11 August 2024

అలీ కరీం 1857లో పాట్నాలో విప్లవకారులకు నాయకత్వం వహించాడు Ali Karim led the revolutionaries at Patna in 1857

 





జస్టిన్ ఫించ్ అనే ఆంగ్ల చరిత్రకారుడి ప్రకారం బీహార్-పాట్నా  లో జరిగిన కుట్ర కు మీర్‌షాహెబ్‌లు (మీర్ అబ్దుల్లా కుటుంబం) మరియు మౌల్వీ అలీ కరీమ్‌లు నాయకత్వం వహించారు.

మౌల్వీ అలీ కరీం1857లో పాట్నాలో విప్లవ సేనలకు అధిపతిగా ఉండేవారు. తిరుగుబాటు చేసినవారిలో బెట్టియా పాలకునితో సహా ముస్లింలు మరియు హిందువులు కూడా ఉన్నారు. తిరుగుబాటు విజయవంతమైతే అలీ కరీం బీహార్ ప్రావిన్స్‌కు పాలకుడిగా ఎన్నికయ్యేవాడు.

బెహార్ జిల్లాకు చెందిన జమీందార్ అయిన మౌల్వీ అలీ కరీం పాట్నా నగరం సరున్ మరియు తిర్హూట్ జిల్లాలలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాడు.

1857 జూన్‌లో ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా కుట్ర పన్నినందుకు ముజఫర్‌పూర్‌కు చెందిన వారిస్ అలీ, జమాదార్‌ను అరెస్టు చేయడంతో విప్లవకారుల ప్రణాళిక వెలుగులోకి వచ్చింది. అలీ కరీం నుండి అనేక లేఖలు వారిస్ అలీ వద్ద కనుగొనబడ్డాయి మరియు బీహార్‌లోని ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద కుట్ర బయటపడినది.

1857 జూన్ 12 దియోగర్‌లో భారతీయులు తిరుగుబాటు చేసిన రోజు అలీ కరీం,  వారిస్ అలీకి, వ్రాసిన ఒక లేఖలో, “విషయాలు ఇప్పుడు వేరే మలుపు తిరుగుతున్నాయి. మీరు వెంటనే రావడం చాలా అవసరం. ఈ రోజు నేను నా పెద Peada, మున్సూర్ అలీని మీకు ఉత్తరంతో పంపాను; నేను మరొక లేఖ చాలా జాగ్రత్తగా పోస్ట్ ద్వారా పంపినాను.  లేఖ చూసిన వెంటనే రండి. ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. ప్రతిదీ మీపై ఆధారపడి ఉంటుంది

."మీరు రాకపోతే  మాలాంటి పేదల పరువు, ఆస్తులు, ప్రాణ రక్షణ అసాధ్యమే.. ఇలాంటి సమయంలో మీకు  విషయాలు తెలవాలి; లేకపోతే నాలాంటి బలహీనుడూ, వృద్ధుడూ ఏమీ చేయలేడు.. మీ రాక కోసం నేను ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను.

కొన్ని రోజుల తర్వాత వారిస్ అలీని బ్రిటిష్ వారు ఉరితీశారు కానీ అలీ కరీంను పట్టుకోలేకపోయారు. V. D. సావర్కర్ ఇలా వ్రాశాడు, “తిర్హుట్ జిల్లాకు చెందిన పోలీసు జమాదార్ వారిస్ అలీ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది మరియు అధికారులు అకస్మాత్తుగా అతని ఇంటిని చుట్టుముట్టారు మరియు అతనిని ఖైదీగా చేసారు. ఇంగ్లీషు సర్వీస్‌లో ఉన్న వారిస్ అలీ అనే జమాదార్ అప్పుడే గయాలోని అలీ కరీం అనే విప్లవ నాయకుడికి ఉత్తరం రాస్తున్నాడు!

వారిస్ అలీ ఇంట్లో స్వాధీనం చేసుకున్న విప్లవాత్మక సాహిత్యం యొక్క సాక్ష్యంపై, వారిస్ అలీ కి వెంటనే మరణశిక్ష విధించబడింది. వారిస్ అలీ ని  పరంజా(ఉరి-కొయ్య) వద్దకు తీసుకువచ్చినప్పుడు, "ఇక్కడ ఎవరైనా నిజమైన స్వరాజ్య భక్తుడు ఉంటే, నన్ను విడిపించండి!" అని అరిచాడు. కానీ, వారిస్ అలీ అభ్యర్థన ప్రజలకు వినబడకముందే, వారిస్ అలీ నిర్జీవ శరీరం పరంజా నుండి వేలాడుతోంది!

 పాట్నా కమీషనర్ 2 జూలై 1857న కరీం అలీని అరెస్టు చేయాలని ఆదేశించాడు. కంపెనీ సైనికులు,  అధికారులతో సహా  అలీ కరీం ఇంటికి చేరుకోగానే, వారి రాక ముందే కరీం అలీ కొంతమంది పరిచారకులతో కలిసి ఏనుగుపై వెళ్లినట్లు గుర్తించారు. కంపెనీ అధికారులు కరీం అలీ ని వెమ్మడించి పట్టుకొనే ప్రయత్నాలు విఫలం చెందాయి.

3 జూలై 1857న పాట్నాలో తిరుగుబాటుకు నాయకత్వం వహించే ప్రణాళిక దీని తర్వాత కార్యరూపం దాల్చలేదు. అలీ కరీం అర్రాకు చెందిన కున్వర్ సింగ్‌తో సన్నిహిత సహకారంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించాడు.

దత్తా అనే బీహార్ ప్రముఖ చరిత్ర కారుడి ప్రకారం బీహార్ మరియు దాని వెలుపల బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలలో అలీ కరీం ముఖ్యమైన పాత్ర పోషించాడు. అలీ కరీం, బీహార్ నుండి పారిపోయే సమయంలో, కున్వర్ సింగ్‌తో కొంత కాలం గడిపాడు తరువాత దశలో అమర్ సింగ్, బీహార్ నుండి బహిష్కరించబడిన సమయంలో అమర్ సింగ్ తో క్రమం తప్పకుండా ఉత్తరప్రత్యుత్తరాలు చేస్తూ, అమర్ సింగ్ తన బలగాలతో బీహార్‌కు రావాలని మరియు ఆంగ్లేయులను తరిమికొట్టడంలో తన తో చేతులు కలపాలని అలీ కరీం,  అమర్ సింగ్ కి వ్రాసాడు.

అలీ కరీం, కున్వర్ సింగ్‌ మరియు  అమర్ సింగ్ ప్రయత్నాలు ఉద్యమంలో భాగంగా ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది.

అలీ కరీం విప్లవకారులతో కలిసి గోరఖ్‌పూర్ మరియు వారణాసికి వెళ్లారు. దత్తా ప్రకారం  అలీ కరీం బీహార్ నుండి పారిపోయిన తర్వాత U. P.లో అతని కార్యకలాపాలు మరియు బీహార్‌లో తిరిగి ప్రవేశించడానికి అలీ కరీం ప్రణాళికల గురించి  సమాచారం ఉంది. డివిజనల్ కమీషనర్, పాట్నా, మరియు అజంగఢ్, గోరఖ్‌పూర్, తదితర మేజిస్ట్రేట్‌ల నివేదికలలోని కొన్ని సూచనల ప్రకారం బ్రిటిష్ అధికారులు అలీ కరీం పట్ల భయపడినది వాస్తవం. అమర్ సింగ్‌తో సఖ్యతగా వ్యవహరించడానికి బీహార్‌కు తిరిగి రావాలనే అలీ కరీం ప్రణాళిక కంపెనీ ప్రభుత్వానికి రాబోయే ప్రమాదాలకు నిదర్శనం.

బ్రిటీష్ వారు అలీ కరీమ్‌ను పట్టుకోలేకపోయారు, అలీ కరీమ్‌ ఆస్తులను జప్తు చేశారు మరియు అలీ కరీమ్‌ను పట్టుకోవడానికి బహుమతి ప్రకటించారు. పాట్నా కమీషనర్ కంపెనీ ప్రభుత్వానికి ఇలా తెలియజేసారు, "నేరస్థుడు అలీ కరీమ్‌ను పట్టుకునేందుకు అన్ని విధాలా కృషి చేశారు, కానీ ఇప్పటివరకు విజయం సాధించలేదు: అలీ కరీమ్‌ అరెస్టు కోసం 2,000 రూపాయలు బహుమతిగా  ప్రకటించబడ్డాయి.

No comments:

Post a Comment