కోయి గుల్ బాకీ రహేగా నా చమన్ రెహ్
జాయేగా
పర్ రసూలుల్లా కా దీన్-ఎ-హసన్ రెహ్
జాయేగా
(ఏ పువ్వు మిగిలి ఉండదు, ఏ తోట మిగిలి ఉండదు; కానీ ముహమ్మద్ (స)
యొక్క అందమైన మతం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.)
. ప్రముఖ ఇస్లామిక్
పండితుడు, కవి మరియు
స్వాతంత్ర్య సమరయోధుడు అయిన మౌలానా సయ్యద్ కిఫాయత్ అలీ కాఫీని బ్రిటీష్ వారు మే 6, 1858న మొరాదాబాద్
కూడలిలో ఉరితీశారు. మౌలానా సయ్యద్ కిఫాయత్ అలీ కాఫీ ఉరి శిక్ష
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన మరచిపోయిన అధ్యాయాన్ని సూచిస్తుంది.
బిజ్నోర్ జిల్లాలో జన్మించిన మౌలానా
కఫీ గౌరవప్రదమైన సాదత్ కుటుంబం లో జన్మించారు. మౌలానా కఫీ మొరాదాబాద్, బరేలీ మరియు బదౌన్‌లలో
తన విద్యను అభ్యసించారు. మౌలానా కఫీ మతపరమైన అధ్యయనాలు, సాంప్రదాయ వైద్యం (హిక్మత్) మరియు
కవిత్వంలో నైపుణ్యం పొందాడు. మౌలానా కఫీ కేవలం పండితుడు మాత్రమే కాదు, దివాన్-ఎ-కాఫీ, దివాన్-ఎ-తన్హా, కమలాత్-ఎ-అజీజీ
మరియు నసీమ్-ఎ-జన్నత్ వంటి రచనలతో నిష్ణాతుడైన కవి కూడా.
బ్రిటీష్ పాలన అంతమై స్వేచ్ఛా
హిందుస్థాన్‌ను చూడాలనే సంకల్పం కలవారు మౌలానా కాఫీ. 1857లో ప్రథమ
స్వాతంత్య్ర సంగ్రామం చెలరేగినప్పుడు, మౌలానా కాఫీ స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా
పాల్గొన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మౌలానా కాఫీ ఇచ్చిన జిహాద్ ఫత్వా, మొరాదాబాద్‌లోని
జామా మసీదు గోడలపై అంటిచబడినది. అణచివేతదారులకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడాలని మౌలానా
కాఫీ పిలుపునిచ్చారు.
జనరల్ బఖ్త్ ఖాన్ రోహిల్లా దళాలలో
చేరి, మౌలానా
కాఫీ ఢిల్లీ నుండి బరేలీ మరియు అలహాబాద్ వరకు ధైర్యంగా పోరాడారు. మొరాదాబాద్‌ను
విముక్తి చేసిన తర్వాత, మౌలానా
కాఫీ, నవాబ్ మజ్జు ఖాన్ అని కూడా పిలువబడే
నవాబ్ మజిదుద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాన్ని స్థాపించడంలో సహాయం
చేశాడు. మౌలానా కాఫీ సదర్-ఎ-షరియత్‌గా నియమించబడ్డాడు, అక్కడ మౌలానా కాఫీ
షరియా చట్టం ప్రకారం న్యాయపరమైన విషయాలను పర్యవేక్షించాడు.
ప్రారంభ విజయాలు ఉన్నప్పటికీ, స్థానిక ద్రోహులు
మరియు బ్రిటిష్ వారితో జతకట్టిన రాంపూర్ నవాబ్ చేసిన ద్రోహాల కారణంగా మొరాదాబాద్‌లో
స్వాతంత్ర్య ఉద్యమం గణనీయమైన ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. ఫలితంగా, బ్రిటీష్ వారు
మొరాదాబాద్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు మరియు ఫక్రుద్దీన్ కలాల్ అనే స్థానిక
ఇన్‌ఫార్మర్ ఇచ్చిన సూచన మేరకు ఏప్రిల్ 30, 1858న మౌలానా కాఫీని అరెస్టు చేశారు.
మౌలానా కాఫీ విచారణ వేగంగా మరియు అత్యంత
క్రూరంగా జరిగింది. మే 6,
1858 న, తీవ్రమైన
హింసను భరించి మరియు తన మాతృభూమి పట్ల తన విశ్వాసాన్ని మరియు నిబద్ధతను
త్యజించడానికి నిరాకరించిన తరువాత, మౌలానా కాఫీ ని బ్రిటిష్ వారు ఉరితీశారు. ఉరి కొయ్య
ఉన్నప్పటికీ మౌలానా కాఫీ తన చివరి క్షణాలు అసాధారణమైన ప్రశాంతతతో గడిపారు.
మౌలానా సయ్యద్ కిఫాయత్ అలీ కాఫీ
త్యాగం భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి తమ ప్రాణాలను అర్పించిన అసంఖ్యాకమైన
మహోన్నతమైన వీరులకు గుర్తుగా మిగిలిపోయింది. మౌలానా సయ్యద్ కిఫాయత్ అలీ, దేశం మరచిన గొప్ప
అమరవీరులలో ఒకరు.
No comments:
Post a Comment