేసే అడ్మిరల్ అని అన్నారు.

బార్బరోస్ హేరెడ్డిన్ పాసా ఓడ యొక్క వాస్తుశిల్పి మరియు ఇంజనీర్.  బార్బరోస్ మధ్యధరా ప్రాంతంలో అనేక నావికా కార్యకలాపాలలో పాల్గొన్నాడు మరియు అన్ని మధ్యధరా నౌకలు గురించి  హేరెడ్డిన్ పాసా కు  తెలుసు.

సెలిమ్ I మరణం తరువాత, అతని కుమారుడు సులేమాన్ (టర్క్‌లకు "చట్టకర్త/Lawgiver" మరియు యూరోపియన్లకు "అద్భుతమైన/Magnificent ") విశాల సామ్రాజ్యానికి సుల్తాన్‌గా పట్టాభిషేకం చేయబడ్డాడు. సులేమాన్. హేరెడ్డిన్ పాసాను సామ్రాజ్యానికి ప్రధాన అడ్మిరల్‌గా చేశాడు.

16వ శతాబ్దంలో ఒకానొక సమయంలో, హేరెడ్డిన్ పాసా అత్యంత శక్తివంతమైన సముద్ర ప్రభువు అని చరిత్రకారులు చెబుతారు, స్నేహితులు మరియు శత్రువుల నుండి భయం మరియు గౌరవం రెండింటినీ హేరెడ్డిన్ పాసా పొందాడు.

సుమారు రెండు దశాబ్దాలలో, హేరెడ్డిన్ పాసా ఉత్తర ఆఫ్రికా, మధ్యధరా మరియు తూర్పు అట్లాంటిక్‌ పై  తన ప్రభావాన్ని విస్తరించాడు. హేరెడ్డిన్ పాసాకి ప్రైవేట్‌ దళాలు మరియు ల్యాండ్ ఆర్మీ రెండూ ఉన్నాయి. హేరెడ్డిన్ పాసా దక్షిణ ఐరోపా తీరంపై దాడి చేశాడు మరియు అమెరికా నుండి బంగారంతో వస్తున్న స్పానిష్ నౌకలను స్వాధీనం చేసుకున్నాడు.

మధ్యధరా ప్రాంతంలో ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క శక్తి పెరగడంతో, అది 'ఒట్టోమన్ సరస్సు'గా మారబోతోంది, పోప్ పాల్ III,  1538లో అగ్రశ్రేణి ఒట్టోమన్ అడ్మిరల్‌ హేరెడ్డిన్ పాసా కు వ్యతిరేకంగా సముద్ర యుద్ధాన్ని నిర్వహించాడు. పోప్ యొక్క నౌకాదళ క్రూసేడ్‌కు ఆండ్రియా డోరియా నాయకత్వం వహించారు. డోరియా దాదాపు 250 సభ్యుల నౌకాదళానికి నాయకత్వం వహించగా, హేరెద్దీన్ పాసా నౌకాదళంలో 122 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

ప్రివెజాలో సెప్టెంబరు 28, 1538 నాటి యుద్ధంలో ఒట్టోమన్ నావికాదళం - హేరెద్దీన్ పాసా ఆధ్వర్యంలో - పది క్రైస్తవ కూటమి నౌకలను ముంచి, ముప్పైకి పైగా నౌకలను స్వాధీనం చేసుకుంది. ఒట్టోమన్ నేవీ 400 మంది సైనికులను కోల్పోగా  క్రైస్తవ కూటమికి చెందిన దాదాపు మూడు వేల మంది సైనికులు పట్టుబడ్డారు.

పోప్ పాల్III ద్వారా కూటమికి వ్యతిరేకంగా టర్కీ  అడ్మిరల్ హేరెడ్డిన్ పాసా సాధించిన విజయాలు మధ్య మరియు తూర్పు మధ్యధరా ప్రాంతంలో తరువాతి కాలం లో ఒట్టోమన్ ఆధిపత్య విస్తరణకు దారి తీసాయి.

భారీ విజయం తర్వాత, హేరెడ్డిన్ పాసా ఇస్తాంబుల్‌ వెళ్లి, టాప్‌కాపి ప్యాలెస్‌లో సులేమాన్ ది మాగ్నిఫిసెంట్‌ని కలిసాడు. హేరెడ్డిన్ పాసా ఒట్టోమన్ నేవీకి చెందిన కప్తాన్-ఇ-డెర్య (చీఫ్ అడ్మిరల్) మరియు ఒట్టోమన్ నార్త్ ఆఫ్రికాకు చెందిన బేలర్‌బేయి (గవర్నర్‌ల గవర్నర్)గా పదోన్నతి పొందాడు. హేరెడ్డిన్ పాసా కి రోడ్స్ గవర్నర్ పదవి కూడా ఇవ్వబడింది. హేరెద్దీన్ పాసా తునిస్ మరియు ట్రిపోలీలను కూడా స్వాధీనం చేసుకున్నాడు.

హేరెద్దీన్ పాసా బార్బరోస్సా మధ్యధరా ప్రాంతంలో స్థాపించిన  ఒట్టోమన్ ఆధిపత్యo  1571 లెపాంటో యుద్ధం వరకు కొనసాగింది. లెపాంటోలో ఓడిపోయిన తర్వాత కూడా, ఒట్టోమన్లు ​​తమ నౌకాదళాన్ని త్వరగా పునర్నిర్మించారు. సైప్రస్ మరియు రిపబ్లిక్ ఆఫ్ వెనిమాటియా నుండి మోరియా మరియు డాల్మాటియాలోని ఇతర భూభాగాలను స్వాధీనం చేసుకున్నారు. 1571 మరియు 1572 మధ్య, మరియు 1574లో స్పెయిన్ నుండి ట్యునీషియాను తిరిగి స్వాధీనం చేసుకున్నారు

జూలై 4, 1546న ఇస్తాంబుల్‌లోని బెసిక్టాస్‌లో హేరెడ్డిన్ పాసా మరణిoచినాడు.

 

లెగసీ:

టర్కీ ఇటీవల నల్ల సముద్రంలో ఒక పెద్ద గ్యాస్ నిల్వను కనుగొనడంతో, ప్రపంచ వేదికపై ఒట్టోమన్‌లను గొప్ప నౌకాదళ శక్తిగా మార్చిన ప్రసిద్ధ అడ్మిరల్ హేరెడ్డిన్ పాసా వంటి చారిత్రాత్మక వ్యక్తుల గురించి మరింత తెలుసుకోవాలనుకునే ఉత్సుకత పెరిగింది.

1.16వ శతాబ్దపు ఒట్టోమన్ నౌకాదళ అడ్మిరల్ బార్బరోస్ హేరెద్దీన్ పాసా మూడు ఖండాల సముద్ర సరిహద్దులపై టర్కీ నౌకాదళ ఆధిపత్యమును ప్రదర్శించి   రాబోయే తరాల టర్క్‌లకు స్ఫూర్తినిచ్చాడు. 

2.మధ్యధరా సముద్రం యొక్క సింహం అని పిలువబడే బార్బరోస్ హేరెద్దీన్ పాసా 16వ శతాబ్దం ప్రారంభంలో ఒట్టోమన్ నౌకాదళం యొక్క గ్రాండ్ అడ్మిరల్‌గా ఒట్టోమన్ నౌకా దళ విశేష సామర్ద్యమును ప్రదర్శించాడు. అడ్మిరల్‌ హేరెద్దీన్ పాసా పర్యవేక్షణలో, ఒట్టోమన్ నౌకాదళ బలం అనేక రెట్లు పెరిగింది మరియు సముద్ర ఆక్రమణలు కూడా పెరిగాయి.

3.టర్కీలో అడ్మిరల్‌ హేరెడ్డిన్ పాసాకు ఇప్పటికీ అపారమైన గౌరవం ఉంది. 2019లో బ్లూ హోమ్‌ల్యాండ్ నేవల్ డ్రిల్ సమయంలో, టర్కీ యుద్ధనౌకలు ఇస్తాంబుల్‌లోని బెసిక్టాస్ జిల్లా తీరంలో ప్రయాణించేటప్పుడు అడ్మిరల్‌ హేరెడ్డిన్ పాసా సమాధి అయిన బార్బరోస్ సమాధి వద్ద మూడుసార్లు ఫోఘోర్న్ foghorn మోగించడం ద్వారా వందనం సమర్పించాయి.

4.టర్కీ నౌకాదళ డ్రిల్‌కు ముందు, అడ్మిరల్‌ హేరెడ్డిన్ పాసా సమాధి (బార్బరోస్ సమాధి) వారానికి సగం రోజులు సందర్శకులకు తెరిచి ఉండేది. ఇది ఇప్పుడు వారానికి ఐదు రోజులు తెరిచి ఉంది, ఆధునిక టర్కిష్ జీవితంలో అడ్మిరల్‌ హేరెద్దీన్ పాసా బలమైన ప్రేరణగా ఉన్నాడు.

5.టర్కీ ప్రభుత్వం తన ప్రధాన సముద్ర డ్రిల్లింగ్ నౌకలకు బార్బరోస్ హేరెద్దీన్ పాసా తో పాటు ఇతర ప్రముఖ ఒట్టోమన్ వ్యక్తులు - ఫాతిహ్, యవుజ్ మరియు కనుని పేరు పెట్టింది.

6. హేరెడ్డిన్ పాసా నౌకాదళ పాఠశాలలను ప్రారంభించాడు మరియు హేరెడ్డిన్ పాసా బోధనలు చాలా మంది ఒట్టోమన్ నావికులు మరియు కమాండర్‌లకు మార్గనిర్దేశం చేశాయి.

7.హేరెద్దీన్ పాసా బార్బరోస్సా కు ముందు, తరువాత వచ్చిన కొద్దిమంది గొప్ప ఒట్టోమన్ అడ్మిరల్స్ మాత్రమె హేరెద్దీన్ పాసా బార్బరోస్సా లాగా అఖండమైన నావికా శక్తిని సాధించారు.

8.హేరెద్దీన్ పాసా బార్బరోస్సా ని సమాధి ఇస్తాంబుల్‌లోని బెసిక్తాస్‌లోని బార్బరోస్ పార్క్‌ లో ఉంది. ఇస్తాంబుల్ నావల్ మ్యూజియం పక్కనే హేరెద్దీన్ పాసా బార్బరోస్సా విగ్రహం కూడా ఉంది.

9.బార్బరోస్ బౌలేవార్డ్,  బోస్ఫరస్‌లోని హేరెద్దీన్ పాసా బార్బరోస్సా సమాధి నుండి ప్రారంభమై లెవెంట్ మరియు మస్లాక్ వ్యాపార జిల్లాలు మరియు వెలుపల వరకు నడుస్తుంది. బెసిక్టాస్‌లోని ఉస్కుడార్ మరియు ఎమినాన్ ఓడరేవు కు  హేరెద్దీన్ పాసా బార్బరోస్సా పేరు పెట్టబడింది.

10.హేరెద్దీన్ పాసా బార్బరోస్సా సమాధి వద్ద సెల్యూట్ కొట్టకుండా ఏ నౌకాదళం సెరాయ్ పాయింట్‌ను క్లియర్ చేయలేదు. టర్కిష్ నౌకాదళానికి చెందిన అనేక యుద్ధనౌకలు మరియు ప్రయాణీకుల నౌకలకు హేరెద్దీన్ పాసా బార్బరోస్సా  పేరు పెట్టారు.

11.బ్రిటీష్ చరిత్రకారుడు, ఎడ్వర్డ్ కేబుల్ చటర్టన్, హేరెద్దీన్ పాసా బార్బరోస్సా ని

"మధ్యధరా సముద్ర జలాలపై పేరు మోసిన అత్యంత తెలివైన వ్యూహకర్తలలో ఒకడు” అని పేర్కొన్నాడు.

12.పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ ఫిల్మ్ సిరీస్‌లోని కల్పిత పాత్ర అయిన హెక్టర్ బార్బోస్సా , హేరెడ్డిన్ పాసా బార్బరోస్సా యొక్క  ప్రతిరూపం.  

13.2021 టర్కిష్ టీవీ సిరీస్ బార్బరోస్: స్వోర్డ్ ఆఫ్ ది మెడిటరేనియన్‌లో, హేరెడ్డిన్ పాసా బార్బరోస్సా పాత్రను నటుడు ఉలాస్ ట్యూనా ఆస్టెప్ పోషించారు.

14.1546లో హేరెడ్డిన్ పాసా మరణంతో, ఒట్టోమన్ సామ్రాజ్యం ఇలా ప్రకటించింది: "సముద్రపు నాయకుడు చనిపోయాడు".

15.ఇస్తాంబుల్‌లోని బెసిక్టాస్‌లో హేరెడ్డిన్ పాసా మరణం తర్వాత అనేక విద్యా మరియు సాంస్కృతిక సంస్థలు, పరిసరాలు, వీధులు మరియు మసీదులకు హేరెడ్డిన్ పాసా పేరు పెట్టారు

No comments:

Post a Comment