27 August 2024

ఇస్లాం మీద బెర్ట్రాండ్ రస్సెల్ Bertrand Russell on Islam

 



పాశ్చాత్యులు సైన్స్ మరియు ఫిలాసఫీ రంగంలో ముస్లింల సహకారాన్ని కొనియాడారు. పాశ్చాత తత్వవేత్త రస్సెల్ తన ప్రసిద్ధ రచన హిస్టరీ ఆఫ్ వెస్ట్రన్ ఫిలాసఫీలో సైన్స్, ఫిలాసఫీ, ఎకానమీ, కళ, కవిత్వం మరియు వైద్యరంగాలలో  ఇస్లాం మరియు ముస్లిం నాగరికత యొక్క సహకారాన్ని బహిరంగంగా అంగీకరించారు..

ఇస్లామిక్ బోధనల వెనుక ఉన్న తర్కం గురించి మాట్లాడుతూ రస్సెల్ క్రైస్తవ పిడివాదంతో పోలిస్తే ఇస్లాంను అభినందిస్తున్నాడు:ప్రవక్త (స) యొక్క మతం సాధారణ ఏకేశ్వరోపాసన.  అది క్రైస్తవ  ట్రినిటీ లేదా క్రైస్తవ వేదాంతశాస్త్రం అంత సంక్లిష్టంగా లేదు. దైవప్రవక్త (స) తనను తానూ దైవంగా భావించలేదు లేదా ఆయన అనుచరులు అలాంటి వాదన చేయలేదు.  చెక్కిన చిత్రాల graven images పై యూదుల నిషేధాన్ని ముహమ్మద్ ప్రవక్త(స) పునరుద్ధరించారు  మరియు వైన్ వాడకాన్ని నిషేధించారు. ఇస్లాం వ్యాప్తి కోసం సాధ్యమైనంత ఎక్కువ ప్రపంచాన్ని జయించడం విశ్వాసుల కర్తవ్యం, కానీ క్రైస్తవులు, యూదులు లేదా జొరాస్ట్రియన్లను హింసించకూడదు. "పుస్తక/గ్రంధ  ప్రజలు", అని ఖురాన్ క్రైస్తవులు, యూదులను,అగ్ని ఆరాధకులను గౌరవంగా    పిలుస్తుంది..

ఇస్లాం తీసుకువచ్చిన రక్తరహిత విప్లవానికి గొప్ప నివాళులు అర్పిస్తూ, ప్రపంచంలోని అరాచక వాతావరణంలో ఇస్లాం క్రమాన్ని order నెలకొల్పినదని రస్సెల్ పేర్కొన్నాడు: "ఎక్కువ తీవ్రమైన పోరాటం లేకుండా వారు సామ్రాజ్యాలను  స్వాధీనం చేసుకున్నందున, తక్కువ విధ్వంసం జరిగింది మరియు పౌర పరిపాలన దాదాపుగా మారలేదు. పర్షియాలో మరియు బైజాంటైన్ సామ్రాజ్యంలో పౌర ప్రభుత్వం అత్యంత వ్యవస్థీకృతమైంది.

ఖలీఫా హరున్ రషీద్ గొప్పతనాన్ని వివరిస్తూ రస్సెల్ ఇలా అన్నాడు:-హరున్-అల్-రషీద్ (మ. 809), చార్లెమాగ్నే మరియు ఎంప్రెస్ ఐరీన్‌ల సమకాలీనుడు మరియు అరేబియన్ నైట్స్ ద్వారా అందరికీ సుపరిచితుడు. హరున్-అల్-రషీద్ ఆస్థానం లగ్జరీ, కవిత్వం మరియు విజ్ఞానానికి ఒక అద్భుతమైన కేంద్రం; అతని ఆదాయం అపారమైనది; అతని సామ్రాజ్యం జిబ్రాల్టర్ జలసంధి నుండి సింధు వరకు విస్తరించింది. అతని సంకల్పం సంపూర్ణమైనది; వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది, తూర్పు మరియు పడమరల మధ్య ఖాలిఫేట్/ఇస్లామిక్ సామ్రాజ్యం  ఒక కేంద్ర స్థానాన్ని ఆక్రమించింది

ముస్లింల ఆర్థిక శాస్త్ర సహకారాన్ని వివరిస్తూ, వ్యాపార వృత్తికి ఇస్లాం లో ఉన్న గౌరవ స్థితిని రస్సెల్ ప్రశంసించాడు: "అపారమైన సంపదను కలిగి ఉండటం వలన చైనా నుండి పట్టు మరియు ఉత్తర ఐరోపా నుండి బొచ్చు వంటి ఖరీదైన వస్తువులకు డిమాండ్ ఏర్పడటమే కాకుండా, ముస్లిం సామ్రాజ్యం యొక్క విస్తారమైన పరిధి, అరబిక్ బాష వ్యాప్తి వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల ద్వారా వాణిజ్యం ప్రోత్సహించబడింది. అరబిక్ ప్రపంచ వ్యాపార భాషగా మారింది  మరియు ముస్లిం నైతిక వ్యవస్థలో వ్యాపారికి ఉన్నతమైన హోదాను కేటాయించారు; ప్రవక్త (స) స్వయంగా ఒక వ్యాపారి అని మరియు మక్కా తీర్థయాత్ర సమయంలో వ్యాపారాన్ని మెచ్చుకున్నారని రస్సెల్ గుర్తు చేసుకున్నారు."

ముస్లిముల వాణిజ్యం, అరబ్బులు రోమన్లు ​​మరియు పర్షియన్ల నుండి వారసత్వంగా పొందిన గొప్ప రహదారులపై ఆధారపడింది మరియు వారు వాటిని  అభివృద్ధి చేసారు. అయితే, క్రమంగా, ఇస్లామిక్ సామ్రాజ్యం - స్పెయిన్, పర్షియా, ఉత్తర ఆఫ్రికా మరియు ఈజిప్ట్ గా విడిపోయి, అవి పూర్తి లేదా దాదాపు పూర్తి స్వాతంత్ర్యం పొందాయి. నీటిపారుదల వ్యవస్థను  వారు అబివృద్ది చేసారు . అరబ్ నీటిపారుదల పనుల ద్వారా నేటికీ స్పానిష్ వ్యవసాయం లాభాలను పొందుతోంది.

రస్సెల్ ప్రకారం ముస్లింలు  ప్లేటో యొక్క ఆదర్శవాదం కంటే అరిస్టాటిల్ యొక్క వాస్తవికతకు ఎక్కువ మొగ్గు చూపారు. "ముస్లిం ప్రపంచం యొక్క విలక్షణమైన సంస్కృతి,సిరియాలో ప్రారంభమైనప్పటికీ, తూర్పు మరియు పాశ్చాత్య అంత్య ప్రాంతాలు, పర్షియా మరియు స్పెయిన్లలో చాలా త్వరగా అభివృద్ధి చెందింది. సిరియన్లు, ఆక్రమణ సమయంలో, అరిస్టాటిల్ యొక్క ఆరాధకులు. అరబ్బులు గ్రీకు తత్వశాస్త్ర జ్ఞానాన్ని మొదట సిరియన్ల నుండి పొందారు, అందువలన, మొదటి నుండి, వారు ప్లేటో కంటే అరిస్టాటిల్‌  జ్ఞానమునే ముఖ్యమైనదిగా భావించారు.. కిండి (d. ca. 873), అరబిక్‌లో మొదటిసారిగా తత్వశాస్త్రాన్ని రచించాడు మరియు స్వయంగా అరబ్ అయిన ఏకైక తత్వవేత్త, ఎనిడ్స్ ఆఫ్ ప్లాటినస్ యొక్క భాగాలను అనువదించాడు మరియు కిండి తన అనువాదాన్ని ది థియాలజీ ఆఫ్ అరిస్టాటిల్ పేరుతో ప్రచురించాడు.

అరబ్బులు కేవలం గ్రీకు శాస్త్రాలకు మాత్రమే పరిమితం కాలేదు భారతీయ శాస్త్రాల నుండి కూడా ప్రయోజనం పొందారు. రస్సెల్ విజ్ఞానం పట్ల ప్రారంభ ముస్లింల విశ్వవ్యాప్త యోగ్యతను ఆమోదించాడు:పర్షియాలో, ముస్లింలు భారతదేశంతో పరిచయం కలిగి ఉన్నారు. వారు ఎనిమిదవ శతాబ్దంలో ఖగోళ శాస్త్రంలో తమ మొదటి జ్ఞానాన్ని సంస్కృత రచనల నుండి పొందారు. 830లో, సంస్కృతం నుండి గణిత మరియు ఖగోళ శాస్త్ర పుస్తకాల అనువాదకుడు అయిన ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారాజ్మీ అరబిక్ లో అనువదించిన ఒక పుస్తకము  పన్నెండవ శతాబ్దంలో అల్గోరిట్మి డి న్యూమెరో ఇండోరమ్ పేరుతో Algoritmi de numero Indorum పేరుతో తిరిగి లాటిన్‌లోకి అనువదించబడినది.  ఈ పుస్తకం నుండి పాశ్చాత్యులు   మొదట "అరబిక్" సంఖ్యలను  నేర్చుకొన్నారు. ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారాజ్మీ బీజగణితంపై ఒక పుస్తకాన్ని రాశారు, దీనిని పాశ్చాత్య దేశాల్లో పుస్తకం గా పదహారవ శతాబ్దం వరకు ఉపయోగించారు."

ఇస్లాం పెర్షియన్ నాగరికతను మార్చింది మరియు తద్వారా గొప్ప మేధోపరమైన ఆధ్యాత్మిక మరియు కళాత్మక వికాసానికి మార్గం సుగమం చేసింది:"పదమూడవ శతాబ్దంలో మంగోలుల దండయాత్ర వరకు పర్షియన్ నాగరికత మేధోపరంగా మరియు కళాత్మకంగా ఉన్నత స్థాయిలో ఉంది, మంగోలుల దండయాత్ర నుండి అది కోలుకోలేదు. కవి మరియు గణిత శాస్త్రజ్ఞుడు అయిన ఒమర్ ఖయ్యామ్, 1079లో క్యాలెండర్‌ను సంస్కరించాడు. పర్షియన్లు గొప్ప కవులు: షహనామా రచయిత ఫిర్దౌసీ (సుమారు 941), హోమర్‌తో సమానమని ఫిర్దౌసీని చదివిన వారు చెప్పారు. సూఫీ తత్వవేత్తలు, నియోప్లాటోనిక్ స్వభావం కలవారు. ముస్లింల తత్వశాస్త్రం సంపూర్ణమైన విధానం మరియు సహజ శాస్త్రాలను గొప్ప తాత్విక ఆదర్శాలతో మిళితం చేసింది:

అరబిక్ తత్వవేత్తలు, రసవాదం, జ్యోతిషశాస్త్రం, ఖగోళశాస్త్రం మరియు జంతుశాస్త్రంలో ఆసక్తిని కలిగి ఉంటారు, ఇద్దరు మహమ్మదీయ తత్వవేత్తలు, ఒకరు పర్షియన్ అవిసెన్నా మరియు రెండోవారు  స్పెయిన్‌ కు చెందిన అవెర్రోస్. వీరిలో మొదటివారు  మహమ్మదీయులలో, రెండవవారు  క్రైస్తవులలో ప్రసిద్ధమైనారు..

అవిసెన్నా (ఇబ్న్ సినా) (980-1037) బొఖారా ప్రావిన్స్‌లో జన్మించాడు; ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సులో అవిసెన్నా మొదట ఖివా, తరువాత ఖొరాస్సాన్ వెళ్ళాడు. కొంతకాలం ఇస్పాహాన్‌లో వైద్యం మరియు తత్వశాస్త్రం బోధించాడు; తర్వాత అవిసెన్నా టెహరాన్‌లో స్థిరపడ్డాడు. అవిసెన్నా తత్వశాస్త్రంలో కంటే వైద్యంలో మరింత ప్రసిద్ధి చెందాడు. పన్నెండవ నుండి పదిహేడవ శతాబ్దం వరకు, అవిసెన్నా ఐరోపాలో వైద్యానికి మార్గదర్శకంగా ఉపయోగించబడ్డాడు.

అవిసెన్నా ఒక ఎన్సైక్లోపీడియా రచయిత, తన లాటిన్ అనువాదాల ద్వారా పశ్చిమ దేశాలలో ప్రభావం చూపాడు. అవిసెన్నా మనస్తత్వశాస్త్రం అనుభావిక ధోరణి empirical tendency ని కలిగి ఉంది. అవిసెన్నా తత్వశాస్త్రం అరిస్టాటిల్‌కు దగ్గరగా ఉంది 

క్రైస్తవ ప్రపంచం లో అవర్రోస్ గ పిలువబడే ఇబ్న్ రష్ద్ 1128 C.E. లో స్పెయిన్లోని కార్డోవా లో జన్మించాడు. అవర్రోస్ ప్రపంచంలోని  గొప్ప ఆలోచనాపరులు మరియు శాస్త్రవేత్తలలో ఒకడు. .  అవర్రోస్ అరిస్టాటిల్ రచనల పై మరియు ప్లేటో యొక్క "ది రిపబ్లిక్" పై వ్యాఖ్యానాలు చేశాడు. తరువాత క్రైస్తవ విద్యావేత్తల వలె, అవర్రోస్ సార్వత్రిక సమస్యలను చర్చించాడు. అవి విషయాలకు పూర్వం అని ప్లేటో చెప్పారు

 అరిస్టాటిల్‌కు రెండు అభిప్రాయాలు ఉన్నాయి, ఒకటి అతను ఆలోచిస్తున్నప్పుడు మరియు మరొకటి అతను ప్లేటోతో విబేదిస్తున్నప్పుడు . ఇది వ్యాఖ్యాతగా అరిస్టాటిల్‌ స్థానాన్ని స్థిరపరుస్తుంది. అవిసెన్నా ఒక సూత్రాన్ని కనిపెట్టాడు, దీనిని అవెరోస్ మరియు అల్బెర్టస్ మాగ్నస్ పునరావృతం చేశారు: "ఆలోచన రూపాల్లో సాధారణతను తెస్తుంది"Thought brings about the generality in forms."

ముస్లింలు మరియు పశ్చిమ దేశాలు ఇద్దరూ ముస్లింల యొక్క అద్భుతమైన గతం యొక్క పై వివరణలను గమనించాలి.

 

 

No comments:

Post a Comment