బ్రిటీష్ సామ్రాజ్యం కీర్తి మరియు
శక్తిలో అత్యున్నత స్థాయికి చేరుకున్న 1940
లలో ఫజల్ ఇ ఎలాహి గోరే ఫఖ్రే క్వామ్ విదేశీ వస్తువుల సంపన్న డీలర్.
స్వాతంత్య్రానికి పూర్వ కాలంలో, భారతీయ సంపన్న వ్యాపారులందరూ బ్రిటన్ నుండి బ్రిటీష్ ఉత్పత్తులను దిగుమతి చేసి వాటిని భారతదేశంలో విక్రయించడం ద్వారా బాగా లాభాలు సంపాదించారు. తన దిగుమతి-ఎగుమతి వ్యాపారం కారణంగా, ఫజల్ ఇ ఎలాహి మరియు అతని కుటుంబం విలాసవంతమైన భవనం లో నివసించారు మరియు తన గ్రాండ్ ఇంపాలా కారులో తిరుగుతూ ఉండేవాడు.
ఫజల్ ఇ ఎలాహి మరియు అతని కుటుంబం
ఢిల్లీలో నివసించారు. అయితే, వ్యాపార అవకాశాల
కోసం కోల్‌కతా వెళ్లాడు. 'శ్వేతజాతీయులతో'
వ్యాపారం
చేసే వ్యక్తిగా ఫజల్ ఇ ఎలాహి కి స్థానిక
ప్రజలు గోరే వాలే అనే పేరు పెట్టారు.
ఫజల్ ఇ ఎలాహి వ్యాపార దక్షతకు మెచ్చి కలకత్తా
ముస్లిం సమాజం ఫజల్ ఇ ఎలాహి గోరే వాలే కు “ఫఖ్రే క్వామ్ (సమాజం
యొక్క గర్వం) అన్న బిరుదును కూడా ప్రధానం చేసింది.
మహాత్మా గాంధీ తన పర్యటనల సమయంలో కోల్‌కతాకు
వెళ్ళినప్పుడు ఫజల్ ఇ ఎలాహి ఇంటిలో బసచేసేవారు ఫజల్ ఇ ఎలాహి దయగల, గౌరవప్రదమైన
వ్యక్తి నైతికతతో జీవించారు.
స్వదేశీ ఉద్యమం లో భాగంగా బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ ప్రారంభం అయింది. ఫజల్-ఇ-ఎలాహి
స్వదేశీ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు.
ఫజల్-ఇ-ఎలాహి తన గిడ్డంగి నుండి
బ్రిటిష్ ఉత్పత్తుల భారీ కుప్పను సేకరించి, వాటిని దహనం
చేసినాడు. . బ్రిటీష్ వారితో వ్యాపార లావాదేవీలు ఆపివేసాడు. ప్రజలు ఫజల్-ఇ-ఎలాహి దేశభక్తి
కి మెచ్చి ‘ఫఖ్రే క్వామ్’
అనే బిరుదును ఇచ్చారు, దీని అర్థం "సమాజం యొక్క
గర్వం".
ఫజల్-ఇ-ఎలాహి త్యాగ స్ఫూర్తితో స్థానికులు
కూడా తమ వద్ద ఉన్న బ్రిటీష్ ఉత్పత్తులను
సేకరించి,
కుప్పలు
వేసి వాటిని దహనం చేసారు. ముస్లిం సమాజంతో పాటు కోల్‌కతా అంతటా బహిష్కరణ ఉద్యమం
ప్రారంభమైంది
ఫజల్-ఎ-ఎలాహీ తన సంపదలో మిగిలిన
భాగాన్ని స్వాతంత్ర్య పోరాటానికి ద్రవ్య విరాళాలు ఇవ్వడానికి ఉపయోగించాడు. వివిధ
భారతీయ ఉత్పత్తులను, చేతితో తయారు చేసిన కొవ్వొత్తులు,
సిరా
మరియు ఇతర ఉత్పత్తులను తయారు చేయడం మరియు వాటి వ్యాపారం చేయడం ప్రారంభించాడు.
వాస్తవానికి ఫజల్-ఎ-ఎలాహి కుటుంబం
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధాకు చెందిన హిందూ-పంజాబీలు. 1900వ
దశకంలో,
వాణిజ్యంలో
మెరుగైన అవకాశాల కోసం ఢిల్లీలో స్థిరపడ్డారు.
హజ్రత్ షామ్స్ తబ్రేజ్ అనే సూఫీ
సన్యాసి ప్రభావం తో ఇస్లాం స్వీకరించారు.
ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డాక,
ఢిల్లీలో
స్థిరపడిన పంజాబీలు ఢిల్లీవాల్ గా పిలవబడ్డారు. ఉర్దూను స్వీకరించారు. నేటికీ,
ప్రపంచవ్యాప్తంగా
స్థిరపడినప్పటికీ, వారిని ఢిల్లీవాల్ సమూహ ప్రజలు ఎక్కువగా
కోల్‌కతా మరియు ఢిల్లీలో కేంద్రీకృతమై ఉన్నారు
క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రచారం
చేస్తున్నప్పుడు, ఫజల్-ఎ-ఎలాహి కోల్‌కతాలోని ఢిల్లీవాల్
కమ్యూనిటీకి చెందిన బరాదారీ (బ్రదర్‌హుడ్) అధ్యక్షుడిగా ఎదిగారు.
No comments:
Post a Comment