టంగుటూరి ప్రకాశం పంతులు (1872 ఆగష్టు 23 – 1957 మే 20) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి.
1940, 50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా
వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.
మద్రాసులో సైమన్
కమిషన్ వ్యతిరేక
ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.
టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు. వల్లూరులో ప్రకాశం ప్రాథమిక
విద్య సాగింది. మిషను
పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని
హనుమంతరావు నాయుడు చలవతో
ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ, ప్రకాశాన్ని తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ.లో చేర్పించాడు. తరువాత
మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు.
ప్రకాశం 1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి
చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి, 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా సంపద సంపాదించాడు.
తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి
అధ్యక్షుడయ్యాడు.
ప్రకాశం ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. దీక్షగా చదివి బారిస్టరు
అయ్యాడు.
భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో ప్రాక్టీసు ప్రారంభించాడు.
1921లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి లాభదాయకమైన
న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య
పత్రికకు సంపాదకత్వం
చేపట్టాడు.
1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు
పార్టీ ప్రధాన
కార్యదర్శిగా ఎన్నికైనాడు..
1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ
అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు
1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు
పార్టీ అభ్యర్థిగా
ఎన్నికైనాడు.
1928లో మద్రాసులో సైమన్
కమిషను బహిష్కరణ
ఉద్యమంలో పాల్గొని, తుపాకికి
ఎదురు నిలిచి, కాల్చమని
సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.
1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవెన్యూమంత్రి
అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.
1942లో క్విట్
ఇండియా ఉద్యమంలో
పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు.
1946 ఏప్రిల్
30న ప్రకాశం
మద్రాసు ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో
అభివృద్ధి పనులు చేపట్టాడు.
1952లో ప్రజాపార్టీని స్థాపించినాడు.
1953 అక్టోబర్
1 న ప్రత్యేక ఆంధ్ర
రాష్ట్రం ఏర్పడినప్పుడు
దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు.
ప్రకాశం పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో
జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా
నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి.
1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి
ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు.
ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు.
ప్రకాశం ఆత్మకథ "నా జీవిత యాత్ర” పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు.
టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన
సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్
5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
· ప్రకాశం పంతులు గారి గౌరవార్థం 1972 అక్టోబర్ 16 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.
·
ఆంధ్రకేసరి
(సినిమా) విజయచందర్
ప్రకాశం పాత్రధారణలో నిర్మితమైంది.
ప్రకాశం
గురించి ప్రముఖులు
"గాలితోనైనా పోట్లాడే స్వభావం
కలవాడు ప్రకాశం" _అయ్యదేవర
కాళేశ్వరరావు
"ప్రమాదములున్నచోటే
ప్రకాశంగారుంటారు" _భోగరాజు
పట్టాభి సీతారామయ్య
No comments:
Post a Comment