ముస్లిం మహిళా విద్యా సాధికారికత:
కోజికోడ్(కేరళ):
కేరళలోని కాసర్గోడ్ జిల్లా త్రికరుపూర్ అనే పట్టణానికి చెందిన కవల సోదరీమణులు - రామ్సీనా రషీద్ Ramsina Rasheed మరియు రిస్సానా Rissana Rasheed రషీద్ లలో ఒకరు రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మరొకరు ఖరగ్‌పూర్ నుండి ఇంజినీరింగ్ పట్టభద్రులయ్యారు మరియు ఇద్దరూ ఉద్యోగరీత్యా బెంగళూరులో పనిచేస్తున్నారు. కవల సోదరీమణుల తండ్రి సాధారణ ఆటో రిక్షా డ్రైవర్.
కవల సోదరీమణుల విద్యాప్రయాణం దేశ విదేశాల్లోని ఆడపిల్లలకు స్ఫూర్తిదాయకం.రామ్‌సీనా రషీద్ మరియు రిస్సానా రషీద్ హిజాబ్‌లో తరగతులకు హాజరవుతూ IIT నుండి పట్టభద్రులై రికార్డు సృష్టించారు.
రామ్‌సినా రషీద్ మరియు రిస్సానా రషీద్ తమ JEE అడ్వాన్స్‌డ్ పరీక్షను 2017లో పూర్తి చేశారు. రామ్సీనా రషీద్ ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి ఏరోస్పేస్ టెక్నాలజీలో M.Tech చేయగా, రిస్సానా రషీద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఐఐటీ రూర్కీ నుండి B.Tech చేసింది.. అక్కాచెల్లెళ్లిద్దరూ రామ్‌సినా రషీద్ మరియు రిస్సానా రషీద్ ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నారు.
రామ్సీనా మరియు రిస్సానాల తండ్రి రషీద్ సాధారణ ఆటో-రిక్షా డ్రైవర్ కాని తన కుమార్తెల చదువుకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత చదువులు చదివేలా చూసుకున్నాడు. తండ్రి రషీద్ తన జీవితాన్ని కూతుళ్ల చదువుకే అంకితం చేశాడు. రామ్సినా మరియు రిస్సానా తండ్రి భారతీయ సమాజంలోని సామాజిక అడ్డంకులతో పాటు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది.
కవల సోదరీమణులు- రామ్సీనా మరియు రిస్సానాల తల్లి కూడా వారి చదువులో సాయపడింది. కవల సోదరీమణులు అమ్మాయిలకు లేత వయస్సులోనే వివాహం చేసే కేరళలోని ఒక ప్రాంతం నుండి వచ్చారు.
రామ్సినా మరియు రిస్సానా వారి గ్రామం నుండి మొదటి IIT ఉత్తీర్ణత సాధించారు. ఇద్దరూ బెంగళూరులోని ఓ టాప్ కంపెనీలో పనిచేస్తున్నారు. తమ ప్రాంతానికి ఆదర్శంగా నిలిచారు.
ఆడపిల్లలు ఆర్థిక, సామాజిక, మత మరియు లింగ ప్రాతిపదికన వివక్షను ఎదుర్కొంటున్న దేశంలో, రామ్‌సినా మరియు రిస్సానా కష్టాలను అధిగమించి అగ్రశ్రేణి IITల నుండి గ్రాడ్యుయేట్ చేయడం ద్వారా రికార్డు సృష్టించారు.
రామ్సీనా మరియు రిస్సానా మతపరమైన
వివక్ష (హిజాబ్ ధారణ) ను కూడా ఎదుర్కొన్నారు. రామ్‌సినా మరియు రిస్సానా హిజాబ్ ధరించి
ను తమ విద్యను కొనసాగించి, తమ ప్రాంతం, తమ
దేశం గర్వించేలా తమ విద్యనూ పూర్తి
చేసారు.
No comments:
Post a Comment