11 August 2024

లోహియా భావాలు: క్విట్ ఇండియా ఉద్యమం: అహింసా ప్రతిఘటనకు ఒక ప్రత్యేక నమూనా Quit India Movement: A Unique Model of Non-Violent Resistance

 





ఆగస్ట్ క్రాంతి (విప్లవం) అని కూడా పిలువబడే క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైన అధ్యాయం. క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగింది, క్విట్ ఇండియా ఉద్యమం లో భారతదేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు అపూర్వమైన ధైర్యం మరియు సహనాన్ని ప్రదర్శించారు.

ప్రముఖ సోషలిస్ట్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, రష్యన్ విప్లవాత్మక ఆలోచనాపరుడు లియోన్ ట్రోత్స్కీని ఉటంకిస్తూ, రష్యా విప్లవంలో 1% జనాభా పాల్గొన్నారని, భారతదేశ ఆగస్టు విప్లవంలో 20% మంది దేశ ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు.

కానీ, క్విట్ ఇండియా ఉద్యమం-అహింసా లేదా హింసాత్మకమైన ఉద్యమమా అనే చర్చకు ప్రతిసారీ కేంద్రంగా ఉంది. మహాత్మా గాంధీ ఆగస్టు 8, 1942న ఉద్యమం ప్రారంభానికి ముందు చేసిన ప్రసంగం చరిత్రలో తనదైన స్థానాన్ని కలిగి ఉంది. ప్రసంగం నుండి ఒక భాగ excerpt  సారాంశం ఇలా ఉంటుంది. 

ఇదిగో ఒక మంత్రం, చిన్నది, నేను మీకు ఇస్తున్నాను. మీరు దానిని మీ హృదయాలపై ముద్రించుకోవచ్చు మరియు మీ ప్రతి శ్వాసద్వారా దాన్ని వ్యక్తీకరిచండి.  మంత్రం: డూ ఆర్ డై’. మేము భారతదేశాన్ని విడిపిస్తాము లేదా ఆ ప్రయత్నంలో చనిపోతాము; బానిసత్వం యొక్క శాశ్వతత్వాన్ని చూడడానికి మేము జీవించము. ప్రతి నిజమైన కాంగ్రెస్‌వాది లేదా మహిళ దేశాన్ని బానిసత్వంలో చూడడానికి సజీవంగా ఉండకూడదనే దృఢ సంకల్పంతో పోరాటంలో పాల్గొంటారు. అది నీ ప్రతిజ్ఞగా ఉండనివ్వు.

గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం లో హింసను ఏ రూపంలోనూ రెచ్చగొట్టడం గురించి సూచించలేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో మానవాళి భయంకరమైన విధ్వసం లో చిక్కుకున్న సమయంలో అహింసాయుత ప్రతిఘటన కోసం ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు ప్రత్యేకమైనది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ఆగస్ట్ 8, 1942న క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. మరుసటి రాత్రి కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్టు చేశారు.

కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టుల వలన  క్విట్ ఇండియా ఉద్యమం కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం మరియు తెలియజేయడం సాధ్యం కాలేదు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (CSP) యొక్క యువ నాయకత్వం చురుకుగా మారింది కానీ అజ్ఞాతం లో పని చేయాల్సి వచ్చింది. జయప్రకాష్ నారాయణ్ (జెపి) అజ్ఞాతంలో ఉన్నప్పుడు విప్లవకారులకు మార్గనిర్దేశం చేయడానికి మరియు ఉద్యమం యొక్క స్వభావం మరియు కార్యాచరణను వివరించడానికి రెండు సుదీర్ఘ లేఖలు రాశారు.

వాస్తవాలు విరుద్ధంగా ఉన్నప్పటికీ, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ పాలనను కూలదోయడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని వైస్రాయ్ లార్డ్ లిన్లిత్‌గో ఆరోపించారు. రామ్ మనోహర్ లోహియా మార్చి 2, 1946న జైలు నుండి వైస్రాయ్‌కి సుదీర్ఘ లేఖ రాశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం యొక్క క్రూరమైన మరియు కుట్రపూరితమైన పాత్రను ఈ లేఖ వివరిస్తుంది..

21 నెలల పాటు ఉద్యమంలో అండర్‌గ్రౌండ్ పాత్ర పోషించిన తరువాత, లోహియా మే 10, 1944న బొంబాయిలో అరెస్టు చేయబడ్డాడు. లోహియా మొదట లాహోర్ కోటలో, ఆపై ఆగ్రాలో ఖైదు చేయబడ్డాడు. లాహోర్‌లో బ్రిటీష్ పోలీసుల చేతిలో అమానవీయ హింసను అనుభవించారు. లోహియా జూన్ 1946లో విడుదలయ్యాడు. మధ్యంతర కాలంలో, లోహియా తండ్రి మరణించారు, కానీ లోహియా పెరోల్‌ను తిరస్కరించారు

తన లేఖలో, లోహియా,  లిన్‌లిత్‌గో ఆరోపణలను ఖండించారు మరియు ఉద్యమం లో నిరాయుధ౦గా పాల్గొనేవారిపై భయంకరమైన దౌర్జన్యాలకు పాల్పడిన బ్రిటిష్ పరిపాలన గురించి మాట్లాడారు. బ్రిటీష్ వారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేయడం జలియన్ వాలాబాగ్ లాంటి అనేక సంఘటనలకు దారితీసిందని, అయితే భారతదేశ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం అహింసా మార్గంలో పట్టుదలతో ఉన్నారని లోహియా అన్నారు.

లోహియా ఇలా వ్రాశారు:"మేము సాయుధ తిరుగుబాటును ప్లాన్ చేసి ఉంటే మరియు మా సమూహాలను హింసను ఆశ్రయించమని కోరినట్లయితే, నన్ను నమ్మండి, లిన్‌లిత్‌గో గాంధీజీ ఈ రోజు స్వేచ్ఛా ప్రజల నుండి మరియు వారి ప్రభుత్వం నుండి మీకు ఉపశమనం reprieve కల్పించి ఉండేవారు."

వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో యొక్క అనాగరిక పరిపాలన పై   వైస్రాయ్‌ను ప్రశ్నిస్తూ లోహియా ఇలా వ్రాశారు: మీరు ఫాసిస్ట్ ప్రతీకార చర్యల గురించి మాట్లాడుతున్నారు; మీరు అరెస్ట్ చేయలేని దేశభక్తుల భార్యలను మీ మనుషులు అత్యాచారం చేసి చంపారు. అవును, మీరు మరియు మీ అధికారులు ఈ చర్యలకు జవాబు చెప్పే  సమయం త్వరలో వస్తుంది.

 “ఆ బాధల క్షణాలలో, ఉద్యమ సమయంలో పదివేల మంది భారతీయుల త్యాగాలకు తగిన మూల్యం చెల్లించబడుతుందనే ఆశతో లోహియా ఉన్నారు మరియు లోహియా ఇలా వ్రాశారు: నేను సంతోషంగా లేను. ఇతరుల కోసం బాధపడటం మరియు సామాన్య మానవుడికి సరియిన  మార్గం చూపడం భారతదేశం యొక్క విధి. నిరాయుధ సామాన్యుడి చరిత్ర ఆగస్టు 9 భారత విప్లవం నుండి ప్రారంభమవుతుంది.

లోహియా ఇంకా స్పష్టం చేసారు.: "మేము భవిష్యత్తు గురించి ఆసక్తిగా ఉన్నాము. మీరు గెలిచినా, యాక్సిస్ గెలిచినా, చుట్టూ నిరాశ మరియు చీకటి ఉంటుంది. కాని స్వేచ్ఛా భారతదేశం ఈ యుద్ధాన్ని ప్రజాస్వామ్య ముగింపుకు తీసుకురాగలదు అనే ఆశల మెరుపు ఉంది..

"స్వాతంత్ర్య సైనికులకు" JP రాసిన రెండు లేఖలు డిసెంబర్ 1942 మరియు సెప్టెంబర్ 1943లో వ్రాయబడ్డాయి. JP రాసిన రెండు లేఖలలో, ముఖ్యంగా మొదటి లేఖనంలో, JP హింస-అహింస అనే ప్రశ్నను సుదీర్ఘంగా లేవనెత్తారు మరియు చర్చించారు. భారతదేశంలోని ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడే పద్ధతి ఏమిటో నిర్ణయి౦చే హక్కు బ్రిటిష్ ప్రభుత్వానికి లేదని JP మండిపడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అంతర్లీనంగా చంపడం లేదా గాయపరచకూడదనే సంకల్పం ఉందని JP అన్నారు.

లోహియా ఇంకా ఇలా రాశారు:బ్రిటీష్ రాజ్‌కు అడ్డంకులు సృష్టించడం, అహింసా మార్గాల ద్వారా బ్రిటీష్ రాజ్‌ ను  స్తంభింపజేయడం ద్వారా బ్రిటీష్ రాజ్‌ ని పడగొట్టడం క్విట్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క ప్రాథమిక మంత్రం మరియు మీరు అహింస పరిధిలో ప్రతిదీ చేయగలరుఅనేది మా ధ్రువ నక్షత్రం. ఆగస్ట్ 1942 నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ సంస్థలు అనుసరించిన కార్యక్రమం యొక్క మేధోపరమైన ప్రాతిపదిక అహింస. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో దాని నాయకులు సూచించినట్లు అహింస పాటించబడుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

1942లో (మరియు 1857లో కూడా) హింసలో భారతీయ పాత్రపై మేధావులకు చాలా అవసరమైన దృక్పథాన్ని అందించడానికి 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం-అహింసాత్మక ప్రతిఘటన ఉద్యమం ఎలా సాధ్యమైంది అనేది ఖచ్చితంగా తీవ్రమైన విశ్లేషణను కోరుతుంది.


(రచయిత డాక్టర్ ప్రేమ్ సింగ్ -సోషలిస్ట్ ఉద్యమంతో అనుబంధం కలిగి ఉన్నారు. డాక్టర్ ప్రేమ్ సింగ్ -ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఉపాధ్యాయుడు మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ, సిమ్లాలో ఫెలో) .

 

స్వేచ్చా అనువాదం: ముహమ్మద్ అజ్గర్ అలీ.

 

 

 

 

No comments:

Post a Comment