17 August 2024

టర్కీ విముక్తి యుద్ధంలో భారతీయ ముస్లిం వీరుడు అబ్దుర్రహ్మాన్ పెషావారి Indian Muslim hero in Turkey’s liberation war Abdurrahman Peshawari

 

ఇస్తాంబుల్:

మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమి తర్వాత టర్కీ స్వాతంత్ర్య యుద్ధ సమయం లో ఒట్టోమన్‌లకు సహాయం చేయడానికి వచ్చిన భారతీయ ముస్లిం అబ్దుర్రహ్మాన్ పెషావారి టర్కీ యొక్క మొదటి వార్తా సంస్థ అనాడోలు ఏజెన్సీకి మొదటి జర్నలిస్టు మరియు టర్కీ యొక్క మొదటి విదేశీ వ్యవహారాల అధికారి అయ్యాడు..

అబ్దుర్రహ్మాన్ పెషావారీ అనడోలు ఏజెన్సీ యొక్క ఒక చిన్న కార్యాలయంలో తన వార్తా కథనాలను వ్రాసి, యుద్ధకాలపు దురాగతాలు, విజయాలు మరియు నష్టాల కథనాలను టైప్ చేసి బయట ప్రపంచానికి తెలిపేవాడు.

 అబ్దుర్రహ్మాన్ పెషావారి ప్రఖ్యాత ఖైబర్ లోయలోని పెషావర్ నగరంలో జన్మించాడు.  కేవలం 26 సంవత్సరాల వయస్సులో అబ్దుర్రహ్మాన్ పెషావారి తన చదువు, సంపన్న కుటుంబం ను విడిచి సముద్రయానం ద్వారా టర్కీ కి చేరుకొన్నాడు.  

అబ్దుర్రహ్మాన్ పెషావరీ 26 మంది భారతీయ ముస్లింలతో ముంబై నుండి ఒట్టోమన్ సామ్రాజ్య రాజధాని ఇస్తాంబుల్‌కు ఇటాలియన్ నౌకలో ప్రయాణించారు మరియు సుదీర్ఘ ప్రయాణంలో బృందంలోని స్వచ్ఛంద వైద్యులు అబ్దుర్రహ్మాన్ పెషావారి కి ప్రథమ చికిత్సలో శిక్షణ ఇచ్చారు.

అబ్దుర్రహ్మాన్ పెషావరీ ఉన్నత ఇస్లామిక్ ఆదర్శాలచే ప్రేరేపించబడి, ఒట్టోమన్ సైన్యంతో కలసి  పోరాడారు మరియు బ్రిటీష్ ఇంపీరియల్ నేవీకి వ్యతిరేకంగా గల్లిపోలిలో పోరాడుతున్నప్పుడు మూడుసార్లు గాయపడ్డారు, ఈ సమయంలో ఒట్టోమన్ దళాలు డార్డనెల్లెస్ జలసంధి నుండి బ్రిటిష్ దండయాత్ర దళాలను తిప్పికొట్టగలిగాయి.

అబ్దుర్రహ్మాన్ పెషావరీ ఒట్టోమన్ రెడ్ క్రెసెంట్ గ్రూప్‌లో చేరాడు. బాల్కన్‌లలో పోరాడుతున్న ఒట్టోమన్ సైన్యాలకు వైద్య పరికరాలను కొనుగోలు చేయడానికి భారతీయ ముస్లింల నుండి ఆర్థిక సహాయం అందించాడు. టర్కీసామ్రాజ్యం పతనం సమయంలో భారతీయ ముస్లిం సంఘాలు ఒట్టోమన్‌లకు మద్దతు ఇచ్చాయి మరియు అబ్దుర్రహ్మాన్ పెషావరీ టర్కీ స్వాతంత్ర్య యుద్ధంలో "తెలియని హీరో unknown hero " అని ప్రముఖ టర్కీ చరిత్ర పరిశోధకుడు ముకాహిత్ అర్స్లాన్ Mucahit Arslan అన్నారు.

"బ్రిటీష్ రాజ్" సమయం లో భారతదేశంలోని ముస్లిం సంఘాలచే కాలిఫేట్ ఉద్యమం 1912 నాటికే ప్రారంభమైంది, ఒట్టోమన్లు ​​బాల్కన్‌లలో పోరాడుతున్నారు మరియు చాలా మంది భారతీయ ముస్లింలు ఒట్టోమన్ల కు  ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా సహకరించారు. ఐరోపాలో మెడిసిన్ చదువుతున్న కొంతమంది సంపన్న భారతీయులు గల్లిపోలి యుద్ధంలో ఫీల్డ్ హాస్పిటల్‌ను స్థాపించారు.

అబ్దుర్రహ్మాన్ పెషావరీ ఒట్టోమన్ సైన్యంలో చేరాడు మరియు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బీరుట్ మరియు గల్లిపోలిలలో క్రియాశీల సేవలో పాల్గొన్నాడు. యుద్ధానంతరం, అబ్దుర్రహ్మాన్ పెషావరీ టర్కిష్ రిపబ్లిక్ స్థాపించబడిన అంకారాలో నివాసం ఏర్పరచుకొన్నాడు.  తిరిగి రావాలని తన తల్లి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాడు.

అబ్దుర్రహ్మాన్ పెషావరీ, అటాతుర్క్ చే ఆఫ్ఘనిస్తాన్‌కు రాయబారిగా నియమించబడి కొత్త టర్కిష్ రిపబ్లిక్‌కు సేవ చేశాడు. అబ్దుర్రహ్మాన్ పెషావరీ 1925లో ఇస్తాంబుల్‌లో మిలిటరీ కమాండర్‌గా పొరబడి హత్యకు గురిఅయినాడు.  

మార్తా గెల్‌హార్న్, జార్జ్ ఆర్వెల్, ఎర్నెస్ట్ హెమింగ్‌వే మరియు వాల్టర్ క్రోన్‌కైట్‌లు వారి కాలంలోని అత్యంత భయంకరమైన సంఘర్షణలను నమోదు చేసి యుద్దకాల విలేకర్లు war time reporters గా అంతర్జాతీయ ఖ్యాతిని పేరును  గడించారు. అబ్దుర్రహ్మాన్ పెషావారి టర్కీలో, ప్రముఖ యుద్దకాల విలేకరిగా పేరు తెచ్చుకొని టర్కీ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచి పోయాడు.


source: http://www.aa.com.tr / Anadolu Agency / Home> Archive / May 07th, 2014

 

No comments:

Post a Comment