"భారత
విమోచన ఉద్యమం లో ప్రముఖ దేశభక్తుడు మరియు నాయకుడు ముఫ్తీ కిఫాయత్ ఉల్లా
నేతృత్వంలోని ఉలేమాలు లేదా భారతదేశంలోని ప్రాచీన ముస్లిం ప్రాతినిధ్య సంస్థ జమియత్-ఉల్-ఉలేమా
పాల్గొనమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.”
అని సుభాష్ చంద్రబోస్ 1942 ఆగస్టు 31న
జర్మనీ నుండి తన రేడియో ప్రసారంలో అన్నారు.
6 అక్టోబర్ 1942న
జరిగిన మరో ప్రసారంలో బోస్ ఇలా అన్నారు, “జైలులో
ఉన్న ఆల్-ఇండియా జమియత్-ఇ-ఉలేమా నాయకుడు ముఫ్తీ
కిఫాయత్ ఉల్లా, మరియు భారతదేశ
స్వాతంత్ర్యం కోసం నిలబడే ఇతర సంస్థలు ముందుకు వచ్చి అహంకారపూరిత బ్రిటిష్ రాజకీయ
నాయకుల తప్పుడు వాదనలకు తగిన సమాధానం ఇవ్వాలి..
షాజహాన్‌పూర్‌లో జన్మించిన ముఫ్తీ
కిఫాయత్ ఉల్లా, 1919లో స్థాపించబడిన జమియాత్-ఇ-ఉలేమా
వ్యవస్థాపకులలో ఒకరు మరియు మొదటి అధిపతి. హద్రత్ షేక్-ఉల్-హింద్ మాల్టాలో ఖైదు
చేయబడిన కారణంగా ముఫ్తీ కిఫాయత్ ఉల్లా తన జీవితాంతం తన గురువు హద్రత్
షేక్-ఉల్-హింద్ స్థానం లో జమియతుల్-ఉలమా తాత్కాలిక అధిపతిగా వ్యవరించారు.
జమియాత్‌కు
శాశ్వత అధిపతిగా ఉండటానికి అంగీకరించలేదు. ముఫ్తీ కిఫాయత్ ఉల్లా 1919
నుండి 1938
వరకు ఈ పదవిలో ఉన్నప్పటికీ - 19 నిరంతర సంవత్సరాలు -
ఎప్పుడూ జమియాత్ యొక్క వార్షిక సమావేశాలకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలేదు,
ఆ
స్థానాన్ని తన సమకాలీనులకు వదిలివేసాడు.
జమియాత్ అనేది భారతదేశాన్ని విముక్తి చేయడానికి కాంగ్రెస్, భారతీయ విప్లవకారులు మరియు సుభాష్ చంద్రబోస్‌తో కలిసి పనిచేసిన రాజకీయ సంస్థ. 1933లో బ్రిటీష్ ఇంటెలిజెన్స్ అభిప్రాయం ప్రకారం జమియాత్-ఎ-ఉలేమాను పూర్తిగా మతపరమైన సంస్థగా కాకపోయినా రాజకీయ-మతపరమైనది
ముఫ్తీ కిఫాయత్ ఉల్లా, స్వాతంత్ర్య యుద్ధం లో బోస్‌తో సన్నిహితంగా పనిచేస్తున్నాడు మరియు బోస్ లాగే ప్రపంచ యుద్ధం సమయంలో అక్ష శక్తుల Axis powers తో దగ్గిరగా వ్యవహరించాడు.
1938లో జర్మనీ కార్గో-బోట్‌లో పాలస్తీనా సమస్యపై జరిగిన సదస్సుకు హాజరైన తర్వాత ముఫ్తీ కిఫాయత్ ఉల్లా కైరో నుండి తిరిగి వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశంలో సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించడంలో బోస్‌కు సహాయం చేసినాడు.
ముఫ్తీ కిఫాయత్ ఉల్లా భారతదేశానికి
తిరిగి వచ్చిన తర్వాత బోస్‌ని కలిశాడు. “సుభాస్ బాబు ముఫ్తీ
కిఫాయత్ ఉల్లా మరియు ఇతర జమియత్-ఉల్-ఉలేమా నాయకులను కలిశారు. కాంగ్రెస్ ఎలాంటి
నిర్ణయం తీసుకున్నా, ఇండియా లోని బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం
చేయడమే తమ ఉద్దేశమని ముఫ్తీ కిఫాయత్ ఉల్లా నిస్సందేహంగా సూచించారు. బ్రిటీష్
ప్రభుత్వంతో ఎలాంటి రాజీకి వారు పార్టీగా ఉండరు.
ప్రభుత్వంతో సహాయ నిరాకరణకు
పిలుపునిచ్చిన ఫత్వాపై ఒరిజినల్ సంతకం చేసిన వారిలో ముఫ్తీ కిఫాయత్ ఉల్లా ఒకరు.
బ్రిటీష్ ప్రభుత్వంలో సైన్యంతో సహా సేవల్లో చేరవద్దని ముస్లింలను ఫత్వా కోరింది. 1920లో
మహాత్మా గాంధీ ముందుకు వచ్చిన సహాయ నిరాకరణ ఆలోచనను ఉత్సాహంగా స్వాగతించిన వారిలో
మొదటి వ్యక్తి ముఫ్తీ కిఫాయత్ ఉల్లా.
తమ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా
యుద్ధం చేసినందుకు బ్రిటీష్ ప్రభుత్వం ముఫ్తీ కిఫాయత్ ఉల్లా ని రెండుసార్లు జైలులో
పెట్టింది. ముఫ్తీ కిఫాయత్ ఉల్లా 1930
మరియు 1932లో
రెండుసార్లు జైలు పాలయ్యాడు., తన బహిరంగ ప్రసంగాలు
మరియు జమియాతుల్-ఉలమా ద్వారా శాసనోల్లంఘన మరియు ర్యాలీలలో పాల్గొన్న కారణం ముఫ్తీ కిఫాయత్
ఉల్లా జైలు పాలయ్యాడు. మొదటిసారి ఢిల్లీలో కొద్దిరోజులు జైలు శిక్ష అనుభవించి
తరువాత గుజరాత్‌కు వెళ్లారు. గుజరాత్ లో ముఫ్తీ
కిఫాయత్ ఉల్లా ఇతర తోటి ఖైదీలు డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ అన్సారీ,
‘అబ్దుల్-గఫార్
ఖాన్,
మౌలానా
అహ్మద్ సయీద్ డెహ్ల్వి, మౌలానా హబీబర్-రహమాన్ లుధియాన్వి,
మరియు
అసిఫ్ ‘అలీ
తదితరులు ఉన్నారు.
ముఫ్తీ కిఫాయత్ ఉల్లా రెండవసారి
అరెస్టయ్యాక, మౌలానా అహ్మద్ సయీద్ డెహ్ల్వీ,
మౌలానా
హబీబుర్-రహమాన్ దేహ్ల్వీ, మౌలానా సయ్యద్ అతా-ఉల్లాహ్ షా బుఖారి,
మౌలానా
దావూద్ గజ్నవీ, లలాదేశ్ బందూగుప్తా
చౌద్రి,
మరియు
డాక్టర్ అన్సారీ. వంటి ఇతర రాజకీయ ఖైదీలతో పాటు ముల్తాన్
జైలులో ఉంచబడ్డాడు.”
వాస్తవానికి, ముఫ్తీ కిఫాయత్ ఉల్లా ఇతర స్వాతంత్ర్య సమరయోధుల కంటే తక్కువ ఖైదు చేయబడ్డాడు, ఎందుకంటే ముఫ్తీ కిఫాయత్ ఉల్లా మద్దతుదారుల నుండి హింసాత్మక ప్రతిచర్యకు బ్రిటిష్ వారు భయపడుతున్నారు. 1930లో మొదటిసారిగా ముఫ్తీ కిఫాయత్ ఉల్లాను జైలులో పెట్టినప్పుడు, బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీకి రిజర్వ్ పోలీసు బలగాలను పిలిపించవలసి వచ్చింది. పహార్‌గంజ్ మరియు ముస్లిం జనాభా ఉన్న ఇతర ప్రాంతాలలో మెషిన్ గన్‌లు మరియు రైఫిల్ ధరించిన సైనికులను భారీగా మోహరించారు. పోలీసులు ముఫ్తీ కిఫాయత్ ఉల్లా ని అరెస్ట్ చేసేందుకు ముఫ్తీ కిఫాయత్ ఉల్లా ఇంటికి చేరుకునేలోపే మార్కెట్లు దాదాపు కర్ఫ్యూలో ఉన్నాయి.
ముఫ్తీ కిఫాయత్ ఉల్లా నేతృత్వంలో,
భారతదేశంలో
బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా బహిరంగంగా వచ్చిన మొదటి ప్రముఖ సంస్థలలో
జమియత్-ఇ-ఉలేమా ఒకటి. సెప్టెంబరు 1939లో,
బ్రిటీష్
ప్రభుత్వం జమియత్-ఇ-ఉలేమా సమావేశానికి సంబంధించిన సాహిత్యం మరియు ఇతర ప్రచార
సామగ్రిని నిషేధించాలని నోటీసు ఇచ్చింది. జర్మనీపై తమ యుద్ధానికి మద్దతు ఇవ్వాలని
బ్రిటిష్ వారు భారతీయులను కోరారు. కాంగ్రెస్ ఇంకా ఈ అంశంపై చర్చిస్తున్న సమయంలో,
జమియత్-ఇ-ఉలేమా
బ్రిటిష్ వారిని ఎదిరించాలని ప్రజలను కోరుతూ ఒక ప్రకటనతో ముందుకు వచ్చింది. ఇది
నేతాజీ సుభాస్, మౌలానా ఉబైదుల్లా మరియు రాష్ బిహారీ
బోస్ బోధించిన దానికి సరిగ్గా అనుగుణంగా ఉంది.
ముఫ్తీ కిఫాయత్ ఉల్లా నాయకత్వంలో,
జమియత్-ఇ-ఉలేమా
మహ్మద్ అలీ జిన్నాకు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్‌కు ఏర్పరచినది మరియు ముస్లిం
లీగ్ యొక్క పాకిస్తాన్ డిమాండ్ కు వ్యతిరేకంగా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలని
కోరింది.
No comments:
Post a Comment