పశ్చిమంలో
అల్ఫ్రాగనస్ అని పిలువబడే అబూ అల్-అబ్బాస్ అహ్మద్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ కాథర్
అల్-ఫర్గాని (800
/ 805-870) ఇస్లామిక్ స్వర్ణయుగ ఖగోళ
శాస్త్రవేత్త మరియు 9 వ
శతాబ్దంలో ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరు.
బాగ్దాద్‌లోని 'అబ్బాసిద్
ఖలీఫా అల్-మామాన్' ఆధ్వర్యంలో
శాస్త్రవేత్తల బృందంతో కలిసి మెరిడియన్ ఆర్క్ పొడవును కొలవడం ద్వారా భూమి యొక్క
వ్యాసాన్ని లెక్కించడంలో అల్-ఫర్గాని పాల్గొన్నాడు.
తరువాత అల్-ఫర్గాని కైరోకు వెళ్లారు, అక్కడ
అల్-ఫర్గాని 856 లో ఆస్ట్రోలాబ్‌పై ఒక గ్రంథాన్ని
రచించాడు. అల్-ఫర్గాని ఇంజనీరింగ్లో కూడా నిపుణుడు. అల్-ఫర్గాని అల్-ఫుస్టాట్ (పాత కైరో) వద్ద
గ్రేట్ నీలోమీటర్ నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. ఇది 861 లో పూర్తయింది. కొందరు అతన్ని
అరబ్ గా మరికొందరు పెర్షియన్ గా అభివర్ణించారు.
ట్రాన్సోక్సియానా Transoxiana లోని
ఫర్గానాలో జన్మించిన అబూల్-అబ్బాస్ అహ్మద్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ కతీర్ అల్-ఫర్గాని, ఖలీఫా అల్-మామున్
మరియు అతని వారసుల సేవలో అత్యంత ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరు. అతను "ఎలిమెంట్స్
ఆఫ్ ఆస్ట్రానమీ" (కితాబ్ ఫై అల్-హరకత్ అల్-సమవియా వా జావామి ఇల్మ్ అల్-నుజుమ్ (Kitab fi al-Harakat al-Samawiya wa
Jawami Ilm al-Nujum)” అనగా ఖగోళ చలన మరియు నక్షత్రాల సమగ్ర
శాస్త్రంపై పుస్తకం (i.e.
the book on celestial motion and thorough science of the stars) 833 లో
వ్రాయబడినది. ఇది మునుపటి ఇస్లామిక్ ఖగోళ శాస్త్రవేత్తల
యొక్క సవరించిన విలువలు అనుసరించి టోలెమి
అల్మాగెస్ట్ యొక్క వివరణాత్మక సారాంశం.
ఇది 12 వ శతాబ్దంలో లాటిన్లోకి అనువదించబడింది మరియు రెజియోమోంటనస్ (Regiomontanus) ముందు
యూరోపియన్ ఖగోళ శాస్త్రం గొప్ప ప్రభావాన్ని చూపింది. టోలోమిక్
ఖగోళశాస్త్రం గురించి డాంటే అలిజియెరి యొక్క జ్ఞానం అతని దివినా కమీడియాDivina Commediaలో
మరియు కన్వివియోConvivio,
వంటి ఇతర రచనలలో
స్పష్టంగా కనబడుతుంది. ఇది అతను అల్ఫ్రాగనస్ రచనల
నుండి తీసుకోబడినట్లు అనిపిస్తుంది. 17 వ శతాబ్దంలో డచ్ ఓరియంటలిస్ట్ జాకబ్
గోలియస్ అల్ ఫార్గని అరబిక్ వచనాన్ని కొత్త లాటిన్ అనువాదం విస్తృతమైన గమనికలతో
ప్రచురించాడు
అల్-ఫర్గాని టోలెమి యొక్క సిద్ధాంతం మరియు
పూర్వస్థితి (precession) యొక్క విలువను అంగీకరించాడు, కాని ఇది నక్షత్రాలను మాత్రమే కాకుండా గ్రహాలను కూడా
ప్రభావితం చేసిందని భావించాడు. అల్-ఫర్గాని భూమి యొక్క వ్యాసం 6,500 మైళ్ళు, మరియు.
గొప్ప దూరాలను మరియు గ్రహాల వ్యాసాలను కూడా కనుగొన్నారు.
ఖలీఫా అల్ ముతావాకిల్ బను ముసా సోదరులను అల్-జాఫారి కాలువ తవ్వకాన్ని పర్యవేక్షకులుగా నియమించాడు. బను ముసా సోదరులు ఈ పనిని నైపుణ్యం కల ఇంజనీర్ సింధ్ ఇబ్న్ అలీ కి కాకుండా అల్ ఫర్గానికి అప్పగించారు. ఈ కాలువ అల్-ముతావాకిల్ టైగ్రిస్‌పై సమర్రా సమీపంలో నిర్మించిన కొత్త నగరం,అల్ జాఫారియ గుండా వెళ్ళుతుంది.
కాలువ నిర్మాణం లో అల్ ఫర్గని తీవ్రమైన లోఫానికి పాల్పడ్డాడు. కాలువ యొక్క ఆరంభం లోతుగా ఉంది, తద్వారా టైగ్రిస్ నది ఎక్కువగా ఉన్నప్పుడు తప్ప కాలువ ద్వారా తగినంత నీరు ప్రవహించదు. ఈ వార్త ఖలీఫా కు కోపం తెప్పించింది అయితే అల్ ఫర్గాని లెక్క ఖచ్చితానికి హామీ ఇవ్వడానికి సింధ్ ఇబ్న్ అలీ ముందుకు రావడం తో బను ముసా ఇద్దరు సోదరులు కఠినమైన శిక్ష నుండి రక్షించబడ్డారు. అల్-ఫర్గాని చేసిన తప్పు అతను ప్రాక్టికల్ ఇంజనీర్ కాకుండా సిద్ధాంతకర్త కావడం, అతను నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయలేదు.
అల్-ఫర్గాని రచనలు:
(1)
“ది బుక్ ఆఫ్ చాప్టర్స్, ఆల్మాజెస్ట్ యొక్క సారాంశం“The Book of Chapters, a summary of the Almagest””
(కితాబ్
అల్-ఫుసుల్, ఇక్తియార్ అల్-మజిస్టి(Kitab al-Fusul, Ikhtiyar al-Majisti))
(2) “సన్-డయల్స్
నిర్మాణంపై పుస్తకం” Book on the Construction of Sun-dials”
(కితాబ్ ‘అమల్ అల్-రుఖమత్). (Kitab ‘Amal al-Rukhamat)
జావామి Jawami, లేదా ‘ది ఎలిమెంట్స్’ అనే గ్రంధం అల్-ఫర్గాని యొక్క బాగా తెలిసిన మరియు అత్యంత
ప్రభావవంతమైన రచన. అబ్దుల్-అజీజ్ అల్-కబీసి (మ. 967) దానిపై
వ్యాఖ్యానం రాశారు, ఇది ఇస్తాంబుల్ మాన్యుస్క్రిప్ట్, అయా సోఫ్యా 4832, ఫోల్స్97v-114v Aya Sofya
4832, fols. 97v-114v లో భద్రపరచబడింది.
12 వ
శతాబ్దంలో దీనికి రెండు లాటిన్ అనువాదాలు అనుసరించాయి. జాకబ్ అనాటోలి ఈ పుస్తకం
యొక్క హీబ్రూ అనువాదం 1590 చేసాడు. జాకబ్ గోలియస్ 1669 లో అరబిక్ ఒరిజినల్‌తో కలిసి కొత్త లాటిన్ అనువాదాన్ని ప్రచురించాడు.
మధ్యయుగ ఐరోపాపై 'ది ఎలిమెంట్స్' ప్రభావం స్పష్టంగా నిరూపించబడింది.
మధ్యయుగ రచయితల
గురించి ఇందులో అనేక రిఫరెన్స్/సూచనలు కలవు మరియు టోలెమిక్ ఖగోళశాస్త్రం యొక్క
జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఇది బాధ్యత వహించినది. సాక్రోబోస్కో గోళం అల్-ఫర్గాని యొక్క ‘ది ఎలిమెంట్స్’ కు రుణపడి
ఉంది. ‘ది ఎలిమెంట్స్’ (గెరార్డ్ అనువాదం) నుండి డాంటే ‘వీటా నూవా Vita nuova’’ మరియు ‘కన్వివియో‘Convivio’’ లో
ప్రదర్శించబడిన ఖగోళ జ్ఞానాన్ని పొందాడు.
15 వ శతాబ్దంలో, క్రిస్టోఫర్ కొలంబస్ భూమికి చుట్టుకొలత సంభందించి
అల్-ఫర్గాని యొక్క అంచనాను అమెరికాకు తన ప్రయాణాలకు ఆధారం గా ఉపయోగించాడు. అయితే కొలంబస్ అల్-ఫర్గాని యొక్క 7091 అడుగుల అరబిక్
మైలు ను 4856 అడుగుల రోమన్
మైలు అని తప్పుగా భావించాడు, తద్వారా అతను భూమి యొక్క చుట్టుకొలతను తక్కువ అంచనా వేసాడు.
అల్-ఫార్గని Al‐Jūzjānī, al-Bīrūnī, Al-Qabisiఅల్-జజ్జానా, అల్-బెరోనా, అల్-కబీసి వంటి
వారిని ప్రభావితం చేసాడు.
No comments:
Post a Comment