3 June 2020

అల్-సూఫీ (అజోఫీ) 903 –986) - ఖగోళ శాస్త్రవేత్త Al-Sufi (Azophi) (903 –986)) – Astronomer


అబ్దుల్-రహమాన్ అల్-సూఫీ (పర్షియన్: عبدالرحمن صوفی) (డిసెంబర్ 7, 903 - మే 25, 986) ఒక పెర్షియన్ ఖగోళ శాస్త్రవేత్త. అతనిని 'అబ్దుర్-రహమాన్ అస్-సూఫీ, లేదా' అబ్దుల్-రహమాన్ అబూ అల్-హుస్సేన్ , 'అబ్దుల్ రెహ్మాన్ సూఫీ,' అని అందురు. అబ్దుర్రహ్మాన్ సూఫీ ని పశ్చిమాన అజోఫీ లేదా అజోఫీ అరబస్  Azophi and Azophi Arabus అని కూడా పిలుస్తారు. ఇతను ఇస్లామిక్ స్వర్ణయుగ ఖగోళ శాస్త్రవేత్త.

 చంద్రలోని  బిలం కు మరియు చిన్న గ్రహం 12621 అల్సుఫీ కి అతని పేరు పెట్టారు. అల్-సూఫీ తన ప్రసిద్ధ “బుక్ ఆఫ్ ఫిక్స్డ్ స్టార్స్‌ Book of Fixed Stars ను 964 లో ప్రచురించాడు. అతడు తన రచనలు  వర్ణనలలో మరియు చిత్రాలలో వివరించాడు. అల్-బెరుని ప్రకారం సూఫీ షిరాజ్‌లో గ్రహణంపై పరిశోధన జరిపాడు.

'ముస్లిం ఖగోళ శాస్త్రవేత్తలలో తొమ్మిది మందిలో అబ్దుల్-రహమాన్ అల్-సూఫీ ఒకరు. అతను సూఫీ ముస్లిం నేపథ్యానికి చెందినవాడు అని అతని పేరు సూచిస్తుంది. అతను పర్షియాలోని ఇస్ఫాహాన్ Isfahan లోని ఎమిర్ అదుద్ అడ్-దౌలా Emir Adud ad-Daula యొక్క ఆస్థానంలో నివసించాడు మరియు గ్రీకు ఖగోళ రచనలను, ముఖ్యంగా ఆల్మాజెస్ట్ ఆఫ్ టోలెమిని అనువదించడానికి మరియు విస్తరించడానికి పనిచేశాడు. అతను టోలెమి యొక్క స్టార్ జాబితాకు అనేక సవరణలు చేసాడు. టోలెమి యొక్క స్టార్ జాబితాకు తన ప్రకాశం మరియు పరిమాణం brightness and magnitude estimates యొక్క అంచనాలను చేశాడు. అల్-సూఫీ యొక్క పరిమాణాలలో 55% మాత్రమే టోలెమికి సమానంగా ఉంటాయి.

అతను హెలెనిస్టిక్ ఖగోళశాస్త్రం యొక్క అరబిక్ అనువాదకుడు. సాంప్రదాయ అరబిక్ నక్షత్ర పేర్లు మరియు నక్షత్రరాశులను  గ్రీకుతో సంబంధం కలపటానికి  ప్రయత్నించిన మొదటి వ్యక్తి.


 స్థిర నక్షత్రాల పుస్తకం Book of Fixed Stars: