4 March 2023

మాజీ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా -అజీజ్ ముషబ్బర్ అహ్మదీ (25 మార్చ్, 1932 – 2 మార్చ్, 2023)

 


 

భారత సుప్రీం కోర్ట్ తీసుకొన్న కొన్ని  ముఖ్యమైన నిర్ణయాలలో కీలక పాత్ర పోషించిన భారతదేశపు సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజీజ్ ముషబ్బర్ అహ్మదీ, మార్చి 2,2023 లో  91 సంవత్సరాల వయస్సులో న్యూఢిల్లీలో కన్నుమూశారు. గత సంవత్సరం భార్య అమీనా మరణించినప్పటి నుండి విద్యావేత్త, మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి అజీజ్ ముషబ్బర్ అహ్మదీ   నిరాశ మరియు అనారోగ్యంతో ఉన్నారు.జస్టిస్ అజీజ్ ముషబ్బర్ అహ్మదీ గుజరాత్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో మరియు తరువాత ప్రజా జీవితంలో ఐదు దశాబ్దాలకు పైగా పని చేసారు.

గుజరాత్‌లోని సూరత్‌లో 1932 మార్చి 25న జన్మించిన జస్టిస్ అహ్మదీ ఒక జూనియర్ సివిల్ జడ్జి కుమారుడు మరియు ముస్లింలలో దౌడీ బోహ్రా ఇస్మాయిలీ వర్గానికి చెందినవారు. అజీజ్ ముషబ్బర్ అహ్మదీ 1954లో బ్యాచిలర్ ఆఫ్ లాస్ (LL.B.) పట్టా పొందిన తర్వాత ముంబైలోని బార్‌లో చేరి న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. జస్టిస్ అహ్మదీ గుజరాత్ దిగువ కోర్టులలో న్యాయమూర్తిగా  మరియు అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్ & సెషన్స్ కోర్టులో పనిచేశాడు. 1976లో  గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యారు.

గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నప్పుడు, జస్టిస్ అహ్మదీ సరఫరా చేయబడిన నిత్యావసర వస్తువుల నిర్వహణ, బ్లాక్ మార్కెటింగ్ నిరోధం మరియు విదేశీ మారకద్రవ్య పరిరక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాలను నిరోధించడం వంటి పలు సలహా బోర్డులకు ఛైర్మన్‌గా పనిచేశారు. జస్టిస్ అహ్మదీ 1988లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవటానికి  ముందు రాజీవ్-లాంగోవాల్ సెటిల్‌మెంట్ కింద రవి మరియు బియాస్ జలాల వివాదాల ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా కూడా పనిచేశాడు.

డిసెంబర్ 1988లో జస్టిస్ అహ్మదీ సుప్రీంకోర్టు జడ్జ్ గా పదోన్నతి పొందారు ఆతరువాత ఆరు సంవత్సరాల తర్వాత 1994లో అజీజ్ ముషబ్బర్ అహ్మదీ 26వ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యారు. జస్టిస్ మహ్మద్ హిదాయతుల్లా మరియు జస్టిస్ మీర్జా హమీదుల్లా బేగ్ తర్వాత భారతదేశం యొక్క సుప్రీం కోర్ట్ మూడవ ముస్లిం ప్రధాన న్యాయమూర్తి గా 24 మార్చి 1997 వరకు పదవిలో ఉన్నారు.

 సబార్డినేట్ న్యాయవ్యవస్థ నుండి సుప్రీంకోర్టుకు చేరిన కొద్దిమంది న్యాయమూర్తులలో జస్టిస్ అహ్మదీ ఒకరు. సుప్రీం కోర్టులో తన పదవీకాలంలో, జస్టిస్ అహ్మదీ 232 తీర్పులను ఇచ్చారు  మరియు 811 బెంచ్‌లలో భాగమయ్యారు.

జస్టిస్ అహ్మదీ 1989లో సుప్రీంకోర్టు న్యాయ సహాయ కమిటీ అధ్యక్షుడిగా Legal Aid Committee మరియు 1990 మరియు 1994 మధ్య భారతదేశంలో న్యాయ సహాయ పథకాల అమలు కమిటీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. జస్టిస్ అహ్మదీ భారతదేశ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అయిన మూడవ ముస్లిం.

 జస్టిస్ అహ్మదీ కు ముందు, జస్టిస్ ఎం. హిదాయతుల్లా (1968-1970), జస్టిస్ ఎం. హమీదుల్లా బేగ్ (1977-1978) భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్ అహ్మదీ పదవీ విరమణ తర్వాత, జస్టిస్ అల్తమస్ కబీర్ సెప్టెంబర్ 29, 2012 నుండి జూలై 18, 2013 వరకు భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

 తీర్పులను వెలువరించే బెంచ్‌లలో జస్టిస్ అహ్మదీ ఒక భాగమైన సుప్రీం కోర్టు యొక్క ముఖ్యమైన తీర్పులలో ఇంద్ర సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు ఇస్మాయిల్ ఫరూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు ఉన్నాయి.

1992 నాటి ఇందిరా సాహ్ని కేసులో, మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇతర వెనుకబడిన తరగతులకు (OBCలు) ఉద్యోగాలు మరియు విద్యలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం యొక్క చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది.

1994 నాటి ఇస్మాయిల్ ఫరూఖీ కేసులో, ఇస్లాం మతం యొక్క ఆచారంలో మసీదు ముఖ్యమైన భాగం కాదని, ఎక్కడైనా నమాజ్ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. 1993లో బాబ్రీ మసీదు పరిసరాల్లోని భూమిని కేంద్రం స్వాధీనం చేసుకోవడం భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం నిషేధించబడలేదని కోర్టు పేర్కొంది.

1994లో తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ నిర్ణయం వెలువరించిన ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఇండియా కేసులో దేశం యొక్క లౌకిక స్వభావంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. జస్టిస్ అహ్మదీ బెంచ్‌లోని తన సోదర న్యాయమూర్తులు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో "ఒప్పందం మరియు అసమ్మతి ప్రాంతాలను areas of agreement and disagreement సూచించడానికి" ప్రత్యేక 37 పేజీల తీర్పును రాశారు. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ "ఆందోళన" గురించి మాట్లాడుతూ, "మహాత్మా గాంధీ ద్వారా ప్రసాదించిన దేశం యొక్క లౌకిక స్వభావం ప్రమాదంలో పడకుండా" నిర్ధారించడానికి, మతపరమైన, భాషాపరమైన మరియు ఇతర సమూహాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా విభజన శక్తులను అదుపులో ఉంచడానికి రాజ్యాంగంలో తగిన నిబంధనలను అంబేద్కర్ పొందుపరిచారని జస్టిస్ అహ్మది నిర్ధారించారు.

1993లో రెండవ జడ్జీల నియామకం కేసును నిర్ణయించిన బెంచ్‌లో విశిష్ట న్యాయమూర్తి జస్టిస్ అహ్మది ఉన్నారు మరియు అది న్యాయ నియామకాల నిర్వహణకు కొలీజియం వ్యవస్థకు జన్మనిచ్చింది. జస్టిస్ అహ్మది ఆ కేసులో జస్టిస్ SP భరూచా యొక్క దృక్కోణాన్ని పంచుకున్నారు   పద్మ అవార్డుల కేసు (1995)లో తీర్పును వ్రాస్తూ, అహ్మదీ అవార్డుల సంఖ్యను పరిమితం చేయడం మరియు పరిమిత అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడం ద్వారా పద్మ అవార్డుల గౌరవాన్ని మరియు గౌరవాన్ని కాపాడే అధికారాలను కాపాడాలని హెచ్చరించారు..

భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో (1996) జస్టిస్  అహ్మదీ నిందితులపై హత్యాకాండకు సమానమైన నేరారోపణను culpable homicide not amounting to murder నిర్లక్ష్యపు మరణాని death by negligence కి మార్చారు, దీని కోసం కొంతమంది మానవ హక్కుల కార్యకర్తల ఆగ్రహాన్ని జస్టిస్  అహ్మదీ ఎదుర్కొన్నాడు. చివరకు జస్టిస్  అహ్మదీ పదవీ విరమణ తర్వాత, జస్టిస్  అహ్మదీ తీర్పుకు అనుగుణంగా కేసును ఎక్కువ లేదా తక్కువగా సుప్రీం కోర్టు నిర్ణయించింది. 2010లో నిందితులకు శిక్షలు పెంచాలని కోరుతూ సీబీఐ వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించినప్పుడు, అహ్మదీ దృక్కోణం నిరూపించబడింది

1996లో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీల విద్యాహక్కుల వివరణను కొత్తగా పరిశీలించేందుకు CJIగా జస్టిస్ అహ్మదీ ప్రత్యేక 11 మంది న్యాయమూర్తుల బెంచ్‌ను ఏర్పాటు చేశారు. తాహిర్ మహమూద్, అమికస్ క్యూరీగా ఈ కేసులో మైనారిటీ కమీషన్ యొక్క అధికారిక జోక్యాన్ని కోరారు, కానీ దాని ప్రతిస్పందనను దాఖలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జస్టిస్ అహ్మదీ పదవీ విరమణ చేసే వరకు ఎటువంటి పురోగతి లేదు. 

1997 లో NHRC చైర్మన్ గా ఉన్న MN వెంకటాచలయ్య, 1993 నాటి కమిషన్ పాలక శాసనం governing statute లో సవరణలను సూచించడానికి ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహించాలని అభ్యర్థించారు. జస్టిస్ అహ్మదీ ముఖ్యమైన బాధ్యతను చేపట్టాడు మరియు కొన్ని కఠినమైన చర్యలను సిఫార్సు చేస్తూ ఒక ముఖ్యమైన నివేదికను సమర్పించారు, కానీ దానిపై ఎటువంటి చర్య తీసుకోలేదు.

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం జస్టిస్ అహ్మదీని ఛాన్సలర్‌గా (2003-2010)ఎన్నుకోవడం ద్వారా తనను తాను గౌరవించుకుంది. పదవీ విరమణ తరువాత, జస్టిస్ అహ్మదీ ప్రజా జీవితంలో చురుకుగా ఉన్నారు  దేశంలోని ముస్లిం మైనారిటీల హక్కుల కోసం జస్టిస్ అహ్మదీ గట్టిగానే మాట్లాడేవారు. జస్టిస్ అహ్మదీ మైనారిటీ హక్కుల కోసం బలమైన న్యాయవాది మరియు ముస్లిం యువకులకు విద్యపై దృష్టి పెట్టారు.

జస్టిస్ అహ్మదీ పదవీ విరమణ చేసిన కొద్దిసేపటి తర్వాత  ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారుల చర్యల కోసం కృషి చేసారు.

2008లో, జస్టిస్ అహ్మదీ "ఎ గైడ్ టు అప్‌లిఫ్ట్ మైనారిటీస్" పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. 207 పేజీల పుస్తకం మైనారిటీ కమ్యూనిటీల కోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలకు ప్రభుత్వం మరియు ఇతర నిధుల ఏజెన్సీల నుండి క్రియాశీల సహాయంతో తమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది.

మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ కేంద్రం గా ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడీస్, 2007లో జస్టిస్ అహ్మదీకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది.

జస్టిస్ అహ్మదీ కుమారుడు హుజెఫా అహ్మదీ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. హుజెఫా అహ్మదీ రాజ్యాంగ చట్టం, పరిపాలనా చట్టం మరియు పన్ను, సివిల్ మరియు క్రిమినల్ చట్టాలకు సంబంధించిన విషయాలలో ప్రాక్టీస్ చేస్తాడు. నవంబర్ 2012లో సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్‌గా నియమితులయ్యారు

2023, మార్చ్ 2న జస్టిస్ అహ్మదీ 91ఏళ్ళ వయస్సు లో మరణించారు.

 

 

 

 

 

 

 

 


No comments:

Post a Comment