17 August 2024

గామా పహెల్వాన్, లెజెండరీ రెజ్లర్, భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు కూడా Gama Pahelwan, the legendary wrestler, was also India’s freedom fighter

 


పారిస్ ఒలింపిక్స్‌లోని రెజ్లింగ్ పోటీలలో వినేష్ ఫోగట్ ప్రదర్శన భారతదేశపు ప్రసిద్ధ మల్లయోధుల జ్ఞాపకాలను తిరిగి తెచ్చాయి. భారతదేశపు ప్రసిద్ధ మల్లయోధులు పాల్గొన్న కుస్తీ రూపం మనం పారిస్‌లో చూసిన ఒలింపిక్ స్టైల్ రెజ్లింగ్‌కు భిన్నంగా ఉన్నప్పటికీ, కుస్తీ క్రీడ యొక్క ప్రాథమిక సూత్రాలు ఒకటే.

గతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ మల్లయోధుడు గులాం మొహమ్మద్ బక్ష్ బట్, ది గ్రేట్ గామా అనే పేరుతో సుపరిచితుడు. గులాం మొహమ్మద్ బక్ష్ బట్, ది గ్రేట్ గామా పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని జబ్బోవాల్ గ్రామంలో స్థిరపడిన కాశ్మీరీ కుటుంబానికి చెందినవాడు. గులాం మొహమ్మద్ బక్ష్ బట్, ది గ్రేట్ గామా తన 52 సంవత్సరాల రెజ్లింగ్ కెరీర్‌లో అజేయంగా నిలిచాడు.

గామా రుస్తోమ్-ఎ-హింద్ టైటిల్ గెలుచుకున్నాడు. 1910లో గామా పహిల్వాన్ ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ అయ్యాడు మరియు ప్రపంచ గొప్ప రెజ్లర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

గామా పహిల్వాన్ యుక్తవయస్సులోకి రాకముందే, జోధ్‌పూర్ రాజా నిర్వహించిన పోటీలో భారతదేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్‌లను ఓడించాడు. 1900ల ప్రారంభంలో, గామా పహిల్వాన్ డాటియా స్టేట్  (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉంది) యొక్క ఛాంపియన్ రెజ్లర్‌గా భారతదేశం అంతటా రెజ్లింగ్ పోటీలను గెలుచుకున్నాడు. దాదాపు ప్రతి భారతీయుడు గామా యొక్క కుస్తీ విన్యాసాల గురించి వినే ఉంటారు కానీ స్వాతంత్ర్య పోరాటంలో గామా పహిల్వాన్ చేసిన కృషిని మనం చాలా అరుదుగా వినిఉంటాము..

మౌలానా ఆజాద్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్ర పాల్, బాల గంగాధర తిలక్ వంటి నాయకులు తెల్ల పాలకుల  భౌతిక ఆధిపత్య కథనాన్ని సవాలు చేశారు. బలం మరియు సత్తువలో ఆంగ్లేయులు మరియు యూరోపియన్ల కంటే భారతీయులు గొప్పవారని నిరూపించగల వీరుడు భారతదేశానికి చాలా అవసరం. గామా వారు కోరుకున్న దానిని అందించాడు.

ధనిక బెంగాలీ వ్యాపారవేత్త అయిన శరత్ మిత్ర, గామా, అతని సోదరుడు ఇమామ్ బక్ష్ మరియు అహ్మద్ బక్ష్‌లను 1910లో లండన్‌కు తీసుకెళ్లాడు. శరత్ మిత్ర భారతీయ అథ్లెట్లు యూరోపియన్ల కంటే ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించాలనుకున్నాడు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి గామా సరైన ఎంపిక. గామాతో పోరాడటానికి యూరప్ నుండి ఎవరికైనా  ఒక ఓపెన్ ఛాలెంజ్ అని వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌లలో ప్రచారం చేయబడింది.

సెప్టెంబరు 1910లో, గామా లండన్‌లో 12,000 మంది ప్రజల సమక్షంలో పోలాండ్ వాసి ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన స్టానిస్లాస్ జిబిస్కోతో కుస్తీ లో పాల్గొన్నాడు. అప్పటి వరకు గామా ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థి జిబిస్కోZbyszko, కానీ పోలిష్ రెజ్లర్ కూడా గామాను అడ్డుకోలేకపోయాడు. టైమ్స్ (లండన్) ప్రకారం మూడుసార్లు జిబిస్కోZbyszko దాడి చేయడానికి చేసినా గామా డిఫెన్స్/రక్షణను ఛేదించడంలో విఫలమయ్యాడు.

ఆ తరువాత జిబిస్కో Zbyszko రక్షణాత్మక వ్యూహాలను అవలంబించాడు మరియు నేలపై పడిపోయాడు.. రెండున్నర గంటల తర్వాత వెలుతురు తగ్గడంతో మ్యాచ్‌ రద్దయింది. మీడియా జిబిస్కో Zbyszko భయపడుతున్నందుకు నిందలు వేసింది మరియు వచ్చే శనివారం రీమ్యాచ్ షెడ్యూల్ చేయబడింది.

శనివారం  రోజు గామా ఎదురుచూస్తూనే ఉన్నాడు కానీ గామా ప్రత్యర్థి జిబిస్కో Zbyszko లండన్ నుండి పారిపోయాడు మరియు గామా విజేతగా ప్రకటించబడ్డాడు. ఈ విజయం అందరి హృదయాల్లో భారతీయ గౌరవాన్ని పునరుద్ధరించింది. భారతీయ జాతీయవాద పత్రికలు ఈ విజయాన్ని పాశ్చాత్యులపై భారతీయుల విజయంగా పేర్కొన్నాయి.

గామా భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, గామా జాతీయ హీరోగా కీర్తించబడ్డాడు. అలహాబాద్‌లో జరిగే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి గామా ను ఆహ్వానించారు. 1928లో, పాటియాలా మహారాజా గామా కోసం జిబిస్కోతో మరో మ్యాచ్‌ని పాటియాలాలో ఏర్పాటు చేశారు..

40,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యమున్న కొత్త స్టేడియాన్ని నిర్మించేందుకు మహారాజా ఏర్పాట్లు చేశారు. ఈ బౌట్‌/కుస్తీ పోటీను చూసేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రముఖులు తరలివచ్చారు. ఇది 1970లలో ముహమ్మద్ అలీ మరియు జో ఫ్రేజియర్‌ల మధ్య జరిగిన పోరు లాంటిది. ఈ పోటీ మళ్లీ ఇండియా వర్సెస్ వెస్ట్‌ గా ప్రచారం చేయబడింది.

కానీ ఇది చరిత్రలో అతి తక్కువ కాలం జరిగిన  కుస్తీ మ్యాచ్‌లలో ఒకటిగా మారింది. గామా జిబిస్కోZbyszko యొక్క డిఫెన్స్ ఛేదించాడు మరియు ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో జిబిస్కోని నేలపై పడేశాడు. ప్రేక్షకులు ఉప్పొంగిపోయారు మరియు "జై హింద్" నినాదాలు స్టేడియం అంతటా ప్రతిధ్వనించాయి.

గామా విజయాల రాజకీయ పరిణామాలపై గణనీయమైన పరిశోధన చేసిన USAలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జోసెఫ్ S. ఆల్టర్, ఒక జాతీయ వీరుడిగా గామా స్వాతంత్ర్య పోరాటానికి మరియు భారతదేశ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించారని రాశారు. ఆ సమయంలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అవసరమైన శక్తి మరియు ధైర్యాన్ని గామా ఇచ్చారు. 

No comments:

Post a Comment