14 June 2020

అల్ రజీ (రేజెస్) 854-932 Al-Rāzī (Rhazes) 854-932


Muhammad ibn Zakariya al-Razi - Wikiwand
.
అల్-రజి ని  ఐరోపావాసులు  రేజస్ అని పిలుస్తారు ( రాజెస్,రాసిస్, రాసి లేదా ఆర్-రజి Rhazes  or Rasis).  లాటిన్ లో  రేజెస్ గా పిలువబడే  అబూ బకర్ ముయమ్మద్ ఇబ్న్ జకారియే అల్-రేజా (జననం 854 పర్షియా ఇప్పుడు ఇరాన్‌లో మరియు  మరణం   925/932లో ) ప్రసిద్ధ రసవాది,ఇస్లామిక్ తత్వవేత్త మరియు ఇస్లామిక్ ప్రపంచంలో గొప్ప వైద్యుడు గా పరిగణిoపబడినాడు. మెడిసన్,ఆప్తమాలోజీ,కెమిస్త్రీ, ఖగోళశాస్త్రం లో ప్రముఖ విద్వాంసుడు. ఇతను మశూచికం(స్మాల్ ఫాక్స్) పై విస్తృతంగా పరిశోదనలు చేసినాడు

అల్-రేజా తన వైద్య పరిజ్ఞానాన్ని సంపాదించడానికి ముందే  రసవాది. రేయ్Rayy ఆసుపత్రిలో చీఫ్ ఫిజిషియన్‌గా పనిచేసిన తరువాత, కొంతకాలం బాగ్దాద్‌లో వైద్యునిగా పనిచేసాడు.

అల్-రేజా యొక్క రెండు ముఖ్యమైన వైద్య రచనలు “కితాబ్ అల్-మనారా Kitāb al-Manūrī” దీనిని పశ్చిమంలో 12 వ శతాబ్దo లో  జెరార్డ్ ఆఫ్ క్రెమోనా లాటిన్ లోకి అనువదించినాడు. అల్-రెజా యొక్క మరియొక ప్రసిద్ద గ్రంధం  “కితాబ్ అల్-ఓవేKitāb al-āwī, లేదా "సమగ్ర పుస్తకం The Comprehensive Book,". దీనిలో అతను గ్రీకు, సిరియన్ మరియు ప్రారంభ అరబిక్ మెడిసిన్  మరియు కొంత  భారతీయ వైద్య పరిజ్ఞానాన్ని పొందుపరిచాడు. తన ప్రతి రచనలలో అతను తన సొంత వైద్య అనుభవాన్ని వ్యాఖ్యానంగా చేర్చాడు.

ఇతను  ఇస్లామిక్ వైద్య పరిశోధనలో ముందంజలో ఉన్నాడు. ఇతను ఒక సఫల రచయిత మరియు ఆయన మెడిసిన్ (ఔషధం) మరియు తత్వశాస్త్రం గురించి 200 పుస్తకాలను లిఖించాడు వాటిలో ఒకటి అముద్రిత పుస్తకo. దానిలో మెడిసిన్ (ఔషధం)తో పాటు, ఇస్లామిక్ ప్రపంచానికి తెలిసిన జ్ఞానాన్ని ఒకే చోట క్రోడికరించారు.  ఈ గ్రంథం లాటిన్లోకి అనువదించబడింది మరియు పశ్చిమ వైద్య చరిత్రలో ఇది ఒక ప్రధాన మూలగ్రంధం  అయింది.

అతని అనేక ఇతర చిన్న వైద్య గ్రంథాలలో “ట్రీటైజ్ ఆన్ ది స్మాల్ పాక్స్ అండ్ మీజిల్స్” మొదలగునవి ఉన్నాయి. మశూచికము,తడపర పై అతడు వ్రాసిన పరిశోధనా వ్యాసాలు ఆతరువాత లాటిన్,గ్రీక్,బైజంటిన్ మరియు ఇతర ప్రముఖ ఆధునిక బాషలలోకి అనువదించబడి ప్రసిద్ది పొందినవి..

ఇస్లామిక్ మెడిసిన్ పితామహుడు - అల్-రాజీ (రజేస్) Al Razi (rhazes)

శాస్త్రీయ పద్ధతి, ప్రయోగం మరియు పరిశీలనను scientific method and promoting experimentation and observation ప్రోత్సహించటం లో  అల్-రజి(Rhazes) ప్రసిద్ది చెందాడు. బాగ్దాద్లో ఒక ఆసుపత్రిని నిర్మిస్తామని దానికి  ప్రదేశాన్ని ఎన్నుకోమని అతనిని అడిగినప్పుడు అతను బాగ్దాద్ లో ఎక్కువ పరిశుబ్రత ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోన్నాడు. రోగుల అనారోగ్యానికి కారణం అపరిశుబ్రత అని  ఆయన భావించారు. అతను బాగ్దాద్ నగర ఆసుపత్రి డైరెక్టర్ గా పనిచేశాడు మరియు ఇస్లామిక్ ఔషధ పరిశోధనలో తన కాలం గడిపాడు.

వైద్యడు (డాక్టర్) మరియు రోగి మధ్య ఉండే కీలకమైన సంబంధాన్ని గురించి  అల్ రజి విస్తృతంగా వ్రాశాడు. రోగి మరియు డాక్టర్ మద్య  ట్రస్ట్(trust) మీద నిర్మించిన సంబంధం అభివృద్ధి చేయాలని మరియు డాక్టర్ రోగికి సహాయంగా ఉండే బాధ్యత కలిగివుండటంతో, రోగి వైద్యుని సలహాను పాటించే బాధ్యతను కలిగి ఉంటాడు అని అన్నాడు.  గాలెన్ మాదిరిగా, కాకుండా ఔషధం యొక్క సంపూర్ణ నివారణ  పద్ధతి కీలకమైనదిగా భావించి  రోగి యొక్క నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని  మరియు అధునిక మెడిసిన్ లో సూచించినట్లు  రోగి దగ్గరి కుటుంబానికి కల వ్యాధులను, రోగాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని  అతను నమ్మాడు.

అతని మరొక  గొప్ప ఘనత అనారోగ్యత యొక్క అవగాహన. ఇది గతంలో లక్షణాల ద్వారా వర్ణించబడింది, కానీ అల్-రజి లక్షణాలకు కారణాలను పరిశిలించాడు.   మశూచి మరియు తట్టు వ్యాధి విషయంలో, అతను రక్తo యొక్క పాత్రను గుర్తిoచాలన్నాడు. అయితే అప్పటికి  సూక్ష్మజీవుల గురించి తెలియదు. .

అల్ రజి మానవ శరీరశాస్త్రం గురించి విస్తృతంగా వ్రాసాడు మరియు మెదడు మరియు నాడీ వ్యవస్థ ఎలా కండరాల కదిలకను  నిర్వహిస్తుందో అర్థం చేసుకున్నాడు. ఆకాలం నాటికి   శరీరచేద్దo (dissection) పై ఆంక్షలు ఉన్నoదువలన అతను ఈ రంగం లో అధ్యయనాలు చేయలేదు.

అల్-రాజి–ఇస్లామిక్ తత్వశాస్త్రం:
ఇతనిని  తత్వశాస్త్రంలో ఇస్లామిక్ సోక్రటీస్ గాను మరియు వైద్యం లో ఇస్లామిక్ హిప్పోక్రేట్స్ గా పరిగణిస్తారు.అల్-రేజా యొక్క తాత్విక రచనలు శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి మరియు వాటి ప్రాముఖ్యత 20 వ శతాబ్దం వరకు వెలుగులోకి రాలేదు. అతను ప్లేటో యొక్క అనుచరుడని చెప్పుకున్నప్పటికీ, అతని అభిప్రాయాలు ప్లేటో పై ప్రముఖ అరబిక్ వ్యాఖ్యాతలైన అల్-ఫరాభి , అవిసెన్నా (ఇబ్న్ సినా ) మరియు అవెరోరోస్ (ఇబ్న్ రష్ద్)లకు చాలా భిన్నంగా ఉన్నాయి.

అతను గ్రీకు అణు తత్వవేత్త atomist philosopher  డెమోక్రిటస్ యొక్క అరబిక్ అనువాదాలతో పరిచయం కలిగి ఉన్నాడు మరియు పదార్థం యొక్క కూర్పు గురించి తన సొంత పరమాణు సిద్ధాంతంలో ఇదే విధమైన ధోరణిని అనుసరించాడు. అతని ఇతర రచనలలో, ది స్పిరిచువల్ ఫిజిక్ ఆఫ్ రేజెస్ The Spiritual Physick of Rhazes  ఒక ప్రసిద్ధ నైతిక గ్రంథంethical treatise మరియు ఒక ప్రధాన రసవాద అధ్యయనం alchemical study.



No comments:

Post a Comment