19 August 2024

INA యొక్క ముస్లిం మహిళా సైనికులు Muslim women soldiers of INA

 


1857లో జరిగిన మొదటి భారత స్వతంత్ర సంగ్రామం లో  బ్రిటీష్ వారితో భారతీయ పురుషులతో పాటు  హిందూ, ముస్లిం మరియు సిక్కు మహిళలు కలసికట్టుగా పోరాడారు.  ఝాన్సీ రాణి మరియు బేగం హజ్రత్ మహల్ వంటి మహిళలు జరిపిన తిరుబాటు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదిని కదిలించింది.

రెండవ ప్రపంచ యుద్ధం 1945 చివరలో ముగిసింది. ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)/ ఆజాద్ హింద్ ఫౌజ్ కి చెందిన సైనికులను యుద్ధ ఖైదీలుగా (PoW) బంధించి సైనిక న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టారు. INA ట్రయల్స్ యొక్క మీడియా కవరేజ్ భారతీయులకు సుభాస్ చంద్రబోస్ నేతృత్వంలోని INA యొక్క నిజమైన చిత్రాన్ని అందించింది. భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకునే జపనీయులు మరియు ఫాసిస్టుల ఏజెంట్లుగా INA చిత్రీకరించబడినారు.కాని INA ఒక స్వతంత్ర భారత సాయుధ దళమని భారతీయులు తెలుసుకున్నారు మరియు INA కు భారతీయ ప్రవాసులు నిధులు సమకూర్చారు. INAలో హిందువులు, ముస్లింలు మరియు సిక్కులు కలిసి భోజనం చేశారు.

INAలో ఝాన్సీ కి రాణి అనే ఒక మహిళా రెజిమెంట్‌ కలదు. INAలోని  మహిళా రెజిమెంట్‌ కు కెప్టెన్ లక్ష్మీ సహగల్ నాయకత్వం వహించారు

INAలో చాలా మంది ప్రధాన జనరల్స్ ముస్లింలు వారితో బాటు  కొంతమంది ముస్లిం మహిళలు ఝాన్సీ కి రాణి అనే మహిళా  రెజిమెంట్ లో కలరు.

 INA డిఫెన్స్ కమిటీ ప్రకారం "I.N.A.లోని ముస్లిం మహిళల్లో ప్రముఖులు ప్రస్తుతం ఎర్రకోటలో బంధీ గా ఉన్న కెప్టెన్ సలీమ్ భార్య శ్రీమతి సలీమ్ సుల్తానా మరియు ఇప్పటికీ థాయ్‌లాండ్‌లో ఉన్న భారతీయుల కోసం పనిచేస్తున్న మేజర్ వహాబ్ ఖాన్ ఇద్దరు కుమార్తెలు.

సుల్తానా భర్త కల్నల్ సలీమ్ INAలో పనిచేస్తున్నారు, సుల్తానా ఝాన్సీ కి రాణి  రెజిమెంట్‌కు చెందిన ప్రముఖ అధికారులలో ఒకరు. యుద్ధం ప్రారంభమయ్యే ముందు సుల్తానా బర్మా నివాసి. INA మహిళా రెజిమెంట్‌లోని మెజారిటీ సైనికుల మాదిరిగానే సుల్తానా కూడా ఎటువంటి ముందస్తు సైనిక శిక్షణ లేకుండానే సుభాస్ చంద్రబోస్ పిలుపుకు ప్రతిస్పందించింది.

యుద్ధ సమయంలో సుల్తానా మరో యువ INA అధికారి సలీమ్‌ను కలిశారు , సలీమ్‌ బ్రిటీష్ ఇంపీరియల్ ప్రభుత్వంలోని భారత సైన్యంలో పనిచేసిన తర్వాత జాతీయవాద సైన్యం INA లోకి వెళ్లాడు. బోస్ ఆశీస్సులతో INA అధికారులు ఇద్దరూ సుల్తానా మరియు సలీమ్‌పెళ్లి చేసుకున్నారు.

యుద్ధం ముగియగానే, సలీమ్ POWగా జైలు పాలయ్యాడు. సుల్తానా ఫిబ్రవరి 1946లో ఝాన్సీ కి రాణి రెజిమెంట్‌కి చెందిన చెందిన మొదటి సైనికుల బృందంలో భాగంగా భారతదేశానికి చేరుకుంది. సుల్తానా ప్రెస్‌తో సంభాషించి, INA గురించి మరియు బోస్ నేతృత్వంలోని ఉద్యమం గురించి ప్రజలకు చెప్పింది.

సుల్తానా సలీమ్ భారతదేశంలోని మహిళలకు సైనిక శిక్షణను సమర్ధించారు మరియు మహిళలు పురుషులతో సమానo అని  మరియు తప్పనిసరిగా సైనిక శిక్షణ పొందాలని అన్నారు. సైనిక శిక్షణ స్త్రీలు  దృఢంగా ఉండేందుకు సహాయపడింది మరియు జీవితంలోని ఇబ్బందులను మరింత మెరుగ్గా ఎదుర్కోగలిగేలా చేసింది. సైనిక శిక్షణ క్రమశిక్షణ మరియు నిర్భయ భావాన్ని కలిగిస్తుంది.. మహిళలు ముందుకు వస్తే ఎక్కువ త్యాగాలు చేయడానికి పురుషులలో ధైర్యాన్ని నింపుతుంది.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం  “తనకు ఒకే ఒక దేశం- హిందూస్థాన్- మాత్రమే ఉందని శ్రీమతి సలీం భావించారు. శ్రీమతి సలీం మతతత్వాన్ని లేదా ప్రాంతీయవాదాన్ని విశ్వసించలేదు. భారతదేశం యొక్క ఏకత్వం ఆమెను ఎక్కువగా ఆకర్షించింది. తూర్పు ఆసియాలో, మతపరమైన లేదా ప్రాంతీయ భేదాలు లేవని  మరియు అంటరానితనం సమస్య లేదని అన్నారు.

INA కి చెందిన ఝాన్సీ కి రాణి మహిళా రెజిమెంట్‌కు లో హిందూ మరియు సిక్కు సోదరీమణులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ముస్లిం మహిళా సైనికులు INAలో తగిన సంఖ్య లో కలరు. 

No comments:

Post a Comment