8 August 2024

ఝాన్సీలో జరిగిన 1857 తిరుగుబాటుకు బక్షిష్ అలీ నాయకత్వం వహించాడు Bakhshish Ali led the revolt of 1857 in Jhansi

 

బక్షిష్ అలీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహించే జైలు అధిపతి(దరోగా). 4 జూన్ 1857న ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీకి చెందిన భారతీయ సిపాయిలు ఝాన్సీలో స్వాతంత్ర్య పతాకాన్ని ఎగురవేసినప్పుడు, బక్షిష్ అలీ ఆ బృందానికి నాయకుడు.

 జైల్ దరోగా  అయిన బక్షిష్ అలీ (బక్షిష్ అలీ) ఝాన్సీలో జరిగిన 1857 తిరుగుబాటుకు ప్రధాన నాయకుడు; బక్షిష్ అలీ ఝాన్సీ లో కంపెనీ అధికారుల హత్యలో పాల్గొన్నాడు మరియు తిరుగుబాటుదారులను ఢిల్లీకి తీసుకెళ్లిన వ్యక్తి.

భారతీయ విప్లవకారులు ఝాన్సీ కోటపై జరిపిన దాడిలో చాలా మంది ఆంగ్ల అధికారులు చంపబడ్డారు మరియు. బక్షిష్ అలీ తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించి కంపెనీ అధికారి కెప్టెన్ స్కేన్‌(skene)ను చంపాడు.

భక్షిష్ అలీ ఖజానాను స్వాధీనం చేసుకున్నాడు, రాణి(ఝాన్సీ)కి కొంత భాగాన్ని చెల్లించాడు మరియు కొంత యుద్ధం కోసం ఢిల్లీకి పంపాడు. బ్రిటిష్ సైన్యం భక్షిష్ అలీ పై  2,000 రూపాయల బహుమతిని ప్రకటించింది.

ఆంగ్ల ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత బక్షిష్ అలీ  ఝాన్సీని పాలించాడు. జైలు దరోగా  బక్షిష్ అలీ మరియు ఇతరులు జూలై 1857 మరియు మార్చి 1858 మధ్య ఝాన్సీలో ప్రభుత్వాన్ని నడిపించే ఒక రకమైన కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన వారిలో ఉన్నారు.

ఝాన్సీ రాణి ఆంగ్లేయులకు గట్టిపోటీ ఇవ్వడం లేదని బక్షిష్ భావించి ఝాన్సీ రాణి ని విడిచిపెట్టి, లలిత్‌పూర్‌లో బాన్‌పూర్ చీఫ్ మర్దాన్ సింగ్‌తో చేరాడు. ఇంగ్లీష్ ఇంటెలిజెన్స్ ప్రకారం  “బక్షిష్,  ఝాన్సీ రాణీని ఆంగ్ల దళాలతో పోరాడాలా వద్దా అని అడిగాడు, రాణీ పోరాడను, బ్రిటిష్ అధికారులు ఝాన్సీకి వచ్చినప్పుడు తన కింద ఉన్న అన్ని జిల్లాలను తిరిగి వారికి అప్పగిస్తాను అని అన్నది.. దానితో దరోగా బక్షిష్ రాణీని విడిచిపెట్టి తన సోదరుడు వజీర్ అలీతో కలసి  లలిత్‌పూర్‌లో గల బాన్‌పూర్ చీఫ్ మర్దాన్ సింగ్‌తో చేరాడు .

బక్షిష్ అలీ తరువాత 1859లో బంధించబడ్డాడు మరియు మరణశిక్ష విధించబడ్డాడు.

బక్షిష్ అలీ చరిత్రపుటలలో  ఎక్కని విప్లవకారులకు నాయకత్వం వహించిన వ్యక్తి. బక్షిష్ అలీ లాంటి వ్యక్తులు దేశ చరిత్రలో మరుగునబడి పోయారు.

 

 

 

No comments:

Post a Comment