తురంగజాయ్ హాజీ గా
పిలవబడే ఫజల్ వాహిద్ 1842లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (NWFP)లో జన్మించాడు. తురంగజాయ్ హాజీ
ప్రారంభ విద్యాభ్యాసం స్థానిక మదర్సాలో సాగింది. తురంగజాయ్ హాజీ తదుపరి చదువుల
కోసం దారుల్ ఉలూమ్-దేవ్‌బంద్ (U.P) వెళ్ళాడు. అక్కడ, తురంగజాయ్ హాజీ, షేక్-ఉల్ హింద్ మౌలానా మహమూద్ ఉల్ హసన్‌తో
స్నేహం చేశాడు మరియు షేక్-ఉల్ హింద్ మౌలానా మహమూద్ ఉల్ హసన్, మౌలానా ఖాసిం
నానోత్వి, మరియు రషీద్ అహ్మద్ గంగోహి తో కలిసి హజ్ తీర్థయాత్రకు వెళ్లాడు.
ఆ రోజుల్లో దియోబంద్,
భారత స్వాతంత్ర్య పోరాటానికి కేంద్ర
స్థానం. దియోబంద్ వ్యవస్థాపకులు అయిన నానోత్వి
మరియు గంగోహి, 1857లో హాజీ ఇమ్దాదుల్లా ముహాజిర్ మక్కీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి
వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. షేక్-ఉల్ హింద్ మౌలానా మహమూద్ ఉల్ హసన్ కూడా
స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మొదటి ప్రపంచ యుద్ధంలో మాల్టాలో యుద్ధ ఖైదీగా
ఉన్నాడు.
1857లో తురంగజాయ్‌కి చెందిన హాజీ భారత
విప్లవకారుల నాయకుడు హాజీ ఇమదదుల్లా ముహాజిర్ మక్కీ ను అరబ్‌లో కలుసుకున్నారు
మరియు ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశాన్ని విడిపించే మిషన్‌కు తన విధేయతను ప్రతిజ్ఞ
రూపంలో తెలిపారు. తురాంగ్‌జాయ్ హాజీ సూఫీయిజం మరియు వలసవాద వ్యతిరేకత భావజాలాల
నుండి ప్రేరణ పొందారు.
తురంగజాయ్ హాజీ
బ్రిటిష్ వ్యతిరేక పండితుడైన ముల్లా నజ్ముద్దీన్ హద్దా (ముల్లా హద్దా)కి నుండి యుద్ద
పాఠాలు నేర్చుకున్నాడు. హజీ తురంగజాయ్ దేవ్‌బంద్ మరియు సూఫీ విప్లవకారుల మధ్య
లింక్ అయ్యాడు తురంగజాయ్ హాజీ వలస పాలకులకు వ్యతిరేకంగా అనేక సాయుధ పోరాటాలకు
నాయకత్వం వహించాడు.
మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, మౌలానా ఉబైదుల్లా సింధీ ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లారు; హాజీ తురంగజాయ్ మౌలానా ఉబైదుల్లా సింధీని అనుసరించాడు. హాజీ తురంగజాయ్ మరియు మౌలానా ఉబైదుల్లా సింధీ స్థానిక తెగలలో అనుచరులను కలిగి ఉన్న ఇతర ఇస్లామిక్ పండితుల నేతృత్వంలోని గిరిజనుల సైన్యాన్ని సమాయుత్తం చేయాలనీ ప్రణాళిక వేశారు. ఆర్యసమాజ్ ఉద్యమానికి చెందిన రాజా మహేంద్ర ప్రతాప్ మరియు గదర్ పార్టీకి చెందిన మౌల్వీ బర్కతుల్లా కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో హాజీ తురంగజాయ్ మౌలానా ఉబైదుల్లా సింధీ తో చేరారు. 1915లో, కాబూల్‌లో భారత తాత్కాలిక కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వ౦ కు రాజా మహేంద్ర ప్రతాప్ మహేంద్ర అధ్యక్షుడు, మౌల్వీ బర్కతుల్లా ప్రధాన మంత్రి మరియు ఉబైదుల్లా సింధీ హోం మంత్రిగా వ్యవరించారు..అయితే, 1916లో ఉబైదుల్లా సింధీ లేఖలను ఆంగ్ల గూఢచార సంస్థలు అడ్డుకోవడంతో ఉద్యమం విఫలమైంది. అనేక మందిని అరెస్టు చేశారు మరియు ఈ ప్రణాళికను సిల్క్ లెటర్ కుట్ర అని పిలిచారు.
తురంగజాయ్ యొక్క హాజీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజనులను సంఘటితం చేయడం కొనసాగించాడు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఐక్యంగా ఉండాలన్నారు.
బ్రిటీష్ ప్రభుత్వ అధికారిక పత్రిక అయిన ది డిఫెన్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం “ఆగస్టు (1915), తురంగజాయ్ హాజీ సాహిబ్, బ్రిటిష్ వ్యతిరేక ముల్లా నజ్ముద్దీన్ హద్దా (ముల్లా హద్దా) తో కలసి స్థానిక గిరిజన మిలీషియ సహయం తో బ్రిటిష్ వారిపై దండయాత్రకు సిద్ధమయ్యాడు”.
తురంగజాయ్ హజీ యొక్క ఉద్యమం దేవబంద్ ఉలేమా నేతృత్వంలోని
ఉద్యమంతో కలసి నడిచింది తురంగజాయ్ హజీ తురంగజాయ్ హజీ యొక్క ఉద్యమం పంజాబ్, బెంగాల్, NWFP లోని అనేక విప్లవాత్మక
ఉద్యమాలతో కూడా సంబంధాలు కలిగి ఉంది.
హాజీ తురంగజాయ్ ఉద్యమం సుభాష్
చంద్రబోస్‌తో కూడా ముడిపడి ఉంది. విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన
మిలన్ హౌనెర్ ఇలా అభిప్రాయం ప్రకారం "బోస్ తన సమగ్ర 'అక్ష శక్తులు Axis Powers మరియు భారతదేశం మధ్య సహకార ప్రణాళిక'లో గిరిజన
భూభాగానికి ఒక ముఖ్యమైన పాత్రను కేటాయించాడు. బెర్లిన్‌కు వచ్చిన బోస్ భారతదేశం నుండి బ్రిటీష్
వారిని తరిమికొట్టడానికినికి సరిహద్దులో ఆధునిక పరికరాలతో 50,000 మంది గిరిజన
మిలీషియ సరిపోతుందని నమ్మాడు.
తురంగజాయ్ హాజీ అనుచరులలో ఖాన్
అబ్దుల్ గఫార్ ఖాన్ ఒకడని చాలా మందికి తెలియదు. గఫార్ ఖాన్ మరియు అతని ఖుదాయి
ఖిద్మత్‌గార్లు తురంగజాయ్ హాజీ నేతృత్వంలోని ఉద్యమంలో భాగంగా ఉన్నారు.
తురంగ్‌జాయ్ హాజీ
సాయుధ మిలీషియాను ఏర్పాటు చేసి, 1915 నుండి 1937లో మరణించే వరకు అనేక బ్రిటిష్ ఆర్మీ పోస్టులపై
దాడి చేశాడు. తురంగజాయ్
హజీ యొక్క ఉద్యమం ను బ్రిటిష్ ప్రభుత్వం అణిచి
వేయడానికి ప్రయత్నించినది తురంగ్‌జాయ్ హాజీ ఆద్వర్యం లోని సాయుధ మిలీషియాను
అణచివేయడానికి బ్రిటిష్ వైమానిక దళం వారిపై బాంబులు వేసింది.తురంగజాయ్ హజీ తప్పించుకొని గిరిజన ప్రాంతాలకు పారిపోయాడు.
తురంగ్‌జాయ్ హాజీ 1937లో మరణించినాడు.
No comments:
Post a Comment