ఉమర్ సోభానీ ఒక జాతీయవాద విప్లవకారుడు
మరియు గాంధీవాద సమర్ధకుడు. ఉమర్ సోభానీ గాంధీజీ పద్దతులను మరియు గాంధీ
సిద్దాంతాలను అనుసరించేవాడు.
ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ మిల్స్
ప్రముఖ కాంగ్రెస్ సభ్యుడు మరియు దాతృత్వ వ్యాపారవేత్త ఉమర్ సోభానీకి చెందినది. ఉమర్
సోభానీ జాతీయవాద ఉద్యమానికి చాలా ఆర్థిక సహాయాన్ని అందించాడు మరియు మహాత్మా
గాంధీకి అత్యంత సన్నిహితుడు..
ఉమర్ సోభానీ సోభానీ ముంబయికి చెందిన
ధనిక వ్యాపారవేత్త
మరియు పత్తి వ్యాపారం చేసేవాడు. ఉమర్ సోభానీ కి చెందిన ఎల్ఫిన్‌స్టోన్ మిల్స్
తర్వాత అనేక జాతీయవాద ర్యాలీలు మరియు సమావేశాలకు సహజ వేదికగా మారింది. సహాయ
నిరాకరణ-ఖిలాఫత్ ఉద్యమంలో ఉమర్ సోభానీ చురుకుగా పాల్గొన్నారు.
గాంధీజీ సంపాదకత్వం వహించిన యంగ్ ఇండియా అనే ఆంగ్ల
పత్రికను మరియు గుజరాతీ జర్నల్ అయిన నవజీవన్‌ను ఉమర్ సోభానీ ప్రారంభించారు మరియ గాంధీజీ సంపాదక
బాద్యతలు నిర్వహిoచేవారు. ఉమర్ శోభానీ, శంకర్‌లాల్ బ్యాంకర్ మరియు ఇందులాల్ యాగ్నిక్, యంగ్ ఇండియా, నవజీవన్, పత్రికలతో సంభంధం కలిగి ఉన్నారు. జాతీయవాద
దినపత్రిక, బాంబే
క్రానికల్‌తో కూడా అనుబంధం కలిగిఉన్నారు..
సోభానీ, శంకర్‌లాల్ బ్యాంకర్
మరియు యాగ్నిక్ గాంధీ కోరిక మేరకు గాంధీజీ “యంగ్
ఇండియా మరియు నవజీవన్” సంపాదకత్వం
స్వీకరించారు. మొదట్లో వారానికి
రెండుసార్లు ‘యంగ్ ఇండియా’ మరియు
ప్రతి వారం ‘నవజీవన్’ బాంబే క్రానికల్
ప్రచురణను పునఃప్రారంభించినప్పుడు, యంగ్ ఇండియా వారపత్రికగా మారింది.
చరఖా (స్పిన్నింగ్ వీల్) అనేది
మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమానికి పర్యాయపదం గా మారింది మరియు దానిని విజయవంతం
చేయడంలో సోభానీ కీలక పాత్ర పోషించారు. ఆ రోజులలో భారతీయ స్పిన్నింగ్ మిల్లులు నూలు(Yarn)ను మిల్లులో తయారు చేసిన గుడ్డగా మార్చేవి..
గాంధీజీ తన స్వదేశీ ఉద్యమం లో
భాగంగా స్పిన్నింగ్ మిల్లుల స్థానం లో నూలు తయారు చేయగల చక్రాల (చరఖా-స్పిన్నింగ్ వీల్)
కోసం వెతకమని సహచరులను కోరాడు. 1917 లో గంగాబెన్ మజ్ముదర్ అనే మహిళ, తాను ఒక చక్రాన్ని కనుగొంటానని గాంధీజీ కి వాగ్దానం
చేసింది.
గంగాబెన్
మజ్ముదర్ చరఖా నడిపే వందలాది మందిని బరోడా రాచరిక రాజ్యం లోని విజాపూర్‌లో
కనుగొన్నారు. గాంధీ స్నేహితుడు ఉమర్ సోభానీ తన సొంత బొంబాయి మిల్లుల నుండి పంపిన
ముడి నూలుతో గాంధి ఆశ్రమo లో చరఖా సహాయం
తో నూలు వడికేవారు..
రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ
ప్రతిజ్ఞపై సంతకం చేసిన 20 మందిలో సోభానీ ఒకరు. 1918లో సహాయ నిరాకరణ ఉద్యమం లో గాంధీకి
మద్దతు ఇచ్చిన సహచరులలో సోభానీ ఒకరు.
“1921 లో బొంబాయిలో ఉమర్ సోభానీ. విదేశి వస్త్ర దహన
ఉద్యమం లో పాల్గొన్నారు. ఈ ఉద్యమం సమయంలో 1921 జూలై 31న మహాత్మా గాంధీ సమక్షంలో ఎల్ఫిన్‌స్టోన్ మిల్స్
ప్రాంగణంలో పెద్ద మొత్తంలో విదేశీ వస్త్రాలు కాల్చివేయబడ్డాయి. 1921 జూలై 31న పది నుంచి పన్నెండు
వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. షౌకత్ అలీని అరెస్టు చేసిన తర్వాత, గాంధీ అక్టోబర్‌లో
ఇక్కడ జరిగిన విదేశీ వస్త్రాల భోగి మంటలకు హాజరయ్యారు.
1921. నవంబరు 17న బొంబాయిలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాకను
నిరసిస్తూ, ఎల్ఫిన్‌స్టోన్
మిల్స్ లో జరిగిన నిరసన ప్రదర్శనలో దాదాపు 25,000 మంది కార్మికులతో కూడిన భారీ సమావేశo౦ జరిగింది.
విదేశీ వస్త్రాలు దహనం చేయబడినవి గాంధీ ప్రసంగించారు. ఎల్ఫిన్‌స్టోన్ మిల్స్
జాతీయవాద పోరాటంలో ముఖ్యమైన భాగం మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో ముఖ్యమైన స్థానం
పొందినది.
తిలక్ స్వరాజ్ ఫండ్ కోసం ఉమర్ రూ. 3
లక్షలు విరాళం గా ఇచ్చారు. .
“ఉమర్ పెద్ద పత్తి వ్యాపారి. బ్రిటీష్ వారి వైస్రెగల్ ఆర్డర్ ద్వారా బొంబాయిలో పత్తి ధరలు
పతనమైనప్పుడు ఉమర్‌కు రూ. 3.64 కోట్లు
నష్టం కలిగింది.
బ్రిటిష్ వారు ఉమర్ తండ్రి, హాజీ యూసుఫ్ సోభానీ
కి నైట్ హుడ్ బిరుదు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఉమర్ దానిని వ్యతిరేకించాడు.
సోభానీ ముంబైలో జరిగే స్వదేశీ మార్చ్‌లకు
నాయకత్వం వహించేవారు, గాంధీ
సమావేశాలను ఏర్పాటు చేశారు మరియు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రాజకీయ ఆందోళనలకు నిధులు
సేకరించేవారు. ముంబైలో గాంధీ సత్యాగ్రహం నిర్వహణ ప్రధాన దాతలలో సోభానీ ఒకరు.
No comments:
Post a Comment