డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ ఆగస్టు 18, 1886న ఫీరోజ్‌పూర్ పంజాబ్‌లో జన్మించారు. చౌదరి వలీ మొహమ్మద్ పంజాబ్‌లోని
లాహోర్ కళాశాల నుండి B.Sc. మరియు M.Sc. డిగ్రీల పొందినాడు. . 1907లో MAO కళాశాల అందు భౌతిక శాస్త్రానికి సంబంధించిన తొలి ఉపాధ్యాయులలో ఒకరిగా చేరాడు.
1908 లో వలీ మొహమ్మద్‌ను MAO కాలేజ్ మేనేజ్‌మెంట్ ఫిజిక్స్‌లో ఉన్నత చదువుల కోసం ఆఘాఖాన్ స్కాలర్‌షిప్
క్రింద ఇంగ్లండ్‌కు పంపింది. చౌదరి వలీ
మొహమ్మద్ కేంబ్రిడ్జ్ అందు నేచురల్ సైన్స్‌లో ట్రిపోస్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. చౌదరి
వలీ మొహమ్మద్ ఆ తరువాత, 1912 లో గోట్టింగెన్ విశ్వవిద్యాలయం (జర్మనీ) నుండి డాక్టరేట్ పొందాడు.
1912లో అలీఘర్‌కు తిరిగి వచ్చిన తర్వాత, డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ 1912-1919 మధ్య కాలంలో భౌతికశాస్త్ర విభాగానికి ప్రొఫెసర్‌గా మరియు హెడ్‌గా పనిచేశాడు. డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్‌లోని MAO కళాశాల ప్రిన్సిపాల్‌గా కొంతకాలం అంటే మార్చి 1919 నుండి మే 1919 వరకు పనిచేశాడు.
అక్టోబరు 1919లో, డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ భారత ప్రభుత్వ విద్యా శాఖలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో సభ్యుడు మరియు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, లక్నో విశ్వవిద్యాలయం, డాకా విశ్వవిద్యాలయం మరియు నాగ్‌పూర్ విశ్వవిద్యాలయాల బిల్లులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు.
1921లో, డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ లక్నో విశ్వవిద్యాలయంలో మొదటి ప్రొఫెసర్ మరియు ఫిజిక్స్ విభాగాధిపతిగా 1945 వరకు పనిచేశాడు. 1943లో నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ స్థాపనకు నియమించబడిన ప్రణాళికా సంఘం సభ్యులలో ఒకరుగా పనిచేసాడు.. 1946 లో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గా కొద్ది కాలం పాటు నియమించబడ్డాడు..
డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల
ప్రయోజనం కోసం ఒక పెద్ద ట్రస్ట్‌ను స్థాపించాడు మరియు యూరప్‌లోని ఉత్తమ
విశ్వవిద్యాలయాలు మరియు ఇన్‌స్టిట్యూట్‌లలో మరియు మన దేశంలోని ఇతర ప్రాంతాలలో
పరిశోధన చేసే యువ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం MAO కాలేజీలో కార్పస్ ఫండ్‌ను స్థాపించాడు,. లక్నో యూనివర్శిటీలో ఎమ్మెస్సీ-ఎలక్ట్రానిక్.లో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థికి
ఎవెలిన్ వలీ మహ్మద్ గోల్డ్ మెడల్‌ను కూడా ప్రారంభించాడు.
విభజన తరువాత, డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ 1948లో లండన్‌కు వలస వెళ్లి అక్కడ సైన్స్ విద్య కోసం పనిచేశాడు. 1957లో,డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ వివిధ బ్రిటిష్ విశ్వవిద్యాలయాలలో సైన్స్, టెక్నాలజీ మరియు మెడిసిన్‌లో ఉన్నత పరిశోధనలను అభ్యసించే విద్యార్థుల కోసం ఎడిత్ ఎవెలిన్ వలీ ముహమ్మద్ ట్రస్ట్‌ను స్థాపించాడు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం కు తన ఆస్తి- ఇల్లు వలి మంజిల్ మరియు నదీమ్ తరిన్ హాల్ ఉన్న భూమి మరియు అరుదైన తన పుస్తకాలు విరాళంగా ఇచ్చాడు.
డైనమిక్ ఫిజిక్స్ టీచర్ మరియు అడ్మినిస్ట్రేటర్‌గా ఉండటమే కాకుండా, డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ లైబ్రరీ వ్యవహారాలపై కూడా చాలా ఆసక్తిని కనబరిచాడు. డాక్టర్చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్‌లో ఉన్నప్పుడు, లిట్టన్ లైబ్రరీ కు లైబ్రేరియన్‌గా పనిచేశాడు. లక్నో యూనివర్శిటీలో, ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ విస్తరణకు కృషి చేయడంతో పాటు టాగోర్ లైబ్రరీగా పిలువబడే ఆధునిక లైబ్రరీని ఏర్పాటు చేశాడు. ఆల్ ఇండియా లైబ్రరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ స్పెక్ట్రోస్కోపీ, మాగ్నెటో-ఆప్టిక్స్ మరియు వైర్‌లెస్ ఆపరేషన్లలో నైపుణ్యం కలిగి ఉన్నారు. లిట్రో మౌంటు స్పెక్ట్రోగ్రాఫ్‌తో స్పెక్ట్రల్ లైన్‌ల హైపర్‌ఫైన్ స్ట్రక్చర్‌పై డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ పరిశోధన చేసినాడు. భారతీయ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులో వైర్‌లెస్‌ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్. అయానోస్పిరిక్ రిఫ్లెక్షన్‌పై డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ పరిశోధన కోసం AMU ఫిజిక్స్ విభాగంలో తక్కువ-పవర్ మీడియం-వేవ్ రేడియో ట్రాన్స్‌మిటర్ ఏర్పాటు చేయబడినది.
డాక్టర్చౌదరి వలీ మొహమ్మద్ 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ (INSA) యొక్క ఫౌండేషన్ ఫెలో. డాక్టర్చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్‌లోని సర్ సయ్యద్ యొక్క 'సైంటిఫిక్ సొసైటీ' పునరుద్ధరణకు కూడా పనిచేశాడు మరియు 1907-1908 మరియు 1914-1915 సెషన్‌లలో వరుసగా సైంటిఫిక్ సొసైటీ, అలీఘర్ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. 1914లో డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ MAO కాలేజీలో ‘ఫోటోగ్రాఫిక్ సొసైటీ’ని కూడా ప్రవేశపెట్టాడు.
డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ సైంటిఫిక్ సొసైటీ వేదిక ద్వారా భౌతిక శాస్త్రంలోని వివిధ అంశాలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. 1908 జూన్ 24న స్ట్రాచీ హాల్‌లోని MAO కళాశాల విద్యార్థుల కోసం X-కిరణాలపై డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ ఉపన్యాస౦ ఇచ్చినాడు. 1925లో, అలహాబాద్ విశ్వవిద్యాలయం యొక్క ఫెలో గా, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విద్య యొక్క స్థితిని విమర్శనాత్మకంగా మూల్యాంకనం చేస్తూ డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ఒక బుక్‌లెట్ కూడా రాశారు.
డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ 1917లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1917లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సెషన్‌లో డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ చేసిన అధ్యక్ష ప్రసంగం టిమ్-ఉల్-మ్రయా-వా-అల్ మనజీర్' Tim-ul-Mraya-wa-al Manazir పేరుతో 1918లో అలీఘర్ ఇన్‌స్టిట్యూట్ ప్రెస్, అలీఘర్ ద్వారా ప్రచురించబడింది.. భౌతికశాస్త్రంపై డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ వ్యాసం ‘ఉక్దా కైనాత్ బజారియా ఇల్మ్-ఎ-హయ్యర్ Uqda Kainat Bazariya Ilm-e-Hayyar’ ' జూన్ 1908లో అలీఘర్ మాసపత్రికలో వచ్చింది.
కేంబ్రిడ్జ్ విద్యావ్యవస్థపై డాక్టర్ వలీ మొహమ్మద్ యొక్క వ్యాసం 'కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకే దిల్చాస్ప్ హలత్ Cambridge University ke Dilchasp Halat’ ' 26 మే 1909న "అలీఘర్ ఇన్స్టిట్యూట్ గెజిట్"లో ప్రచురించబడింది. "అలీఘర్ ఇన్స్టిట్యూట్ గెజిట్‌లో వచ్చిన వలీ మొహమ్మద్ ఇతర వ్యాసాలు: 'విలాయత్ కే అఖ్బరత్ క్యోంకర్ చాప్తయ్ హై? – లండన్ కే మత్బత్ మే ఐక్ దిన్' (15 సెప్టెంబర్ 1909), 'సిక్కే కైసే మజ్రూబ్ హోతే హైన్ (22 సెప్టెంబర్ 1909), 'ఐక్ జపానీ ముదర్రిస్ కా దస్తూర్-ఉల్-అమల్ (22 సెప్టెంబర్ 1909), 'విలాయత్ మే అంద్బే బచ్చే కైసే పార్థే హైన్ -అంధే బచ్చన్ కే స్కూల్ మే ఐక్ దిన్' (29, సెప్టెంబర్ 1909) Wilayat ke Akhbarat Kyonkar Chaptay Hain? – London ke Matbat me Aik Din’ (15th September 1909), ‘Sikkay Kaise Mazroob hotay Hain (22nd September 1909), ‘Aik Japani Mudarris ka Dastoor-ul-Amal (22 September 1909), ‘Wilayat me Andbe Bacche kaise Parthe Hain-Andhe Bacchon ke School me Aik Din’ (29, September 1909).. అలీగఢ్ కాలేజ్ కే మౌజూదా హలత్ Aligarh College ke Maujooda Halat’ అనే వ్యాసం 16 మార్చి 1919న అలీఘర్ ఇన్స్టిట్యూట్ గెజిట్‌లో వచ్చింది. డాక్టర్చౌదరి వలీ మొహమ్మద్ 24 జూన్ 1968న అలీఘర్‌లో మరణించాడు.
రిఫరెన్స్:
1. అలీఘర్ ఇన్స్టిట్యూట్ గెజిట్ (23 సెప్టెంబర్ 1908, 26 మే 1909, 6 ఫిబ్రవరి 1918, మరియు 4 నవంబర్ 1915),
2. అలీఘర్ మాసపత్రిక (జూన్ 1908)
3. డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ కాలేజ్ కే పెహ్లే హిందుస్థానీ ప్రిన్సిపాల్ ఔర్
మబీర్-ఎ- తబయ్యత్ చే డాక్టర్ అసద్ ఫైసల్ ఫరూఖీ, ఫికర్-ఓ-నాజర్, అలీఘర్ జూన్ 2021
4. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ కంట్రిబ్యూషన్స్ అండ్ అచీవ్‌మెంట్స్, డ్యూటీ సొసైటీ, అలీఘర్, 1989.
5. ది నైన్ ఫ్యాకల్టీ జెమ్స్ ఆఫ్ లక్నో యూనివర్సిటీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, నవంబర్ 16, 2019.
6. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వెబ్‌సైట్, Insaindia.res.in సావనీర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, 2012
7. ఇండియన్ లైబ్రరీ క్రోనాలజీ బై PSG కుమార్, అలైడ్ పబ్లిషర్స్ ఢిల్లీ, 2000
8. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వలీ మొహమ్మద్ మరణానికి సంతాపం, 8 సెప్టెంబర్ 1968 ముస్లిం యూనివర్సిటీ గెజిట్
References
1. Aligarh Institute Gazette (23 September 1908, 26
May 1909, 6 February 1918, and 4th November 1915),
2. Aligarh Monthly (June 1908)
3. Dr. Chaudhary Wali Mohammad College Ke Pehle
Hindustani Principal Aur Mabir-e- Tabayyat by Dr. Asad Faisal Farooqui,
Fikr-o-Nazar, Aligarh June 2021
4. Aligarh Muslim University Contributions and
Achievements, Duty Society, Aligarh, 1989.
5. The Nine Faculty Gems of Lucknow University,
Times of India, November 16, 2019.
6. Website of Indian National Science Academy, Insaindia.res.in
Souvenir Department of Physics, Aligarh Muslim University, 2012
7. Indian Library Chronology by PSG Kumar, Allied
Publishers Delhi, 2000
8. University Mourns Professor Wali Mohammad’s
death, 8 September 1968 Muslim University Gazette
No comments:
Post a Comment