ఉప్పు సత్యాగ్రహం,
లేదా
దండి మార్చ్, భారతదేశంలోని బ్రిటిష్ వలస
సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ (మహాత్మా గాంధీ) నిర్వహించిన
అతిపెద్ద సామూహిక ఆందోళనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఉప్పుపై పన్ను విధింపు వ్యతిరేకతను
గాంధీజీ ప్రజా ఉద్యమంగా మార్చారు.
ఉప్పు పన్ను వ్యతిరేక ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలనే ఆలోచన కొత్తది కాదు. 1844లో, సూరత్ లో ఇలాంటి ప్రజాందోళన జరిగింది మరియు ఆందోళన చేస్తున్న ప్రజల డిమాండ్‌కు బ్రిటిష్ ప్రభుత్వం తలొగ్గవలసి వచ్చింది. ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా జరిగిన ప్రజాఉద్యమానికి సయ్యద్ నా అలీ అద్రోస్ దర్గా అధిపతి షరీఫ్ షేక్ నాయకత్వం వహించారు.
షరీఫ్ షేక్, 30 ఆగస్టు 1844న సూరత్‌లోని కోర్టులతో సహా ప్రభుత్వ కార్యాలయాల ముందు 30,000 ప్రజలు నిర్వహించిన ఆందోళనకు నాయకత్వం వహించాడు. ఉప్పు సుంకాన్ని మట్టిదిబ్బకు 8 అణాల (సుమారు. 37 కిలోలు) నుండి 1 రూపాయికి పెంచడానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఆందోళన శాంతియుతంగా జరిగింది.
నాటి బాంబే టైమ్స్ మరియు జర్నల్ ఆఫ్ కామర్స్ కథనం ప్రకారం , “ఉప్పు పై అన్యాయమైన డబుల్ డ్యూటీ విధించడం కు నిరసనగా సూరత్ నగరవాసులందరూ కలిసి న్యాయమూర్తికి విజ్ఞాపన ఇవ్వడానికి అడవాలత్‌కు వెళ్లారు. వారిలో కొందరు తుంటరి వారు రాళ్లు రువ్వడం మొదలెట్టారు, న్యాయమూర్తి నివాస భవనాల కిటికీలు పగలగొట్టారు మరియు నష్టం చేయడం ప్రారంభించారు. అడవాలత్ వద్దకు సైన్యం రావడంతో గొడవ ప్రారంభమైంది, దీనిలో ఒక వృద్ధురాలు మరణించింది మరియు అనేక మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు, చివరకు సైన్యం గుంపును చెదరగొట్టారు. దుకాణాలు మూసివేయబడ్డాయి మరియు వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. సూరత్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు.
సూరత్‌లోని బ్రిటీష్ ఏజెంట్ బొంబాయి (ప్రస్తుతం ముంబై)లోని తన ఉన్నతాధికారులకు సమాజం లోని అన్ని వర్గాల ప్రజల ఆందోళనను తెలియజేసాడు. బ్రిటీష్ అధికారులు ఆందోళన లో "హిందువులలోని అట్టడుగు వర్గాలు" మాత్రమే కాకుండా హిందువులు, ముస్లింలు మరియు పార్సీలలోని ఉన్నత వర్గాల వారు కూడా ఉద్యమంలో చేరారు అని గ్రహించారు.సామూహిక ఉద్యమం మరింత విస్తరించవచ్చని మరియు హింసాత్మకంగా మారవచ్చని గ్రహించిన తర్వాత సాల్ట్ టాక్స్ ఆగస్ట్ 31న ఉపసంహరించబడింది.
ది బాంబే టైమ్స్ ప్రకారం "సర్ కీత్, కలెక్టర్, ఉప్పు చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు."
మహమ్మదీయ నాయకుడు షరీఫ్ షేక్ ప్రకారం “నగరంలోని
పౌరులు నా ఇంటి వద్ద సమావేశమయి సిర్దార్ సాహెబ్ (గౌరవనీయమైన గవర్నర్‌కు ఏజెంట్)
వద్దకు వెళ్లాలని నన్ను కోరారు. దయగల సాహెబ్ ప్రజలను శాంతింపజేయడానికి, నగరంలో
ఉప్పు ను అన్యాయమైన డబుల్ డ్యూటీ లేకుండా విక్రయించమని
ఆదేశిస్తాడని ప్రజలు కోరుకొన్నారు.”
ఒక అధికారిక లేఖలో,
బ్రిటిష్ అధికారులు
షరీఫ్ షేక్‌కు ముందు ప్రజలను శాంతపరచమని, ఉప్పు పన్ను పై అసంతృప్తి విషయాన్నీ ప్రభుత్వానికి
ఒక పిటీషన్ ద్వారా విజ్ఞప్తి చేసుకొమ్మని, స్థానిక అధికారులు ఆ పిటీషన్ ను బొంబాయిలో గౌరవనీయులైన గవర్నర్‌కి పంపుతామని తెలియజేసారు..
కాని ఆందోళన ఆగలేదు. ముందుగా పన్నును
ఉపసంహరించుకోవాలని షరీఫ్ షేక్ కోరారు. ఆగస్టు 31న పన్నును
ఉపసంహరించుకున్నప్పుడు మాత్రమే ఆందోళన ఆగిపోయింది. “‘అధికారులు,
ప్రజల మద్య చర్చల
తర్వాత సూరత్ కలక్టర్ ఉప్పు పై తొలగించారు, సూరత్ లో లో
శాంతి నెలకొల్పబడినది దుకాణాలు తెరవబడ్డాయి మరియు ప్రతిదీ
యథావిధిగా జరుగుతోంది'.
దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత గాంధీ
శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సూరత్ సమీపంలోని దండి వద్ద ఉప్పు
చట్టాన్ని ఉల్లంఘించారు.
No comments:
Post a Comment