హైదరాబాద్
యువరాణి బేగం సాహిబా నీలౌఫర్ ఖానుమ్ సుల్తానా ఫర్హాట్
(టర్కిష్: నీలుఫర్ హనమ్ సుల్తాన్; 4 జనవరి 1916 -
12 జూన్ 1989) ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క చివరి యువరాణులలో ఒకరు. ఆమె భారతదేశంలో హైదరాబాద్
చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండవ కుమారుడు మోజ్జామ్ జా Moazzam Jah ని వివాహం
చేసుకుంది.
టర్కీ,
ఇస్తాంబుల్‌లోని Göztepe గుజ్టెప్ ప్యాలెస్‌లో నీలౌఫర్ జన్మించారు. ఆమె
తండ్రి డమాద్ మొరాలిజాడ సాలరుద్దీన్ బే ఎఫెండి ఒట్టోమన్ రాజాస్థానం లో ప్రముఖ సభ్యుడు. ఆమె తల్లి, అడిలే సుల్తాన్ Adile Sultan, సుల్తాన్ మురాద్ V యొక్క పెద్ద కుమారుడు షెహజాద్ మేహ్మేడ్ సెలహేద్దున్ Shehzade Mehmed Selaheddin యొక్క కుమార్తె.
మొదటి ప్రపంచ
యుద్ధం ముగింపులో టర్కీపాలక రాజవంశం
తొలగించబడింది మరియు టర్కీ రిపబ్లిక్గా ప్రకటింపబడినది.1924 లో ఒట్టోమన్లు
టర్కీ నుండి బహిష్కరించబడ్డారు. వారు ఫ్రాన్స్ లో స్థిరపడ్డారు మరియు మధ్యధరా నగరమైన నైస్‌లో నివాసం ఏర్పర్చుకున్నారు.
నీలోఫర్ తల్లిదండ్రులతో సహా రాజాస్థానం లోని అనేక కుటుంబాల సభ్యులు ఫ్రాన్స్ లో ప్రవాసానికి వెళ్లారు.
డిసెంబర్ 20, 1931న నీలౌఫర్ కి 16 ఏళ్ళ వయసులో హైదరాబాద్ చివరి నిజాం రెండవ
కుమారుడు మోజ్జామ్ జాతో వివాహం నైస్ లోని హిలాఫత్ ప్యాలెస్లో జరిగింది. నిజాం పెద్ద కుమారుడు మరియు వారసుడు సుల్తాన్
అబ్దుల్మెసిడ్ II కుమార్తె
డర్రెహ్వర్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత, నీలౌఫర్ భారతదేశంలోని హైదరాబాద్లోని నిజాం రాజాస్థానం
కు వెళ్లారు.
ఆమెకు పిల్లలు లేరు. ఆమె తన ప్రజా సేవ
లో తన జీవితాన్నిగడిపింది. ఆమె లేడీ హైదరి
క్లబ్‌లో మెంబెర్. ఆమె స్వేచ్ఛగా నగరం లో తిరగే వారు మరియు పబ్లిక్ కార్యక్రమాలు,
విందులు-వినోదాలకు హాజరయ్యేవారు మరియు అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళల
అభివృద్దికి నిలోఫర్ ఎంతోగా కృషి చేసారు. ఆమె అందం మరియు చురుకైన ప్రజా జీవితం
పత్రికలలో ప్రస్తావించబడింది మరియు ఆమె పత్రికల కవర్ పేజీలలో ప్రదర్శించబడింది.
ఆమె ప్రపంచంలోని అత్యంత అందమైన 10 మహిళలలో ఒకరిగా గౌరవిoపబడినది..
నీలౌఫర్
హాస్పిటల్ ఏర్పాటు:
తల్లిని కావాలనే
ఆమె కల నిజం కాలేదు. కానీ, గర్బిణీలు, పిల్లలకు మెరుగైన
వైద్య సేవలు అందించాలనే స్వప్నం సాకారమైంది. అదే.. ‘నిలోఫర్’ ఆసుపత్రి
1949లో నిలోఫర్
పనిమనిషుల్లో ఒకరైన రఫత్ ఉన్నీసా బేగం మరణించింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న
రఫత్‌కు వైద్యం అందకపోవడం వల్ల ఆమెతోపాటు బిడ్డ కూడా మరణించింది. ఈ విషయం తెలిసి
నిలోఫర్ గుండె బరువెక్కింది. దీంతో ఆమె ఈ విషయాన్ని మామ ఉస్మాన్ అలీఖాన్‌కు
వెల్లడించారు. మాత, శిశు మరణాల నియంత్రణ కోసం ఆసుపత్రి నిర్మించాలని
కోరారు. ఆమె కోరిక మేరకు హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్ ప్రాంతంలో 100 పడకలతోమహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రి నిర్మించారు.
ఆమె గౌరవార్థం ఆసుపత్రికి నీలౌఫర్ హాస్పిటల్ అని పేరు పెట్టారు మరియు ఆమె దాని పోషకురాలిగా కొనసాగించింది. ప్రస్తుతం ఈ ఆసుపత్రి సామర్థ్యం 500 పడకలకు చేరింది. ప్రసూతి మరణాల నుంచి తల్లిబిడ్డలను కాపాడుతోంది
ప్రత్యేక
ఆసుపత్రిని నిర్మించడం మరియు హైదరాబాద్‌లో స్థిరపడటానికి విదేశీ వైద్యులను గొప్ప
ఖర్చుతో ప్రోత్సహించడం సహా ఆమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు నిజాం నవాబ్ మరియు ఇతర
కుటుంబ సభ్యులు పూర్తిగా మద్దతు ఇచ్చారు, ఆసుపత్రి మరియు పిల్లల పాఠశాలలు వంటి నిర్మాణాత్మక విషయాలలో
ఆమెకు తన కుటుంభ సబ్యుల మద్దతు లబించినది. రెండవ ప్రపంచ యుద్ధంలో, నీలౌఫర్, నర్సుగా శిక్షణ
పొందాడు మరియు హైదరాబాద్లో సహాయక చర్యలలో పాల్గొన్నారు.
వివాహం తరువాత
చాలా సంవత్సరాలు గడిచాయి, కాని నీలౌఫర్
గర్భం ధరించలేదు. హైదరాబాద్‌లో స్పెషలిస్ట్ ప్రసూతి వైద్యులు లేనందున ఆమె
వైద్యులను సంప్రదించడానికి యూరప్ వెళ్లారు.
1948లో నీలౌఫర్‌తో
వివాహం అయిన 17 సంవత్సరాల తరువాత,
ఆమె భర్త మోజ్జామ్ జాహ్ హైదరాబాద్‌లోని స్థానిక కులీనుల
కుమార్తె రజియా బేగం ను రెండవ వివాహం
చేసుకొన్నారు. రెండవ వివాహం ద్వారా అతనికి ముగ్గురు కుమార్తెలు జన్మించారు.
ఆ తర్వాత వారు ఫ్రాన్స్ వెళ్లిపోయారు.
1952లో 21 సంవత్సరాల వివాహం తరువాత, నీలౌఫర్ మరియు ఆమె భర్త విడాకులు తీసుకున్నారు. నీలోఫర్ తన కలల
ప్రాజెక్టయిన ఆసుపత్రి నిర్మాణ పనులు చూసుకున్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్
వెళ్లిపోయారు. దీంతో ఆమె ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. 1953లో ఆమె లేకుండానే నిలోఫర్ ఆసుపత్రి ప్రారంభమైంది.
విడాకుల తరువాత, నీలోఫర్ ఫ్రాన్స్ కు వెళ్లి అక్కడ ఉన్న ఒట్టోమన్ కుటుంబం తో స్థిరపడింది. నైస్‌లో నీలౌఫర్ చురుకైన సామాజిక
జీవితాన్ని కొనసాగించారు. 21 ఫిబ్రవరి 1963 న, పారిస్‌లో, నీలౌఫర్ ఎడ్వర్డ్ జూలియస్ పోప్ ఒక అమెరికన్ను వివాహం
చేసుకున్నాడు. ఆమె 12 జూన్ 1989 న పారిస్‌లో మరణించింది.
ఆధారాలు:
·
వికిపిడియా
·
విబిన్న పత్రికలలోని వార్తలు